
‘‘ఎక్కడో కాదు, మన ఇండియాలోనే గత పదేళ్లలోనే సార్స్ (శ్వాసకోశవ్యాధి), బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, జీకా లాంటి అంటువ్యాధుల్ని చూశాం. కానీ మన దేశంలో పెద్ద సమస్యల్లా – దేశంలో రాజకీయ కార్యక్రమాల్లోనూ, ప్రభుత్వ దేశాభివృద్ధి కార్యక్రమాల్లోనూ, వైద్య, ఆరోగ్య వ్యవస్థకు ఎజెండాలో అత్యంత అధమస్థాయి ప్రాధాన్యం మాత్రమే ఇస్తూ వచ్చాం. చివరికి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎంతసేపూ అంటు వ్యాధుల నివారణతో నిమిత్తం లేని ఇతరత్రా రోగాలపైన, ఆయుష్మాన్ భారత్ పైన మాత్రమే కేంద్రీకరిస్తోంది. ప్రస్తుతం తాండవిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో అయినా మన రాజకీయ పాలకులు... ఇప్పటికైనా కీలకమైన అంటువ్యాధులు ప్రబలి మహమ్మారులుగా తలెత్తకుండా ఉండేందుకు ప్రజారోగ్య రక్షణ వ్యవస్థను పకడ్బందీగా తీర్చిదిద్దుకునేం దుకు వీలుగా ఆరోగ్య శాఖను పునర్నిర్మిస్తారని ఆశిస్తున్నాను’’
– కె.సుజాతారావు (డాక్టర్ కేఎల్ రావు కుమార్తె), 2010 దాకా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి, ఇంటర్వ్యూ
దేశంలో ప్రజారోగ్య రక్షణకు పటిష్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల.. ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న కోవిడ్–19 మహమ్మారిని పరిమార్చే విధానంలో కూడా ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాస వివక్షను కూడా సుజాతారావు చూడగల్గడం విశేషం. ఈ మహమ్మారి వ్యాధిని పరీక్షించి అదుపు చేసే యత్నంలో ఉపకరించే రాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా పరీక్షకు రూ. 4,500లు రోగి దగ్గర వసూలు చేయడం పాశవికం అని కూడా ఆమె అభ్యంతరం తెల్పారు. (ఇందుకు మినహాయింపు భారతదేశంలో బహుశా ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని భావిస్తున్నారు). ఇది ఇలా ఉండగానే కరోనా వ్యాధి నివారణకు ఇంతవరకూ తోడ్పడే మందు (టీకాలు గానీ, ఇంజక్షన్ గానీ) లేదు. వాటి తయారీకి ఆరుమాసాలు లేదా సంవత్సర కాలం పట్టవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. చైనాలోని ఒక రాష్ట్రానికి పరిమితమైన కరోనా వ్యాధి ఇప్పుడు భారతదేశం సహా 190 దేశాలకు విస్తరించినందున దాని నివారణకు తగిన మందుల కోసం వెంపర్లాట ప్రారంభమైంది. దీంట్లో భాగంగానే కేవలం మలేరియా వ్యాధికి పరిష్కారంగా వచ్చిన హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)ను, అజిత్రోమైసిన్ యాంటీ బయాటిక్ మందును కరోనా వ్యాధికి తాత్కాలిక ఉపశమనంగా వాడటానికి.. ప్రస్తుతం అపార జననష్టానికి గురవుతున్న అమెరికా, తదితర యూరోపియన్ దేశాలు నిర్ణయించుకున్నాయి.
అయితే ఈ రెండు మందులకు మన దేశం ఉత్పత్తి కేంద్రం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను భారత్‌పైన పడింది. అయితే ఈ మందు ఎగుమతుల్ని ముఖ్యంగా అమెరికాకు, మరికొన్ని దేశాలకు ప్రస్తుత పరిస్థితుల్లో మన కేంద్ర ప్రభుత్వం మొదట్లో నిషేధించింది. కానీ ఇటీవలికాలంలో ట్రంప్‌తో స్నేహం మన పాలకులకు పెరిగిపోవడాన్ని ఆసరా చేసుకుని పై రెండు మందులను అమెరికాకు ధారాళంగా ఎగుమతి చేయాలని భారత పాలకుల్ని ట్రంప్ ఆదేశించాడు. కానీ, మన అవసరాలకోసం ఆ మందులను అమెరికాకు ఎగుమతి చేయటాన్ని నిలుపుదల చేస్తున్నట్లు మన పాలకులు మొదట్లో ప్రకటించారు. ఇది ట్రంప్‌కు కంటగింపై ఒక సామ్రాజ్యవాదిగా కన్నెర్ర జేశాడు. ‘నాతో మీ దేశానికి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు, ఇండి యాకు మేం ఎంతో సహాయం చేశాం. ఈ మందుల ఎగుమతుల్ని మాకు నిలిపివేస్తే నేనేం చేయాలో అది చేస్తా. అప్పుడు ఇండియా బతుకు ఏమవుతుందో చూస్తా’’ అని ట్రంప్ బెదిరించిన విషయాన్ని మనం మర్చిపోరాదు.
అయినా సరే మన పాలకులు ఆ బెదిరింపులకు లొంగి అంతకు ముందు ఆ మందుల ఎగుమతులపై విధించిన నిషేధాజ్ఞల్ని రద్దు చేశారు. దీంతో మన దేశానికి, ప్రజలకు ఏర్పడిన కరోనా విపత్తునుంచి బయటపడేందుకు ఎంతో కొంత ఉపయోగపడే ఆ మాత్రపు మందులు కూడా దేశ అవసరాలు తీర్చే విషయంలో కొంత అడ్డంకి ఏర్పడినట్లే చెప్పాలి. పైగా అమెరికా కోరుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ కేవలం మలేరియాకు తప్ప కరోనా వ్యాధికి పనికిరాదని స్వయానా ట్రంప్ అధ్యక్ష కార్యాలయ ఆరోగ్య విభాగం అధిపతి ఫాసీ ప్రక టించినా ఆ పేరుతోనైనా ఆ మందు ఎగుమతుల నిషేధాన్ని కొన సాగించి ఉండాల్సింది. కానీ మన పాలకులు అమెరికాలో చేసిన హౌడీ మోదీ నినాదాలకు ప్రత్యుపకారంగా ఇండియాలో ట్రంప్‌ను ఆహ్వా నిస్తూ అందుకు చెల్లించిన నమస్తే ట్రంప్ వాయనాలు మన ప్రజలకు ఏ మాత్రమూ కలిసి రాలేదని గుర్తించాలి. అయినాసరే, అమెరికాపట్ల మన పాలకులది ఎంత ఔదార్యం అని చాటుకున్నా ‘తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం’గా తయారైంది.
అయినా ‘లాక్‌డౌన్’ అమలులో ఉండగా– ప్రధాన ఉత్పత్తి కర్మాగారాలు, రవాణా మార్గాలు స్తంభించి పోయినప్పుడు అమెరికా కోరిన మందుల ఎగుమతుల్ని ఎలా పంపిస్తారు? కేంద్ర ప్రభుత్వం అమెరికా కోరిన మందుల్ని పంపడానికి ఆదేశాలయితే జారీ అయ్యాయే గానీ, మందుల పరి శ్రమల నిర్వహణకు ఉత్పత్తుల తయారీకి లాక్‌డౌన్‌వల్ల కార్మికులకు, ఉద్యోగులకు ఏర్పడిన ప్రయాణ, రవాణా సౌకర్యాల కటకట మాత్రం తొలగలేదని ఉత్పత్తిదారులు ప్రకటనలు జారీ చేశారు. అంతకన్నా ముఖ్యమైన అంశం– తయారీ పరికరాల కొరత రానున్న వారాలలో ఏర్పడబోతోందనీ, ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల మందుల ఉత్పత్తి పరిశ్రమలకు కల్గిన ఇబ్బందుల్ని తొలగించి సత్వరం ఉత్పత్తిని తిరిగి ప్రారంభించేలా చూడాలని కేంద్ర మందుల పరిశ్రమ శాఖే ప్రకటించిందని మరవరాదు. ఈ పరిస్థితుల్లో మలేరియా వ్యాధి నివారణకు ప్రధానంగా వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ స్థానే తాజాగా క్యూబా, చైనా ప్రజా వైద్య రక్షణ వ్యవస్థలు జయప్రదంగా అనుసరించి, కరోనా నుంచి లక్షలాది వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కల్గించిన ‘ప్లాస్మా వైద్యం (ప్లాస్మా థెరపీ) పద్ధతిని మనం కూడా అనుసరించి ప్రయోజనం పొందడం శ్రేయస్కరం కాదా? ఇప్పటికే తాజా కేరళ ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులకు ఉపశమనం కల్గించే ప్రయోగంలో ఉందని తెలుస్తోంది.
పైగా, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ కేంద్రాల ఏర్పాటు వ్యవస్థను, తద్వారా లక్షలమంది గ్రామీణ సచివాలయ కార్యకర్తల ద్వారా పొందుతున్న ప్రయోజనా లను కేరళ వామపక్ష ముఖ్యమంత్రి విజయన్ కొనియాడి, తామూ ఆ ఆదర్శాన్ని కేరళలో పాటించడానికి సిద్ధమవుతున్నారు. పైగా, ‘ఇండి యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ ఉన్నతాధికారి డాక్టర్ మురేకర్ కౌన్సిల్ తరఫున ప్రకటన చేస్తూ.. ఈ ‘ప్లాస్మా థెరపీ’ని అనుసరిం చడానికి ముందు పాటించాల్సిన అధికారిక అనుమతుల్ని (ప్రోటో కాల్) పొందే తుది దశలో ఉన్నామని తెలిపారు. ప్లాస్మా థెరపీ పద్ధతి: కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్న రోగి నుంచి సేకరించిన రక్తాన్ని (ప్లాస్మా) కరోనా వ్యాధి తీవ్రతలో ఉన్న రోగికి ఎక్కిస్తే, ఆ రోగిలో వ్యాధిని ప్రతిఘటించే శక్తినిచ్చే విరుగుడు పదార్థంగా (యాంటీబాడీ) పనిచేస్తుందని పరిశోధనలు నిరూపిం చాయి. ఈ ప్లాస్మా వైద్య ప్రయోగం ద్వారానే చైనాలో కరోనా వ్యాప్తి ఒకే ఒక్క రాష్ట్రంలోని వూహాన్‌కు పరిమితమై అంతరించిందని, ఈ వ్యాధి వల్ల చైనాలో జన నష్టం 3,600 మందికే పరిమితం అయిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి మానవ శరీ రాలపైన 60 రకాల వ్యాక్సిన్ల ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నాయి.
ఇవి అంటువ్యాధికి ఆధారమైన వ్యాధికారక వాహిక (వెక్టార్)ను నిర్వీ ర్యం చేసి తద్వారా రోగిలోని మంచి జన్యువుల్ని (డీఎన్‌ఏ) కాపాడి, హానికారకమైన ఆర్‌ఎన్‌ఏ జన్యువుల్ని నాశనం చేస్తాయి. 20.1.2020న తొలిసారిగా చైనా 20మంది కరోనా వ్యాధి పీడితులమీద ఈ ప్లాస్మా ప్రయోగం చేసి జయప్రదమైంది. రోగిమీద ప్రయోగించే ఇలాంటి వ్యాక్సిన్లను ‘కాండిడేట్ వ్యాక్సిన్లు’ అంటారు. ఒక మందు చెడు ప్రభా వాన్ని మరో ప్రత్యర్థి మందు ద్వారా నిర్వీర్యం చేయడమే వైద్య శాస్త్ర ప్రయోగాల లక్ష్యం. అందుకే డీఎన్‌ఏ ప్లాస్మా వ్యాక్సిన్ కోసం చేస్తున్న శాస్త్రవేత్తల ప్రయత్నాలు. ‘ప్లాస్మా’ వైద్యంతోపాటు ప్రస్తుతం క్యూబా వ్యాక్సిన్ ‘ఇంటర్‌ఫెరాన్ 2బి’ కూడా క్యూబా, చైనాలలో విజయభేరి మోగిస్తున్న వ్యాక్సిన్. ఇక ఒక కోటి 15 లక్షలమంది జనాభా గల క్యూబా 60 ఏళ్లపాటు అమెరికా సామ్రాజ్యవాద బెదిరింపులను నిరంతర దాడులను ఎదు ర్కొంటూంది. ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వాన విప్లవం ద్వారా స్వాతం త్య్రం సాధించుకున్న దేశం.. సోషలిస్టు వ్యవస్థ పునాదిగా చేసిన ప్రజారక్షణ విధానాలలో తొలి చర్యగా నిరుపేద దేశానికి విద్య, ఆరోగ్య రంగాలలో ప్రజారక్షణ వ్యవస్థకు గట్టి పునాదులు వేసింది. ఫలితంగా దాదాపు 80 దేశాలకు క్యూబా 37,000 మంది డాక్టర్లను ఆయా దేశాల ప్రజల ఆరోగ్య సేవలకు ‘ఆశాదూతలు’గా పంపి సేవ లందిస్తోంది. ఆ క్రమశిక్షణకు కారణం–ప్రతి క్యూబా వైద్యుడు సైన్యంలో రెండేళ్లు శిక్షణ పొంది తిరుగులేని ‘భిషక్కులు’గా అవ తరించడమే.
ఆ క్యూబా ఛాయలు మన దేశానికి చెందిన కొన్ని ప్రత్యేక పరిమిత పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కన పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కనీస ప్రజాహిత సామాజిక కార్య క్రమాలను అనేక పరిమితులు, ఆటంకాల మధ్యనే జయప్రదంగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. సోషలిజం అంటే, లేదా సమ సమాజ వ్యవస్థ అంటే అర్థం– పెట్టుబడికి, కట్టు బడికి, కట్టుకథలకు దాసానుదాసులు కావడంగా ఏ క్యూబన్ పౌరుడూ భావించరాదని ‘విల్లు’ రాసిపోయిన ప్రజా నాయకుడు క్యాస్ట్రో. ఏనాటికైనా జగన్ ఆ స్ఫూర్తిని అవకాశం మేరకు పెంచి, పోషిం చుకోగలరని ఆశిద్దాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా, వివిధ రాష్ట్రాలు వైఎస్ జగన్ ప్రజాహిత కార్యక్రమాలవైపు మొగ్గు చూపడం ఇందుకొక ఆశాకిరణం!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment