టీ20ల్లో మరో సంచలనం నమోదైంది. హాంకాంగ్ బౌలర్ ఆయుష్ శుక్లా ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తన 4 ఓవర్లు కోటాను మెయిడిన్లగా ముగించాడు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్‌లో భాగంగా మంగోలియాపై ఆయుష్ ఈ ఫీట్ సాధించాడు.
తద్వారా ఒకే ఇన్నింగ్స్‌లో వరుసగా నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసిన మూడో బౌలర్‌గా శుక్లా చరిత్రకెక్కాడు. అయితే ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆసియా బౌలర్ శుక్లానే కావడం గమనార్హం. మంగోలియా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్న శుక్లా.. తొలి బంతికే వికెట్ తీసాడు.
ఆ తర్వాత వరుసగా తన బౌలింగ్ కోటాను అతడు పూర్తి చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ లాకీ ఫెర్గూసన్, కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ ఉన్నారు. ఈ ఫీట్‌ణు లాకీ ఫెర్గూసన్ టీ20 వరల్డ్‌కప్‌లో పపువా న్యూగినియాపై సాధించగా.. సాద్ బిన్ జఫర్ పనామాపై సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment