ప్లాస్మా థెరపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి | Etela Rajender Said Central Government Approved Plasma Therapy | Sakshi
Sakshi News home page

ప్లాస్మా థెరపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి

Apr 25 2020 3:17 AM | Updated on Apr 25 2020 8:09 AM

Etela Rajender Said Central Government Approved Plasma Therapy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్లాస్మాథెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేం దుకు కేంద్రం అనుమతిచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. శుక్రవారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లా డారు. 4రోజుల కింద ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అను మతినివ్వాలని కేంద్రాన్ని కోరగా, తాజాగా అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ రోగుల్లో బాగా సీరియస్‌గా ఉన్నవారికి ఈ విధానం ద్వారా చికిత్స చేస్తామన్నారు.

మరో 13 కేసులు నమోదు..
తెలంగాణలో కొత్తగా మరో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఈటల వెల్లడించారు. అందులో గద్వాల జిల్లాలో 9, జీహెచ్‌ఎంసీలో 2, రంగారెడ్డి, నిర్మల్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు తెలి పారు. మొత్తంగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 983కి చేరినట్లు తెలిపారు. తాజాగా 29 మంది డిశ్చార్జి కాగా, మొత్తం ఇప్పటి వరకు 291 మంది డిశ్చార్జి అయినట్లు ప్రకటించారు. ఆస్ప త్రిలో 667 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 25మంది మృతి చెందారని, మరో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు. గురువారం 970 కేసులు ప్రకటించామని, కానీ ఆ తర్వాత రాత్రి వరకు 8 కేసులు పెరిగాయన్నారు. ఆ రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 5 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అప్పటినుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. మొత్తంగా గత 24 గంటల్లో 540 పరీక్షలు చేశామని చెప్పారు.

సూర్యాపేట, గద్వాల, జీహెచ్‌ఎంసీ, వికారాబాద్‌ ప్రాంతాల నుంచే ఎక్కువ కేసులు వచ్చాయని, వికారాబాద్‌లో 14 బాధిత కుటుంబాలుంటే రోగుల సంఖ్య 38గా ఉందని పేర్కొన్నారు. గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి సోకిందన్నారు. జీహెచ్‌ఎంసీలో 44 కుటుంబాల నుంచే 268 మంది పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. ఇక్కడ కుటుంబాల సంఖ్య తక్కువగా ఉన్నా, ఒక్కో కుటుంబంలో సగటున ఆరు, ఏడుగురికి వ్యాపించిందన్నారు. కుటుంబాల సంఖ్య తక్కువగా ఉండి, పాజిటివ్‌ రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దిగ్బంధించేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పారు.

గ్రేటర్‌ హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌లో కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టంగా కంటైన్మెంట్‌ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఆ ప్రాంతాల్లో ఒక్కరిని కూడా బయటకు రానివ్వట్లేదని చెప్పారు. అక్కడున్న వారి ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నామని, నిత్యావసర వస్తువులను కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆ మూడు జిల్లాల్లో ఉన్నతస్థాయి బృందం పర్యటించి సీఎంకు నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆ మూడు చోట్ల త్వరలోనే కేసులు తగ్గుతాయన్నారు.

కరీంనగర్‌లో 28 రోజులకు పాజిటివ్‌..
రోజురోజుకూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత డిశ్చార్జ్‌ సమయంలో నెగెటివ్‌ వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు పాజిటివ్‌ వస్తోందని చెప్పారు. కరీంనగర్‌లో 28 రోజులకు పాజిటివ్‌ వచ్చిందన్నారు. కేరళలో ఒక మహిళకు 14 రోజుల తర్వాత 19 సార్లు పరీక్షించినా పాజిటివ్‌ వచ్చింది. మన దగ్గర కూడా 200 పైచిలుకు డిశార్జి కావాలి. కానీ రెండుసార్లు పరీక్షిస్తే ఒకసారి నెగెటివ్, మరోసారి పాజిటివ్‌ వచ్చింది. అంటే ఎన్ని రోజుల వరకు నెగెటివ్‌ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చదవండి: గలగలా గోదారి కదిలి వచ్చింది


దుష్ప్రచారంపై మండిపాటు...
కొద్దిమంది వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మంత్రి ఈటల మండిపడ్డారు. సైకోలు, శాడిస్టుల ఆలోచనలు వేరుగా ఉన్నాయని, సోషల్‌ మీడియాలో గాంధీలో సౌకర్యాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆస్పత్రిలో రోజూ ఒక టిఫిన్‌ ఉంటుంది. 11 గంటలకు బిస్కెట్లు, చాయ్‌ ఇస్తున్నాం. మధ్యాహ్నం ఒంటి గంటకు గుడ్డుతో కూడిన ఆహారం అందిస్తున్నాం. సాయంత్రం 4–5 గంటలకు డ్రైఫ్రూట్స్‌ ఇస్తున్నాం.

సాయంత్రం 7 గంటలకు మళ్లీ గుడ్డుతో కూడిన ఆహారం పెడుతున్నాం. అక్కడ బిర్యానీ తెచ్చి ఇవ్వలేం కదా. అది ఆస్పత్రి.. రోగులకు ఎంత అవసరమో అదే ఇస్తున్నాం’అని వివరించారు. కాగా, గాంధీని పూర్తిస్థాయి ‘కోవిడ్‌’(కరోనా) ఆస్పత్రిగా నామకరణం చేసినట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఆహారం సరిగా లేదంటూ ఎవరో ఒకరు రాసిన లేఖను ఆధారంగా దానిపై విపక్షాలు, బాధ్యత లేని వ్యక్తులు స్పందించడం సరికాదన్నారు. ప్రస్తుతం గాంధీలో ఏడుగురు ఆక్సిజన్‌పై ఉన్నారని పేర్కొన్నారు.

సేవలందించేందుకు సిద్ధం..
లక్ష మంది కరోనా రోగులు వచ్చినా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ఈటల పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ జరిగిందని, రాష్ట్రంలో కరోనాకు అరికట్టడంలో బాగా కృషిచేస్తున్నట్లు అభినందించారని ఈటల తెలిపారు. ప్రస్తుతం 9 ల్యాబ్స్‌ ద్వారా ఒకే రోజు 1,600 పరీక్షలు చేసే సత్తా తమకున్నట్లు కేంద్రానికి తెలిపామన్నారు. రాష్ట్రాలకు విదేశాల నుంచి వచ్చే వైద్య యంత్ర పరికరాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని, దేశీయంగా కొనుగోలు చేసే యంత్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఈటల వెల్లడించారు. 10 లక్షల పీపీఈ కిట్లు, 10 లక్షల ఎన్‌–95 మాస్క్‌లకు ఆర్డర్‌ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో వైద్యులకు ఎక్కడా కరోనా సోకలేదని వెల్లడించారు. చదవండి: ఒక్కరోజులో 1,752 పాజిటివ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement