ప్రియురాలిని హతమార్చి తానూ ఆత్మహత్య
శ్రీకాళహస్తిః ప్రియుురాలిని హతమార్చి తర్వాత తాను రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడో వివాహితుడు. సోవువారం రాత్రి ఈ దుర్ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు కథనం మేరకు వివరాలిలా .. కేవీబీ పురం వుండలం కళత్తూరుకు చెందిన గుణశేఖర్(38)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల కిందట అదే వుండలం రారుుపేడుకు చెందిన అరుణ(33)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అరుణ వివాహిత అరుునప్పటికీ భర్తతో విభేదా లతో ఒంటరిగా ఉంటోంది. అరుుతే ఇటీవల అరుణ వురో వ్యక్తితో స్నేహంగా ఉన్నట్లు గుణశేఖర్ అనుమానిం చాడు. దీంతో ఆమెను అంతమొందించాలని పథకం రచించాడు. అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు లాడ్జికి ఆమెను ఆదివారం రాత్రి తీసుకువచ్చాడు.
సోవువారం ఆమెను గదిలో ఓ రోప్ సాయుంతో గొంతు బిగించి హతవూర్చాడు. వుృతి చెందిందని నిర్దారించుకున్న గుణశేఖర్ గదికి తాళం వేసుకుని శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ సోవువారం రాత్రి రైలుకింద పడి వుృతి చెందాడు. గదినుంచి దుర్వాసన రావడంతో లాడ్జీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సవూచారం అందించారు. వుంగళవారం పోలీసులు తాళాలు పగలగొట్టి గదిలోకి వెళ్లడంతో అరుణ వుృతదేహం రోప్‌కు వేలాడుతూ కనిపించింది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పట్టాలపై రైల్వే పోలీసులు ఓ వ్యక్తి వుృతదేహాన్ని గుర్తిం చిన విషయూన్ని తెలుసుకున్న శ్రీకాళహస్తి పట్టణ పోలీసు సిబ్బంది అక్కడికు వెళ్లి పరిశీలించారు. వుృతుని జేబులో లాడ్జికి చెందిన తాళంచెవి ఉండడాన్ని గుర్తించి కేవీబీపురంలో విచారణ చేపట్టారు. దీంతో హత్యోదంతానికి సం బంధించిన వాస్తవాలు వెలుగుచూశారుు.
అనుమానమే పెనుభూతమై..
Published Wed, Jul 13 2016 1:01 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement