Plasma therapy
-
ప్లేట్లెట్ థెరపీ కిట్‌కు పేటెంట్.. రెండు తెలుగు రాష్టాల్లో ఇదే తొలిసారి
Guntur Doctor Gets Patent For Plasma Therapy Kit: వైద్య రంగంలో పరిశోధనలు చేస్తూ పలు అవార్డులను సొంతం చేసుకున్న సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సూరత్ అమర్నాథ్కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. ప్లేట్లెట్ థెరపీలో వినూత్నంగా రూపొందించిన వైద్య పరికరానికి ఈ పేటెంట్ లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైద్యుడు రూపొందించిన వైద్య పరికరానికి పేటెంట్ లభించడం ఇదే మొదటిసారి. శనివారం గుంటూరు కొత్తపేటలోని డాక్టర్ అమర్ ఆర్థోపెడిక్ హాస్పటల్లో డాక్టర్ సూరత్ అమర్నాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో స్ఫూర్తి పొంది ప్లేట్లెట్ థెరపీ పరికరాన్ని రూపొందించినట్టు చెప్పారు. రోగి నుంచి రక్తాన్ని సేకరించి ఆ రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను వేరు చేసి.. ఆ రోగికి అవసరమైన చోట సిరంజితో ఎక్కించడాన్ని ప్లేట్లెట్ థెరపీ అంటారని, ప్రస్తుతం దీనికి రూ.6 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతుందన్నారు. అయితే తాను రూపొందించిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ పరికరం ఖరీదు కేవలం రూ.2 వేలు మాత్రమేనని డాక్టర్ సూరత్ అమర్నాథ్ వివరించారు. -
ప్లాస్మా థెరపీపై కీలక నిర్ణయం తీసుకున్న ఐసిఎంఆర్
-
Plasma Therapy: ప్లాస్మా థెరపీ నిలిపివేత
న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది. కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే (వారి రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు) దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉంటే యాంటీబాడీలు కరోనా వైరస్‌పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి తీవ్రత అంతగా లేనపుడు ప్లాస్మా థెరపీని వాడటానికి గతంలో అనుమతించారు. అశాస్త్రీయంగా, అహేతుకంగా ప్లాస్మా థెరపీని విచ్చలవిడిగా వాడుతున్నారని, దీనివల్ల కలిగే ప్రయోజనాలకు సరైనా ఆధారాలు లేవని కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ప్లాస్మా థెరపీతో ప్రమాదకరమైన కొత్త వేరియెంట్లు పుట్టుకొచ్చే అవకాశముందని హెచ్చరిస్తూ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్, ఐసీఎంఆర్ చీఫ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్‌కు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన భారత వైద్య పరిశోధన మండలి– కోవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ప్లాస్మా థెరపీని చికిత్సా విధానం నుంచి తప్పించాలని సభ్యులందరూ అభిప్రాయపడటం తెల్సిందే. -
Coronavirus:‘ప్లాస్మా’ థెరపీతో లాభం సున్నా!
సాక్షి, హైదరాబాద్: కరోనా మొదలైన కొత్తలో ప్లాస్మా థెరపీ తెరపైకి వచ్చింది. కోవిడ్ సోకి తగ్గినవారి ప్లాస్మా ఇతర రోగులను కాపాడుతుందని, అది అపర సంజీవని అన్నంతగా ప్రచారం పొందింది. కరోనా గురించి పెద్దగా ఏమీ తెలియని సమయంలో ప్లాస్మా థెరపీని ఆశాకిరణంగా భావించారు. కోవిడ్ చికిత్సలో ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని ప్రభు త్వాలు కూడా ప్రకటించడం, ప్లాస్మా దానం చే యాలంటూ జరిగిన ప్రచారంతో దానికి ప్రాధా న్యత బాగా పెరిగిపోయింది. అయితే ఇటీవల జరిగిన పలు ఉన్నత స్థాయి అధ్యయనాలు మాత్రం.. కోవిడ్ చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం శూన్యమని తేల్చాయి. అంతేకాదు ప్లాస్మా థెరపీ వల్ల కరోనా వైరస్ కొత్త మ్యూటెంట్లు తయారయ్యాయని, వైరస్ సామర్థ్యాన్ని పెంచుకుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో కోవిడ్ చికిత్సల కోసం అనుసరిస్తున్న ప్రొటోకాల్ నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్ణయించింది. లాన్సెట్ అధ్యయనంలో.. ప్లాస్మా థెరపీ వల్ల ఆశించిన ప్రయోజనం లేదని, రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన దాఖలాలు లేవని యూకే మెడికల్ జర్నల్ లాన్సెట్ తాజా అధ్యయనంలో తేల్చింది. బ్రిటన్‌లో గతేడాది మే 28 నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు 11,558 మంది రోగులను 2 కేటగిరీలుగా విభజించి ఈ అధ్యయనం చేశారు. ప్లాస్మా థెరపీ తీసుకున్న 5,795 మందిలో 1,399 (24 శాతం) మంది మరణించగా.. ఇతర సాధారణ చికిత్స తీసుకున్న 5,763 మందిలో 1,408 (24 శాతం) మంది మరణించినట్టు గుర్తించారు. మెడికల్ వెంటిలేషన్ అవసరం విషయంలో కూడా ప్లాస్మా, సాధారణ చికిత్సల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. ఇంతకుముందే మన దేశంలో జరిగిన ఐసీఎంఆర్–ప్లాసిడ్ అధ్యయనం, అర్జెంటీనాకు చెందిన ప్లాస్మాఆర్ ట్రయిల్స్ కూడా ప్లాస్మా థెరపీతో రోగులకు పెద్దగా లాభమేమీ లేదని తేల్చాయి. గత శుక్రవారం ఐసీఎంఆర్ జాతీయ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో సభ్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో కరోనా చికిత్సల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. త్వరలో ఆస్పత్రులకు మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ప్లాస్మానే ‘ఫస్ట్’ చాయిస్ ఏదైనా వ్యాధి నుంచి కోలుకున్నవారి రక్తంలో ఆ వ్యాధిని ఎదుర్కొనే యాంటీబాడీస్ ఏర్పడుతాయి. రక్తంలోని ప్లాస్మాలో ఉండే ఈ యాంటీబాడీస్‌ను.. అదే వ్యాధితో బాధపడుతున్న రోగికి ఇవ్వడాన్ని ప్లాస్మా థెరపీగా పేర్కొంటారు. రోగికి ప్లాస్మా ఎక్కించగానే.. దానిలో అప్పటికే ఉన్న యాంటీబాడీలు వైరస్‌తో పోరాటం మొదలుపెడతాయి. గతంలో మందులకు కొరుకుడు పడని పలు వ్యాధుల చికిత్సలో ప్లాస్మా థెరపీ బాగా ఉపయోగపడింది కూడా. ఈ నేపథ్యంలోనే కోవిడ్ చికిత్సలోనూ ప్లాస్మా థెరపీని మొదలుపెట్టారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి ఏ చిన్న ఆధారం దొరికినా చాలు అన్న ఉద్దేశంతో పెద్దఎత్తున వినియోగించారు. కొత్త మ్యూటెంట్లకు కారణమిదేనా? ప్లాస్మా థెరపీ కోవిడ్ చికిత్సలో పనిచేయడం లేదంటూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది వైద్యరంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలు ఇటీవల ఐసీఎంఆర్‌కు లేఖ రాశారు. భారత్‌లో కొత్త రకం కరోనా వేరియంట్లు విజృంభించడానికి ప్లాస్మా థెరపీ కూడా కారణమని వారు పేర్కొన్నారు. ఐసీయూలో చేరిన పేషెంట్లకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్లాస్మా థెరపీ ఇవ్వడం వల్ల.. అందులోని యాంటీబాడీస్‌ను ఎదుర్కొనేలా కరోనా వైరస్ కొత్త రూపాలు (మ్యూటెంట్లు) సంతరించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్త పరీక్షలు కూడా చేయకుండానే ఐసీయూలో ఉన్న రోగులకు నేరుగా ప్లాస్మా ఇవ్వడం ప్రాణాంతకంగా పరిణమిస్తోందని పేర్కొన్నారు. అలాగే ఈ థెరపీని అనధికారికంగా వినియోగించడం వల్ల కూడా పలు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్లాస్మా చికిత్స అంశాన్ని అత్యవసరంగా సమీక్షించి, ఆపేయాలని కోరారు. ఇటీవలి అధ్యయనాల ఫలితాలు, తాజాగా నిపుణుల లేఖ నేపథ్యంలో ప్లాస్మా థెరపీని పక్కనపెట్టాలని ఐసీఎంఆర్ నిర్ణయం తీసుకుంది. అవగాహన అవసరం సాధారణ కరోనా లక్షణాలకు ప్లాస్మా థెరపీ ఉపయోగం ఉండొచ్చు గానీ.. అప్పటికే ఆక్సిజన్, వెంటిలేట ర్‌పై వెళ్లినప్పుడు, క్రిటికల్ కేర్‌లో ఉన్నప్పుడు ఉపయోగం ఉండదు. గతంలో ఎబోలా చికిత్సలో కూడా ప్లాస్మా థెరపీని వా డారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక.. గతేడా ది దేశవ్యాప్తంగా 39 ఇన్స్టిట్యూట్స్లో ప్లాస్మా థెరపీ ట్రయల్స్ నిర్వహిస్తే.. ఫలితాలు అంత సంతృప్తికరంగా రాలేదు. ఇప్పుడు సెకండ్ వే వ్‌లో డబుల్ వేరియంట్స్ పెరగడానికి ప్లాస్మా థెరపీనే కారణమని.. వైరస్ రూపాంతరం చెంది, మరింత శక్తివంతంగా మారిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఫలితాలు సంతృప్తికరంగా లేనప్పుడు ట్రీట్ మెంట్ ప్రొటోకాల్ నుంచి ప్లా స్మా థెరపీని తీసేస్తే మంచిదని ఐసీఎంఆర్ భావిస్తోంది. మాకు ఇంకా గైడ్‌లైన్స్ రాలేదు. ఇప్పటికే ప్లాస్మా థెరపీ తీసుకున్నవారు, ప్రాసెసింగ్ ఉన్నవారికి.. వారి కండిషన్స్ బట్టి చికిత్స చేస్తాం. రెమ్‌డెసివిర్ గానీ, ప్లాస్మా థెరపీగానీ సెకండరీ చికిత్సలే. ఆక్సిజన్, స్టెరాయిడ్లకే ప్రాధాన్యం అవసరం. ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా చూసుకుంటూ, డాక్టర్ సూచనలు పాటిస్తూ.. పౌష్టికాహారం తీసు కుంటూ, శ్వాసకోశ వ్యాయామాలు చేస్తుంటే 90శాతం మంది పూర్తిగా రికవరీ అవుతారు. – డాక్టర్ ఎస్ఏ రఫీ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ -
Hanuma Vihari: దాతృత్వం.. కోవిడ్ బాధితులకు అండగా
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు. విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. ఓ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో 27 ఏళ్ల విహారి మాట్లాడుతూ ‘నేను చేసింది గొప్ప దాతృత్వమో, సేవో కానే కాదు! అవసరమైన వారికి ఏదో నాకు తోచినంత సాయం మాత్రమే ఇది. మహమ్మారి ఉధృతిలో నా వంతు చేయూత అందించానంతే’ అని అన్నాడు. సామాజిక మాధ్యమాల్లో లక్షా పదివేల ఫాలోవర్లు ఉన్న విహారి చేసిన ప్రయత్నానికి చాలామంది కలిసిరావడంతో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ముఖ్యంగా పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా దానం, ఆక్సిజన్ అవసరమైన వారికి ప్రాణవాయువు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగానని ఇక ముందు కూడా ఇలాంటి సాయమందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి చెప్పాడు. ఇప్పటివరకు 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం జూన్ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది. జట్టుకోసం ఏదైతే అది... ఇంగ్లండ్ పర్యటనపై మాట్లాడుతూ జట్టు కోసం ఏ స్థానంలో పంపించినా బ్యాటింగ్‌కు సిద్ధమేనని చెప్పాడు. ‘నా కెరీర్లో ఎన్నోసార్లు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేశాను. జట్టు మేనేజ్మెంట్ కోరితే ఇప్పుడు సిద్ధమే. ఓపెనింగ్ అయినా ఓకే’ అని విహారి అన్నాడు. ముందుగా కివీస్‌తో ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్, తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చాలా ముందుగా ఇక్కడికి రావడం తనకు కలిసివస్తుందని చెప్పాడు. పిచ్, స్థానిక వాతావరణం అలవాటైందని చెప్పుకొచ్చాడు. ఇది భారత జట్టు తరఫున మెరుగ్గా ఆడేందుకు దోహదం చేస్తుందన్నాడు. -
రక్తం లో ప్రతిరోధకాలు కలిగిఉన్న ఒక భాగమే ప్లాస్మా
-
ప్లాస్మా థెరపీ కరోనా చికిత్స లో ఎంతవరకు ప్రభావవంతం ..?
-
ప్లాస్మాథేరఫీతో కరోనా ను కట్టడి చేయవచ్చు
-
ప్లాస్మా దాతలు 1,475 మంది
సాక్షి, అమరావతి: కోవిడ్ సోకి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉన్నవారికి ప్రాణావసరమైన ప్లాస్మా దానానికి పలువురు ముందుకు వస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారి నుంచి ప్లాస్మా సేకరించి అవసరమైన రోగులకు ఇవ్వడం ద్వారా వారు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే 1,475 మంది ప్లాస్మా దానం చేయగా మరో 2,600 మంది ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ సోకి 6.72 లక్షల మందికిపైగా కోలుకున్నారు. వీరిలో మరింతమంది ముందుకొచ్చి ప్లాస్మా దానం చేస్తే ఎందరో రోగులకు ఉపయోగపడుతుంది. ప్లాస్మాను ఏడాదిపాటు నిల్వ ఉంచవచ్చు. ► ఇప్పటివరకు మన రాష్ట్రంలో 1,475 మంది నుంచి 1,838 యూనిట్ల ప్లాస్మా సేకరించారు. ► ఇప్పటివరకు 1,385 మందికి ప్లాస్మా చికిత్స చేశారు. ► అత్యధికంగా గుంటూరు జిల్లాలో 322 మంది ప్లాస్మా దానం చేయగా 302 మంది చికిత్స చేయించుకున్నారు. ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 301 మంది ప్లాస్మా దానం చేయగా 280 మందికి ప్లాస్మా చికిత్స చేశారు. కోవిడ్ విస్తరణ ఆలస్యంగా జరిగిన శ్రీకాకుళం జిల్లాలో 227 మంది ప్లాస్మా దానం చేయగా 200 మందికి చికిత్స జరిగింది. చిత్తూరు, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు కూడా ప్లాస్మా దానం చేయలేదు. ఈ జిల్లాల్లో ఒక్కరికి కూడా ప్లాస్మా చికిత్స చేయలేదు. ప్లాస్మా డొనేషన్‌కు ముందుకు రావాలి అవగాహన లేకపోవడంతో ప్లాస్మా డొనేషన్‌కు చాలామంది ముందుకు రావడం లేదు. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో నలభై ఏళ్లలోపు యువకులు చాలామంది ఉన్నారు. వీళ్లంతా ప్లాస్మా ఇస్తే మరింతమందిని బతికించవచ్చు. ప్లాస్మా చికిత్స కూడా వెంటిలేటర్‌కు వెళ్లాక ఇవ్వడం కాదు.. ఆక్సిజన్ బెడ్‌పై ఉన్నప్పుడే ఇవ్వాలి. పేషెంటు చివరి దశలో ఉన్నప్పుడు ఇస్తే ఫలితం ఉండదు. నిర్థారణ పరీక్షల ఆధారంగా ముందస్తుగానే ప్లాస్మా చికిత్స చేయాల్సి ఉంది. –డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, ప్రత్యేక అధికారి, కమాండ్ కంట్రోల్ కేంద్రం -
మధ్య వయస్కులూ.. తస్మాత్ జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: మధ్య వయస్కులూ.. తస్మాత్ జాగ్రత్త! గతంలో భయపడిన దానికి భిన్నంగా ఇప్పుడు జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దశలో పదేళ్లలోపు పిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే మనదేశంలో ఇప్పుడు పిల్లలు, వృద్ధులపై కోవిడ్ ప్రభావం తగ్గి, 35–60 ఏళ్లలోపున్న వారిపై, ముఖ్యంగా పురుషులపై దీని ప్రభావం ఎక్కువని కిమ్స్ కన్సల్టింగ్ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డా. వీవీ రమణ ప్రసాద్ చెప్తున్నారు. దీనికి తోడు ఊబకాయం, అధిక బరువు ఉన్నవారిలో మగ, ఆడ అనే తేడా లేకుండా ఎక్కువమందికి కరోనా వైరస్ సోకుతోందన్నారు. వైరస్ సోకిన తర్వాత అధిక బరువు, షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ తదితర తీవ్ర సమస్యలున్న వారిలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. కొంతకాలంగా కోవిడ్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న డా.రమణ ప్రసాద్ ప్రాధాన్యత సంతరించుకున్న పలు అంశాలపై సాక్షితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ అంశాలు.. ఆయన మాటల్లోనే... ఆలస్యం చేయొద్దు... 2, 3 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోతే మామూలే అని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. టెస్ట్ చేయించుకోవడం లేదు. మళ్లీ జ్వరమో ఇతర లక్షణాలో కనిపించి అది న్యూమోనియాగా మారుతోంది. ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్చి ఆక్సిజన్ ఇవ్వడం, ఐసీయూలో చేర్చడం, వెంటిలేటర్ అమర్చే పరిస్థితి వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. మొదట నిర్లక్ష్యం చేసి, తర్వాత అది తీవ్ర రూపం దాల్చేదాక వేచి చూడొద్దు. ప్లాస్మా థెరపీ ప్రయోజనకరమే... ప్లాస్మా థెరపీలో ప్లాస్మా ఎవరి దగ్గర తీసుకున్నారనేది ప్రధానం. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఎక్కువ యాంటీబాడీస్ ఉన్న ప్లాస్మా మంచి ఫలితాలిస్తోంది. వైరస్ తీవ్రత ఎక్కువై వెంటిలేటర్ పెట్టాల్సిన రోగులకు ఇది బాగా పనిచేస్తోంది. ఎన్–95 మాస్క్‌లు నిషేధించాలి... రెస్పిరేటరీ వాల్వులున్న ఎన్–95 మాస్క్‌లను వెంటనే నిషేధించాలి. వైరస్ సోకినా లక్షణాలు కనిపించని అసింప్టోమేటిక్, స్వల్ప లక్షణాలున్న వారు ఈ మాస్క్‌లను వాడితే.. గుంపుల్లోకి వెళ్లి మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా కచ్చితంగా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది. వ్యాక్సిన్ వల్ల 50, 60 శాతం రక్షణ! ఈ డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. వచ్చినా దాని వల్ల 50, 60 శాతం రక్షణ ఉండొచ్చు. వ్యాక్సిన్ ఒక నివారణగా మాత్రమే పనిచేస్తుంది. వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే... ఏ వైరస్ అయినా ఒకసారి వచ్చి తగ్గిపోయాక పర్యావరణంలో ఉండిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినవారికి ఇది మళ్లీ సోకే అవకాశాలుంటాయి. అందువల్ల కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే. 2008లో తీవ్రంగా వచ్చిన స్వైన్‌ఫ్లూ వల్ల మరణాలు ఎక్కువగా నమోదయ్యాక, తర్వాతి సంవత్సరాల్లో కూడా ఆ కేసులు తక్కువగానైనా బయటపడుతున్నాయి. రీఇన్ఫెక్షన్లపై ఆందోళనొద్దు... కరోనా ఒకసారి వచ్చి తగ్గిపోయాక మళ్లీ ఇన్ఫెక్ట్ అవుతామేమోననే ఆందోళనలు వద్దు. అలాగని నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దు. సరైన జాగ్రత్తలు పాటించాలి. తగ్గినా వేరే లక్షణాలతో వస్తున్నారు కోవిడ్ వచ్చి తగ్గిన 2, 3 నెలల తర్వాత గుండె సమస్యలు, పక్షవాతం, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో కొందరు మళ్లీ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ పరిస్థితిని డాక్టర్లు ‘లాంగ్ కోవిడ్’గా అభివర్ణిస్తున్నారు. వైరస్ పూర్తిగా నిర్వీర్యం కాకపోవడం, ఆలస్యంగా చికిత్స తీసుకోవడం దీనికి ప్రధాన కారణం. వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో ‘లంగ్ ఫైబ్రోసిస్’ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. -
కరోనా పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులను కొన్ని షరతుల మేరకు అనుమతించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. పిల్లలతో కలసి ఉంటే వైరస్ వ్యాప్తికి గల ప్రమాదాలను తల్లిదండ్రులకు వివరించాలని, వారి అంగీకారం తీసుకున్నాక వార్డుల్లో ఉండేందుకు అనుమతినివ్వాలని తెలిపింది. ఈ మేరకు వివిధ అంశాలపై స్పష్టతనిస్తూ బుధవారం మార్గదర్శకాలు జారీచేసింది. ఇక పెద్దలు ఎవరైనా ఆసుపత్రుల్లో కరోనాతో బాధపడుతుంటే, వారి వద్దకు బంధు వులు, కుటుంబ సభ్యులను ఏమాత్రం అనుమతిం చొద్దని స్పష్టంచేసింది. అలా వెళ్లనిస్తే వారికి వ్యాధి సోకి, తద్వారా ఇతరులకూ వ్యాప్తి చెందే ప్రమాదముందని పేర్కొంది. ప్రస్తుతం కొన్ని ఆసుపత్రులు కరోనా రోగులుండే వార్డుల్లోకి బంధువులు, కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నాయి. దీనివల్ల వైరస్ వ్యాప్తి జరుగుతుందన్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు కీలకం కానున్నాయి. ప్రారంభ దశలోనే ప్లాస్మా.. కరోనా తీవ్రత ఉన్న రోగులకు ప్రారంభ దశలోనే ప్లాస్మా చికిత్స చేయాలని కేంద్రం స్పష్టంచేసింది. అయితే దీన్ని జాగ్రత్తగా చేయాలని పేర్కొంది. దీన్ని ప్రయోగాత్మక చికిత్సగా కూడా పరిగణించాలని వెల్లడించింది. కరోనా రోగుల్లో కొందరు తీవ్రమైన నిరాశ, ఒత్తిడికి గురవుతుంటారు. ఒంటరిగా ఉండటం, వ్యాధికి సంబంధించిన కారణాల వల్ల ఆందోళన చెందుతుంటారు. ఇటువంటి రోగులకు మానసిక వైద్యుల సలహా అందించాల్సి ఉంటుందని వివరించింది. ఇతర అంశాలపైనా కేంద్రం మార్గదర్శకాలు.. ► వైద్య సిబ్బందిలో రోగ నిరోధక శక్తి కోసం కొన్ని పరిమితుల్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలను వాడొచ్చు. ► అలాగే కరోనా నుంచి రక్షించడానికి పీపీఈ కిట్లను సరైన పద్ధతుల్లో వాడాలి. ఇతర ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను ఉపయోగించాలి. ► కరోనాలో కొన్ని ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. కొన్నిసార్లు గుండెపోటు వంటివి వస్తున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువున్న రోగులను దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలుంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వీటన్నింటినీ గమనించకుండా కరోనా రోగులను డిశ్చార్జి చేయడానికి అనుమతించకూడదు. ► కార్టికోస్టెరాయిడ్స్ ప్రస్తుతం మధ్యస్థం నుంచి తీవ్రమైన కరోనా రోగులకు వాడొచ్చు. ► టోసిలిజుమాబ్ మందును డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది. అయినప్పటికీ ఇది ఒక ప్రయోగాత్మక చికిత్సనే. దీనివల్ల ప్రయోజనం అంతంతే. ఇన్ఫెక్షన్లు పెద్దగా లేని సైటోకిన్ సిండ్రోమ్ ఉన్న రోగుల్లో మాత్రమే వాడాలి. ► ఫావిపిరావిర్‌ను ప్రధానంగా తేలికపాటి లేదా లక్షణాలు లేని వారికి ఉపయోగిస్తున్నారు. దీని వాడకంపై జాతీయ మార్గదర్శకాల్లో ఎక్కడా సిఫార్సు చేయలేదు. ► రెమిడెసివిర్ కూడా ప్రయోగాత్మక చికిత్సే. వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని డీసీజీఐ ఆమోదించింది. అందువల్ల అనుమానాస్పద కరోనా కేసులకు వీటిని వాడకూడదు. అవసరమని వైద్యులు భావించిన కరోనా రోగుల్లో మాత్రమే ఉపయోగించాలి. -
ఆరు నెలల గరిష్టానికి మార్కెట్
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల కొనుగోళ్ల జోరుతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 52 పైసలు పుంజుకొని 74.32కు చేరడం, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, వినోద రంగ పరిశ్రమ (సినిమా హాళ్లు తెరవడానికి)మరిన్ని వెసులుబాట్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటం, మూడు ప్రైవేట్ బ్యాంక్‌లను ఎఫ్టీఎస్ఈ గ్లోబల్ ఇండెక్స్‌లో చేర్చడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 38,799 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,466 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అప్రమత్తత అవసరం... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ లాభాలు అంతకంతకూ పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 125 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. నిధుల వరద పారుతుండటంతో మార్కెట్ జోరుగా పెరుగుతోందని, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్మా చికిత్సకు అమెరికా ఎఫ్‌డీఏ ఓకే... కరోనా వైరస్ సోకిన రోగులకు ప్లాస్మా చికిత్స చేయడానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ను ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవడానికి కొన్ని నిబంధనలను సడలించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఫలితంగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్‌ను ఉపయోగించే అవకాశాలున్నాయి. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం యూరప్ మార్కెట్లు 2 శాతం రేంజ్లో లాభపడ్డాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 3.5% లాభంతో రూ.1,387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. హీరో మోటొకార్ప్, ఆఫిల్ ఇండియా, ఇమామి, సనోఫి ఇండియా, ఎస్ఆర్ఎఫ్, ఆర్తి డ్రగ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ముంబై ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్ట్‌లో 74 శాతం వాటాను రూ.15,000 కోట్లకు కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 7 శాతం లాభంతో రూ.249 వద్ద ముగిసింది. ఈ గ్రూప్‌లోని ఇతర షేర్లు కూడా లాభపడ్డాయి. ► రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ. 1 ముఖ విలువ పది షేర్లుగా విభజన చేసిన నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం ఎగసింది. చివరకు 0.36 శాతం లాభంతో రూ.2,178 వద్ద ముగిసింది. ► దాదాపు 450కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, రెప్కో హోమ్ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
ప్లాస్మా థెరపీ: అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: మహమ్మారి కరోనా బారిన పడిన వారి పాలిట వరంలా పరిగణిస్తున్న ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిలిపివేసింది. ఈ చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ క్లినికల్ డైరెక్టర్ హెచ్, క్లిఫార్డ్ లేన్ మాట్లాడుతూ.. ప్లాస్మా థెరపీపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత సమీప భవిష్యత్తులో అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఈ చికిత్స ద్వారా ఎంత మంది కోలుకున్నారు, ఏ మేరకు సత్ఫలితాలు లభించాయన్న వివరాలపై స్పష్టత లేనందున అనుమతులు నిలిపివేసినట్లు భావిస్తున్నామన్నారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ గురువారం కథనం ప్రచురించింది. (కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?) కాగా కరోనాకు విరుగుడు టీకా అందుబాటులోని రాని నేపథ్యంలో భారత్ వంటి దేశాల్లో ప్లాస్మా థెరపీ ద్వారా మహమ్మారిని జయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో పలు సూచనలు చేసిన భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్).. ఏప్రిల్ నుంచి ప్లాస్మా చికిత్స క్లినికల్ ట్రయల్స్ అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూలై 2న ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరి సైన్సెస్‌లో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేసి.. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాను సేకరించి కోవిడ్ పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. ఆ తర్వాత లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్లో కూడా మరో బ్యాంకును ఏర్పాటు చేశారు. దీని గురించి అవగాహన పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా మరిన్ని ప్లాస్మా బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ చికిత్స ద్వారా ఇంత వరకు ఏ మేర సానుకూల ఫలితాలు వచ్చాయన్న అంశంపై కొంతమంది నిపుణులు అనునామాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ ఎడిటర్ అమర్ జేసాని మట్లాడుతూ.. ‘‘దీని ద్వారా కరోనా రోగులు కోలుకుంటున్నారడానికి సరైన ఆధారాలు లేవు. ఏప్రిల్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైనా, ఆగష్టు వరకు కూడా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం, గణాంకాలు బయటకు రాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మరికొందరు నిపుణులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఎఫ్‌డీఏ తాత్కాలికంగా అనుమతులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. -
ప్లాస్మాదానం.. నిలిచే ప్రాణదీపం
పార్వతీపురం టౌన్: కరోనా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఎక్కడో ఏదో చిన్న పొరపాటువల్ల కొందరికి అనూహ్యంగా సోకుతోంది. వారు సమయానుకూలంగా చికిత్స పొంది... కోలుకుంటే మరికొందరు రోగులు కోలుకోవడానికి తోడ్పడగలరని తెలుసా... అవును అక్షరాలా నిజం. కరోనానుంచి కోలుకున్నవారి నుంచి సేకరించిన ప్లాస్మా క్రిటికల్ కండిషన్లో ఉన్న కరోనా రోగులకు ప్రాణం పోస్తుంది. కొత్త జీవితాన్నిస్తుంది. దీనిపై విస్తృతంగా ప్రచారం ఊపందుకుంటోంది. ప్లాస్మా దానంపై అవగాహన పెరుగుతోంది. (ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని) ప్లాస్మా థెరపీ అంటే ఒక వ్యక్తి వైరస్ ఇన్ఫెక్షన్కు గురైనపుడు వ్యాధి నిరోధక వ్యవస్థలోని అంటే రక్తంలోని బిలింఫో సైట్స్ కణాలు కొన్ని యాంటీ బాడీలు కొన్ని రకాల ప్రోటీన్లను విడుదల చేస్తాయి. ఇవి వైరస్‌తో పోరాడి వైరస్‌ను నాశనం చేయడంతో సహాయ పడతాయి. ఆ రోగి కోలుకున్న తరువాత కూడా రక్తంలోని యాంటీబాడీలు వైరన్‌ను నియంత్రించడానికి సహాయ పడతాయి. వైరస్‌బారిన పడి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించి వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తి శరీరంలోకి పంపడం ద్వారా వ్యాధిని తగ్గించే ప్రక్రియనే ప్లాస్మాథెరఫీ అంటారు. కోవిడ్–19నుంచి కోలుకుంటున్న వారు స్వచ్ఛందంగా ఫ్లాస్మా దానం చేసి మరొక ప్రాణం కాపాడాలని వైద్యులు కోరుతున్నారు. ప్లాస్మా దానం చేసినవారికి ప్రభుత్వం రూ.5వేలు ప్రోత్సాహకం కూడా అందస్తుండటంతో కరోనా పేషెంట్లు కోలుకుని ప్లాస్మా దాతలుగా మారుతున్నారు. తాము జీవిస్తూ మరి కొన్ని జీవితాలకు వెలుగునిస్తున్నారు. వెబ్సైట్ల ద్వారా కూడా ప్లాస్మా దానం కోలుకున్న పాజిటివ్ రోగులందరూ సానుకూల దృక్పథంతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. కోలుకున్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా డోనేట్ చేసేలా ఈ సైట్లో ఒక ప్రత్యేక సెక్షన్‌ని ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత, ఫెండ్స్ 2 సపోర్ట్ ఫౌండర్ షేక్ షరీఫ్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. పాజిటివ్ రోగులందరూ ఈ వెబ్సైట్లో ప్లాస్మాదాతలుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన బ్లడ్ గ్రూపుల వారికి ప్లాస్మా దొరకడం చాలా కష్టమైన పని. ఈ సైట్లో కనుక పేరు నమోదు చేసుకుంటే పని సులభమవుతుంది. 2005లో షరీఫ్ ప్రారంభించిన ఈ సైట్ద్వారా కోవిడ్ రోగులకు ప్లాస్మా డోనేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కోవిడ్ రోగులకు, బంధువులకు ప్లాస్మా దానం ఎవరు చేస్తారు. వారి వివరాలు ఎలా సేకరించాలి. అనేదానిపై అవగాహన ఉండదు. అటువంటి వారికి ఈ సైట్ సహాయకారిగా ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ను వారం రోజులపాటు ట్రయల్‌రన్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ సైట్లో ఆరు దేశాల నుంచి 5లక్షల మంది సాధారణ రక్తదాతలు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్లాస్మా దానం చేయాలనుకున్నవారు ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కాని, వెబ్సైట్ ద్వారాగాని నమోదు పేరు చేసుకోవచ్చు. అపోహలు వద్దు.. కరోనాను జయించిన వ్యక్తులు అపోహలు వీడి ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి హానీ ఉండదు. వారు చేసే దానం వల్ల మరొకరికి కొత్త జీవితాన్ని ఇచ్చినవారవుతారు. కరోనాను జయించిన వారంతా ప్లాస్మా దానం చేయడం మంచిది. కరోనాతో తీవ్రస్థాయిలో బాధపడుతున్న వారికి మీరిచ్చిన ప్లాస్మా త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఇది కూడా రక్తదానం లాంటిదే. – డా.బి.వాగ్దేవి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం -
మనిషి మాత్రమే మరో మనిషికి దానం..
సాక్షి, హైదరాబాద్: ప్లాస్మా దానం చేసి ప్రాణాలను రక్షించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మరోసారి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది ఇప్పటివరకూ 150మందికి పైగా పోలీస్ అధికారులు ప్లాస్మా దానం చేశారని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ‘మనిషి మాత్రమే మరో మనిషికి దానం చేయగలడు. మీకు సహాయం చేయడానికి సిటీ పోలీసులు ఉన్నారు. ప్లాస్మా విరాళం వాట్సాప్ కోసం లేదా 9490616780కు కాల్ చేయండి’అని కోరారు. కాగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులకు మరొకసారి పునర్జన్మనిచ్చేందుకు రక్తదానం దోహదపడుతుందని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు నగర పోలీసులు తమ తరపున ప్లాస్మా అందచేస్తుందన్నారు. -
ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని
సాక్షి, నెల్లూరు: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. గురువారం నెల్లూరులో ఆయన కరోనాపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, కావల్సిన సదుపాయాలపై చర్చించారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు ఇస్తున్నారన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు కూడా అధికంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 350 కోట్లను వెచ్చిస్తోందని వెల్లడించారు. ఆసుపత్రులలో బాధితులకు మెరుగైన వసతులు కల్పించి సేవలందిస్తున్నామని ఆయన చెప్పారు. కరోనాపై ప్రజలు ఆందోళన పడాల్సిన పని లేదని, ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు, అర్హులైన వారంతా ప్లాస్మా దానం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసే వారికి 5 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. -
ప్లాస్మా దానం చేయనున్న మధ్యప్రదేశ్ సీఎం
భోపాల్ : కరోనా నుంచి కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కోవిడ్-19 పేషెంట్ల చికిత్స కోసం తన ప్లాస్మాను దానం చేయనున్నట్లు శివరాజ్ సింగ్ ఆదివారం తెలిపారు. కాగా జూలై 25న చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వెంటనే ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందారు. అనంతరం 11 రోజుల తర్వాత ఆగష్టు 5న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన బట్టలు తానే ఉతుక్కుంటున్నానని వీడియో ద్వారా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న సీఎం చౌహాన్ ) కాగా రాష్ట్రంలోని కరోనా వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన సీఎం.. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ‘నేను ఇంతకుముందు కరోనా బారిన పడ్డాను. చికిత్స తర్వాత ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. కరోనా వైరస్‌తో పోరాడటానికి యాంటీబాడీస్ నా శరీరంలో వృద్ధి చెంది ఉంటాయి. కావున నేను త్వరలో ప్లాస్మాను దానం చేస్తాను’ అని పేర్కొన్నారు. అయితే కరోనాను అంతం చేయడంలో శరీరంలోని రోగనిరోధకశక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను సేకరించి కరోనా బారిన పడిన వారికి అందించడం ద్వారా వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది. ఇక మధ్యప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 39,000 వేలు దాటింది. -
సైబరాబాద్ కమిషనరేట్‌కు మెగాస్టార్ ఫోటోలు
-
బయటకు దగ్గాలంటే భయమేస్తోంది: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: పాస్మా దానం వల్ల కోవిడ్ బారినపడ్డవారిని ఆదుకున్నవారమవుతామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. దీనిపై ఎవరూ అపోహలకు గురికావొద్దని, ఫ్లాస్మాను దానం చేయడం ద్వారా ఎలాంటి బ్లడ్ లాస్ జరగదని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైబరాబాద్ పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్లాస్మా దానం చేసిన కొందరిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో కలిసి చిరంజీవి శుక్రవారం సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్త దానం నుంచి ఫ్లాస్మా దానం వరకు సైబరాబాద్ పోలీసులు చేస్తున్న సేవలను గుర్తుంచుకోవాలి. ఇలాంటి మంచి మార్గం లో నన్ను నడిపిస్తున్నందుకు సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు. (చదవండి: ప్లాస్మాతో ప్రాణం) 22 ఏళ్ల క్రితం నాకు సామాజిక బాధ్యత తెలియని సమయంలో న్యూస్ పేపర్లో ఒక వార్తా చూసి చలించి పోయాను. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఎంతోమంది రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారని గమనించి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భావించి ఏర్పాటు చేశాను. దీనికి అభిమానులు సహకరిస్తూ, నిత్యం రక్త దానం చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ మధ్య మాకు కేంద్ర ప్రభుత్వం బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు ఇచ్చింది. ఈ కోవిడ్ పరిస్థితిల్లో ఇప్పుడు అసలైన ఆయుధం ఫ్లాస్మా. ఈ ఫ్లాస్మా దానం చేయడంతో మరో ప్రాణాన్ని కాపాడిన వారమవుతాం. రెండు రోజుల క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది. వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు అనే వ్యక్తిని ఫ్లాస్మా దానం చేయమని చెప్పాను అతను ప్లాస్మా దానం చేయడంతో మా బందువు ప్రాణాలతో బయట పడ్డాడు. మా ఇంట్లో, నా దగ్గర పని చేసే వర్కర్స్ కి నలుగురికి కరోనా సోకింది. వంట మనిషి శ్రీను, స్విమ్మింగ్ లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరికి కరోనా సోకింది. ఇప్పుడు వారందరు కోవిడ్ నుండి కోలుకుని పనిలో చేరారు. వాళ్ల ప్లాస్మా ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇంట్లో అందరూ భౌతిక దూరం పాటిస్తున్నాం. బయటకు దగ్గాలంటే భయమేస్తోంది. ఫిజికల్ డిస్టెన్స్ అనేది భార్యాభర్తలను కూడా విడదీసింది. కోవిడ్ నుండి కోలుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఫ్లాస్మా దానం చేయండి. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ఫ్లాస్మానే మనల్ని కాపాడుతుంది’అని చిరు పేర్కొన్నారు. (తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు) -
కోలుకున్నారా..? మేలు చేయండి
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: ప్లాస్మా థెరపీ.. కరోనాపై పలు రకాల మందులు ప్రయోగిస్తున్న తరుణంలో వైద్యుల నమ్మకం సంపాదించిన వైద్య విధానం. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి తీసుకున్న ప్లాస్మాను అత్యవసర స్థితిలో ఉన్న మరో కరోనా రోగికి ఇచ్చి బతికిస్తున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలను అందిస్తుండడంతో వైద్యులు ఈ ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు. అనేక దేశాల్లో వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ప్రస్తుతం అవి ప్రయోగ దశల్లోనే ఉండడంతో ప్లాస్మా థెరపీపైనే వారంతా దృష్టి సారించారు. ఆయా దేశాలతోపాటు మనదేశంలోని అనేక రాష్ట్రా ల్లో ప్లాస్మా థెరపీ ప్రారంభమైంది. మన రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఇంకా ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది. ఏ గ్రూపు వారికి ఆ గ్రూపే.. రక్తం ఏ గ్రూపు వారికి ఆ గ్రూపు రక్తాన్ని ఎక్కించినట్లుగానే ప్లాస్మాను కూడా ఎక్కించాల్సి ఉంటుంది. కోలుకున్న వ్యక్తుల నుంచి 350 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తే దాని నుంచి 300 మిల్లీలీటర్ల వరకు ప్లాస్మాను వేరు చేయవచ్చు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను ఎక్కిస్తే సంబంధిత వ్యక్తి కోలుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్లాస్మాను ఎక్కించిన వారిలో 85 నుంచి 90 శాతం వరకు కోలు కుంటున్నట్లు అనేక దేశాల్లోను, మనదేశంలోను రుజువైంది. ప్రస్తుతం ప్లాస్మా థెరపీ తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలవుతోంది. ప్లాస్మా థెరపీ అంటే.. ప్లాస్మా థెరపీ అంటే కరోనా నుంచి కోలుకున్న రోగి నుంచి రక్తాన్ని సేకరించి దాని నుంచి ఎర్ర రక్తకణాలను వేరు చేస్తే మిగిలిన దాన్ని ప్లాస్మాగా పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో రెండు రకాల యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. ఐజీఎం అనే యాంటీబాడీ 7 నుంచి 10 రోజులు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇది సంబంధిత వ్యక్తి పూర్తిగా కోలుకునేందుకు ఉపయోగపడతాయి. వీటిని స్వల్పకాలిక యాంటీబాడీలుగా పిలుస్తారు. రెండో రకాన్ని ఐజీజీగా పిలుస్తారు. ఇది దీర్ఘకాలిక యాంటీబాడీలు. ఈ యాంటీబాడీల వల్లనే రోగి రెండోసారి వ్యాధి బారిన పడకుండా తనను తాను రక్షించుకోగలుగుతాడు. అయితే ప్లాస్మా ఇవ్వడానికి ఈ రోగులు ముందుకు రావడం వల్ల సంబంధిత వ్యక్తులకు ఎలాంటి హాని ఉండదు. రక్తాన్ని ఇచ్చినప్పటికీ ఇంకా సంబంధిత వ్యక్తిలో ఐజీజీ యాంటీబాడీలు ఉంటాయి. అందువల్ల ఎలాంటి హానీ ఉండదు. ఎవరి నుంచి సేకరిస్తారు..? ఇప్పటికే మన దేశంలో (ఐసీఎంఆర్) అనుమతులు ఇవ్వ టంతో ఈ ప్రక్రియపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. అందరికి ప్లాస్మా ఉపయోగించి వ్యాధులు అరికట్టవచ్చు అనుకుంటాం. కానీ ఈ ప్లాస్మా సేకరణకు కొన్ని నిబంధనలున్నాయి. ముఖ్యంగా దాత వయస్సు, తాజా ఆరోగ్య స్థితిని పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా వయస్సు 18 –60 ఏళ్ల మధ్య ఉండాలి. దాతలు వ్యాధి నుంచి కోలుకుని రెండు వారాల సమయం గడవాలి. దాతకు హెచ్ఐవీ, హెపసైటిస్–బి, సీ, సెఫిలిస్ వంటి వ్యాధులు ఉండకూడదు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి శరీరానికి ప్లాస్మెపెరిసిస్ అనే పరికరం అమర్చి ప్లాస్మా ఎక్సే్చంజ్ ద్వారా దీన్ని సేకరిస్తారు. అలా సేకరించిన స్లాస్మాను నేరుగా రోగి శరీరంలోకి ఎక్కించవచ్చు. లేదా –30డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఏడాది కాలం భద్రపరుస్తారు. ప్రోత్సాహకాన్ని అందజేస్తున్న ప్రభుత్వం రక్తదానం చేసినట్లుగానే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు రక్తదానం చేస్తే వారికి రూ. 5వేల ప్రోత్సాహకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించి దీన్ని ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పుడు రూ. 2వేలను సహాయంగా అందజేస్తుండగా ప్లాస్మా దానం చేస్తే మరో రూ. 5వేలను పొందేందుకు వీలవుతుంది. ఈ ప్రోత్సాహం గురించి కాకపోయినా ప్లాస్మా దానం చేస్తే ఒకరికి ప్రాణం దానం చేసినట్లుగానే అవుతుంది. ప్లాస్మా బ్యాంకుల కోసం జిల్లా అధికారుల కృషి.. కలెక్టర్ నివాస్ శ్రీకాకుళంలో కూడా ప్లాస్మా బ్యాంకు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారు. కోవిడ్ ఆస్పత్రులైన రిమ్స్, జెమ్స్లతోపాటు రెడ్క్రాస్లలోని రక్త నిధుల్లో ప్లాస్మా తయారుచేసే సౌకర్యాలున్నాయి. అందువల్ల ఆయా ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయాలని కలెక్ట ర్ యోచిస్తున్నారు. జిల్లాలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని యంత్రం ద్వారా పిచికారీ చేయించడంతోపాటు కరోనా పరీక్షలు ఇతర జిల్లాల్లో కంటే ఎక్కువ చేయించడం, మరె న్నో పకడ్బందీ చర్యలను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన వద్ద చేపట్టినట్లుగానే ప్లాస్మా థెరపీ కూడా తొలిదశలో చేపట్టిన జిల్లాగా పేరుండిపోతుంది. యువత ముందుకు వస్తే జిల్లాలోని ఎందరో ప్రాణాలను కాపాడగలుగుతారు. వ్యాక్సిన్ కంటే ఉపయోగకరం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కంటే ప్లాస్మా థెరపీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తీవ్రస్థాయిలో బాధపడుతున్న కరోనా రోగికి 500 ఎంఎల్ ప్లాస్మాను ఎక్కిస్తే తీవ్రత తగ్గి త్వరగా కోలుకోవడానికి వీలుంటుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు యువత ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేస్తే ప్రాణదాతలవుతారు. – డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, రిమ్స్ అపోహలు అవసరం లేదు ప్లాస్మా అందించటంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. దీనిపై అపోహలు వీడాలి. కోవిడ్ బారిన పడి కోలుకున్న యువత, సంపూర్ణ ఆరోగ్యవంతులు ముందుకు రావాలి. దీని వల్ల మీ కుటుంబ సభ్యులకు లేక ఇతరులకు ప్రాణదాతలు కావవచ్చు. ప్లాస్మా థెరపీతో మరణాలను తగ్గించవచ్చు. ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ప్రకటించటం హర్షణీయం. అలాగే ప్లాస్మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చే లా అవగాహన కార్యక్రమాలపై ప్రచారం చేయాలి. – డాక్టర్ బి.శ్రీనివాసరావు, ఎండీ జనరల్ మెడిషన్, ఏరియా ఆసుపత్రి, పాలకొండ -
ప్లాస్మాథెరపీలో ‘గాంధీ’ సక్సెస్
గాంధీఆస్పత్రి (హైదరాబాద్): కరోనా వైద్యం లో భాగంగా చేపట్టిన ప్లాస్మాథెరపీ చికిత్సలు కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వంద శాతం విజయవంతమయ్యా యి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్లాస్మాథెరపీ చికిత్సల్లో ఐసీఎంఆర్ చేపట్టిన గ్రేడింగ్‌లో ఈ ఆస్పత్రికి 5వ స్థానం దక్కింది. కేటాయించిన కోటా పూర్తికావడంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశాల మేర కు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మాధెరపీ చికిత్సలు నిలిపివేశారు. అత్యంత క్లిష్టమైన, ప్రాణాపాయస్థితిలో ఉన్న 25 మంది రోగులకు ఇక్కడ ప్లాస్మా థెరపీ చికిత్స అందించి వైద్యులు పునర్జన్మనిచ్చారు. 25 మంది కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. మే 14న మొదటి ప్లాస్మాచికిత్స సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐసీఎంఆర్ ఆదేశాలతో వెంటిలేటర్‌పై ఉన్న పాతబస్తీకి చెందిన యువకుడి (44)కి గత మే 14న 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఎక్కించారు. శరీరం స్పం దించడంతో మే 16న మరో డోస్ ప్లాస్మాను ఎక్కించడంతో బా«ధితుడు సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకుని వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యా డు. అనంతరం ప్రాణాపాయస్థితిలో ఉన్న మ రో 24 మందికి విజయవంతంగా ప్లాస్మాథెరపీ చికిత్స అందించారు. కాగా, కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేందుకు మరికొంత సమయం పట్టనున్న క్రమంలో ప్లాస్మాథెరపీని కరోనా చికిత్సలో భాగం చేయాలా, మరికొంతకాలం ప్రయోగాత్మకంగానే పరిశీలించాలా అనే అం శంపై ఐసీఎంఆర్ తర్జనభర్జన పడుతోంది. దేశవ్యాప్తంగా ఈ చికిత్సలు నిర్వహించిన 25 సెం టర్లలో చికిత్సపొందిన 625 మంది బాధితుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని సెంటర్లలో ప్లాస్మాచికిత్స ఫలితాలు సాధించలేదు. తెలంగాణ, ఏపీలో సత్ఫలితాలనిచ్చిన క్రమంలో ప్రాంతాలవారీగా అధ్యయనం చేస్తున్నారు. అప్పటి వరకు ప్లాస్మా చికిత్సలకు విరామమివ్వాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. 5వ ర్యాంకు గర్వకారణం ప్లాస్మాథెరపీ చికిత్సల్లో వంద శాతం ఫలితాలు సాధించి దేశవ్యాప్త గ్రేడింగ్‌లో గాంధీ ఆస్పత్రి 5వ ర్యాంకు సాధించడం గర్వకారణం. ఐసీఎంఆర్ సూచనతో ప్రస్తుతం ప్లాస్మాథెరపీ చికిత్సలు నిలిపివేశాం. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్లాస్మా దాతలకు రూ.5 వేలు
సాక్షి, అమరావతి: కరోనా సోకిన వారికి మరింత మెరుగైన చికిత్స, సేవలపై దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ చికిత్స కోసం ఎంపిక చేసిన 138 ఆస్పత్రుల్లో సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆయన కోరారు. చికిత్స, మందులు, ఆహారం, పారిశుద్ధ్యం.. ఈ నాలుగు అంశాలపై గట్టి పర్యవేక్షణ చేయాలన్నారు. అలాగే, ఆస్పత్రుల్లో భర్తీ అయిన బెడ్లు, ఖాళీ అయిన బెడ్ల వివరాలను ఆస్పత్రి వెలుపల బోర్డు ద్వారా తెలియజేయాలని.. ఆ వివరాలను డిజిటల్ పద్ధతుల్లో అన్ని కోవిడ్ ఆస్పత్రులకూ అందుబాటులో ఉంచాలన్నారు. ప్లాస్మా థెరపీతో సానుకూల ఫలితాలు వస్తుంటే, దాన్ని ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి.. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేలు ఇవ్వాలన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలిచ్చారు. కోవిడ్19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రుల వారీగా బెడ్లు, చికిత్స పొందుతున్న వారిపై ఆరా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రులు, వాటిలో బెడ్లు, ఖాళీలు తదితర అంశాలపై సీఎం అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. మొత్తం 138 ఆస్పత్రుల్లో 36,778 బెడ్లు ఉన్నాయని, ఇందులో 14,450 బెడ్లలో బాధితులు చికిత్స పొందుతున్నారని అధికారులు వివరించారు. మొత్తం 70,446 యాక్టివ్ కేసులు ఉండగా, ఇందులో 14,042 మంది ఆస్పత్రుల్లోనూ, 18,753 మంది కోవిడ్ కేర్ సెంటర్లలోనూ (క్వారంటైన్ కేంద్రాలు), 35,660 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ తరహా చికిత్స పొందుతున్న వారు 3,541 మంది అని వివరించారు. కాగా, గురువారం ఒక్కరోజే ఆస్పత్రుల నుంచి 1,436 మంది డిశ్చార్జి అయ్యారని సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ బెడ్ల వివరాలను కూడా సీఎం ఆరా తీశారు. మొత్తంగా 28,911 బెడ్లను సిద్ధం చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఆస్పత్రి వెలుపల బెడ్ల వివరాలు వెల్లడించాలి ఆస్పత్రుల్లో బెడ్ల కేటాయింపు.. భర్తీ అయినవి, ఖాళీగా ఉన్నవాటి విషయంలో మెరుగైన విధానాన్ని పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో సమాచారమంతా డిజిటిల్ పద్ధతుల్లో ఉండాలని ఆయన స్పష్టంచేశారు. ఎప్పటికప్పుడు ఈ డేటాను అప్డేట్ చేస్తూ అన్ని ఆస్పత్రుల్లోని హెల్ప్ డెస్క్‌లకు అందుబాటులో ఉంచాలని.. ప్రతి కోవిడ్ ఆస్పత్రి వెలుపల బ్లాక్ బోర్డుపై భర్తీ అయిన బెడ్లు, ఖాళీ అయిన బెడ్ల వివరాలను వెల్లడించాలన్నారు. ఎవరికైనా బెడ్ అందుబాటులో లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో ఉన్న బెడ్ కేటాయింపు అక్కడే ఉన్న హెల్ప్ డెస్క్ ద్వారా జరగాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం హెల్ప్ డెస్క్‌లను బలోపేతం చేయాలని, ఆరోగ్యమిత్రలను అక్కడ పెట్టాలన్నారు. సూక్ష్మస్థాయిలో సమీక్షించాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో అందించే సేవల్లో మెరుగైన పద్ధతులు అవలంబించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సూక్ష్మస్థాయిలో అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. బెడ్లు, వైద్యం, మందులు, ఆహారం, పారిశుధ్యం బాగున్నాయా.. లేదా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జీజీహెచ్ లాంటి ఆస్పత్రుల్లో ఈ అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ ఆస్పత్రుల్లో సమర్థవంతమైన సిబ్బందిని పెట్టాలని, జేసీలు దీనిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఇంకా రాబోయే రోజుల్లో కాల్ సెంటర్ల పనితీరు, కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలపై దృష్టిపెట్టాలన్నారు. కరోనాపై మీడియాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలిస్తే.. వాటిని ఎప్పటికప్పుడు ఖండించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఒకవేళ ఆ కథనాల్లో వాస్తవాలుంటే.. వాటిని పరిష్కరించాలన్నారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలుంటే, దానిపై అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. బాగా ఉపయోగపడితే.. ఈ విధానాన్ని ప్రోత్సహించాలని, ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేలు ఇవ్వాలన్నారు. మంచి భోజనం, ఇతరత్రా ఆరోగ్యపరమైన అవసరాల కోసం ఈ ప్రోత్సాహకం ఉపయోగపడుతుందన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక, మాస్క్‌లు సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నామని, విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మాస్కులు ఎలా వాడాలన్న దానిపై వారికి అవగాహన కూడా కల్పించాలన్నారు. ఏపీలో మరణాలు 0.98 శాతమే కాగా, తొలుత ఈ సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎంకు అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.21 శాతం ఉంటే.. రాష్ట్రంలో 0.98 శాతం ఉందన్నారు. పాజిటివిటీ రేటు కూడా దేశవ్యాప్తంగా 8.71 శాతం అయితే, రాష్ట్రంలో 6.91 శాతంగా ఉందని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరణాల రేటును మరింత తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్ వ్యాప్తి, మరణాలు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వారు చెప్పారు. మూడేళ్లలో కొత్త మెడికల్ కాలేజీలు పూర్తికావాలి సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ప్రజారోగ్య రంగం బలోపేతానికి చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. కోవిడ్ లాంటి విపత్తులను భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే.. ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, ఇతర ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం పురోగతిపై ఆరా తీశారు. మూడేళ్లలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తికావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు నిర్దేశించారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో టెండర్లు పిలుస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
‘శభాష్ సైబరాబాద్ పోలీస్.. ఎస్సీఎస్సీ’
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంపై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. ప్లాస్మా దాతలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చేందుకు డొనేట్‌ప్లాస్మా.ఎస్సీఎస్సీ.ఇన్ ఆన్లైన్ లింక్ ప్రారంభించడంపై ప్రశంసలు కురిపించారు. కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్ పోలీసుల సామాజిక దృక్పథ కోణంపై అభినందనలు తెలిపారు. అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని మెగాస్టార్ చిరంజీవి సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్లో చేసిన ట్వీట్‌కు స్పందించారు. అలాగే ప్లాస్మా దాతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం మహా అద్భుతమంటూ హీరో సాయికుమార్ ట్వీట్ చేశారు. అలాగే హీరో మహేశ్‌బాబు ట్వీట్ చేస్తూ... సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీలు ప్లాస్మా దాతలను సత్కరించడం ఇతరుల్లో స్ఫూర్తి కలిగించేలా ఉందని, కరోనాను జయించిన ప్రతి ఒక్కరూ ప్లాస్మా వారియర్‌గా వ్యవహరించాలని కోరారు. మరో హీరో రఘు కుంచె ఇదో మంచి కార్యక్రమని ప్రశంసించారు. -
ప్లాస్మా థెరపీ విజయవంతం
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కరోనా బాధితుడికి ప్లాస్మాథెరపీ విజయవంతమైంది. డోన్‌కు చెందిన 37 ఏళ్ల సతీష్‌గౌడ్ కరోనాతో రెండు వారాల క్రితం కర్నూలులోని స్టేట్ కోవిడ్ హాస్పిటల్లో చేరాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వైద్యులు అతనికి రెండు సార్లు ప్లాస్మాథెరపీ అందించారు. దీంతో అతను పూర్తిగా కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడు. అతన్ని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవిపట్టన్‌శెట్టి, ఆసుపత్రి అధికారులు అభినందించారు. దేశంలో తొలిసారి ఢిల్లీలో ఓ మంత్రికి, ఆ తర్వాత తిరుపతిలో, అనంతరం కర్నూలులో మాత్రమే ప్లాస్మాథెరపీ చికిత్స ప్రారంభించడం విశేషం. -
‘ప్లాస్మా’ పేరుతోనూ మోసాలు
సాక్షి, సిటీబ్యూరో: ఘరానా మోసగాళ్లు సీజన్‌ను బట్టి తమ పంథా మార్చుకుంటున్నారు. తాజాగా కోవిడ్ పేషెంట్స్‌కు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో వైద్యం చేస్తున్నారు. దీంతో ప్లాస్మా డోనర్లకు భారీ డిమాండ్ వచ్చింది. దీన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి మోసగాళ్లు రంగంలోకి దిగారు. ఈ పంథాలో పలువురిని మోసం చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వాసిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతగాడు కొందరిని యాంటీ వైరల్ డ్రగ్స్ ఇప్పిస్తానంటూనూ మోసం చేసినట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి సోమవారం వెల్లడించారు. ఇతగాడు ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న దాదాపు 200 మందిని మోసం చేసినట్లు అనుమానిస్తున్నామని, నగరంలో ఇతడిపై నాలుగు కేసులు నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొనుగుటివలస ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆపై హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ కోర్సు కూడా పూర్తి చేశాడు. నిరుద్యోగంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరల బాటపట్టాడు. విశాఖపట్నంలోని ద్వారక, రెండో పట్టణ పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఈ కేసుల్లో అరెస్టు అయిన జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఆ రోగులకు వైద్యం చేయడానికి కోలుకున్న పేషెంట్ ప్లాస్మా అవసరం పెరిగింది. దీంతో అనేక మంది సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ కేంద్రంగా డోనర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం గమనించిన సందీప్ డోనర్ పేరుతో మోసాలు చేయాలని పథకం వేశాడు. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సెర్చ్ చేశాడు. ప్లాస్మా డోనర్స్ కోసం వాటిలో ప్రకటనలు ఇచ్చిన వారికి ఫోన్లు చేసేవాడు. తాను ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నానని, నాది మీకు కావాల్సిన బ్లడ్‌గ్రూప్ అని నమ్మబలికే వాడు. తాను ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పేవాడు. అయితే తాను శ్రీకాకుళం నుంచి రావడానికి రవాణా, ఇతర ఖర్చులకు కొంత డబ్బు కావాలని కోరేవాడు. తన బ్యాంకు ఖాతా లేదా ఈ–వాలెట్ వివరాలు పంపి వాటిలో డబ్బు వేయించుకునే వాడు. ఆపై వారి ఫోన్లకు స్పందించకుండా మోసం చేసేవాడు. మరికొందరికి కోవిడ్ రోగులకు చికిత్స కోసం వాడే యాంటీ వైరల్ డ్రగ్స్ ఇప్పిస్తానంటూ డబ్బు గుంజాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 200 మందిని మోసం చేశాడు. నగరానికి చెందిన కొందరినీ మోసం చేయడంతో ఇతడిపై సిటీలోని పంజగుట్ట, రామ్‌గోపాల్‌పేట, బంజారాహిల్స్‌తో పాటు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇతడిని పట్టుకోవడానికి ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు గోవింద్‌స్వామి, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్‌లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇలాంటి మోసగాళ్లు మరికొందరు ఉండి ఉంటారని, అప్రమత్తంగా ఉండాలని అదనపు డీసీపీ కోరారు. -
కర్నూలులో ప్లాస్మాథెరపీ ప్రారంభం
కర్నూలు (హాస్పిటల్): రాష్ట్రంలో తిరుపతి తర్వాత కర్నూలులో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్సను ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్‌కు చెందిన ఓ వ్యక్తికి వైద్యులు క్లినికల్ ట్రయల్స్ కింద ప్లాస్మాథెరపీ చేశారు. ఇదివరకు ఢిల్లీ, ఆ తర్వాత తిరుపతిలో మాత్రమే ప్లాస్మా థెరపీ చేశారు. నెల క్రితం ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో ప్లాస్మా సేకరణకు, 2 వారాల క్రితం ప్లాస్మాథెరపీ క్లినికల్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ నుంచి అనుమతి వచ్చింది. శుక్రవారం రాత్రి 11:30 గంటలకు కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్స అందించారు. -
ప్లాస్మాను దానం చేయండి : సచిన్ టెండూల్కర్
ముంబై : కరోనా రోగులకు అందించే చికిత్సలో భాగంగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ యూనిట్‌ను సచిన్ టెండూల్కర్ బుధవారం ప్రారంభించారు. సబర్బన్ అంధేరిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో దీన్ని అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారు ప్లాస్మాను చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని కోరారు. కరోనా కట్టడిలో ముందుండి నడిపిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని..అయినప్పటికీ అవిశ్రామంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. (ఒక్కరోజులో రికార్డు కేసులు ) ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం కరోనా చికిత్సలో అవంలంభిస్తున్న ప్లాస్మా థెరపీ ద్వారా ఎంతో మంది ఈ వైరస్ నుంచి బయటపడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో యంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు ప్లాస్మాను దానం చేస్తే ఇతరుల ప్రాణాలను రక్షించిన వాళ్లవుతారు. దాతలు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అని సచిన్ పేర్కొన్నారు. ప్లాస్మా యూనిట్‌ను ప్రారంభించిన బిఎంసిను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. (కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు) -
బీజేపీ నేత ప్లాస్మా దానం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 బారినపడి కోలుకుని గత నెలలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బీజేపీ నేత సంబిట్ పాత్ర సోమవారం గురుగ్రామ్ ఆస్పత్రిలో ప్లాస్మా దానం చేశారు. గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్ప్రత్రిలో ఆయన ప్లాస్మా దానం చేశారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉధృతమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 2500 తాజా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. వ్యాక్సిన్ వచ్చే వరకూ మహమ్మారికి సరైన చికిత్స కొరవడిన నేపథ్యంలో అందరి దృష్టి ప్లాస్మా థెరఫీపై కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో ఢిల్లీలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా కేజ్రీవాల్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు, కరోనా వైరస్ చికిత్స కోసం ప్లాస్మా పొందడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఇప్పుడు కొంత ఉపశమనం లభిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్లాస్మాను దానం చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను’ అన్నారు. ఐఎల్‌బీఎస్ ఆస్పత్రిలో ఈ ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించినట్లు ఆప్ ట్వీట్ చేసింది. చదవండి: మీరైతే ఏం చేస్తారు.. ఇదంతా నిజమేనా? -
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. అధిక పాజిటివ్ కేసుల నమోదులో ముంబై మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్‌కి వచ్చిందని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం స్పందించారు. రాష్ట్రంలో వైరస్‌కు సంబంధించి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని స్పష్టం చేశారు. ఇక వైరస్ బారిన పడిన బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. (ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్) అదే విధంగా కరోనా చికిత్సలో ప్లాస్మా థెరఫి కీలక పాత్ర పోషిస్తోందని రాజేష్ తోపే తెలిపారు. ఈ చికిత్సలో సుమారు 10 మంది కరోనా బాధితుల్లో 9 మంది కోలుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93 వేల మంది కరోనా పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకున్నారని వెల్లడించారు. చాలామంది పాజిటివ్ బాధితుల హిస్టరీ గమనిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా కేంద్రాల్లో, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైరస్ తీవ్రతను గమనిస్తే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్‌కి చేరలేదని వెల్లడించారు. ఇక రెమిడిసివిర్, ఫావిపిరవిర్ మందులు మరో రెండు రోజుల్లో అన్ని జిల్లాల్లో లభిస్తాయని తెలిపారు. ధనిక, పేద తేడాలు లేకుండా ప్రజలందరికీ ఈ మందులను అందుబాటులోకి తీసుకువస్తామని రాజేష్ తోపే చెప్పారు.(కరోనా : 30 రోజుల్లో 3,94,958 కేసులు ) -
తొలి ప్లాస్మా బ్యాంక్.. విధివిధానాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా అంతకంతకు విస్తరిస్తోంది. ఈ మాయదారి రోగానికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి మరి కొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ప్లాస్మా థెరపీ వైపు మళ్లీంది. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా కేజ్రీవాల్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు, కరోనా వైరస్ చికిత్స కోసం ప్లాస్మా పొందడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఇప్పుడు కొంత ఉపశమనం లభిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్లాస్మాను దానం చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను’ అన్నారు. ఐఎల్‌బీఎస్ ఆస్పత్రిలో ఈ ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించినట్లు ఆప్ ట్వీట్ చేసింది. ప్లాస్మా దాతకు ఉండాల్సిన లక్షణాలు గురించి కూడా కేజ్రీవాల్ వెల్లడించారు. (కోలుకున్నవారు..కోవిడ్‌పై వార్) ఎవరు దానం చేయవచ్చు ఒక వ్యక్తి కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకొని, 14 రోజుల పాటు ఏ లక్షణాలు లేకుండా ఉంటే ప్లాస్మాను దానం చేయవచ్చని కేజ్రీవాల్ తెలిపారు. 18-60 ఏళ్లలోపు ఉండి.. 50కిలోల కంటే ఎక్కువ బరువున్న వారు ప్లాస్మాను దానం చేయవచ్చన్నారు. ప్లాస్మా దానానికి అనర్హులు ఎవరంటే డయాబెటిస్, ఇన్సులిన్ ఉన్నవారు, క్యాన్సర్‌తో పోరాడుతున్న వారు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భవతులు ప్లాస్మా దానం చేయడానికి అనర్హులు అన్నారు. అంతేకాక ఒక వ్యక్తి రక్తపోటు 140 కన్నా ఎక్కువ, డయాస్టొలిక్ 60 కన్నా తక్కువ లేదా 90 కన్నా ఎక్కువ ఉంటే అతను లేదా ఆమె ప్లాస్మాను దానం చేయకూడదని కేజ్రీవాల్ తెలిపారు. ప్లాస్మా దానం చేయడానికి ఇష్టపడే వారు 1031కు కాల్ చేయడం లేదా 8800007722 నంబరుకు వాట్సాప్ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. రక్త దానం చేయడం వల్ల బలహీనం కావచ్చు కానీ ప్లాస్మా దానం వల్ల అలా జరగదని తెలిపారు. Delhi Govt to facilitate donors. 1. Govt will arrange for transport to the ILBS Hospital, or reimburse travel cost. 2. If you've not yet been tested negative after being tested positive for Covid initially, we will arrange for you to be tested. Link: https://t.co/jsU7p3y4H7 — AAP (@AamAadmiParty) July 2, 2020 ప్రభుత్వ సదుపాయాలు 1. ప్లాస్మా దానం చేయాలనుకునే వారు ఐఎల్‌బీఎస్ ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. వారి ప్రయాణానికి అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 2. ప్లాస్మా దానం చేయాలనుకుంటున్న వ్యక్తికి మొదట కరోనా పాజిటివ్ వచ్చి.. ప్రస్తుతం ఇంకా నెగిటివ్ రాని వారికి ప్రభుత్వమే మరోసారి పరీక్షలు చేస్తుంది. 3. ప్లాస్మా దానం చేయడానికి వచిన వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. 4. ప్లాస్మా దానం చేసిన వారికి ముఖ్యమంత్రి సంతకం చేసిన ‘ప్లాస్మా డోనర్ సర్టిఫికెట్’ ఇస్తామని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలో అత్యంత బలమైన యాంటీ బాడీస్ ఉంటాయి. అవి ఇతరులకు సోకిన కరోనాను కట్టడి చేయడంలో తోడ్పడతాయి. అయితే... ప్లాస్మాను ఎవరి నుంచి, ఎలా సేకరించాలి అనే అంశంపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్ఆర్) గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుంది. ప్లాస్మా సేకరణకు ముందు... దాతకు యాంటీ బాడీ స్క్రీనింగ్ చేస్తారు. తద్వారా ఆ వ్యక్తిలో యాంటీ బాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుంటారు. ఎందుకంటే... కరోనా నుంచి కోలుకున్నవారిలో... వెంటనే యాంటీబాడీస్ తయారవ్వవు. అందుకు కొంత టైమ్ పడుతుంది. సరిపడా యాంటీబాడీస్ ఉన్నాయని నిర్థారింయిచిన తర్వాతే... దాత నుంచి ప్లాస్మా సేకరిస్తారు. -
కోలుకున్నవారు..కోవిడ్‌పై వార్
సాక్షి, హైదరాబాద్: మహమ్మారిపై పోరు ముమ్మరమవుతోంది. కోవిడ్ కట్టడికి లాక్డౌన్ పాటించి ప్రజలు సామాజిక స్ఫూర్తిని చాటారు. ఇప్పుడు కోవిడ్ బాధితులను గండం నుంచి గట్టెక్కించేందుకు సరికొత్త ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ వ్యాధి సోకి ఆ తర్వాత కోలుకున్నవారి ప్లాస్మాతో రోగులను కాపాడే ప్రక్రియకు బీజం పడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్లాస్మా దాతల అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రకటించారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ ఏర్పాటు ద్వారా ప్లాస్మా థెరపీ చికిత్స ప్రాధాన్యతను చాటాలని ఆయన భావిస్తున్నారు. కోవిడ్ బాధితులకు ప్లాస్మా థెరపీ చికిత్సను అందించే ఉద్దేశంతో ముందుకెళుతున్నట్టు గూడూరు వెల్లడించారు. తీవ్ర పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా నయం చేయవచ్చని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. 500 మంది సీరియస్ రోగులకు ప్లాస్మా థెరపీ అందించే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ’ప్లాటినా’పేరుతో ఓ ప్రాజెక్టును తలపెట్టింది. తెలంగాణలో ఇప్పటి వరకు 7,294 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, వారిలో ఇద్దరి ప్లాస్మాతో ఒక కోవిడ్ వ్యాధిగ్రస్తునికి చికిత్స చేసే వీలుంది. ప్లాస్మాను దానం చేయడానికి మన రాష్ట్రంలో కూడా చాలామంది సుముఖంగా ఉన్నా వారిని ఏకతాటిపైకి తెచ్చే యంత్రాంగం లేకుండా పోయింది. ఇప్పుడు అసోసియేషన్ ఏర్పాటుతో ప్లాస్మా దాతలంతా ఒక్క చోటకు చేరే అవకాశముంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారితో 2000 మందికి పైగా చికిత్స చేసే అవకాశం ముందని నిపుణులు భావిస్తున్నారు. -
కరోనా రోగుల చికిత్స కోసం ప్లాస్మా బ్యాంక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుండటంతో ఢిల్లీ సర్కార్ పలు చర్యలు చేపడుతోంది. అతిపెద్ద కోవిడ్-19 సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటి సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇక కరోనా రోగుల చికిత్స కోసం ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రెండు రోజుల్లో ప్లాస్మా బ్యాంక్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు ప్లాస్మాను దానం చేయాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారితో మరణించిన డాక్టర్ అసీం గుప్తా కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ కోటి పరిహారం ప్రకటించారు. ఢిల్లీలో 29 మంది కరోనా రోగులపై ప్లాస్మా థెరఫీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్లాస్మా దాతలు, అవసరమైన రోగుల మధ్య ప్లాస్మా బ్యాంక్ సంథానకర్తగా వ్యవహరిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇక ఢిల్లీలో ఇప్పటివరకూ 83,077 కరోనా పాజిటివ్ కేసులలు వెలుగుచూశాయి. చదవండి : చైనాకు ధీటుగా.. ఢిల్లీలో -
‘ప్లాస్మా’ దాత.. దాటవేత!
గాంధీఆస్పత్రి: కరోనా రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యుల వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం ప్లాస్మాథెరపీ. వైరస్ బారిన పడి పూర్తిస్థాయిలో కోలుకున్న పలువురు బాధితులు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో ప్లాస్మా చికిత్సల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చికిత్సలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతి ఇవ్వడంతో మే 11న ప్లాస్మాథెరపీ చికిత్సలు ప్రారంభించారు. కరోనా సోకి పూర్తిస్థాయిలో నయమైన రోగుల్లో వైరస్‌ను నిర్మూలించే యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి. మానవ శరీరంలో రక్తంతో మిళితమై ఉన్న ప్లాస్మా యాంటీబాడీలను ప్రత్యేక పద్ధతుల ద్వారా బయటకు తీసి వాటిని ప్రాణాపాయస్థితిలో ఉన్న కరోనా బాధితులకు ఎక్కిస్తారు. బాధితుల శరీరంలో చేరిన యాండీబాడీలు కరోనా వైరస్‌తో పోరాడి నిర్మూలించడంతో రోగి కోలుకుని ప్రాణాపాయం నుంచి బయటపడతాడు.(కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి :శ్రీదేవి) అయిదుగురు రోగులకు విజయవంతంగా.. గాంధీ ఆస్పత్రిలో చేపట్టిన ప్లాస్మా థెరపీ చికిత్సలు విజయవంతం కావడంతో మరింతమంది కరోనా రోగులకు ఇదే తరహా చికిత్సలు అందించాలని వైద్యులు నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్లాస్మా« థెరపీ చికిత్సలు అందించిన ఐదుగురు రోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులై డిశ్చార్జీ కావడం గమనార్హం. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌కు చికిత్స పొంది కోలుకున్న బాధితులు వేలసంఖ్యలో ఉన్నారు. ప్రారంభంలో వీరంతా ప్లాస్మా దానం చేసేందుకు అంగీకరించారు. 50 ఏళ్లలోపు ఉండి ఇతర రుగ్మతలు లేనివారి నుంచే ప్లాస్మా సేకరించాలనే ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం 36 మంది ప్లాస్మా దాతలను గుర్తించారు. వీరిలో ఇప్పటికి కేవలం పదిమంది మాత్రమే ప్లాస్మా దానం చేసినట్లు తెలిసింది. అపోహలను తొలగించాలి.. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రాణాపాయస్థితిలో ఉన్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్లాస్మా కోసం దాతలను సంప్రదిస్తే కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, యాంటీబాడీలు దానం చేస్తే మల్లీ కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందంటూ పలు కారణాలతో దానం చేసేందుకు అంగీకరించడంలేదని తెలిసింది. ప్లాస్మా దాతలు ముందుకు రాకపోవడంతో చికిత్సలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. తక్షణమే తెలంగాణ ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు, సామాజికవేత్తలు స్పందించి ప్లాస్మాదానం, చికిత్సలపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించి, దాతలు ముందుకు వచ్చేలా తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి :శ్రీదేవి
తాడికొండ: కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తాడికొండ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆదివారం రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా యాంటీ బాడీలను తీసుకొని వాటిని కోవిడ్ రోగికి ఎక్కించడం ద్వారా ఎక్కువ శాతం ఫలితం వస్తుందన్నారు. కోలుకున్న రోగుల నుంచి రక్తాన్ని సేకరించి మిగతా రోగులకు ఎక్కించడం కొత్తేమీ కాదని వందేళ్ల కిందట స్పానిష్ ఫ్లూ విజృంభించినపుడు కూడా దీనిని వాడారన్నారు. ఇటీవల కాలంలో వచ్చిన ఎబోలా, సార్స్, మెర్స్ సహా 2009లో వచ్చిన హెచ్1 ఎన్1(స్వైన్ ఫ్లూ)కు కూడా ప్లాస్మాతో చికిత్స చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారు తమ వంతు సాయంగా ప్రస్తుతం వైరస్ బారిన పడి పోరాడుతున్న వారికి రక్తంలోని ప్లాస్మాను దానం చేయాలని కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానం ప్రాణాపాయంలో ఉన్నవారికి అత్యవసరంగా రక్తం అవసరమైతే అనేక మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారు. రక్తదానం పట్ల పట్టణ ప్రాంతాల్లో కొంతమేర అవగాహన ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజల్లో నేటికీ అపోహలు ఉన్నాయన్నారు. రక్తం ఇస్తే బలహీనమై పోతామనే భయం నిజం కాదని తెలియపరచాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం చేసినా చేయకపోయినా మన శరీరంలో రక్తనాళాలు కొద్ది రోజులకు నశించడం, కొత్తవి ఉత్పత్తి కావడం జరుగుతూనే ఉంటుందన్నారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లేనని, ఆరోగ్యకరమైన వ్యక్తి 18–60 సంవత్సరాల మధ్య కాలంలో ప్రతి మూడు నెలలకోసారి రక్తాన్ని దానం చేస్తే తన జీవిత కాలంలో 168 సార్లు ఇవ్వవచ్చని ఎమ్మెల్యే చెప్పారు. -
ప్లాస్మా థెరపీ చికిత్సకు ఏపీ ప్రభుత్వం అనుమతి
-
60 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా ప్లాస్మా థెరపీ
చండీగఢ్: కరోనా పేషంట్ల పాలిట ఆశాదీపంగా కనిపిస్తోన్న ప్లాస్మా థెరపీతో ఓ అరవై ఏళ్ల వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంఘటన చండీగఢ్ పీజీఐ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కురుక్షేత్రకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి న్యూమోనియా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యి.. ఆక్సిజన్ థెరపీ అవసరమైన స్థితిలో ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడికి ప్లాస్మా థెరపీ, ఇతర చికిత్సలు అందించారు. ఫలితంగా మూడు రోజుల్లోనే అతడికి ఆక్సిజన్ థెరపీని నిలిపివేయడమే కాక క్రమంగా కోలుకోవడం ప్రారంభించాడు. ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ క్రమంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్) డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ మాట్లాడుతూ.. ‘ఇది ఖచ్చితంగా మనందరికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చే వార్త. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వైద్యులందరికి అభినందనలు. పీజీఐఎమ్ఈఆర్లో ప్లాస్మా థెరపీతో కోలుకున్న మొదటి వ్యక్తి ఇతను. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురయిన వారికి ప్లాస్మా థెరపీని అందించాలని సూచిస్తారు. ఈ ప్రయత్నం విజయవంతం అయ్యింది. దీని గురించి మరింత ప్రచారం చేయాల్సి’ ఉంది అన్నారు. (పరమౌషధం కానున్న ప్లాస్మా!) అనస్థీషియా అండ్ ఇంటెన్సివ్ కేర్ విభాగం డీన్ (అకాడెమిక్స్), హెడ్ ప్రొఫెసర్ జీడీ పూరి చికిత్స గురించి తెలుపుతు ‘ప్లాస్మా థెరపీతో కోలుకోవడం సానుకూల సూచిక. ఈ చికిత్స క్లినికల్ ట్రయల్స్ కోసం ఎక్కువ మంది దాతలు ముందుకు రావల్సిన అవసరం ఉంది. కరోనా నుంచి కోలుకున్న రోగులను రక్త దానం చేసేలా ప్రోత్సాహించమని వారి కుటుంబ సభ్యులు, బంధువులను కోరుతున్నాం’ అన్నారు. ఆక్సిజన్ థెరపీ అవసరమయ్యే కరోనా పాజిటివ్ రోగులకు ప్లాస్మా చికిత్స అందించవచ్చని ఐసీఎమ్ఆర్ తెలిపింది. ట్రయల్స్ కోసం అది ఎంచుకున్న కేంద్రాల్లో పీజీఐ చంఢీగర్‌ను ఒకటి. ఈ క్రమంలో ‘ఏప్రిల్ చివరి వారంలో ఐసీఎమ్ఆర్ పీజీఐని ఎంచుకుంది. మే 9న మొదటి వ్యక్తి ప్లాస్మాను దానం చేశారు. జూన్ 1 న ప్లాస్మా థెరపీ పొందటానికి అర్హత సాధించిన మొదటి కరోనా రోగిని గుర్తించాం. చికిత్స అనంతరం అతడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు’ అని పూరి తెలిపారు. (కరోనా చికిత్సపై కొత్త ఆశలు) ప్లాస్మా థెరపీ అంటే.. కరోనా పేషంట్ల పాలిట ఆశాదీపంగా కనిపిస్తున్న ఈ ప్లాస్మా థెరపీలో.. కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగి నుంచి ప్లాస్మా తీసుకుంటారు. దీన్ని ‘కన్వలేసెంట్ ప్లాస్మా’ అంటారు. కరోనా వైరస్ సోకిన మొదటి దశలో ఈ ప్లాస్మా థెరపీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ప్లాస్మాలో ఉండే ప్రతిరోధకాల ద్వారా ఈ చికిత్స పనిచేస్తుంది. కరోనా నుంచి కోలుకున్న రోగులు మాత్రమే ప్లాస్మాను దానం చేయడానికి అర్హులు. వీరి నుంచి సేకరించిన ప్లాస్మాను బ్లడ్ బ్యాంకులో నిల్వ వుంచి తీవ్రమైన ఇన్ఫెక్షన్తో వచ్చే రోగుల చికిత్స కోసం వినియోగిస్తారు. -
భయం వద్దు.. ప్లాస్మాథెరపీ ఉంది!
అల్వాల్ (హైదరాబాద్): కరోనా బారినపడితే ఏదో అయిపోతుందనే భయం వద్దు. ఈ వైరస్‌కు ప్రస్తుతానికి మందులు లేకున్నా.. వైద్యులు తమకున్న అనుభవంతో, ప్లాస్మా థెరపీ వంటి వివిధ చికిత్స పద్ధతులతో రోగులను కోలుకునేలా చేస్తున్న తీరు అద్భుతం. గాంధీ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ధైర్యం చెబుతూ రోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు’ అని చెప్పారు హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రగతిశీల్ కాలనీకి చెందిన వంశీకృష్ణ. కరోనా వైరస్ బారినపడిన ఆయన ఇటీవలే గాంధీ ఆస్పత్రి నుంచి ఆరోగ్యవంతంగా ఇంటికి చేరుకున్నారు. వంశీకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నతోద్యోగి కాగా, ఆయన భార్య అడ్వకేట్. రాష్ట్రంలోనే ప్లాస్మా థెరపీ చికిత్స పొందిన మొదటి వ్యక్తి అయిన వంశీకృష్ణ గురువారం తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కంటికిరెప్పలా చూసుకున్నారు.. ‘ప్రతి గంటకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వారు. సమయానికి మందు లు, ఆహారం ఇవ్వడంతో పాటు వ్యాయామం చేయించడం ద్వారా రోగిని సంపూ ర్ణ ఆరోగ్యవంతుడిని చేస్తున్నారు. ప్లాస్మా థెరపీ పొందిన నన్ను గాంధీ ఆస్పత్రి ఆర్ఎం డాక్టర్ రాజారావు కంటికిరెప్పలా చూసుకున్నారు. ఆయన స్వయంగా ప్రతి బాధితుని వద్దకు వెళ్లి క్షేమ సమాచారాలు అడిగే వారు. ధైర్యం నింపేవారు. రోగనిరోధక శక్తి బాగుంటే కరోనా నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మను చూడ్డానికి తరచూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే క్రమంలో నాకు కరోనా వైరస్ సోకింది. దీంతో మే 11న నన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నా భార్య, ఇద్దరు పిల్లలను ఆస్పత్రిలో క్వారంటైన్ చేశారు. మే 26న భార్యాపిల్లల్ని, 30న నన్ను వైద్యులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపారు. ప్రస్తుత కరోనా సమయంలో, దాని చికిత్సకు నూతన ఒరవడిగా చెబుతున్న ప్లాస్మా థెరపీ చికిత్సను రాష్ట్రంలో పొందిన మొదటి వ్యక్తిని నేనే. కరోనా నుంచి చికిత్సానంతరం కోలుకున్న ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. దాన్ని వైరస్‌తో బాధపడుతున్న వారికి అందిస్తారు. ఆరోగ్యవంతుడి నుంచి తీసుకున్న రక్తం ద్వారా రోగికి వ్యాధిని జయించే శక్తి వస్తుంది. ఈ చికిత్స విధానంలో నేను కొద్దిరోజుల్లోనే కరోనా నుంచి బయటపడ్డాను’. ఇంటికొచ్చేసరికి ఇల్లు గుల్ల కరోనా బారినపడి.. చికిత్స పొంది, ఆరోగ్యంగా ఇంటికి చేరుకునే సరికి వంశీకృష్ణ ఇల్లు గుల్లయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘ టన వివరాలు బాధితులు, పోలీసు లు తెలిపిన ప్రకారం.. గత నెల 11న వంశీకృష్ణకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో పాటు భార్య, ఇద్ద రు పిల్లలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి క్వారంటైన్లో ఉంచిన వంశీకృష్ణ భార్యాపిల్లల్ని మే 26న ఇంటికి పంపారు. వారొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బంగారం, నగదు, విలువైన సామగ్రి కనిపించలేదు. 10 తులాల బంగారం, రూ.30 వేలు, 2 ల్యాబ్టాప్లు, 3 ఐప్యా డ్లు చోరీ అయినట్టు గుర్తించి అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి యాజమాని వంశీకృష్ణ చికిత్స పూర్తి చేసుకొని మే 30న ఇంటికి వచ్చారు. ఇంటికి సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, ఆధునిక లాకింగ్ సదుపాయాలతో కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లున్నా కూడా దొంగతనం జరిగిన తీరు విస్తుగొలుపుతోంది. కాగా, ఘటన జరిగిన 8 రోజుల తరువాత ఈ నెల 4న అల్వాల్ పోలీసులు బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని అందచేశారు. -
కరోనాకు చెక్.. ఫలించిన ప్లాస్మా థెరపీ
హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన కరోనా మహమ్మారికి ప్లాస్మాథెరపీతో చెక్ పెట్టారు. ప్రాణాపాయస్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న బాధితునికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. వివరాలివీ... కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా «థెరపీ చికిత్స నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మే నెలలో అనుమతి ఇచ్చింది. గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆరుగురి కరోనా బాధితుల కేస్‌షీట్లతోపాటు పూర్తి వివరాలను ఐసీఎంఆర్‌కు పంపగా ముందుగా థెరపీ చికిత్స కోసం ఒకరిని సెలెక్ట్ చేసింది. ఐసీఎంఆర్ నిపుణుల సూచనల మేరకు మే 14వ తేదీన చావుబతుకుల మధ్య వెంటిలేటర్‌పై ఉన్న పాతబస్తీకి చెందిన 44 ఏళ్ల వయసు గల కరోనా బాధితునికి 200 ఎంఎల్ ప్లాస్మా ద్రావణాన్ని ఎక్కించారు. సదరు రోగి ఆరోగ్యం కొంతమేర మెరుగుపడటంతో రెండు రోజుల తర్వాత 16వ తేదీన మరో 200 ఎంఎల్ ప్లాస్మాను ఎక్కించారు. బాధితుడు పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత మరో వారం రోజులు పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఇక ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని భావించి ఈ నెల 30వ తేదీన డిశ్చార్జ్ చేసినట్లు తెలిసింది. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు మరో ఇద్దరు కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ చికిత్సలు అందించగా ఇరువురు కోలుకుంటున్నారని, రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని, ప్లాస్మాథెరపీ చికిత్సలు పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో గాంధీ వైద్యుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోందని ఓ వైద్యాధికారి సంతోషం వ్యక్తం చేశారు. -
ప్లాస్మా థెరపీ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణకు, కరోనా వచ్చిన వారికి అందజేస్తున్న వివిధ రకాల మందులను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వాటివల్ల అనేక సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయని పేర్కొంది. ఇవన్నీ ట్రయల్స్ దశలో ఉన్నాయని, వాటి తుది ఫలితాలు వచ్చే వరకు వాడటం శ్రేయస్కరం కాదని తేల్చి చెప్పింది. కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలు చేయొద్దని స్పష్టం చేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, లోపినావిర్, రిటోనానవిర్, రెమిడిసివిర్, యుమిఫినోవిర్, ఫావిపిరవిర్ వంటి మందులను కూడా వాడొద్దని తెలిపింది. రోగ నిరోధక శక్తి క్రమబద్ధీకరణకు ఉపయోగించే టొసిలిజుమాబ్, ఇంటర్ ఫెరాన్లను కూడా వాడొద్దని పేర్కొంది. ప్రస్తుతం కరోనాకు మందు లేదని తెలిపింది. ఈ మేరకు తాజాగా ‘క్లినికల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్–19’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.సాధారణ, తేలిక పాటి కరోనా లక్షణాలున్న వారికి పారాసిటమాల్ వంటివి వాడితే సరిపోతుందని తేల్చి చెప్పింది. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే? హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ మాత్రలు వాడితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయని తెలిపింది. లోపినావిర్, రిటొనావిర్ వాడితే జీర్ణాశ యానికి సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొంది. రెమిడిసివిర్‌తో కాలేయ, కిడ్నీకి సంబం ధించిన సమస్యలు, దద్దుర్లు, బీపీ పెరుగుతుందని వివరించింది. యుమిఫినోవిర్‌తో డయేరియా, వాంతులు, ఫావిపిరవిర్‌ను వాడితే గుండె సంబం ధిత సమస్యలు వస్తాయని, ఇంటర్ఫెరాన్ వాడితే కండరాలు బలహీనంగా మారుతాయని తెలిపింది. టొసిలిజుమాబ్ వాడితే ముక్కు, గొంతుకు సంబం ధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. కరోనా వచ్చిన గర్భిణులకు ప్రసవం చేయాల్సి వస్తే, తప్పనిసరిగా సిజేరియన్ చేయాలనేం లేదని పేర్కొంది. -
ప్లాస్మా ట్రయిల్స్ నిర్వహణకు స్విమ్స్‌కు అనుమతి
సాక్షి, చిత్తూరు: ప్లాస్మా థెరపీ నిర్వహించడానికి తిరుతిలలోని స్విమ్స్‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్) అనుమతినిచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు. కొవిడ్-19 పెషేంట్లకు ట్రయల్ బేసిస్‌పై ప్లాస్మా థెరపీ నిర్వహిస్తామన్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోరుకున్న వారి ద్వారా ప్లాస్మాను సేకరిస్తారని జవహర్ రెడ్డి తెలిపారు. దానిని అర్హులైన కొవిడ్ పేషెంట్లకు ఎక్కించి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్..) -
కరోనా చికిత్సపై కొత్త ఆశలు
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్‌తో బాధ పడుతున్న వారిలో ఐదు వేల మంది రోగులకు ఇంతవరకు ‘ప్లాస్మా చికిత్స’ అందజేశారు. వారిలో 15 శాతం మంది మరణించగా, ఒక శాతం మందిలో మాత్రమే ఇన్ఫెక్షన్లు వచ్చాయని, మిగతా వారంతా కోలుకున్నారని ఓ వైద్య నివేదిక వెల్లడించింది. కరోన వైరస్ బారినపడి బతికి బయటక పడిన వారి రక్తంలోని ప్లాస్మాను తీసుకొని ఇతర కరోనా రోగులకు ఎక్కించడమే ‘ప్లాస్మా చికిత్స’ అంటారన్న విషయం తెల్సిందే. రక్తంలోని ప్లాస్మాలోనే యాండీ బాడీస్ అంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది. (కరోనాకు కొత్త రకం వ్యాక్సిన్) ఈ రకమైన చికిత్సకు అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎఫ్‌డీఏ)’ గత మార్చి నెలలోనే అనుమతి ఇచ్చింది. దాంతో మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ మయో క్లినిక్ పరిశోధకులు ప్లాస్మా థెరపీని ప్రారభించి ఇప్పటి వరకు ఐదు వేల మందికి చికిత్సను అందజేశారు. 15 శాతం మృతులు, ఒక్క శాతం మాత్రమే ఇన్ఫెక్షన్లు ఉన్నందున ఈ ప్లాస్మా చికిత్స ఆశాజనకంగానే ఉందని పరిశోధకులు తెలిపారు. (మాస్క్ ధరించడం ‘బలహీనతకు సంకేతం’!) అందరికి కాకపోయిన ఆస్పత్రులో చేరిన కరోన రోగులందరికి ఈ చికిత్సను కొనసాగించవచ్చని వారు సూచించారు. అప్పుడే ఓ నిర్ణయానికి రావడం మంచిదికాదని, చనిపోయిన 15 శాతం కేసులను ఒక్కొక్క కేసు చొప్పున సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అమెరికా వైద్యాధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ప్లాస్మా చికిత్సపై కొత్త ఆశలు చిగురించాయని చెప్పవచ్చని వారు వ్యాఖ్యానించారు. (ప్లాస్మా చికిత్స తీసుకున్న వైద్యుడు మృతి) -
రాష్ట్రంలో ప్లాస్మా సేకరణ ప్రారంభం
సాక్షి, అమరావతి/కర్నూలు (హాస్పిటల్): రాష్ట్రంలో కరోనా సోకి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరణ మొదలైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళవారం కర్నూలులో ఒకరు, తిరుపతిలో ముగ్గురు వ్యక్తుల నుంచి రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్యులు ప్లాస్మాను సేకరించారు. కరోనా నిర్ధారణ తర్వాత 28 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్న వీరికి ఆ తర్వాత పరీక్షలు నిర్వహించారు. రిపోర్టు నెగిటివ్ రావడంతో ఒక్కొక్కరి నుండి 300 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అందులో నుంచి ప్లాస్మా (యాంటీబాడీస్)ను వేరు చేస్తారు. కరోనా పాజిటివ్‌తో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వారికి ఈ ప్లాస్మాను ఎక్కిస్తారు. ఇప్పటివరకు కరోనా సోకి కోలుకున్న వారి వివరాలు సేకరించగా 330 మంది వరకూ ఉన్నట్టు తేలింది. వీళ్లందరి నుంచి ప్లాస్మా సేకరించి భద్రపరచాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. -
రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి చర్యలు
మంగళగిరి/కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలో త్వరలో ప్లాస్మా థెరపీని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కేంద్ర బృందం ప్రతినిధి, ఆలింఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైజీస్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బబ్బిపాల్ చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. గుంటూరు జిల్లా చినకాకాని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో ఏమన్నారంటే.. ► వైరస్ నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న పరీక్షల కారణంగా అత్యధిక కేసులు బయటపడుతున్నాయి. ► నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్‌ల గుర్తింపు, క్వారంటైన్ల నిర్వహణ తదితర కార్యకలాపాల్లో మరింత వేగంగా పనిచేయాలి. ► కాంటాక్ట్‌ల గుర్తింపులో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది విజయవంతం అయిన కారణంగానే కరోనా నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ► కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ నందినీ భట్టాచార్య, ఎన్ఆర్ఐ అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ ఉపేంద్రనాథ్ తదితరులున్నారు. వందశాతం నివారణ అసాధ్యం ► కరోనా వైరస్‌ను వందశాతం నివారించడం సాధ్యం కాదని కేంద్ర బృందం సభ్యురాలు డాక్టర్ మధుమిత దూబే చెప్పారు. కర్నూలు పెద్దాస్పత్రి (రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రి)లో కరోనా కట్టడిపై కేంద్ర బృందం సభ్యుడు ప్రొఫెసర్ సంజయ్‌కుమార్ సాధూఖాన్, కలెక్టర్ జి.వీరపాండియన్‌తో కలిసి ఆస్పత్రి హెచ్వోడీలు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ► డాక్టర్ సంజయ్‌కుమార్ సాధూఖాన్ మాట్లాడుతూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు అవసరమైన వారికి అజిత్రోమైసిన్ మాత్రలు కూడా ఇవ్వాలని సూచించారు. ► కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా బాధితులు 95 శాతం మంది కోలుకుంటున్నారని కేంద్ర బృందానికి నివేదించారు. -
గాంధీలో ప్లాస్మా థెరపీ
గాంధీఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మరో మైలురాయికి చేరుకుంది. రాష్ట్రచరిత్రలో మొదటిసారిగా ప్లాస్మా థెరపీ చికిత్స నిర్వహించిన ఘనత సాధించింది. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి గాంధీ ఆస్పత్రిలో ప్లా స్మా థెరపీని ప్రారంభించామని సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ప్లాస్మా దాతలతోపాటు ఆస్పత్రి పాలనాయంత్రాంగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ.. శ్రీనగర్‌కాలనీ, ఎల్బీనగర్కు చెందిన అఖిల్, సూర్యారావు నుంచి 800 ఎంఎల్ ప్లాస్మా సేకరించామని, 200 ఎంఎల్ ప్లాస్మాను ప్రాణాపాయస్థితిలో ఉన్న కరోనా రోగులకు ఎక్కిస్తామన్నారు. ప్లాస్మా దానా నికి మరో 15 మంది సిద్ధంగా ఉన్నారని, మరో 200 మంది సైతం అందుబాటులో ఉన్నారన్నారు. కరోనాతో ఎవరూ చనిపోకూడదు: అఖిల్ వైద్యుల కృషితో కరోనాను జయించానని, ఈ మ హమ్మారితో ఎవరూ మృతి చెందకూడదన్న సంకల్పంతోనే ప్లాస్మా దానం చేసేందుకు వచ్చానని శ్రీ నగర్ కాలనీకి చెందిన దాత హైకోర్టు న్యాయవాది అఖిల్ స్పష్టం చేశాడు. స్కాట్లాండ్ నుంచి ఇండి యా వచ్చిన తర్వాత జ్వరం, జలుబుతో బాధపడ్డానని, పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలి పా డు. గాంధీ ఆస్పత్రిలో 16 రోజులు చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయినట్లు చెప్పారు. -
మరో చరిత్రకు సిద్ధమైన గాంధీ ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 ఆసుపత్రి గాంధీ ఇప్పుడు మరో చరిత్రకు సిద్ధమైంది. కరోనా వైద్యం కోసమే ప్రత్యేకంగా కేటాయించిన గాంధీ ఆసుపత్రిలో నేటి నుంచి కరోనా మహమ్మారికి చికిత్సలో కీలకంగా భావిస్తున్న ప్లాస్మా థెరపీని మొదలుపెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతి పొందింది. కరోనా బారిన పడి వైద్యసేవల అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న 35 మంది ప్లాస్మా దాతలు ముందుకురాగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న 15మంది నుంచి ప్లాస్మా కణాలను సేకరించారు. వారిలో ఆరుగురు కరోనా బాధితుల కేస్ సీట్లు ఇతర వివరాలను ఐసీఎంఆర్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకు మొదటి విడతగా ముగ్గురికి ప్లాస్మా థెరపీ చికిత్స ప్రారంభిస్తారు. చదవండి: చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం ఆరోగ్యవంతుడైన కరోనా బాధితుల నుంచి 400 ఎం.ఎల్ ప్లాస్మాను సేకరించి 200 ఎం.ఎల్ ప్లాస్మాను బ్లడ్ గ్రూప్ ఆధారంగా రోగి శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ప్రక్రియకు సుమారు 2 గంటల సమయం పడుతుంది. ప్లాస్మా థెరపీతో రోగి కోలుకుంటున్నట్లు భావిస్తే మరో 200 ఎం.ఎల్ ప్లాస్మాను ఎక్కిస్తారు. ఇటు దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్లాస్మా థెరపీ చికిత్సలు, పనితీరుపై ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీసి పలు సలహాలు సూచనలు అందిస్తోంది. గాంధీలో చేపట్టే ప్లాస్మా థెరపీ చికిత్సను అనుక్షణం ఐసీఎంఆర్ నిపుణులు పర్యవేక్షించనున్నారు. చదవండి: కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్! -
ప్లాస్మా చికిత్స తీసుకున్న వైద్యుడు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో తొలిసారి ప్లాస్మా చికిత్స తీసుకున్న వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన 53 ఏళ్ల ప్రభుత్వ వైద్యుడు, అతని భార్య కరోనా బారిన పడ్డారు. దీంతో వారిద్దరినీ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో చికిత్స అందించారు. అయితే గత కొంతకాలంగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న వైద్యుడు ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి రక్తాన్ని ఎక్కించుకుని ప్లాస్మా చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. ఇంతలోనే కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకడంతో శనివారం రాత్రి ప్రాణాలు విడిచాడు. అయితే అతను మరణించడానికి ముందు చేసిన పరీక్షల్లో నెగెటివ్ అని రావడం గమనార్హం. (‘ప్లాస్మా’పై 21 సంస్థలకు అనుమతి) ఈ ఘటన గురించి కేజీఎంయూ అంటు వ్యాధి విభాగం ఇన్చార్జ్ డా. డి.హిమాన్షు మాట్లాడుతూ.. "అతడు అప్పటికే మధుమేహం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అతనికి మేము ప్లాస్మా థెరపీ ప్రయోగించాం. ఆ తర్వాత అతని ఊపిరితిత్తుల పరిస్థితితోపాటు, గుండె పనితీరు కూడా మెరుగుపడింది. ఆ తర్వాత అకస్మాత్తుగా అతనికి మూత్రాశయ ఇన్ఫెక్షన్ సోకి అది మరణానికి దారి తీసింది" అని తెలిపారు. కాగా మహారాష్ట్రలోనూ తొలిసారిగా ప్లాస్మా చికిత్స ప్రయోగించిన వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా ఢిల్లీ తర్వాత ప్లాస్మా చికిత్స ప్రయోగించిన రెండవ రాష్ట్రంగా యూపీ నిలిచింది. (మహారాష్ట్రలో ప్లాస్మా చికిత్స ఫెయిల్) -
సోమవారం నుంచి ప్లాస్మా చికిత్సలు షురూ
సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్మా థెరపీ చికిత్సలకు గాంధీ ఆస్పత్రి వైద్యులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ముందుకు వచ్చిన 36 మంది దాతల నుంచి శనివారం ప్లాస్మాను సేకరించనున్నారు. సోమవారం నుంచి అవసరమైన రోగులకు చికిత్సలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. అయితే దీన్ని క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగానే పరిగణించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్)స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు ప్లాస్మాథెరపీ ఓ ఔషధంలా ఉపయోగపడుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఆ మేరకు ఇటీవల గాంధీ ఆస్పత్రి వైద్యులు ఐసీఎంఆర్‌కు లేఖ రాయగా ఇప్పటికే ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా మంజూరు చేసింది. గాంధీతో పాటు ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, అపోలో గచ్చిబౌలి, ఏఐజీ గచ్చిబౌలి కేంద్రాలకు కూడా ఈ ప్లాస్మా థెరపీ చికిత్సలకు అనుమతులు ఇచ్చింది. అయితే ప్లాస్మాథెరపీ చికిత్సలను వైద్యులు ఇష్టానుసారం కాకుండా ఐసీఎంఆర్ ఎంపిక చేసిన రోగులకే చేయాలని నిబంధనలు విధించింది. ప్రస్తుతం వీటిని క్లీనికల్ ట్రయల్స్ భాగంగా భావించాలని కూడా స్పష్టం చేసింది. అత్యవసర రోగులకు ఇదో వరం తెలంగాణలో గురువారం నాటికి 1122 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 29 మంది మృతి చెందారు. 693 మందిచికిత్సల తర్వాత కోలుకుని డిశ్చార్జి కూడా అయ్యారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 400 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 15 మంది ఆక్సిజన్‌పై ఉండగా, మరో ఐదుగురు బాధితులు డయాలసిస్‌పై కొనసాగుతున్నారు. వీరిలో కొంత మందికి వెంటిలేటర్ చికిత్సలు కూడా అవసరమవుతున్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, లోపినవీర్ వంటి మందులు వాడినా వైరస్ తగ్గకపోగా..వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తోంది. మృత్యువాతకు కారణమవుతోంది. ఇలాంటి రోగులను కాపాడాలంటే ప్లాస్మాథెరపీ ఒక్కటే పరిష్కారమని వైద్యనిపుణులు భావించారు. ఇప్పటికే అమెరికా సహా పలు దేశాల్లో ఈ తరహా చికిత్సలను అందజేస్తున్నాయి. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. దీంతో మన దగ్గర చికిత్స పొందుతున్న అత్యవసర రోగులకు కూడా ఈ తరహా చికిత్సలను ప్రారంభించాలని నెల రోజుల క్రితమే వైద్య ఆరోగ్యశాఖ భావించింది. ఆ మేరకు గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఐదుగురు వైద్యులతో ఓ ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు..అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను ఐసీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లి, ఈ చికిత్సలకు అనుమతి ఇవ్వాలని కోరింది. చికిత్సల్లో వైద్యులకు ఉన్న అనుభవం..మౌలిక సదుపాయాలను పరిశీలించిన తర్వాత ఐసీఎంఆర్ అనుమతులు జారీ చేసింది. అయితే ఏ రోగికి ఈ తరహా చికిత్స చేస్తున్నారో ముందే తమకు తెలియజేయాలని, తాము అనుమతి ఇచ్చిన తర్వాతే చికిత్సలు ప్రారంభించాలని కండిషన్ పెట్టింది. ముందుకు వచ్చిన 36 మంది దాతలు ఇప్పటికే కరోనా వైరస్ భారిన పడి..గాంధీలో చికిత్సల తర్వాత పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన 36 మంది దాతలు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వీరి నుంచి ప్లాస్మాను శనివారం సేకరించనున్నారు. గాంధీ రక్తనిధి కేంద్రంలోని ఓ ప్రత్యేక మిషన్ సహాయంతో రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి నిల్వ చేయనున్నారు. ఒక్కో దాత నుంచి 400 ఎంఎల్ ప్లాస్మాను సేకరించనున్నారు. ఇలా సేకరించిన ప్లాస్మాను ఒక్కో రోగికి 200 ఎంఎల్చొప్పున ఇద్దరు రోగులకు ఎక్కించనున్నారు. ఈ సమయంలో దాత శరీరంలోని రక్తం చుక్క కూడా వృథా కాదు. రక్తం నుంచి ప్లాస్మా వేరు చేసిన తర్వాత ఆ రక్తం తిరిగి దాత శరీరంలోకి వెళ్లిపోతుంది. త ద్వారా దాతకు కేవలం ప్లాస్మా మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలా సేకరించిన ప్లాస్మాను గ్రూపులుగా విభజించి..రోగి బ్లడ్ గ్రూప్ ఆధారంగా ప్లాస్మాను వారికి ఎక్కించనున్నారు. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీలో ఆక్సిజన్, డయాలసిస్‌పై ఉన్న రోగులకు ఈ తరహా చికిత్సలను అందజేయాలని వైద్యులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా బాధితుల వివరాలను ఐసీఎంఆర్‌కు కూడా పంపినట్లు తెలిసింది. ఐసీఎంఆర్ సూచనల మేరకు వారికి చికిత్సలు అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. -
కరోనా: రెండు చోట్ల ప్లాస్మా సేకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా ప్లాస్మా సేకరణకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రెండు చోట్ల ప్లాస్మా సేకరణ చేయనున్నట్లు కోవిడ్-19 స్టేట్ కమాండ్ కంట్రోల్ నోడల్ అధికారి డా. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి స్విమ్స్, కర్నూలు మెడికల్ కాలేజిలో ప్లాస్మా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగుల నుంచి 14 రోజుల తర్వాత వారి ప్లాస్మా సేకరిస్తే, యాంటీ బాడీస్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపతుందని చెప్పారు. ఇప్పటివరకు కేవలం ప్లాస్మా సేకరణ మాత్రమే చేస్తున్నామని డా. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. (ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు..) సిరియా దేశంలో ప్లాస్మా సేకరణ కరోనా బాధితులకు యంటీ బాడీస్ అభివృద్ధికి ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. ఇక సేకరించి ప్లాస్మాను -40 డిగ్రీల వద్ద ప్రిజర్వ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు 14 రోజులు తర్వాత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వటం ద్వారా కరోనా బాధితులకు మేలు చేసినట్లు అవుతుందని ఆయన చెప్పారు. (గ్యాస్ లీక్ ఘటనపై విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి) -
‘ప్లాస్మా’పై 21 సంస్థలకు అనుమతి
న్యూఢిల్లీ: కోవిడ్ నుంచి కాపాడేందుకు ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్‌కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) దేశంలోని 21 సంస్థలకు అనుమతినిచ్చింది. థెరపీ ద్వారా కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల రక్తంలోని యాంటీబాడీస్‌ని సేకరించి, వాటిని కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తుల శరీరంలోకి ప్రవేశపెడతారు. దీనివల్ల కోవిడ్‌ని ఎదుర్కోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తం ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు 111 సంస్థలు ఆసక్తి చూపగా, 21 సంస్థలకే అనుమతి లభించింది. ఐసీఎంఆర్ అనుమతి పొందిన వాటిలో తెలంగాణలోని గాంధీ మెడికల్ కాలేజీ ఉంది. కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులైన వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. దాత పూర్తి సమ్మతితోనే ప్లాస్మాను తీసుకుంటారు. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారణ అయితేనే వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. కేవలం ప్లాస్మా కణాలు మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటిబాడీస్ ప్లాస్మాలో పుష్కలంగా ఉంటాయి. ఒక దాత నుంచి 400 నుంచి 800 ఎంఎల్ ప్లాస్మా కణాలు సేకరించే అవకాశం ఉంది. (ఒక్క రోజులో 2,958 కరోనా పాజిటివ్ కేసులు) -
ప్లాస్మా థెరపీకి ఎథిక్స్ కమిటీ ఆమోదం
సాక్షి, గుంటూరు: కరోనా (కోవిడ్–19) బాధితులకు ప్మాస్లాథెరపీ ద్వారా చికిత్స అందించేందుకు గుంటూరు వైద్య కళాశాల ఎథిక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. శనివారం వైద్య కళాశాలలో కళాశాల ఎథిక్స్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం వెల్లడించింది. ఈ విధానంలో కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు గుంటూరు వైద్య కళాశాలలో అన్ని రకాల వైద్యులు, వైద్య సౌకర్యాలు ఉండటంతో కళాశాల ఎతిక్స్ కమిటీ ఈ వైద్య విధానంలో చికిత్స అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధికి కరోనా) వైద్య కళాశాల ఎథిక్స్ కమిటీ నివేదికను కేంద్ర పరిశోధనా సంస్థ ఐసిఎంఆర్‌కు పంపి అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ప్లాస్మాథెరపీ చికిత్స ప్రారంభిస్తామని ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, పెథాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ చాగంటి పద్మావతిదేవి తెలిపారు. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’) -
‘కునుకు తీసినంత సులువుగా ప్లాస్మా దానం’
కాలిఫోర్నియా : కరోనాపై విజయం సాధించిన హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్(63) ప్లాస్మా దానం చేశారు. గత వారం టామ్ హాంక్స్ ఇచ్చిన ప్లాస్మా బ్యాగు ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. శరీరం నుంచి ప్లాస్మాను తీయడం కునుకు తీసినంత సులువుగా అనిపించిందని పేర్కొన్నారు. కాగా హాలీవుడ్ స్టార్ కపుల్ టామ్ హాంక్స్, రీటా విల్సన్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కోవిడ్ నుంచి కోలుకున్న వీరు ప్రస్తుతం అమెరికాకు చేరుకున్నారు. సేవింగ్ ప్రైవేట్రియాన్, కాస్ట్ అవే, ఫిలడెల్పియా, ఫారెస్ట్ గంప్, స్ప్లాష్, బ్యాచిలర్ పార్టీ, బిగ్, ది టెర్మిమినల్, అపో వంటి చిత్రాలతో మంచి నటుడిగా టామ్ హాంక్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి భార్య సమంతా లూయీస్ నుంచి విడిపోయిన తర్వాత 1998లో నటి రీటాను పెళ్లి చేసుకున్నారు. చదవండి : 2293 కొత్త కేసులు, 71మంది మృతి -
ప్లాస్మా చికిత్స ఫెయిల్.. వ్యక్తి మృతి
ముంబై : మహారాష్ట్రలో తొలిసారిగా ప్లాస్మా చికిత్స ప్రయోగించిన 53 ఏళ్ల వ్యక్తి బుధవారం అర్థరాత్రి మరణించారు. వివరాల ప్రకారం.. కరోనా కారణంగా ఓ వ్యక్తి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరగా, ప్లాస్మా చికిత్స అందించారు. కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన 200 మి.లీ. ప్లాస్మాను అందించి ట్రీట్మెంట్ కొనసాగించారు. మొదట్లో కోలుకుంటున్నట్లు అనిపించినా, తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. 24 గంటల్లోనే పరిస్థితి విషమించి ఆ వ్యక్తి చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఇది వరకే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి ప్రకారమే ప్లాస్మా చికిత్స చేశామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌తోపే తెలిపారు. బివైఎల్ నాయర్ ఆసుపత్రిలో మరో కరోనా రోగికి ప్లాస్మా చికిత్స చేస్తున్నామని, అది విజయవంతమవుందని ఆశిస్తున్నట్లు వెల్లడించిన కొద్ది గంటల్లోనే మొదటి ప్లాస్మా చికిత్స తీసుకుంటున్న వ్యక్తి మరణించడం గమనార్హం. అయితే ప్లాస్మా చికిత్స ప్రయోగిస్తున్న ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సత్పలితాలు వస్తున్నాయి. కాబట్టి మరికొంత మందిపై ప్రయోగాల కోసం ఐసీఎంఆర్‌ను అనుమతి కోరిన సంగతి తెలిసిందే. కోవిడ్ నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులైన వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. అది కూడా వారి ఇష్టప్రకారం అయితేనే. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారణ అయితేనే వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. కేవలం ప్లాస్మా కణాలు మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటిబాడీస్ ప్లాస్మాలో పుష్కలంగా ఉంటాయి. ఒక దాత నుంచి 400 నుంచి 800 ఎంఎల్ ప్లాస్మా కణాలు సేకరించే అవకాశం ఉంది. వీటి ద్వారా కనీసం నలుగురు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. (కనికా కపూర్ సంచలన నిర్ణయం ) -
ప్లాస్మా థెరపీకి ఐసీఎంఆర్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బారినపడి గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న అత్యవసర రోగులకు ప్లాస్మా థెరపీ అందించేందుకు అనుమతి లభించింది. ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోల్ బోర్డు పచ్చజెండా ఊపాయి. తెలంగాణలో సోమవారం రాత్రి వరకు 1,003 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 332 మందికిపైగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 25 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 646 మంది కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏడుగురి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంది. వీరంతా వెంటిలేటర్‌పై ఉన్నారు. వీరిని కాపాడాలంటే ప్లాస్మా థెరపీ ఒక్కటే పరిష్కారమని వైద్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి వైద్య బృందం అనుమతుల కోసం ఐసీఎంఆర్ సహా డ్రగ్ కంట్రోల్ బోర్డుకు దరఖాస్తు చేసింది. డాక్టర్ రాజారావు నేతృత్వంలో ఎథికల్ కమిటీని కూడా ఎంపిక చేసింది. తాజాగా ఐసీఎంఆర్ ప్లాస్మా థెరపీ నిర్వహణకు అనుమతులిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ బారినపడి చికిత్సానంతరం పూర్తిగా కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ప్లాస్మా థెరపీ ఎలా చేస్తారంటే.. ప్లాస్మా థెరపీ నిర్వహించాలంటే ఇప్పటికే కరోనా పాజిటివ్ నిర్ధారణై, చికిత్స తర్వాత కోలుకుని, నెగెటివ్ రిపోర్టు వచ్చిన దాతలు అవసరం. అంటే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారన్న మాట. వీరికి హెపటైటిస్ బీ, సీ సహా, హెచ్ఐవీ ఇతర జబ్బులు ఉండకూడదు. దాత వయసు కూడా 20 నుంచి 40ఏళ్లలోపు ఉండాలి. ఆస్పత్రిలోని ఎథికల్ కమిటీ.. దాతలు సహా స్వీకర్తలను ఎంపిక చేస్తుంది. సింగిల్ డోనర్ ద్వారా ప్లాస్మా సేకరిస్తారు. ఇందుకు దాతలను సింగిల్ డోనర్ ప్రాసెస్ (ఎస్డీపీ) మిషన్‌కు అనుసంధానం చేస్తారు. ఈ మిషన్ దాత శరీరంలోని సాధారణ రక్తం నుంచి నీటిరూపంలో ఉండే పసుపు రంగు ద్రావణాన్ని (ప్లాస్మా) వేరు చేస్తుంది. రక్తం యథావిధిగా దాత శరీరంలోకి తిరిగి వెళ్లిపోతుంది. కేవలం ప్లాస్మా కణాలు మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటిబాడీస్ ప్లాస్మాలో పుష్కలంగా ఉంటాయి. కరోనాను జయించిన దాత ప్లాస్మాలో ఈ యాంటిబాడీస్ ఎక్కువగా ఉంటా యని వైద్యనిపుణులు అంటున్నారు. ఒక దాత నుంచి 400 నుంచి 800 ఎంఎల్ ప్లాస్మా కణాలు సేకరించే అవకాశం ఉంది. వీటిని కనీసం నలుగురు బాధితులకు అందించి కాపాడవచ్చు. ఇలా సేకరించిన కణాలను అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఎక్కిస్తారు. ఈ ప్లాస్మా కణాలను శరీరంలోకి ఎక్కించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీబాడీస్‌ను పెంచడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, వైరస్ బారి నుంచి బాధితులు త్వరగా కోలుకుంటారు. ఢిల్లీలో ఇప్పటికే విజయవంతం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్లాస్మాథెరపీ ఓ ఆరోగ్య సంజీవనిగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికాలో ఇప్పటికే 600 మందికి ఈ ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసినట్లు తెలిసింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో 49ఏళ్ల వ్యక్తికి ప్లాస్మా థెరపీ నిర్వహించడంతో ఆయన విజయవంతంగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యారు. కేరళ, మహారాష్ట్రలోనూ ఈ తరహా చికిత్సలు కొనసాగుతున్నాయి. తాజాగా గాంధీలో చికిత్స పొందుతున్న ఏడుగురు రోగులకు ఇదే తరహాలో చికిత్స చేయాలని వైద్యులు భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దాతలను కూడా ఎంపిక చేసినట్లు తెలిసింది. అన్నీ సవ్యంగా జరిగితే ఒకట్రెండు రోజుల్లో ఈ తరహా చికిత్సను ప్రారంభించే అవకాశం లేకపోలేదని ఓ వైద్యుడు చెప్పారు. ప్లాస్మా డోనర్లు రెడీ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి పూర్తిగా కోలుకున్న 32 మంది వ్యక్తులు ఇతర రోగుల ప్రాణాలను రక్షించేందుకు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు లేఖ రాశారు. ప్లాస్మా దానం చేసేందుకు సంసిద్ధత తెలిపిన 32 వ్యక్తుల జాబితాను లేఖతో పాటు పంపించారు. ప్లాస్మా దాతలు ముందుకు రావడంతో కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటం బలోపేతం అవుతుందని అసదుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి కోలుకున్న తబ్లీగీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఆయన మంత్రికి పంపిన జాబితాలో ఉన్నాయి. -
కనికా కపూర్ సంచలన నిర్ణయం
సాక్షి, లక్నో: కరోనా వైరస్ వ్యాప్తిపై అనేక వివాదాలు,ఆరోపణలు, ఆఖరికి యూపీ పోలీసుల కేసును కూడా ఎదుర్కొన్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాంతక కరోనావైరస్ నుండి ఇటీవల కోలుకున్న కనికా కరోనా పేషెంట్ల కోసం తన ప్లాస్మాను దానం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు ఆమె లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) అధికారులను సంప్రదించి రక్త నమూనాలను ఇచ్చారు. ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం అధిపతి తులికా చంద్ర ఆమె రక్త నమూనాను పరీక్ష కోసం తీసుకున్నట్టు వెల్లడించారు. పరీక్షల అనంతరం నిర్ణయం తీసుకుంటామనీ, అన్నీ సవ్యంగా వుంటే ఆమెను ప్లాస్మా స్వీకరణకు పిలుస్తామని తులికా చంద్ర చెప్పారు. కరోనా బారిన పడి వరుసగా నెగిటివ్ రిపోర్టులు వచ్చినా, ధైర్యం కోల్పోకుండా పూర్తిగా కోలుకున్న కనికా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లక్నోలో ఉంటున్నారు. తనపై అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేశారంటూ తన అనుభవాలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. (ఇన్నిరోజులు మౌనంగా భరించా : కనికా కపూర్) ప్లాస్మా థెరపీ సత్ఫలితాలనిస్తుండటంతో ఢిల్లీ, కేరళ సహా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా చికిత్స కోసం ప్లాస్మా థెరపీని అందిస్తున్నారు. కేజీఎంయూలో కోలుకున్న ముగ్గురు తమ ప్లాస్మాను దానం చేశారు. వీరిలో కేజీఎంయూ రెసిడెంట్ డాక్టర్, కెనడాకు చెందిన మహిళా వైద్యురాలు, మరొక రోగి వున్నారు. ఆదివారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 58 ఏళ్ల ఓ కరోనా పేషెంట్‌కు ప్లాస్మా థెరపీతో కోలుకుంటున్నాడని వైద్యులు ప్రకటించడం విశేషం. (కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం) కాగా కోవిడ్-19 రోగులకు ప్లాస్మా చికిత్సను ఒక ప్రయోగాత్మక ప్రక్రియగా గుర్తించారు. వైరస్ బారిన పడి కోలుకున్నఆరోగ్యకరమైన వ్యక్తి ప్లాస్మా(రక్త భాగం)ను స్వీకరించి కరోనావైరస్ రోగికి చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే ప్లాస్మా దాతలకు డయాబెటిస్, గుండె జబ్బులు, మలేరియా, సిఫిలిస్ వంటి వ్యాధులు ఉండకూడదు. మరోవైపు ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల రాష్ట్రాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. -
నొప్పి కూడా ఎక్కువ ఉండదు.. దయచేసి..
ఎంతో ధైర్యంగా పోరాడి ప్రాణాంతక కరోనా వైరస్‌ను జయించడంతో పాటు తన ప్లాస్మాను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిందని తన కజిన్ కూతురు దియా నాయుడుపై నటి నఫీసా అలీ ప్రశంసలు కురిపించారు. కరోనాపై పోరులో విజయం సాధించి... ప్రస్తుతం తన లాంటి పేషెంట్లను కాపాడేందుకు సాయం అందిస్తున్న హీరో దియా అనుభవాలను తెలుసుకోవాలని తన ఇన్‌స్టా ఫాలోవర్లకు సూచించారు. ‘‘దియా నాయుడు. ప్లాస్మా దానం చేసి ఇంటికి తిరిగివచ్చింది. ఇప్పుడదే లిక్విడ్ గోల్డ్‌లా కనిపిస్తోంది. ఎన్నో ప్రాణాలను నిలబెడుతోంది కాబట్టి దానికి విలువ కట్టలేం’’అని తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చారు. దియాను ధైర్యశాలిగా ఆమె అభివర్ణించారు. ఈ క్రమంలో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.(కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?) కాగా బెంగళూరులో నివసించే దియా నాయుడు కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె ఇటీవలే కోలుకున్నారు. కరోనా పేషంట్లకు.. కోవిడ్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మా ఎక్కించడం ద్వారా ప్రమాద తీవ్రత తగ్గుంతుందన్న వార్తల నేపథ్యంలో ముందుకొచ్చి.. కర్ణాటకలో ప్లాస్మా దానం చేసిన రెండో వ్యక్తిగా ఆమె నిలిచారు. ఈ క్రమంలో తన అనుభవాలు వెల్లడిస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు. ‘‘కర్ణాటకలో ప్లాస్మా థెరపీ ప్రారంభించారు. కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల రక్తంలోని ప్లాస్మాను సేకరిస్తున్నారు. అందులోని యాంటీబాడీలు వైరస్ బారిన పడిన వారు కోలుకునేందుకు ఉపయోగపడతాయి. ఒక్క బ్యాగు ప్లాస్మా ఒక పేషెంట్‌కు మాత్రమే సరిపోతుందట. అంటే ప్లాస్మా దానం చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.(ప్లాస్మా దానం చేస్తున్న తబ్లిగీలు) కాబట్టి కరోనా నుంచి బయటపడ్డవారు ముందుకురావాలి. మనలాగే బాధ పడుతున్న వారిని కాపాడాలి. మీరు నాకు మెసేజ్ చేస్తే మీ సమాచారాన్ని డాక్టర్లకు చేరవేస్తాను. ఎవ్వరూ భయపడవద్దు. రక్తదానం చేసినట్లుగానే ఈ ప్రక్రియ కూడా. పెద్దగా నొప్పికూడా ఉండదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మన నుంచి ప్లాస్మా సేకరిస్తారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అంతేకాదు మరో రెండు వారాల్లో తిరిగి ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కేవలం నాలుగు గంటలు కేటాయిస్తే చాలు ఒక్కరి ప్రాణం కాపాడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. వైద్యబృందాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. వారికి సాయం అందిద్దాం’’అని చైతన్యం నింపారు. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. View this post on Instagram My darling niece Diya Naidu - I am so grateful to you brave child - a COVID19 warrior ( living in Bangalore) has agreed to donate her plasma to help cure other COVID19 serious patients. The process of donating plasma to treat COVID-19 is not very complex and can be done in just two hours. One of the most discussed methods of treatment of the disease caused by the novel coronavirus is plasma therapy, which involves the transfusion of plasma from a convalescent coronavirus patient to a critical patient. The blood of a recovering patient is rich in antibodies produced by the body to fight the virus, which are expected to help the critical patient recover.#covid_19 #plasmadonation #india A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Apr 27, 2020 at 2:37am PDT -
ప్లాస్మా దానం: ప్రభుత్వానికి ఒవైసీ లేఖ
సాక్షి, హైదరాబాద్ : తబ్లిగీ జమాత్‌లో పాల్గొని కరోనా సోకి, దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు కోవిడ్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా సోకి అనంతరం కోలుకున్న ఢిల్లీకి చెందిన 300 మంది ముస్లింలు, ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్న ఇతరులకు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. కరోనా వైరస్ సోకి కోలుకున్న 32 మందిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరినట్లు తెలిపారు. దానికి వారు సుముఖత వ్యక్తం చేశారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందచేస్తున్నా అని ఒవైసీ పేర్కొన్నారు. (కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?) వైరస్ నుంచి కొలుకున్న 32 మంది వైరస్ బాధితుకుల ప్లాస్మా దానం చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు లేఖ రాశారు. కాగా మార్చిలో జరిగిన తబ్లిగీ సదస్సు భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తబ్లిగీలో పాల్గొన్న ముస్లింలు దేశద్రోహులంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో జమాత్ చీఫ్ మౌలానా సైతం ప్లాస్మా దాన కార్యక్రమానికి కరోనా నుంచి కోలుకున్న ముస్లింలు ముందుకు రావాలంటూ రంజాన్ సందర్భంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. (ముస్లింలకు అసదుద్దీన్ విజ్ఞప్తి) -
ప్లాస్మా దానం చేస్తున్న తబ్లిగీలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌లో పాల్గొని కరోనా సోకి, అనంతరం దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు కోవిడ్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మార్చిలో జరిగిన తబ్లిగీ సదస్సు భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తబ్లిగీలో పాల్గొన్న ముస్లింలు దేశద్రోహులంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో తబ్లిగీ కారణంగా కరోనా సోకి అనంతరం కోలుకున్న 300 మంది ముస్లింలు, ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్న ఇతరులకు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జమాత్ చీఫ్ మౌలానా సైతం ఈ దాన కార్యక్రమానికి కరోనా నుంచి కోలుకున్న ముస్లింలు ముందుకు రావాలంటూ రంజాన్ సందర్భంగా పిలుపునిచ్చారు. -
మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీ
సాక్షి, అమరావతి: మంగళగిరి ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతించింది. కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్‌లో ఇమ్యునోథెరపీ, ఫార్మకోథెరపీకి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. మంగళగిరిలో ఎయిమ్స్‌లో ప్లాస్మా థెరపీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో కార్యనిర్వాహక కమిటీని, ఆరుగురు వైద్యులతో సాంకేతిక కమిటీ బృందాన్ని నియమించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీలైనంత త్వరగా ల్యాబొరేటరీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. (పరీక్షల సంఖ్య పెంచండి: సీఎం జగన్) కోవిడ్–19 ఓఎస్డీగా జయచంద్రా రెడ్డి అమరావతి: కోవిడ్–19కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, కంట్రోల్ రూం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)గా డాక్టర్ పీఎల్.జయచంద్రా రెడ్డిని ప్రభుత్వం నియమించింది. విధులకు తక్షణం హాజరు కావాల్సిందిగా ఆయన్ను ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. జయచంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. (సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్) -
కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారీ చికిత్సకు ఇంతవరకు మందునుగానీ, వ్యాక్సిన్‌నుగానీ కనుక్కోలేక పోవడంతో కరోనా బాధితులను రక్షించేందుకు చైనా, అమెరికా దేశాలు ‘ప్లాస్మా థెరపి’ని ఇప్పటికే ఉపయోగిస్తుండగా, ఇప్పుడు భారత్ కూడా అదే థెరపిని ఉపయోగిస్తోంది. ఈ థెరపి వల్ల నలుగురు కరోనా పేషంట్లు పూర్తిగా కోలుకున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ శనివారం మధ్యాహ్నం తెలిపారు. ఇంతకు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటీ? దీన్ని ‘కన్వాల్సెంట్ ప్లాస్మా థెరపి’ అంటారు. ప్రస్తుత సందర్భంలో కరోనా వైరస్ వచ్చి కోలుకున్న వ్యక్తి రక్తంలోని యాంటీ బాడీస్‌ను తీసి అదే వైరస్ బారిన పడిన బాధితుడి రక్తంలోకి ఎక్కించడమే ఈ థెరపి. యాంటీ బాడీస్‌ను శాస్త్ర విజ్ఞాన పరిభాషలో ‘ఇమ్యునోగ్లోబులిన్’గా వ్యవహరిస్తారు. మన పరిభాషలో దీన్ని రోగ నిరోధక శక్తిగా పేర్కొంటాం. ఎవరైన కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నట్లయితే అతని రక్తంలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉన్నట్లు. ఈ యాంటీ బాడీస్ మనిషి రక్తంలోని ‘ప్లాస్మా’ అనే ద్రావకంలో ఉంటాయి. దాత రక్తం నుంచి ప్లాస్మాను తీసుకొని రోగికి ఎక్కిస్తారు. అందుకే దీన్ని ప్లాస్మా థెరపి అని అంటారు. రోగి రక్తంలోకి ఎక్కించిన ప్లాస్మాలోని యాంటీ బాడీస్ శరీరంలోని కణజాలం మొత్తానికి రక్తం ద్వారా ప్రవహిస్తూ వైరస్‌తో పోరాడుతుంది. ఈ థెరపి వల్ల రోగి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటితోపాటు అపాయాలు కూడా ఉన్నాయి. అపాయాలు ఏమిటీ? 1. రక్తదాతకు హెపిటైటీస్ బీ, హెపిటైటిస్ సీ, హెఐవీ లాంటి జబ్బులున్నా, మరే ఇతర వైరస్‌లున్నా థెరపి తీసుకున్న రోగులకు సంక్రమిస్తాయి. 2. రక్త దాత నుంచి తీసుకున్న ప్లాస్మాలో వైరస్‌ను ధీటుగా ఎదుర్కొనే స్థాయిలో యాంటీ బాడీస్ ఉండాలి. అలా లేని పక్షంలో ప్లాస్మా థెరపి తీసుకున్న వ్యక్తికి జబ్బు తగ్గకపోగా మరింత తీవ్రమవుతుంది. అప్పటికి తగ్గిపోయినా మళ్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. 3. ఈ థెరపి వల్ల రోగిలో సహజసిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి నశిస్తుంది. భవిష్యత్తులో ఎదురయ్యే జబ్బులను ఎదుర్కోవడంలో వైఫల్యం కనిపిస్తుంది. అయినప్పటికీ మందు లేని వైరస్ల ఇన్ఫెక్షన్లకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ థెరపిని ఉపయోగిస్తున్నారు. 1. హెచ్1ఎన్1 (ఇన్‌ఫ్లూయెంజా లేదా స్పానిష్ వైరస్) ఇన్ఫెక్షన్ నివారణకు 2009లో ఈ థెరపిని కొన్ని దేశాలు ఉపయోగించాయి. ఇదే వైరస్ నివారణకు 1918లో ప్రయోగాత్మకంగా ఈ థెరపిని ఉపయోగించారట. 2. మొట్టమొదటి సారిగా ఈ థెరపీనీ 2014లో ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. 3. మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) జబ్బుకు కూడా 2015లో ప్లాస్మా థెరపీని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. 4. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా వ్యవహరించే స్పానిష్ వైరస్ నివారణకు 2018లో అనుమతించింది. -
ప్లాస్మా థెరపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాస్మాథెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేం దుకు కేంద్రం అనుమతిచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. శుక్రవారం కోఠిలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లా డారు. 4రోజుల కింద ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అను మతినివ్వాలని కేంద్రాన్ని కోరగా, తాజాగా అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగుల్లో బాగా సీరియస్‌గా ఉన్నవారికి ఈ విధానం ద్వారా చికిత్స చేస్తామన్నారు. మరో 13 కేసులు నమోదు.. తెలంగాణలో కొత్తగా మరో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఈటల వెల్లడించారు. అందులో గద్వాల జిల్లాలో 9, జీహెచ్ఎంసీలో 2, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు తెలి పారు. మొత్తంగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 983కి చేరినట్లు తెలిపారు. తాజాగా 29 మంది డిశ్చార్జి కాగా, మొత్తం ఇప్పటి వరకు 291 మంది డిశ్చార్జి అయినట్లు ప్రకటించారు. ఆస్ప త్రిలో 667 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 25మంది మృతి చెందారని, మరో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు. గురువారం 970 కేసులు ప్రకటించామని, కానీ ఆ తర్వాత రాత్రి వరకు 8 కేసులు పెరిగాయన్నారు. ఆ రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 5 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అప్పటినుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. మొత్తంగా గత 24 గంటల్లో 540 పరీక్షలు చేశామని చెప్పారు. సూర్యాపేట, గద్వాల, జీహెచ్ఎంసీ, వికారాబాద్ ప్రాంతాల నుంచే ఎక్కువ కేసులు వచ్చాయని, వికారాబాద్‌లో 14 బాధిత కుటుంబాలుంటే రోగుల సంఖ్య 38గా ఉందని పేర్కొన్నారు. గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి సోకిందన్నారు. జీహెచ్ఎంసీలో 44 కుటుంబాల నుంచే 268 మంది పాజిటివ్ వచ్చిందని వివరించారు. ఇక్కడ కుటుంబాల సంఖ్య తక్కువగా ఉన్నా, ఒక్కో కుటుంబంలో సగటున ఆరు, ఏడుగురికి వ్యాపించిందన్నారు. కుటుంబాల సంఖ్య తక్కువగా ఉండి, పాజిటివ్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దిగ్బంధించేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌లో కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టంగా కంటైన్మెంట్ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఆ ప్రాంతాల్లో ఒక్కరిని కూడా బయటకు రానివ్వట్లేదని చెప్పారు. అక్కడున్న వారి ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నామని, నిత్యావసర వస్తువులను కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆ మూడు జిల్లాల్లో ఉన్నతస్థాయి బృందం పర్యటించి సీఎంకు నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆ మూడు చోట్ల త్వరలోనే కేసులు తగ్గుతాయన్నారు. కరీంనగర్లో 28 రోజులకు పాజిటివ్.. రోజురోజుకూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ సమయంలో నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు పాజిటివ్ వస్తోందని చెప్పారు. కరీంనగర్లో 28 రోజులకు పాజిటివ్ వచ్చిందన్నారు. కేరళలో ఒక మహిళకు 14 రోజుల తర్వాత 19 సార్లు పరీక్షించినా పాజిటివ్ వచ్చింది. మన దగ్గర కూడా 200 పైచిలుకు డిశార్జి కావాలి. కానీ రెండుసార్లు పరీక్షిస్తే ఒకసారి నెగెటివ్, మరోసారి పాజిటివ్ వచ్చింది. అంటే ఎన్ని రోజుల వరకు నెగెటివ్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చదవండి: గలగలా గోదారి కదిలి వచ్చింది దుష్ప్రచారంపై మండిపాటు... కొద్దిమంది వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మంత్రి ఈటల మండిపడ్డారు. సైకోలు, శాడిస్టుల ఆలోచనలు వేరుగా ఉన్నాయని, సోషల్ మీడియాలో గాంధీలో సౌకర్యాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆస్పత్రిలో రోజూ ఒక టిఫిన్ ఉంటుంది. 11 గంటలకు బిస్కెట్లు, చాయ్ ఇస్తున్నాం. మధ్యాహ్నం ఒంటి గంటకు గుడ్డుతో కూడిన ఆహారం అందిస్తున్నాం. సాయంత్రం 4–5 గంటలకు డ్రైఫ్రూట్స్ ఇస్తున్నాం. సాయంత్రం 7 గంటలకు మళ్లీ గుడ్డుతో కూడిన ఆహారం పెడుతున్నాం. అక్కడ బిర్యానీ తెచ్చి ఇవ్వలేం కదా. అది ఆస్పత్రి.. రోగులకు ఎంత అవసరమో అదే ఇస్తున్నాం’అని వివరించారు. కాగా, గాంధీని పూర్తిస్థాయి ‘కోవిడ్’(కరోనా) ఆస్పత్రిగా నామకరణం చేసినట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఆహారం సరిగా లేదంటూ ఎవరో ఒకరు రాసిన లేఖను ఆధారంగా దానిపై విపక్షాలు, బాధ్యత లేని వ్యక్తులు స్పందించడం సరికాదన్నారు. ప్రస్తుతం గాంధీలో ఏడుగురు ఆక్సిజన్‌పై ఉన్నారని పేర్కొన్నారు. సేవలందించేందుకు సిద్ధం.. లక్ష మంది కరోనా రోగులు వచ్చినా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ఈటల పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, రాష్ట్రంలో కరోనాకు అరికట్టడంలో బాగా కృషిచేస్తున్నట్లు అభినందించారని ఈటల తెలిపారు. ప్రస్తుతం 9 ల్యాబ్స్ ద్వారా ఒకే రోజు 1,600 పరీక్షలు చేసే సత్తా తమకున్నట్లు కేంద్రానికి తెలిపామన్నారు. రాష్ట్రాలకు విదేశాల నుంచి వచ్చే వైద్య యంత్ర పరికరాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని, దేశీయంగా కొనుగోలు చేసే యంత్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఈటల వెల్లడించారు. 10 లక్షల పీపీఈ కిట్లు, 10 లక్షల ఎన్–95 మాస్క్‌లకు ఆర్డర్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో వైద్యులకు ఎక్కడా కరోనా సోకలేదని వెల్లడించారు. చదవండి: ఒక్కరోజులో 1,752 పాజిటివ్ -
‘ప్లాస్మా థెరపీకి కేంద్రం నుంచి అనుమతి’
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ పార్టీలు సూచనలు చేస్తే, భేషజాలు లేకుండా తప్పకుండా పాటిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారన్నారు. తెలంగాణలో 9 ల్యాబ్‌లు ఉన్నాయి. పరికరాలు, ఎక్విప్మెంట్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం పన్నులు మినహాయించాలని కోరారు. ప్లాస్మా థెరపీకి కేంద్రం నుంచి అనుమతి వచ్చిందని, సీరియస్‌గా ఉన్న కరోనా పేషంట్లకు ప్లాస్మా థెరపీ చేస్తామని ఈటల చెప్పారు. తెలంగాణలో మొత్తం 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 25 మంది మృతిచెందగా, 291 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. తెలంగాణలో యాక్టిక్ కేసులు 663 ఉన్నాయని పేర్కొన్నారు. సూర్యాపేట, గద్వాల, జీహెచ్ఎంసీ, వికారాబాద్ ప్రాంతాల నుంచే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. కొందరు సైకోలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు భోజనం బాగాలేదని.. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దుష్ప్రచారాం తగదన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతీయొద్దని సూచించారు. -
ప్లాస్మా చికిత్సతో మెరుగైన ఫలితాలు: సీఎం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లపై ఈ మేరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ప్లాస్మా చికిత్స అనంతరం ఇద్దరు పేషెంట్లు కోలుకున్నారని.. వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్లాస్మా థెరపీని మరింత విస్తృతం చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా.. ఇప్పుడే ఈ థెరపీపై పూర్తి అవగాహనకు రాలేమని... కేవలం ప్లాస్మా చికిత్సతో రోగులు కోలుకున్న దాఖలాలు లేవని అభిప్రాయపడ్డారు. అయితే కరోనాపై పోరులో ప్రస్తుతానికి ఇదొక్కటే మన ముందున్న మార్గమని పేర్కొన్నారు. (కరోనా: ‘ప్లాస్మా థెరపీ’తో చెక్!) ఇక కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తేనే ఈ థెరపీని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు. ప్లాస్మా దానం చేయడాన్ని నిజమైన దేశభక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. మరోవైపు.. ఈ విషయం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్స్ డైరెక్టర్ ఎస్కే సరీన్ మాట్లాడుతూ... ‘‘ ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలోని మరో ముగ్గురు కరోనా పేషెంట్లకు ఎక్కించేందుకు రక్తం, ప్లాస్మా సిద్ధంగా ఉంది. ఈరోజే వారికి ప్లాస్మా థెరపీ ప్రారంభిస్తాం. ఈ చికిత్స సానుకూల ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉంది’’అని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీలో ఇప్పటి వరకు 2376 కరోనా కేసులు నమోదు కాగా.. 50 మరణాలు సంభవించాయి. కాగా కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా యాంటీ బాడీలను తీసుకొని వాటిని కోవిడ్ రోగికి ఎక్కించడం ద్వారా ఎక్కువ శాతం ఫలితం వస్తోందని, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. విదేశాల్లో ఈ ప్రక్రియ ద్వారా వైద్యులు సానుకూల ఫలితాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్సపై పరిశోధనలు జరిపేందుకు ముందుకొచ్చే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది. -
తెలంగాణలో మరో 15 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా కేసులు నమోద య్యాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 కేసులు నమోదు కాగా, సూర్యాపేటలో కొత్తగా మూడు కేసులు, గద్వాలలో రెండు కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 943కు చేరింది. అలాగే బుధవారం ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 24కు చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటివరకు 194 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 725 చికిత్స పొందుతున్నారు. సగటు కేసులు సూర్యాపేటలోనే అధికం.. రాష్ట్రంలో గత వారం రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 3 నాలుగు జిల్లాల నుంచే ఉంటున్నాయి. ఇప్పటిదాకా ఒక్క హైదరాబాద్‌లోనే 462 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా సూర్యాపేట నిలిచింది. అక్కడ ఏకంగా 83 కేసులు నమోదయ్యాయి. జనాభాతో పోలిస్తే అధికంగా కేసులు నమోదైన జిల్లాగా సూర్యాపేట నిలిచింది. ఆ జిల్లాలో మొత్తం 13 లక్షల జనాభా ఉంటే.. ఇప్పటివరకు 83 కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి లక్ష మందికి సగటున 6.5 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ జనాభా కోటి వరకు ఉండగా.. ఇక్కడ 462 కేసులు నమోదయ్యాయి. చదవండి: లాక్డౌన్ అమలుకు ‘కరీంనగర్ ఫార్ములా’ ఇక్కడ ప్రతి లక్ష మందిలో 4.62 మందికే కరోనా సోకింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అక్కడి జనాభా 9.27 లక్షలు. ఆ జిల్లాలో ప్రతి లక్ష మందిలో సగటున నలుగురు వైరస్ బారినపడ్డారు. గద్వాల జిల్లాల్లో 36 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. గద్వాల జిల్లాలో మొత్తం జనాభా 6 లక్షలు. ప్రతి లక్షలో సగటున ఆరుగురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాలతో పోల్చితే ఈ నాలుగు ప్రాంతాల్లోనే కేసులు సంఖ్య చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్లాస్మా థెరపీకి అనుమతివ్వండి: మంత్రికి విర్కో బయోటెక్ విన్నపం కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీకి అనుమతివ్వాలని విర్కో బయోటెక్ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. ఈ మేరకు ఆయనను బుధవారం కలిశారు. కరోనాకు ప్లాస్మా థెరపీ, ఇమ్యునోగ్లోబిన్ అందించడం ద్వారా చికిత్స అందించేందుకు కేంద్ర అనుమతి కోసం సంప్రదించిన మొదటి కంపెనీ తమదేనని మంత్రికి తెలిపారు. ఇప్పటికే సెంట్రల్ డ్రగ్ అనుమతి కూడా వచ్చిందని, కాబట్టి ఇక్కడ చికిత్స అందించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొదటి 3 నెలలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇమ్యునోగ్లోబిన్లు వైరస్ నుంచి సమర్థంగా రక్షణ అందిస్తాయని విర్కో బయోటెక్ డైరెక్టర్ రాజేశ్ తుమ్మూరు తెలిపారు. ఈ విషయంపై నిపుణుల అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. -
ప్లాస్మా దానం చేయండి: తబ్లిగీ నేత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్ కందల్వీ తన అనుచరులను కోరారు. కరోనాతో పోరాటం చేసేవారికి రక్తంలోని ప్లాస్మా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తనతోపాటు మర్కజ్ ప్రార్థనలకు హాజరైన కొంతమంది స్వీయ నిర్భందంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా స్వీయ నిర్భందంలో ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చిందని మౌలానా సాద్ తెలిపారు. ఇక పాజిటివ్‌గా వచ్చిన వారికి కూడా సరైన చికిత్స అందించగా వారు కోలుకున్నారని ఆయన వెల్లడించారు. (తబ్లిగీ నేతపై ఈడీ కేసు) కరోనా నుంచి కోలుకున్నవారు తమవంతు సాయంగా ప్రస్తుతం వైరస్ బారినపడి పోరాడుతున్న వారికి.. రక్తంలోని ప్లాస్మాను దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వచ్చే రంజాన్ మాసంలో ముస్లింలు ఇంటి వద్దనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేయాలని కోరారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మౌలానా ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. (కొత్తగా 1,300 కరోనా కేసులు, 50మంది మృతి) కాగా దేశంలో ఇప్పటివరకూ మొత్తం 19,984 పాటిజివ్ కేసులు నమోదు కాగా, 640 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,474 ఉన్నాయి. ఇక 3,870 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (పరమౌషధం కానున్న ప్లాస్మా!) -
ఢిల్లీలో ప్లాస్మా చికిత్స విజయవంతం..కానీ..
ఢిల్లీ : కరోనావైరస్ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ఫ్లాస్మా చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన క్రినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా, ఢిల్లీలో తొలి విజయం నమోదైంది. 49 ఏళ్ల కరోనా బాధితుడు ఫ్లాస్మా ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా కోలుకున్నట్లు ఢిల్లీ మ్యాక్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 4న 49 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరగా, పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల్లోనే అతని ఆరోగ్యం క్షీణించి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్లు అతడికి ప్లాస్మా థెరపీని అందించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాతో అతడికి చికిత్స చేశారు. ఊహించని రీతిలో ఈ చికిత్స మంచి ఫలితాన్ని ఇచ్చింది. దీంతో అతడికి అమర్చిన వెంటిలేటర్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడి పూర్తిగా కోలుకున్నాడు. రెండుసార్లు నిర్వహించిన కోవిడ్ పరీక్షలోనూ నెగిటివ్ అని తేలింది. అతను పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఒక వ్యక్తి ఇద్దర్ని కాపాడవచ్చు : డా. బుధిరాజు అయితే ఈ ఫ్లాస్మా చికిత్స కరోనాను నివారించే మ్యాజిక్ ఫార్ములా కాదని మ్యాక్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజు అన్నారు. "ఫ్లాస్మా థెరపీ ద్వారానే అతను కోలుకున్నాడు అని చెప్పలేం. ఎందుకంటే ఇతర ప్రోటోకాల్స్‌ని కూడా మేం ఫాలో అయ్యాం. ఫ్లాస్మా క్రినికల్ ట్రయల్స్‌తో మన దేశం ఒక అడుగు ముందుకేసింందని భావిస్తున్నా. కరోనా సోకిన వ్యక్తి నుంచి సేకరించిన ఫ్లాస్మాలో యాంటీబాడీస్ అత్యధికంగా ఉంటాయి. దీన్ని ఇతర కరోనా రోగులకు అందిచడం ద్వారా ఆ వ్యక్తి త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువ" అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక దాత 400 ఎంఎల్ ఫ్లాస్మాను దానం చేయగలడని, దీని ద్వారా ఇద్దరి ప్రాణాలను కాపాడవచ్చు అని డాక్టర్ బుధిరాజు తెలిపారు. -
పరమౌషధం కానున్న ప్లాస్మా!
న్యూఢిల్లీ: కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యులకు ప్లాస్మా యాంటీ బాడీలతో చికిత్స మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా యాంటీ బాడీలను తీసుకొని వాటిని కోవిడ్ రోగికి ఎక్కించడం ద్వారా ఎక్కువ శాతం ఫలితం వస్తోందని, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్సపై పరిశోధనలు జరిపేందుకు ముందుకొచ్చే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించడం తెల్సిందే. దీంతో కొన్ని సంస్థలు పరీక్షలు జరిపేందుకు ముందుకొచ్చాయి. ఈ వ్యవహారానికి తాజాగా సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చింది. ఐసీఎంఆర్ రూపొందించిన ప్రొటోకాల్ ప్రకారం దీనికి అనుమతులిచ్చింది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్‌కు ఐసీఎంఆర్ ఇచ్చిన నివేదికలో ప్లాస్మా చికిత్స పరిశోధనలపై పనిచేయనున్న సంస్థల వివరాలు ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలను పరిగణలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్ రెగ్యులేటరీ తెలిపింది. వాటిని తమ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ పూర్తిగా పరిశీలించినట్లు వెల్లడించింది. డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్ రూల్స్ కింద అనుమతులిచ్చినట్లు స్పష్టం చేసింది. ఇదే ముందున్న మార్గమా? అమెరికా ఎఫ్.డీ.ఏ కన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్స ద్వారా కోవిడ్ వైద్యులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అయిదు మంది కరోనా రోగులకు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తుల యాంటీబాడీలు కలిగిన ప్లాస్మాను ఎక్కించారు. అందులో ముగ్గురు ఇప్పటికే కోలుకోగా, మరో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉంది. మరణాలు అసలులేకపోవడం ఆశాజనకంగా మారింది. మరోవైపు భారత్‌లో నలుగురు రోగులపై ప్లాస్మా చికిత్సను ప్రయోగించగా, వారిలో గర్భిణిసహా అందరూ కోలుకున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. -
వ్యాక్సిన్ వచ్చేవరకు అదే మంచి ప్రత్యామ్నాయం
‘‘కరోనా వ్యాధి ప్రపంచాన్ని కబళిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ వ్యాధికి ఇప్పటివరకూ మందులేకపోవడంతో... వ్యాక్సిన్ వచ్చేవరకు ప్లాస్మాథెరపీ చికిత్స, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి మందులు వాడటం తప్పనిసరి’’ అంటున్నారు హూస్టన్‌లోని బెలోర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌లో వైరస్ వ్యాధులను నిరోధించే రంగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ వాసంతి అవధానుల. హూస్టన్‌లో ఉన్న బేలోర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌కు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఫెడరల్ గవర్నమెంట్ ప్రధాన సంస్థ అయిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తో అనుబంధం కూడా ఉంది. ఆ సంస్థకు చెందిన మెడికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో వైరస్ వ్యాధులను నిరోధించే విషయంలోడాక్టర్ వాసంతి అవధానుల 2007 నుంచి శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన తెలుగు మహిళ అయిన వాసంతి... ఆంధ్రయూనివర్సిటీలో ఎంఎస్సీ చదివి, అమెరికా వచ్చి యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీలో ఎంఎస్... ఆ తర్వాత వైరల్ డిసీజెస్‌లో పీహెచ్డీ చేశారు. అమెరికాలో కరోనా వైరస్ విపరీతంగా ప్రబలడంతో కరోనాకు మందు కనిపెట్టే ప్రయత్నంతో పాటు, దానికి సరైన చికిత్స విషయంలోనూ ఆమె అక్కడి ఇతర శాస్త్రవేత్తలతో పాటు కలిసి కృషి చేస్తున్నారు. దీనికితోడు అన్ని రకాల మెడికల్ రీసెర్చ్, ముఖ్యంగా వైరల్ డిసీజెస్ మీద కూడా రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో హూస్టన్‌లో ఉన్న టెక్సస్ మెడికల్ సెంటర్‌తో కలిసి పనిచేయడం వల్ల టెక్సస్ మెడికల్ సెంటర్లో ఆధ్వర్యంలో దాదాపు 15 హాస్పిటల్స ఉండటం వల్ల కరోనా బాధిత రోగుల చికిత్సలో పరోక్షంగా డాక్టర్ వాసంతి కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి దీనికి సరైన చికిత్సలేని నేపథ్యంలో ‘ప్లాస్మా థెరపీ’ని ప్రయోగించినప్పుడు కేసుల్లో సత్ఫలితాలు వచ్చినందున... వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ ప్లాస్మాథెరపీ చికిత్స ప్రాణాలు కాపాడేందుకు దోహదం చేస్తుందని డాక్టర్ వాసంతి పేర్కొంటున్నారు. ఒక వ్యక్తికి వైరస్ సోకినప్పుడు... ఆ వైరస్ ద్వారా వచ్చిన వ్యాధిని ఎదుర్కొనేందుకు యాంటీసెల్స్/యాంటీబాడీస్ అనే రక్షణ కణాలు పుడతాయి. అవి వైరస్‌ను ఎదుర్కొని దాన్ని నిరోధిస్తాయి. ఆ వ్యక్తికి జబ్బు తగ్గిపోయిన తర్వాత కూడా అతడి రక్తంలో యాంటీసెల్స్ అలాగే ఉండిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి రక్తంలోంచి... వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకశక్తి ఉన్న సెల్స్‌ను తీసుకుని, పరిస్థితి విషమంగా ఉన్న వేరే రోగికి ఇవ్వడం ద్వారా చికిత్స పొందుతున్న రోగిలో రోగనిరోధక వ్యవస్థను పెంపొందేలా చేయడమే ‘ప్లాస్మాథెరపీ’ చికిత్స. ఈ చికిత్స వల్ల పరిస్థితి చేయిదాటిపోయిన రోగి కూడా కోలుకునే అవకాశం ఉంటుంది. ‘‘కరోనా రోగుల విషయంలో ప్లాస్మాథెరపీని మార్చి మొదటివారంలోనే మేము ప్రారంభించాం. ఆ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తోందని అతితక్కువ సమయంలోనే తెలుసుకున్నాం. దాంతో ప్లాస్మా థెరపీని మరింత ఎక్కువ మందికి ఇవ్వడం మొదలుపెట్టాం. న్యూయార్క్‌లో సైతం ఈ ప్లాస్మాథెరపీ చికిత్సను మొదలుపెట్టారు. ఈ థెరపీకి సుమారుగా 3 నుంచి 4 యూనిట్ల రక్తం సరిపోతుంది. అయితే కరోనా వ్యాధికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలా ప్రతిస్పందిస్తున్నారు. కొందరికి వెంటనే నయమైపోతుంటే... మరికొందరికి వ్యాధి అదుపులోకి రావడానికి 2 – 3 వారాలు పడుతోంది. అయితే ఒక రోగికి కరోనా వచ్చి తగ్గాక 3 –4 వారాల వరకు వారి దేహంలో ఈ రోగనిరోధకశక్తి ఉండే కణాలు ఉంటాయి, ఆ సమయంలోనే వారు ప్లాస్మాథెరపీకి డోనర్‌గా రావాల్సి ఉంటుంది‘‘ అని డాక్టర్ వాసంతి తెలిపారు. ‘‘కరోనాకి హెచ్ఐవీ మందులు కూడా వాడుతున్నారనీ, అలాగే మలేరియాకి వాడే హైడ్రోక్లోరోక్విన్ మందులును కూడా ఉపయోగిస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. అంటే ఒక సమస్యను కట్టడి చేసేందుకు వాడే మందులే, దీనికి కూడా వాడుతున్నారు. అయితే ఈ చికిత్స ప్రక్రియలన్నీ కరెక్టనీ లేదా కాదని చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదు. మనకు అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ ప్రయోగించి చూస్తున్నామన్నమాట. కరోనాను నిర్దిష్టంగా వ్యాక్సిన్ కనిపెట్టేవరకు ఇలా అన్ని మార్గాలను అనుసరించి చూడటంలో తప్పులేదు. అయితే అర్హులైన డాక్టర్ సలహా లేకుండా ఎవరికి వారు ఈ మందులను తీసుకోవడం మాత్రం చాలా ప్రమాదం.– డాక్టర్ వాసంతి అవధానుల -
కరోనా : త్వరలోనే ఫ్లాస్మా ట్రయల్స్
సాక్షి, ఢిల్లీ : కరోనా సోకిన వారికి త్వరలోనే ఫ్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్మెంట్ అందించేందుకు ట్రయల్స్ ప్రారంభించామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి లభించిందని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన ట్రయల్స్ ప్రారంభమవుతుందని, ఇది విజయవంతమైతే త్వరలోనే కరోనా రోగులకు ఈ విధమైన చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేషన్‌కార్డుల కోసం ఇప్పటివరకు 15 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని, ప్రతిరోజు 10 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో కరోనా బాధితుల ఆరోగ్యం మెరుగుపడుతోందని, 3-4 రోజుల్లో వారిని డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. Delhi is starting plasma transfusion trials for treating Corona patients. We will take every measure possible to prevent loss of lives https://t.co/jYmRP5Gwx1 — Arvind Kejriwal (@ArvindKejriwal) April 16, 2020 కాగా కరోనా నివారణకు మందు ఇంతవరకు ఎవరు కనుక్కొలేదు. ప్లాస్మా థెరపీలో కరోనా సోకి కోలుకున్న వ్యక్తి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగి రక్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధారణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్రమంలో కరోనా వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఈ విధానం ద్వారా రోగులను బతికించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అగ్ర రాజ్యం అమెరికాతో పాటు చైనాలో సక్సెస్ కావడంతో కరోనా అధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ లలో కూడా ప్లాస్మా ధెరపికి వైద్యులు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో కూడా ప్లాస్మా థెరిపికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేరళకు అనుమతిచ్చింది. ఇక భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12, 380 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లోనే 941 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. -
కరోనాకు ‘ప్లాస్మా’ చికిత్సే మందు
‘‘ఎక్కడో కాదు, మన ఇండియాలోనే గత పదేళ్లలోనే సార్స్ (శ్వాసకోశవ్యాధి), బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, జీకా లాంటి అంటువ్యాధుల్ని చూశాం. కానీ మన దేశంలో పెద్ద సమస్యల్లా – దేశంలో రాజకీయ కార్యక్రమాల్లోనూ, ప్రభుత్వ దేశాభివృద్ధి కార్యక్రమాల్లోనూ, వైద్య, ఆరోగ్య వ్యవస్థకు ఎజెండాలో అత్యంత అధమస్థాయి ప్రాధాన్యం మాత్రమే ఇస్తూ వచ్చాం. చివరికి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎంతసేపూ అంటు వ్యాధుల నివారణతో నిమిత్తం లేని ఇతరత్రా రోగాలపైన, ఆయుష్మాన్ భారత్ పైన మాత్రమే కేంద్రీకరిస్తోంది. ప్రస్తుతం తాండవిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో అయినా మన రాజకీయ పాలకులు... ఇప్పటికైనా కీలకమైన అంటువ్యాధులు ప్రబలి మహమ్మారులుగా తలెత్తకుండా ఉండేందుకు ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను పకడ్బందీగా తీర్చిదిద్దుకునేం దుకు వీలుగా ఆరోగ్య శాఖను పునర్నిర్మిస్తారని ఆశిస్తున్నాను’’ – కె.సుజాతారావు (డాక్టర్ కేఎల్ రావు కుమార్తె), 2010 దాకా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి, ఇంటర్వ్యూ దేశంలో ప్రజారోగ్య రక్షణకు పటిష్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల.. ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న కోవిడ్–19 మహమ్మారిని పరిమార్చే విధానంలో కూడా ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాస వివక్షను కూడా సుజాతారావు చూడగల్గడం విశేషం. ఈ మహమ్మారి వ్యాధిని పరీక్షించి అదుపు చేసే యత్నంలో ఉపకరించే రాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా పరీక్షకు రూ. 4,500లు రోగి దగ్గర వసూలు చేయడం పాశవికం అని కూడా ఆమె అభ్యంతరం తెల్పారు. (ఇందుకు మినహాయింపు భారతదేశంలో బహుశా ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని భావిస్తున్నారు). ఇది ఇలా ఉండగానే కరోనా వ్యాధి నివారణకు ఇంతవరకూ తోడ్పడే మందు (టీకాలు గానీ, ఇంజక్షన్ గానీ) లేదు. వాటి తయారీకి ఆరుమాసాలు లేదా సంవత్సర కాలం పట్టవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. చైనాలోని ఒక రాష్ట్రానికి పరిమితమైన కరోనా వ్యాధి ఇప్పుడు భారతదేశం సహా 190 దేశాలకు విస్తరించినందున దాని నివారణకు తగిన మందుల కోసం వెంపర్లాట ప్రారంభమైంది. దీంట్లో భాగంగానే కేవలం మలేరియా వ్యాధికి పరిష్కారంగా వచ్చిన హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)ను, అజిత్రోమైసిన్ యాంటీ బయాటిక్ మందును కరోనా వ్యాధికి తాత్కాలిక ఉపశమనంగా వాడటానికి.. ప్రస్తుతం అపార జననష్టానికి గురవుతున్న అమెరికా, తదితర యూరోపియన్ దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఈ రెండు మందులకు మన దేశం ఉత్పత్తి కేంద్రం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను భారత్‌పైన పడింది. అయితే ఈ మందు ఎగుమతుల్ని ముఖ్యంగా అమెరికాకు, మరికొన్ని దేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో మన కేంద్ర ప్రభుత్వం మొదట్లో నిషేధించింది. కానీ ఇటీవలికాలంలో ట్రంప్‌తో స్నేహం మన పాలకులకు పెరిగిపోవడాన్ని ఆసరా చేసుకుని పై రెండు మందులను అమెరికాకు ధారాళంగా ఎగుమతి చేయాలని భారత పాలకుల్ని ట్రంప్ ఆదేశించాడు. కానీ, మన అవసరాలకోసం ఆ మందులను అమెరికాకు ఎగుమతి చేయటాన్ని నిలుపుదల చేస్తున్నట్లు మన పాలకులు మొదట్లో ప్రకటించారు. ఇది ట్రంప్‌కు కంటగింపై ఒక సామ్రాజ్యవాదిగా కన్నెర్ర జేశాడు. ‘నాతో మీ దేశానికి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు, ఇండి యాకు మేం ఎంతో సహాయం చేశాం. ఈ మందుల ఎగుమతుల్ని మాకు నిలిపివేస్తే నేనేం చేయాలో అది చేస్తా. అప్పుడు ఇండియా బతుకు ఏమవుతుందో చూస్తా’’ అని ట్రంప్ బెదిరించిన విషయాన్ని మనం మర్చిపోరాదు. అయినా సరే మన పాలకులు ఆ బెదిరింపులకు లొంగి అంతకు ముందు ఆ మందుల ఎగుమతులపై విధించిన నిషేధాజ్ఞల్ని రద్దు చేశారు. దీంతో మన దేశానికి, ప్రజలకు ఏర్పడిన కరోనా విపత్తునుంచి బయటపడేందుకు ఎంతో కొంత ఉపయోగపడే ఆ మాత్రపు మందులు కూడా దేశ అవసరాలు తీర్చే విషయంలో కొంత అడ్డంకి ఏర్పడినట్లే చెప్పాలి. పైగా అమెరికా కోరుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ కేవలం మలేరియాకు తప్ప కరోనా వ్యాధికి పనికిరాదని స్వయానా ట్రంప్ అధ్యక్ష కార్యాలయ ఆరోగ్య విభాగం అధిపతి ఫాసీ ప్రక టించినా ఆ పేరుతోనైనా ఆ మందు ఎగుమతుల నిషేధాన్ని కొన సాగించి ఉండాల్సింది. కానీ మన పాలకులు అమెరికాలో చేసిన హౌడీ మోదీ నినాదాలకు ప్రత్యుపకారంగా ఇండియాలో ట్రంప్‌ను ఆహ్వా నిస్తూ అందుకు చెల్లించిన నమస్తే ట్రంప్ వాయనాలు మన ప్రజలకు ఏ మాత్రమూ కలిసి రాలేదని గుర్తించాలి. అయినాసరే, అమెరికాపట్ల మన పాలకులది ఎంత ఔదార్యం అని చాటుకున్నా ‘తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం’గా తయారైంది. అయినా ‘లాక్డౌన్’ అమలులో ఉండగా– ప్రధాన ఉత్పత్తి కర్మాగారాలు, రవాణా మార్గాలు స్తంభించి పోయినప్పుడు అమెరికా కోరిన మందుల ఎగుమతుల్ని ఎలా పంపిస్తారు? కేంద్ర ప్రభుత్వం అమెరికా కోరిన మందుల్ని పంపడానికి ఆదేశాలయితే జారీ అయ్యాయే గానీ, మందుల పరి శ్రమల నిర్వహణకు ఉత్పత్తుల తయారీకి లాక్‌డౌన్‌వల్ల కార్మికులకు, ఉద్యోగులకు ఏర్పడిన ప్రయాణ, రవాణా సౌకర్యాల కటకట మాత్రం తొలగలేదని ఉత్పత్తిదారులు ప్రకటనలు జారీ చేశారు. అంతకన్నా ముఖ్యమైన అంశం– తయారీ పరికరాల కొరత రానున్న వారాలలో ఏర్పడబోతోందనీ, ప్రస్తుతం లాక్డౌన్ వల్ల మందుల ఉత్పత్తి పరిశ్రమలకు కల్గిన ఇబ్బందుల్ని తొలగించి సత్వరం ఉత్పత్తిని తిరిగి ప్రారంభించేలా చూడాలని కేంద్ర మందుల పరిశ్రమ శాఖే ప్రకటించిందని మరవరాదు. ఈ పరిస్థితుల్లో మలేరియా వ్యాధి నివారణకు ప్రధానంగా వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ స్థానే తాజాగా క్యూబా, చైనా ప్రజా వైద్య రక్షణ వ్యవస్థలు జయప్రదంగా అనుసరించి, కరోనా నుంచి లక్షలాది వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కల్గించిన ‘ప్లాస్మా వైద్యం (ప్లాస్మా థెరపీ) పద్ధతిని మనం కూడా అనుసరించి ప్రయోజనం పొందడం శ్రేయస్కరం కాదా? ఇప్పటికే తాజా కేరళ ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులకు ఉపశమనం కల్గించే ప్రయోగంలో ఉందని తెలుస్తోంది. పైగా, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ కేంద్రాల ఏర్పాటు వ్యవస్థను, తద్వారా లక్షలమంది గ్రామీణ సచివాలయ కార్యకర్తల ద్వారా పొందుతున్న ప్రయోజనా లను కేరళ వామపక్ష ముఖ్యమంత్రి విజయన్ కొనియాడి, తామూ ఆ ఆదర్శాన్ని కేరళలో పాటించడానికి సిద్ధమవుతున్నారు. పైగా, ‘ఇండి యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ ఉన్నతాధికారి డాక్టర్ మురేకర్ కౌన్సిల్ తరఫున ప్రకటన చేస్తూ.. ఈ ‘ప్లాస్మా థెరపీ’ని అనుసరిం చడానికి ముందు పాటించాల్సిన అధికారిక అనుమతుల్ని (ప్రోటో కాల్) పొందే తుది దశలో ఉన్నామని తెలిపారు. ప్లాస్మా థెరపీ పద్ధతి: కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్న రోగి నుంచి సేకరించిన రక్తాన్ని (ప్లాస్మా) కరోనా వ్యాధి తీవ్రతలో ఉన్న రోగికి ఎక్కిస్తే, ఆ రోగిలో వ్యాధిని ప్రతిఘటించే శక్తినిచ్చే విరుగుడు పదార్థంగా (యాంటీబాడీ) పనిచేస్తుందని పరిశోధనలు నిరూపిం చాయి. ఈ ప్లాస్మా వైద్య ప్రయోగం ద్వారానే చైనాలో కరోనా వ్యాప్తి ఒకే ఒక్క రాష్ట్రంలోని వూహాన్‌కు పరిమితమై అంతరించిందని, ఈ వ్యాధి వల్ల చైనాలో జన నష్టం 3,600 మందికే పరిమితం అయిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి మానవ శరీ రాలపైన 60 రకాల వ్యాక్సిన్ల ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నాయి. ఇవి అంటువ్యాధికి ఆధారమైన వ్యాధికారక వాహిక (వెక్టార్)ను నిర్వీ ర్యం చేసి తద్వారా రోగిలోని మంచి జన్యువుల్ని (డీఎన్ఏ) కాపాడి, హానికారకమైన ఆర్ఎన్ఏ జన్యువుల్ని నాశనం చేస్తాయి. 20.1.2020న తొలిసారిగా చైనా 20మంది కరోనా వ్యాధి పీడితులమీద ఈ ప్లాస్మా ప్రయోగం చేసి జయప్రదమైంది. రోగిమీద ప్రయోగించే ఇలాంటి వ్యాక్సిన్లను ‘కాండిడేట్ వ్యాక్సిన్లు’ అంటారు. ఒక మందు చెడు ప్రభా వాన్ని మరో ప్రత్యర్థి మందు ద్వారా నిర్వీర్యం చేయడమే వైద్య శాస్త్ర ప్రయోగాల లక్ష్యం. అందుకే డీఎన్ఏ ప్లాస్మా వ్యాక్సిన్ కోసం చేస్తున్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు. ‘ప్లాస్మా’ వైద్యంతోపాటు ప్రస్తుతం క్యూబా వ్యాక్సిన్ ‘ఇంటర్ఫెరాన్ 2బి’ కూడా క్యూబా, చైనాలలో విజయభేరి మోగిస్తున్న వ్యాక్సిన్. ఇక ఒక కోటి 15 లక్షలమంది జనాభా గల క్యూబా 60 ఏళ్లపాటు అమెరికా సామ్రాజ్యవాద బెదిరింపులను నిరంతర దాడులను ఎదు ర్కొంటూంది. ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వాన విప్లవం ద్వారా స్వాతం త్య్రం సాధించుకున్న దేశం.. సోషలిస్టు వ్యవస్థ పునాదిగా చేసిన ప్రజారక్షణ విధానాలలో తొలి చర్యగా నిరుపేద దేశానికి విద్య, ఆరోగ్య రంగాలలో ప్రజారక్షణ వ్యవస్థకు గట్టి పునాదులు వేసింది. ఫలితంగా దాదాపు 80 దేశాలకు క్యూబా 37,000 మంది డాక్టర్లను ఆయా దేశాల ప్రజల ఆరోగ్య సేవలకు ‘ఆశాదూతలు’గా పంపి సేవ లందిస్తోంది. ఆ క్రమశిక్షణకు కారణం–ప్రతి క్యూబా వైద్యుడు సైన్యంలో రెండేళ్లు శిక్షణ పొంది తిరుగులేని ‘భిషక్కులు’గా అవ తరించడమే. ఆ క్యూబా ఛాయలు మన దేశానికి చెందిన కొన్ని ప్రత్యేక పరిమిత పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కన పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కనీస ప్రజాహిత సామాజిక కార్య క్రమాలను అనేక పరిమితులు, ఆటంకాల మధ్యనే జయప్రదంగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. సోషలిజం అంటే, లేదా సమ సమాజ వ్యవస్థ అంటే అర్థం– పెట్టుబడికి, కట్టు బడికి, కట్టుకథలకు దాసానుదాసులు కావడంగా ఏ క్యూబన్ పౌరుడూ భావించరాదని ‘విల్లు’ రాసిపోయిన ప్రజా నాయకుడు క్యాస్ట్రో. ఏనాటికైనా జగన్ ఆ స్ఫూర్తిని అవకాశం మేరకు పెంచి, పోషిం చుకోగలరని ఆశిద్దాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా, వివిధ రాష్ట్రాలు వైఎస్ జగన్ ప్రజాహిత కార్యక్రమాలవైపు మొగ్గు చూపడం ఇందుకొక ఆశాకిరణం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ప్లాస్మా చికిత్సకు దారి దొరికింది...
పదార్థపు నాల్గో స్థితి అనే ప్లాస్మాను వైద్యంలో విరివిగా ఉపయోగించేందుకు మార్గం సులువైంది. మిచిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా ప్లాస్మాతో వైద్యం అందుబాటులోకి వస్తే గాయాలు తొందరగా మానడమే కాకుండా.. కేన్సర్ కణాలను కూడా సులువుగా చంపేయవచ్చు. అయితే ప్లాస్మా అస్థిరత కారణంగా ఇప్పటివరకూ వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించలేదు. మిచిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ లోటును భర్తీ చేశారు. ప్లాస్మాను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోడ్ల వద్ద వేడి కారణంగా జనించే ధ్వని తరంగాల వల్ల ప్లాస్మా దిశ, వేగం మారిపోతున్నట్లు వీరు గుర్తించారు. ఈ రెండింటిని నియంత్రించడం తెలుసుకోగలిగితే ప్లాస్మాను చికిత్సకు వాడటం సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త అమండా లీజ్ అంటున్నారు. ప్లాస్మా కారణంగా పుట్టే కొన్ని ఫ్రీ రాడికల్స్ కేన్సర్ కణాలను చంపేయగలవని, అదే సమయంలో ఇది సాధారణ కణాలకు ఏ హానీ చేయదని ఇప్పటికే గుర్తించినట్లు లీజ్ తెలిపారు. ఈ ఫ్రీ రాడికల్స్ బ్యాక్టీరియా త్వచాలను బద్దలుకొట్టి వాటిని చంపేస్తాయని, అందువల్ల దీన్ని వైద్య పరికరాలను శుద్ధి చేసేందుకు కూడా వాడవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికాలో చికిత్సలో ప్లాస్మా వాడకంపై నియంత్రణ ఉన్నప్పటికీ యూరప్‌లో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.