కోహ్లి (PC: IPL)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 7,500 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 130.36 స్ట్రైక్ రేట్‌తో 7575 పరుగులు చేశాడు. ఐపీఎల్‍లో అత్యధిక పరుగుల రికార్డు కూడా విరాట్ పేరిటే ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
72 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. విరాట్ కోహ్లికి ఇది 8వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఐపీఎల్ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లినే కావడం విశేషం.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే..
విరాట్ కోహ్లి- 7575 పరుగులు (242 మ్యాచ్‌లు)
శిఖర్ ధావన్- 6754 పరుగులు (221 మ్యాచ్‌లు)
డేవిడ్ వార్నర్- 6545 పరుగులు (180 మ్యాచ్‌లు)
రోహిత్ శర్మ- 6280 పరుగులు (246 మ్యాచ్‌లు)
సురేశ్ రైనా- 5528 పరుగులు (205 మ్యాచ్‌లు)
Make that 7500 runs and counting in the #TATAIPL for @imVkohli 👏👏
— IndianPremierLeague (@IPL) April 6, 2024
Live - https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/M5CS7PUW2Q
Comments
Please login to add a commentAdd a comment