కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కరోనా బాధితుడికి ప్లాస్మాథెరపీ విజయవంతమైంది. డోన్‌కు చెందిన 37 ఏళ్ల సతీష్‌గౌడ్ కరోనాతో రెండు వారాల క్రితం కర్నూలులోని స్టేట్ కోవిడ్ హాస్పిటల్‌లో చేరాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వైద్యులు అతనికి రెండు సార్లు ప్లాస్మాథెరపీ అందించారు. దీంతో అతను పూర్తిగా కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడు. అతన్ని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవిపట్టన్‌శెట్టి, ఆసుపత్రి అధికారులు అభినందించారు. దేశంలో తొలిసారి ఢిల్లీలో ఓ మంత్రికి, ఆ తర్వాత తిరుపతిలో, అనంతరం కర్నూలులో మాత్రమే ప్లాస్మాథెరపీ చికిత్స ప్రారంభించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment