
కర్నూలు ఆస్పత్రిలో ప్లాస్మా దాతను అభినందిస్తున్న అధికారులు
సాక్షి, అమరావతి/కర్నూలు (హాస్పిటల్): రాష్ట్రంలో కరోనా సోకి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరణ మొదలైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళవారం కర్నూలులో ఒకరు, తిరుపతిలో ముగ్గురు వ్యక్తుల నుంచి రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్యులు ప్లాస్మాను సేకరించారు. కరోనా నిర్ధారణ తర్వాత 28 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్న వీరికి ఆ తర్వాత పరీక్షలు నిర్వహించారు.
రిపోర్టు నెగిటివ్ రావడంతో ఒక్కొక్కరి నుండి 300 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అందులో నుంచి ప్లాస్మా (యాంటీబాడీస్)ను వేరు చేస్తారు. కరోనా పాజిటివ్‌తో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వారికి ఈ ప్లాస్మాను ఎక్కిస్తారు. ఇప్పటివరకు కరోనా సోకి కోలుకున్న వారి వివరాలు సేకరించగా 330 మంది వరకూ ఉన్నట్టు తేలింది. వీళ్లందరి నుంచి ప్లాస్మా సేకరించి భద్రపరచాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment