గాంధీఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మరో మైలురాయికి చేరుకుంది. రాష్ట్రచరిత్రలో మొదటిసారిగా ప్లాస్మా థెరపీ చికిత్స నిర్వహించిన ఘనత సాధించింది. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి గాంధీ ఆస్పత్రిలో ప్లా స్మా థెరపీని ప్రారంభించామని సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ప్లాస్మా దాతలతోపాటు ఆస్పత్రి పాలనాయంత్రాంగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ.. శ్రీనగర్‌కాలనీ, ఎల్బీనగర్‌కు చెందిన అఖిల్, సూర్యారావు నుంచి 800 ఎంఎల్ ప్లాస్మా సేకరించామని, 200 ఎంఎల్ ప్లాస్మాను ప్రాణాపాయస్థితిలో ఉన్న కరోనా రోగులకు ఎక్కిస్తామన్నారు. ప్లాస్మా దానా నికి మరో 15 మంది సిద్ధంగా ఉన్నారని, మరో 200 మంది సైతం అందుబాటులో ఉన్నారన్నారు.
కరోనాతో ఎవరూ చనిపోకూడదు: అఖిల్
వైద్యుల కృషితో కరోనాను జయించానని, ఈ మ హమ్మారితో ఎవరూ మృతి చెందకూడదన్న సంకల్పంతోనే ప్లాస్మా దానం చేసేందుకు వచ్చానని శ్రీ నగర్ కాలనీకి చెందిన దాత హైకోర్టు న్యాయవాది అఖిల్ స్పష్టం చేశాడు. స్కాట్లాండ్ నుంచి ఇండి యా వచ్చిన తర్వాత జ్వరం, జలుబుతో బాధపడ్డానని, పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలి పా డు. గాంధీ ఆస్పత్రిలో 16 రోజులు చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment