సాక్షి, గుంటూరు: కరోనా (కోవిడ్–19) బాధితులకు ప్మాస్లాథెరపీ ద్వారా చికిత్స అందించేందుకు గుంటూరు వైద్య కళాశాల ఎథిక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. శనివారం వైద్య కళాశాలలో కళాశాల ఎథిక్స్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం వెల్లడించింది. ఈ విధానంలో కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు గుంటూరు వైద్య కళాశాలలో అన్ని రకాల వైద్యులు, వైద్య సౌకర్యాలు ఉండటంతో కళాశాల ఎతిక్స్ కమిటీ ఈ వైద్య విధానంలో చికిత్స అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధికి కరోనా)
వైద్య కళాశాల ఎథిక్స్ కమిటీ నివేదికను కేంద్ర పరిశోధనా సంస్థ ఐసిఎంఆర్‌కు పంపి అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ప్లాస్మాథెరపీ చికిత్స ప్రారంభిస్తామని ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ ఇన్‌వెస్టిగేటర్, పెథాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ చాగంటి పద్మావతిదేవి తెలిపారు. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’)
Comments
Please login to add a commentAdd a comment