ఐపీఎల్-2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు అజింక్యా రహానే అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. బౌండరీ లైన్ వద్ద రహానే ఫీల్డింగ్ విన్యాసానికి అందరూ ఆశ్చర్యపోయారు. బౌండరీ లైన్ వద్ద చాకచాక్యంగా వ్యవహరించిన రహానే.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు.
ఏం జరిగిందంటే
ఆర్సీబీ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన ముస్త్‌ఫిజర్ రెహ్మాన్ రెండో బంతిని కోహ్లికి షార్ట్‌పిచ్ డెలివరీగా సంధించాడు. దీంతో కోహ్లి డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటు వైపు ఫీల్డింగ్ చేస్తున్న రహానే కుడి వైపు పరుగెత్తి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. కానీ బౌండరీ రోప్ దగ్గరలో బ్యాలెన్స్ కోల్పోయిన రహానే.. సమయస్పూర్తిని ప్రదర్శిస్తూ.. తనను ఫాలో అవుతూ స్క్వేర్ లెగ్ నుంచి పరుగెత్తుకొచ్చిన రచిన్ రవీంద్రకు బంతిని అందించాడు.
క్యాచ్ రచిన్ ఖాతాలో చేరినప్పటికి.. రహానే ఎఫర్ట్‌కు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఆఖరికి విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి (20 బంతుల్లో సిక్స్‌తో 21) పరుగులు చేశాడు.
Brilliant relay catch 👌
— IndianPremierLeague (@IPL) March 22, 2024
Timber strike 🎯
Mustafizur Rahman is making merry & so are @ChennaiIPL 🙌
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL | @ajinkyarahane88 pic.twitter.com/0GKADcZleM
Comments
Please login to add a commentAdd a comment