ICC T20 world cup
-
T20 WC Qualifiers: పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్
టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫియర్-ఎలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా మలేషియా వేదికగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మంగోలియా 10 ఓవర్లు ఆడి కేవలం 10 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో ఐదు డకౌట్లు కాగా.. నలుగురు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. మంగోలియా ఇన్నింగ్స్‌లో 2 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. ఇక సింగపూర్ బౌలర్లలో హర్ష భరద్వాజ్ ఆరు వికెట్లు పడగొట్టగా.. ఆక్షయ్ పూరీ రెండు, రాహుల్, రమేష్ తలా వికెట్ సాధించారు. 10 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సింగపూర్ 0.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఆలౌటైన మంగోలియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన ఐస్లీ ఆఫ్ మ్యాన్ రికార్డును మంగోలియా సమం చేసింది. గతేడాది స్పెయిన్‌పై ఐస్లీ ఆఫ్ మ్యాన్ జట్టు కూడా 10 పరుగులకే చాపచుట్టేసింది.తుది జట్లుమంగోలియా: మోహన్ వివేకానందన్, సంచిర్ నట్సగ్డోర్జ్, దవాసురేన్ జమ్యాన్సురెన్, సోడ్బిలెగ్ గంతుల్గా, గండెంబెరెల్ గాన్బోల్డ్(వికెట్ కీపర్), లువ్సంజుండుయ్ ఎర్డెనెబుల్గాన్(కెప్టెన్), టెములెన్ అమర్మేండ్, జోల్జావ్ఖ్లాన్ షురెంత్సెట్సేగ్, టర్బోల్డ్ బట్జర్గల్, తుర్ముంఖ్ తుముర్సుఖ్, ఎంఖ్‌బాత్ బత్ఖుయాగ్సింగపూర్: సురేంద్రన్ చంద్రమోహన్, అర్జున్ ముత్రేజా, విలియం సింప్సన్, మన్‌ప్రీత్ సింగ్(వికెట్ కీపర్), అమన్ దేశాయ్, అమర్త్య కౌల్, హర్ష భరద్వాజ్, అక్షయ్ పూరి, రాహుల్ శేషాద్రి, రౌల్ శర్మ, రమేష్ కలిముత్తుచదవండి: Duleep Trophy: నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్.. ఆరు ఫోర్లు కొట్టి.. -
టీ20ల్లో సంచలనం.. ఒక్క రన్ ఇవ్వకుండా 4 ఓవర్లు
టీ20ల్లో మరో సంచలనం నమోదైంది. హాంకాంగ్ బౌలర్ ఆయుష్ శుక్లా ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తన 4 ఓవర్లు కోటాను మెయిడిన్లగా ముగించాడు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫైయర్‌లో భాగంగా మంగోలియాపై ఆయుష్ ఈ ఫీట్ సాధించాడు.తద్వారా ఒకే ఇన్నింగ్స్‌లో వరుసగా నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసిన మూడో బౌలర్‌గా శుక్లా చరిత్రకెక్కాడు. అయితే ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆసియా బౌలర్ శుక్లానే కావడం గమనార్హం. మంగోలియా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసేందుకు బంతిని అందుకున్న శుక్లా.. తొలి బంతికే వికెట్ తీసాడు.ఆ తర్వాత వరుసగా తన బౌలింగ్ కోటాను అతడు పూర్తి చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ లాకీ ఫెర్గూసన్, కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ ఉన్నారు. ఈ ఫీట్ణు లాకీ ఫెర్గూసన్ టీ20 వరల్డ్‌కప్‌లో పపువా న్యూగినియాపై సాధించగా.. సాద్ బిన్ జఫర్ పనామాపై సాధించాడు. -
T20 WC: ‘వరల్డ్‌కప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే! కోహ్లి కూడా..’
వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసి రెండు రోజులు కూడా పూర్తికాకముందే టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలతో ముందుకువచ్చాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి తన జట్టును ఇప్పుడే ఎంపిక చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి తన టీమ్‌లో స్థానమిచ్చాడు. వారిద్దరూ కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్ ఆడే ఛాన్స్ ఉందని శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా గత కొన్నాళ్లుగా రోహిత్, కోహ్లి టీ20 సిరీస్‌లకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం సహా.. 2024 ప్రపంచకప్ నాటికి యువ జట్టును సిద్ధం చేసే క్రమంలో మేనేజ్మెంట్ ఈ ఇద్దరు స్టార్లకు విశ్రాంతినిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నవంబరు 19న జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలు కాగా.. ‘విరాహిత్’ ద్వయం తీవ్ర నిరాశకు లోనయ్యారు. కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనుకున్న నమ్మకంతో బరిలోకి దిగిన భారత జట్టు.. అనూహ్య రీతిలో ఆసీస్ చేతిలో ఓడిపోవడంతో.. టీ20లలో రోహిత్, కోహ్లి భవితవ్యంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేరళ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రోహిత్ శర్మ ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం టీ20 వరల్డ్‌కప్‌లో కూడా రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడు. ఎందుకంటే ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఘనత అతడి సొంతం. అయితే, టోర్నీ నాటికి రోహిత్ సారథ్యం వహిస్తాడా లేదంటే హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పుతారా అన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇక యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తే కచ్చితంగా జట్టులోకి వస్తాడు. అయితే మూడో కీపర్ ఆప్షన్‌గానే అతడి పేరు ఉంటుంది. అయితే, మనకో మ్యాచ్ విన్నర్ కాబట్టి బ్యాటర్‌గా తనకు స్థానం దక్కడం ఖాయమనిపిస్తోంది. అయితే ఫామ్‌ను బట్టి అతడి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని శ్రీశాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా గతేడాది డిసెంబరులో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఐపీఎల్-2024 నాటి అతడు మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 4న మొదలుకానుంది. టీ20 వరల్డ్‌కప్-2024కు శ్రీశాంత్ ఎంచుకున్న జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ -
T20 WC 2024: ఐసీసీ ప్రకటన.. ఆ 3 నగరాలకు గుడ్‌న్యూస్
3 USA venues locked in for ICC Men's T20 WC 2024: ఐసీసీ మెన్స్ వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్‌లను టీ20 ప్రపంచకప్ వేదికలుగా ఎంపిక చేసినట్లు బుధవారం ధ్రువీకరించింది. మొట్టమొదటిసారి కాగా వెస్టిండీస్‌తో కలిసి యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈసారి పొట్టి ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమైన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను అమెరికా దక్కించుకోగా.. వేదికల ఎంపికలో ఐసీసీ తాజాగా తుది నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌లోని నసౌవ్ కౌంటీ, డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రొవార్డ్ కౌంటీ అసోసియేషన్లకు ఈ మేరకు శుభవార్త చెప్పింది. ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. సీటింగ్ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఫ్యాన్స్ కోసమే ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గాఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. అతిపెద్ద ఐసీసీ ఈవెంట్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతుండటం సంతోషంగా ఉందన్నాడు. అమెరికాలో క్రికెట్ పట్ల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుండటం.. ఫ్యాన్‌బేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. సొంత నగరాల్లోనే మేటి క్రికెట్ మ్యాచ్‌లు నేరుగా వీక్షించేందుకు యూఎస్ఏలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం దొరకనుంది. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా.. ఏకంగా.. -
T20 WC: టి20 ప్రపంచకప్-2024కు అర్హత సాధించిన పసికూన
వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా జట్టు టి20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. శుక్రవారం ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టోనీ యురా 61, ఆసద్ వాలా 59, చార్ల్స్ అమిని 53 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పిలిప్పీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ డేనియల్ స్మిత్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అర్ష్‌దీప్ శర్మ 22 పరుగులు చేశాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా రెండు వికెట్లు తీయగా.. జాన్ కరికో, హిరిహిరి ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే ఐర్లాండ్ అర్హత సాధించగా.. తాజాగా పపువా న్యూ గినియా కూడా అర్హత సాధించడంతో టి20 వరల్డ్‌కప్ అర్హతకు సంబంధించి మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా క్వాలిఫయర్ నుంచి.. మిగతా నాలుగు బెర్తుల్లో రెండు ఆసియా నుంచి.. మరో రెండు ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. ICC Men’s #T20WorldCup 2024 bound ✈️🏆 Congratulations, Papua New Guinea! 🙌 pic.twitter.com/Y7jKSU6Hxq — ICC (@ICC) July 28, 2023 చదవండి: Ashes 2023: పాంటింగ్‌పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను' -
'ఇది ఆటేనా.. ఫైనల్లో పాక్‌తో తలపడే అర్హత భారత్‌కు లేదు'
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. భారత జట్ట పేలవ ప్రదర్శనపై అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి ప్రదర్శనేంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉందని విమర్శలు గుప్పించాడు. భారత జట్టు ప్రదర్శన పాతాళానికి పాడిపోయిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. 'మెల్బోర్న్లో జరిగే ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడే అర్హత భారత్‌కు లేదు. టీమిండియా సత్తా ఏంటో ఈ మ్యాచ్‌తో తేలిపోయింది. సెమీ ఫైనల్‌కు చేరడం గొప్పేం కాదు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఇలా ఉంటే చాలా కష్టం. టీమిండియా కెప్టెన్సీపై పునరాలోచించుకోవాలి. దారుణ పరాభవానికి జట్టు యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలి.' అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సనాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అర్ధ సెంచరీలతో కదం తొక్కి 10 వికెట్ల తేడాతో తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించి ఫైనల్ చేర్చారు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక చేతులెత్తేశారు. మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మద్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుత ఫాంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని చూస్తుండగా.. 1992 సీన్‌ను రిపీట్ చేసి ఇంగ్లాండ్‌ను ఓడించి మరోసారి కప్పు ఎగరేసుకుపోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఏదేమైనా ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అలరించనుంది. చదవండి: ఐపీఎల్ బ్యాన్ చేస్తేనే దారిలోకి వస్తారా! -
ఫైనల్ పోరుకు చేరేదెవరు? న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య తొలి సెమీస్
ఈ టి20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగిశాయి. ఇప్పుడిక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. వర్షం కురిస్తే రిజర్వ్ డే ఉందేమో కానీ ఓడితే మాత్రం ఇంకో మ్యాచ్ ఉండదు. ఇంటిముఖం పట్టాల్సిందే! అదృష్టం కలిసొచ్చిన పాకిస్తాన్ జట్టుతో నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ నేడు జరిగే తొలి సెమీఫైనల్లో తలపడనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ టైటిల్ వేటలో తొలి అడుగు వేసేందుకు సై అంటుండగా... గత ప్రపంచకప్‌లో సెమీస్‌తో ముగిసిన తమ ప్రయాణాన్ని ఈసారి ఫైనల్ దాకా కొనసాగించాలని, 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పాకిస్తాన్ పట్టుదలతో ఉంది. సిడ్నీ: ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్లలో (వన్డే, టి20) ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఓడిపోలేదు. కానీ ఈసారి పాకిస్తాన్ జట్టుకు గెలవడం అంత సులభం కాదేమో! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలో పాక్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్న కివీస్ విజయమే లక్ష్యంగా టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో బరిలోకి దిగుతోంది. పడుతూ లేస్తూ వచ్చి న బాబర్ ఆజమ్ బృందం ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సర్వశక్తులు ఒడ్డితేనే ముందడుగు వేస్తుంది. లేదంటే గత ఏడాది మాదిరిగానే ఈసారీ సెమీఫైనల్లో నిష్క్రమించాల్సి వస్తుంది. చివరిసారి 2009 టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరి విజేతగా నిలిచిన పాక్ ఆ తర్వాత ఫైనల్ చేరలేకపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో... ఈ టోర్నీ ఆరంభం నుంచి కూడా న్యూజిలాండ్ నిలకడైన ప్రదర్శనతో విజయాలు సాధిస్తూ వచ్చింది. ఒక్క ఇంగ్లండ్ మ్యాచ్‌లో మినహా ప్రతి మ్యాచ్‌లోనూ పెద్ద తేడాతోనే నెగ్గుకొచ్చింది. ఆతిథ్య ఆసీస్నైతే 89 పరుగులతో ఓడించింది. టాపార్డర్‌లో ఓపెనర్లు అలెన్, డెవాన్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్ సహా నాలుగో వరుసలో గ్లెన్ ఫిలిప్స్ రాణిస్తున్నారు. ముఖ్యంగా లంకతో జరిగిన పోరులో టాపార్డర్ మూకుమ్మడిగా విఫలమైనా... ఫిలిప్స్ ఒంటిచేత్తో శతక్కొట్టి గెలుపును ఖాయం చేశాడు. బౌలింగ్‌లో బౌల్ట్, సౌతీ, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, సోధి ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ఇబ్బంది పెడుతున్నారు. బౌల్ట్ మినహా మిగతా నలుగురు బౌలర్లు ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్లను పడగొట్టారు. . ఒత్తిడిలో బాబర్ జట్టు పాకిస్తాన్ ఈ టోర్నీలో సాధారణ ప్రదర్శనతోనే నెట్టుకొచ్చింది. అదృష్టంతో ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడ మాత్రం అదృష్టాన్ని నమ్ముకుంటే కుదరదు... మెరుపుల్లేని ఓపెనింగ్ జోడీ రిజ్వాన్, బాబర్ బ్యాట్ ఝుళిపించాల్సిందే. మిడిలార్డర్లో ఇఫ్తికార్, షాన్ మసూద్ ఆదుకుంటున్నారు. బౌలింగ్ కూడా రాటుదేలితేనే పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఢీకొట్టగలదు. లేదంటే ఇక్కడితోనే ఇంటిబాట ఖాయం! గత రికార్డులు.. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో (1992, 1999 వన్డే వరల్డ్‌కప్, 2007 టి20 ప్రపంచకప్) పాకిస్తాన్ జట్టే గెలిచింది. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఓవరాల్‌గా న్యూజిలాండ్, పాక్ జట్ల మధ్య 28 మ్యాచ్‌లు జరిగాయి. 17 మ్యాచ్‌ల్లో పాక్ గెలుపొందగా... 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. పిచ్, వాతావరణం సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో మెరుపులకు కొదవే ఉండదు. కివీస్, ఆసీస్‌ల మధ్య ‘సూపర్ 12’ తొలి మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌పైనే తొలి సెమీస్‌ను ఆడిస్తున్నారు. దీంతో పాక్‌కంటే న్యూజిలాండ్‌కే కాస్త అనుకూలం ఎందుకంటే ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 200 పరుగులు చేసింది. ఉదయం చినుకులు కురిసే అవకాశమున్నప్పటికీ మ్యాచ్ సమయానికి ఏ ఇబ్బంది ఉండదు. జట్లు (అంచనా) న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, డెవాన్ కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాన్‌ట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, సోధి, ఫెర్గూసన్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్, నవాజ్, షాదాబ్ ఖాన్, వసీమ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్. చదవండి: 'కోహ్లి కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోతుంది' -
బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు.. గెలిస్తే సెమీస్ బెర్త్!
సాధారణంగా అయితే బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్ అంటే ఎలాంటి విశ్లేషణలు లేకుండా మనదే గెలుపు ఖాయమని అందరిలో నమ్మకం. అయితే కొంత కాలంగా బంగ్లాతో మ్యాచ్‌లు కూడా ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. తుది ఫలితం టీమిండియాకు అనుకూలంగా వచ్చినా... మ్యాచ్‌లో వేర్వేరు దశల్లో బంగ్లా అనూహ్యంగా చెలరేగి మన జట్టును ఇబ్బంది పెడుతోంది. పాక్‌తో మ్యాచ్ తరహాలో అభిమానులు కూడా అదనంగా కొన్నిసార్లు తమ భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్ చేరడం దాదాపు ఖాయం కానుండగా, తమకంటే చిన్న జట్లపై రెండు విజయాలు సాధించిన బంగ్లాదేశ్ సంచలనాన్ని ఆశిస్తోంది. అడిలైడ్: గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయాన్ని మరచి కొత్త ఉత్సాహంతో మరో పోరుకు భారత్ సన్నద్ధమైంది. సఫారీలను ఓడించి ఉంటే ఇప్పటికే మన సెమీస్ అవకాశాలపై మరింత స్పష్టత వచ్చేది. అయితే పెర్త్ పిచ్ అలాంటి అవ కాశం ఇవ్వలేదు. ఇప్పుడు గ్రూప్–2లో బలహీన జట్లలో ఒకటైన బంగ్లాదేశ్‌ను నేడు రోహిత్ సేన ఎదుర్కొంటోంది. బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే భారత్ సహజంగానే ఫేవరెట్ కాగా, అలసత్వం దరి చేరనీయకుండా ఆడాల్సి ఉంటుంది. తమ స్థాయిని బట్టి చూస్తే టోర్నీలో ఇప్పటికే సంతృప్తికర ప్రదర్శన ఇచ్చిన బంగ్లా ఈ మ్యాచ్‌లో ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. పంత్‌కు చాన్స్! వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు కోహ్లి, సూర్యకుమార్ రెండు అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆనందపరిచారు. రోహిత్ కూడా నెదర్లాండ్స్‌పై అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే టోర్నీలో ఇప్పటికీ తనేంటో కేఎల్ రాహుల్ నిరూపించుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో అతను 4, 9, 9 చొప్పున పరుగులు చేశాడు. అయితే రాహుల్ విలువేంటో తమకు తెలుసని, జట్టులోంచి అతడిని తప్పించే అవకాశమే లేదని కోచ్ ద్రవిడ్ ఖరాఖండీగా చెప్పేశాడు కాబట్టి స్థానంపై ఎలాంటి సందేహాలు లేవు. కీపర్ దినేశ్ కార్తీక్ గాయం విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కార్తీక్‌కు ఆడించడంకంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్న పంత్‌కు అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయం కావచ్చు. బౌలింగ్‌లో ముగ్గురు రెగ్యులర్ పేసర్లకు తోడు స్పిన్నర్‌గా అశ్విన్‌నే కొనసాగిస్తారా చూడాలి. బంగ్లా లైనప్‌లో నలుగురు ఎడంచేతివాటం బ్యాటర్లు ఉండటంతో అశ్విన్ సరైనోడు కావచ్చు. బౌలింగ్‌పైనే ఆశలు... లీగ్ దశలో జింబాబ్వే, నెదర్లాండ్స్‌లపై స్వల్ప తేడాలతో నెగ్గిన బంగ్లాదేశ్ జట్టుకు ఆ రెండు విజయాలు బౌలింగ్ కారణంగానే వచ్చాయి. ముఖ్యంగా పేసర్ తస్కీన్ అహ్మద్ జట్టు భారం మోస్తున్నాడు. ముస్తఫిజుర్ మళ్లీ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. హసన్ మహమూద్ కూడా కీలక పేసర్. ఆఫ్‌స్పిన్నర్ మొసద్దిక్ కూడా ప్రభావం చూపగలడు. అయితే వీరంతా కూడా బలమైన భారత బ్యాటింగ్‌ను నిలువరించడం అంత సులువు కాదు. బ్యాటింగ్‌లోనైతే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. నజ్ముల్, లిటన్, సర్కార్, అఫీఫ్లు ఏమాత్రం రాణిస్తారనేదానిపైనే జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి మించి కెప్టెన్ షకీబ్ ఫామ్‌లో లేకపోవడమే ఇబ్బందిగా మారింది. పైగా ‘మేం వరల్డ్ కప్ గెలవడానికి రాలేదు’ అంటూ అతను వ్యాఖ్యానించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేవే. పిచ్, వాతావరణం అడిలైడ్ ఓవల్ మైదానం మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అయితే వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే... టి20ల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య 11 మ్యాచ్‌లు జరగ్గా, 10 భారత్ గెలిచింది. వరల్డ్‌కప్‌లో 2016లో ఆఖరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి. అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్‌లో పరుగు తేడాతో భారత్ నెగ్గింది. 5 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన బంగ్లా వరుసగా 2 ఫోర్లు కొట్టి సంబరాలు చేసుకోగా, తర్వాతి 3 బంతుల్లో భారత్ ఒక్క పరుగూ ఇవ్వకుండా 3 వికెట్లు తీయడాన్ని అభిమానులు మరచిపోలేరు. చదవండి: కేఎల్ రాహుల్‌కు కోహ్లి పాఠాలు -
Ind Vs Pak: పాక్‌పై చారిత్రక ఇన్నింగ్స్.. కోహ్లి నేర్పిన 'పంచ సూత్రాలు'
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి వీరోచిత పోరాటం చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ గ్రేట్ ఇన్నింగ్స్ నుంచి మనమంతా ఐదు విషాయాలు నేర్చోవాలని తెలిపారు ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్. ఇందుకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కోహ్లీ నుంచి అందరూ నేర్చుకోవాల్సిన ఆ ఐదు విషయాలెంటో ఇప్పుడు చూద్దాం.. బ్యాడ్ టైమ్ తాత్కాలికమే.. శాశ్వతం కాదు. ప్రదర్శనతోనే బదులివ్వాలి చివరి క్షణం వరకు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి ప్రజలు దేన్నైనా త్వరగా మర్చిపోతారనే విషయం గుర్తుంచుకోవాలి మీ ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు ఎంతపెద్ద కష్టాన్నైనా సులభంగా అధిగమించవచ్చు #ViratKohli𓃵 की पारी से सीख: 1. आपका बुरा समय भी स्थायी नहीं है 2. सिर्फ़ अपने परफ़ॉर्मेंस से ही जवाब दिया जा सकता 3. अंतिम समय तक अपनी भावनाओं पर नियंत्रण रखना 4. लोगों की याददाश्त बहुत छोटी होती है 5. जब आत्मविश्वास बढ़ता है तो कठिन परिस्थिति भी आसान लगती है — Awanish Sharan (@AwanishSharan) October 24, 2022 ఐఏఎస్ అధికారి చెప్పినట్లు ఈ ఐదు విషయాలు కోహ్లి ఇన్నింగ్స్ నుంచి అందరూ నేర్చుకోవచ్చు. పాక్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయతీరాలకు చేర్చాడు కోహ్లి. మ్యాచ్ పూర్తయాక భావోద్వానికి లోనయ్యాడు. తన కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడినట్లు చెప్పాడు. చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
స్నేహితులతో కలిసి భారత్-పాక్ మ్యాచ్ చూస్తుండగా గుండెపోటు
చివరిబంతి వరకు ఉత్కంఠగా సాగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ 34 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. మరణించిన వ్యక్తిని బిటు గొగొయ్(34)గా గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం థియేటర్లో ప్రత్యక్షప్రసారం చేస్తున్న భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు బిటు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అయితే మ్యాచ్ చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఫ్రెండ్స్ వెంటనే అతడ్ని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ బిటు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. థియేటర్లో అరుపులు, ఈలల గోల కారణంగా శబ్ద కాలుష్యంతో అతనికి గుండెపోటు వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిటు తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. 34 ఏళ్లకే బిటుకు నూరేళ్లు నిండుతాయని ఊహించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
ఓటమితో మైండ్ బ్లాంక్.. టీవీ పగలగొట్టిన అభిమాని..అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు! ట్విస్ట్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అధ్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ యావత్ క్రికెట్ అభిమానులను అలరించింది. మ్యాచ్ విజయంతో భారత అభిమానులు ఒకరోజు ముందే దీపావళి చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ అభిమానులు మాత్రం భారత్ చేతిలో తమ జట్టు ఓటమికి జీర్ణుంచుకోలేక ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. మ్యాచ్ అయిపోగానే కొందరు టీవీలు పగలగొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియో ఇప్పటిది కాదు ఇందుకు సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అయిపోగానే ఓ పాక్ అభిమాని తన టీవీని పగలగొట్టినట్లుగా ఇందులో కనిపించిది. దానిపైకి వస్తువును విసరడమే గాక.. కాలుతో తన్ని దాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు ఆ దృశ్యాల్లో ఉంది. అతడి ఆగ్రహాన్ని చూసి సెహ్వాగ్ సైటెర్లు వేశాడు. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. రిలాక్స్ అవ్వండి. మేము ఇక్కడి దీపావళి టపాసులు పేల్చుతుంటే.. మీరేమో టీవీలు పగలగొడుతున్నారు. పాపం టీవీలు ఏం చేశాయి? అని రాసుకొచ్చాడు. నవ్వే ఓ ఎమోజీ కూడా పెట్టాడు. దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అయితే, నిజానికి ఇది టీ20 వరల్డ్‌కప్-2022లో భారత్- పాక్ నాటి మ్యాచ్‌కు సంబంధించింది కాదు. 2016లో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి ఈ చర్యకు పాల్పడగా.. దీనిని భారత్- పాక్ మ్యాచ్‌కు లింక్ చేసి వైరల్ చేయడం గమనార్హం. Relax Padosi , it’s only a game. Hamaare yahan Deepawali hai toh pataakhe phod rahe hain aur aap bevajah TV 📺 phod rahe hain 🤣. Nahin yaar, TV ka kya kasoor. pic.twitter.com/AvVL4fOmny — Virender Sehwag (@virendersehwag) October 23, 2022 చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
పద పద పరుగుల పండగ వైపు...
మెల్బోర్న్: టి20 ప్రపంచకప్–2021 ఫైనల్ నవంబర్ 14న జరిగింది. క్యాలెండర్లో సంవత్సరం కూడా పూర్తి కాకుండానే మరోసారి ధనాధన్ ఆటలో విశ్వ సమరానికి సమయం వచ్చేసింది. డిఫెండింగ్ చాంపియన్, మాజీ చాంపియన్లు, కొత్త చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉన్న జట్లన్నీ మరోసారి సత్తా చాటేందుకు బరిలోకి దిగబోతున్నాయి. వన్డే వరల్డ్ కప్‌లను రెండు సార్లు దిగ్విజయంగా నిర్వహించిన ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇస్తుండగా, కొత్తగా అమల్లోకి వచ్చిన ఐసీసీ నిబంధనలతో మెగా ఈవెంట్ మరింత ఆసక్తికరంగా మారనుంది. తొలి రౌండ్లో 8 జట్ల మధ్య జరిగే 12 మ్యాచ్‌ల పోరు తర్వాత 12 జట్ల రెండో దశ సమరంతో మొదలు పెట్టి మరో 33 మ్యాచ్‌లు ఆసాంతం వినోదాన్ని పంచడం ఖాయం. మొత్తంగా 29 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు పరుగుల పండగే. ఏడాది వ్యవధిలోనే... ఐసీసీ లెక్కల ప్రకారం 2010 నుంచి ప్రతీ రెండేళ్లకు ఒకసారి టి20 వరల్డ్ కప్ జరగాలి. అయితే 2016 తర్వాత ఏకంగా ఐదేళ్ల విరామం వచ్చింది. 2018లో పెద్ద సంఖ్యలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఖరారు కావడంతో టోర్నీ సాధ్యం కాలేదు. ఆ ఏడాది దక్షిణాఫ్రికాలో జరిపేందుకు ప్రయత్నించినా... ‘నల్లజాతీయుల రిజర్వేషన్’ సమస్యలతో అక్కడి ప్రభుత్వం అదే సమయంలో దక్షిణాఫ్రికా బోర్డుపై నిషేధం విధించింది. 2019లో వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి దానిని 2020కి మార్చారు. అయితే కరోనా కారణంగా వాయిదా తప్పలేదు. 2021లో భారత్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉండగా, దానిని రద్దు చేసి టి20 ప్రపంచకప్‌గా మార్చారు. అయితే తమ హక్కులను వదులుకునేందుకు భారత్ ఇష్టపడకపోవడంతో అదే ఏడాది భారత్ (యూఏఈలో) నిర్వహించింది. 2020లో నిర్వహించాల్సిన ఆస్ట్రేలియా దానిని 2022కు మార్చుకోవాల్సి వచ్చింది. గతంలోనూ చాంపియన్స్ ట్రోఫీ సమస్యలతోనే 2009, 2010లో వరుసగా రెండు ప్రపంచకప్‌లు జరిగాయి. గత రికార్డు ఇప్పటి వరకు 7 టి20 ప్రపంచకప్‌లు జరగ్గా... వెస్టిండీస్ రెండు సార్లు (2012, 2016), భారత్ (2007), పాక్ (2009), ఇంగ్లండ్ (2010), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి విజేతగా నిలిచాయి. ఫార్మాట్ గత వరల్డ్ కప్ తరహాలోనే ఎలాంటి మార్పూ లేదు. తొలి రౌండ్లో 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్ తన గ్రూప్‌లోని మిగిలిన 3 టీమ్‌లతో తలపడుతుంది. గ్రూప్‌లో టాప్–2 జట్లు తర్వాతి దశకు అర్హత సాధిస్తాయి. ► గ్రూప్ ‘ఎ’లో మాజీ చాంపియన్ శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈ ఉండగా... ► గ్రూప్ ‘బి’లో రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే ఉన్నాయి. ఇక్కడ ముందంజలో నిలిచిన నాలుగు టీమ్‌లతో పాటు ర్యాంకింగ్ ద్వారా నేరుగా అర్హత సాధించిన భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లు కలిసి ‘సూపర్ 12’ మ్యాచ్‌లు ఆడతాయి. ‘సూపర్ 12’ మ్యాచ్‌లు ఈనెల 22 నుంచి మొదలవుతాయి. ► ‘సూపర్ 12’ గ్రూప్–1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్... గ్రూప్–2లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ► ‘సూపర్ 12’లోని రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్ నవంబర్ 9న... రెండో సెమీఫైనల్ నవంబర్ 10న జరుగుతాయి. ఫైనల్ నవంబర్ 13న నిర్వహిస్తారు. నేటి మ్యాచ్‌లు శ్రీలంక vs నమీబియా (ఉదయం గం. 9:30 నుంచి) నెదర్లాండ్స్ vs యూఏఈ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–1,2లో ప్రత్యక్ష ప్రసారం -
ICC T20 World Cup: ‘ఆల్ ది బెస్ట్’
ముంబై: భారత క్రికెట్ అభిమానుల ఆశలు మోస్తూ టి20 ప్రపంచ కప్ వేటలో టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని బృందం గురువారం ముంబైనుంచి బయల్దేరి వెళ్లింది. 14 మంది జట్టు సభ్యులతో పాటు మరో 16 మంది సహాయక సిబ్బంది కూడా టీమ్‌తో ఉన్నారు. వరల్డ్‌కప్‌లోని ఇతర జట్లతో పోలిస్తే భారత్ చాలా ముందుగా ఆసీస్ గడ్డపై అడుగు పెడుతోంది. మెగా టోర్నీకి ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన దీపక్ హుడా పూర్తిగా కోలుకొని జట్టుతో చేరాడు. మరో వైపు బుమ్రా స్థానంలో ఇంకా ఎవరినీ సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో 14 మందే ఆసీస్‌కు వెళ్లారు. పెర్త్‌లో జట్టుకు వారం రోజుల పాటు కండిషనింగ్ క్యాంప్ జరుగుతుంది. -
టీ20 వరల్డ్‌కప్-2022కు సంబంధించి కీలక ప్రకటన
దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల(జనవరి) 21న వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను వెల్లడించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. టిక్కెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. 🗓 21.01.2022 The ICC Men's T20 World Cup Australia 2022 fixture is coming! #T20WorldCup pic.twitter.com/9Z2ASZgaty — T20 World Cup (@T20WorldCup) January 14, 2022 మొత్తం 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13-నవంబర్ 16 మధ్యలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్ దుబాయ్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఫించ్ నేతృత్వంలో ఆసీస్ జట్టు తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను గెలిచింది. \ఇదిలా ఉంటే, టీ20 ర్యాంకింగ్స్‌లో గతేడాది చివరి నాటికి టాప్-8లో ఉన్న జట్లు ప్రపంచకప్-2022కు నేరుగా అర్హత సాధించగా.. మిగతా నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయర్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు క్వాలిఫైయర్స్‌లో తలపడతాయి. చదవండి: ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ -
దాయాది దేశాల మ్యాచా? మజాకా? 10 సెకన్ల యాడ్‌కు రూ.30 లక్షలు!
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఇంకా ప్రారంభమే కాలేదు అప్పుడే రికార్డుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాది దేశాలు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ఉండే క్రేజే అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు కాసుల వర్షం కురిపించనుంది.(చదవండి: ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. యూట్యూబ్ మ్యూజిక్ సరికొత్త ఆఫర్!) ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే ఈ దాయాదీ దేశాల మ్యాచ్ సమయంలో యాడ్స్ కోసం 14 మంది స్పాన్సర్లతో ఒప్పంద సంతకాలు చేసింది. అందరూ ఊహించినట్టే భారత్-పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో 10 సెకన్ల యాడ్ కోసం మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు అయ్యాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న స్టార్‌స్పోర్ట్స్‌కు యాడ్స్ రూపంలో కనక వర్షం కురుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లైవ్ బ్రాడ్ కాస్ట్ భాగస్వామి అయిన స్టార్ స్పోర్ట్స్ 10 సెకన్ల యాడ్ కోసం 25-30 లక్షల రూపాయలు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఈ యాడ్స్ విషయంపై స్టార్ స్పోర్ట్స్ ప్రతినిధిని స్పష్టత ఇవ్వలేదు.(చదవండి: Windows 11: వచ్చిందోచ్.. మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తుందా?) ఇందులో డ్రీమ్ 11, బైజుస్, ఫోనెప్, థంప్స్, విమల్, హావెల్స్, జియోమార్ట్, netmeds.com సహ-ప్రజంటింగ్ స్పాన్సర్లు, ఆకాశ్, స్కోడా, వైట్ హాట్జ్ర్, గ్రేట్ లెర్నింగ్, కాయిన్ డిఎక్స్, మరియు ట్రెండ్స్ అసోసియేట్ స్పాన్సర్లు ఉన్నారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ యాడ్స్ రేట్లు 10 సెకండ్ల కోసం 25-30 లక్షల చెల్లించినట్లు తెలుస్తుంది. అలాగే, సహ-ప్రజంటింగ్ స్పాన్సర్ షిప్ 60-70 కోట్లకు విక్రయించబడింది. బ్రాడ్ కాస్టర్ అసోసియేట్ స్పాన్సర్ షిప్ 30-35 కోట్ల కొరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. 2016లో మన దేశంలో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ టీ20 సందర్భంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, దూరదర్శన్లలో 17.3 రేటింగ్ తో 83 మిలియన్ల మందికి చేరుకుంది. ఇప్పటికే వరకు ఇదే అత్యుత్తమ రేటింగ్ గల టీ-20 మ్యాచ్. -
T20 World Cup: భారత్xపాక్ మ్యాచ్‌పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దాయాదుల పోరుకు ముహుర్తం ఖారారైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచులోనే పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 24న జరగనుంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ,ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్ లో మాట్లడూతూ.. తొలి మ్యాచులోనే పాకిస్థాన్‌తో తలపడటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘2007 లో కూడా, మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు, మా మొదటి మ్యాచ్ స్కాట్లాండ్తో జరగాల్సింది. కానీ అది వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మా మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తో జరిగింది. నేను ఇప్పుడు చెబుతోందీ అదే. టోర్నమెంట్ ప్రారంభ దశలో పాక్‌తో తలపడితే టీమిండియాకు మేలు. అదే పనిగా పాక్ మ్యాచ్ గురించి ఆలోచించకుండా మిగతా టోర్నీపై దృష్టి పెట్టొచ్చు. దేశ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంటుందనుకోండి. ఫలితం ఎలా ఉన్నా, రెండు దేశాలు ఆరంభంలోనే ఆడబోతున్నందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను' అని గంభీర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2021 తొలి రౌండ్ అక్టోబరు 17న ఒమన్‌లో ఆరంభమవుతుంది. గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి. గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో సూపర్ 12 అక్టోబరు 23న మొదలవుతుంది. మెదటి రోజు గ్రూప్ 1 జట్లు.. ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్ తలపడతాయి. చదవండి: ICC Test Rankings: లార్డ్స్ టెస్ట్‌లో విఫలమైనా కోహ్లీ ర్యాంక్ పదిలం -
అధికారిక ప్రకటన: ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ ఎప్పుడంటే..
దుబాయ్: టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణ తేదీని ఐసీసీ మంగళవారం ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది.. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టోర్నీని నిర్వహించనున్నట్లు తెలిపింది. తాజాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో మ్యాచ్‌లను యూఏఈతో పాటు ఒమన్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ఈ టోర్నీ మొత్తం జరుగనుందని ఐసీసీ స్పష్టం చేసింది. టోర్నీలో భాగంగా మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఉంటాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం(అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. కాగా టోర్నమెంట్ తొలి రౌండ్లో అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒమన్, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్‌లు సూపర్12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్‌తో కలుస్తాయని ఐసీసీ తన ట్వీట్లో పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్ వేదికలను భారత్ నుంచి యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ఊహించని విధంగా బౌన్సర్ వేశాడు.. దాంతో 🚨 ANNOUNCEMENT 🚨 Details 👉 https://t.co/FzfXTKb94M pic.twitter.com/8xEzsmhWWN — ICC (@ICC) June 29, 2021 -
అప్పటి వరకు కోహ్లి రిటైర్ కాడు: భజ్జీ
న్యూఢిల్లీ: ఆటగాడిగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విరాట్ కోహ్లి త్వరలోనే ప్రపంచకప్‌ను సాధించి కెప్టెన్‌గానూ తనదైన చరిత్ర లిఖిస్తాడని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని, కాబట్టి ఐసీసీ ట్రోఫీ సాధించడం పెద్ద కష్టమేమీ కాబోదని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ సాధించేంత వరకు కోహ్లి రిటైర్మైంట్ ఆలోచన చేయడని భావిస్తున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడేతో మాట్లాడిన భజ్జీ.. టీమిండియా ఈసారి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.(చదవండి: అలాంటి మధుర క్షణాలు మళ్లీ మళ్లీ రావు.. అందుకే!) ఇక కోహ్లి ఆటతీరు, నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ.. ‘‘ ఏ కెప్టెన్ అయినా ఇలాంటి ఒక విజయం సాధించాలని భావిస్తాడు. విరాట్ కోహ్లి గొప్ప ఆటగాడు. ఇప్పటికే ఈ విషయాన్ని అతడు ఎన్నోసార్లు రుజువు చేశాడు. అయితే ఇంతవరకు తన ఖాతాలో వరల్డ్ కప్ ఘనత చేరలేదు. ప్రపంచకప్ సాధించిన కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావించడం సహజం. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఈ ఫీట్ సాధించవచ్చు. ప్రస్తుతం ఉన్న జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. కాబట్టి త్వరలోనే కోహ్లి ఐసీసీ ట్రోఫీని ముద్దాడగలడు. ఇప్పుడు కాకపోతే ఆ మరుసటి ఏడాది అయినా ఈ ఘనత సొంతం చేసుకుంటాడు. మొత్తానికి ఏదో ఒక టైటిల్ సాధించకుండా తను రిటైర్ కాబోడు’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా రన్‌మెషీన్‌గా నీరాజనాలు అందుకుంటున్న కోహ్లి, ఇప్పటివరకు 70 సెంచరీలు(వన్డే, టెస్టులు) నమోదు చేశాడు. అయితే ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన అనంతరం సారథిగా టెస్టుల్లో పలు చారిత్రక విజయాలు నమోదు చేసిన కోహ్లి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఇంతవరకు అలాంటి ఘనత సాధించలేకపోయాడు. ఇక 2019 వరల్డ్ కప్‌లో లీగ్ దశలో అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన కోహ్లి సేన ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. (చదవండి: కోహ్లి ఎప్పుడూ దూకుడుగానే ఉంటాడు..) -
టి20 ప్రపంచకప్ భవితవ్యం తేలేది నేడే
దుబాయ్: టి20 ప్రపంచకప్ వాయిదాపై అధికారిక ప్రకటన వస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై తమ కార్యాచరణ ఉంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెప్పకనే చెబుతోంది. మెగా ఈవెంట్ వాయిదాపై నేడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి స్పష్టమైన నిర్ణయం వస్తుందని బోర్డు ఆశిస్తోంది. రెండు నెలలుగా పలుమార్లు సమావేశమైన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏ నిర్ణయం తీసుకోకుండానే నాన్చుతూ వచ్చింది. కానీ ఇంతలోపే ఆతిథ్య ఆస్ట్రేలియా తమ దేశం లో మెగా ఈవెంట్ నిర్వహించే పరిస్థితి లేదని చెప్పేసింది. దీంతో ఐసీసీ వాయిదా ప్రకటన తప్ప చేయగలిందేమీ లేదు. సోమవారం జరిగే సమావేశంలో ఈ నిర్ణయం వెలువడితే ఆ మెగా ఈవెంట్ షెడ్యూల్ సమయాన్ని ఐపీఎల్–13కు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ ప్రణాళికతో ఉంది. కుదించైనా నిర్వహించాలనేదే లక్ష్యం... షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆసీస్‌లో ప్రపంచకప్ ఈవెంట్ జరగాలి. ఇప్పుడీ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బోర్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికను కూడా సిద్ధం చేసుకుంది. కుదించైనా సరే లీగ్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. ఈ విషయాన్ని బోర్డు అధ్యక్షుడు గంగూలీ స్పష్టంగా చెప్పాడు కూడా! ఈసారి ఐపీఎల్ విదేశాల్లోనే జరుగుతుందని ‘దాదా’ ఇదివరకే స్పష్టతనిచ్చాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆసియా కప్ రద్దు ప్రకటనను ఇప్పించాడు. ఇవన్నీ కూడా ఐపీఎల్ తంతు కోసమే! ఈసారి లీగ్ జరగకపోతే బోర్డుకు రూ. 4000 కోట్ల నష్టం వస్తుంది. వైరస్ ఉధృతి వల్లే బయట... దేశంలో రోజురోజుకీ వైరస్ విజృంభిస్తోంది. బీసీసీఐ సమావేశానికి ముందు రోజే 10 లక్షల మార్క్‌ను దాటింది. దీంతో భారత్‌లో లీగ్‌కు అవకాశమే లేదని గ్రహించిన బీసీసీఐ విదేశీ ఆతిథ్యంపై తెరవెనుక పనులు చకచకా చక్కబెట్టెస్తోంది. దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘తొలి అడుగు ఆసియా కప్ వాయిదాతో పడింది. ఇక టి20 మెగా ఈవెంట్‌పై అధికారిక ప్రకటన వస్తే మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. మా ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలంటే ఐసీసీ ప్రకటన రావాలి’ అని అన్నారు. నేడు జరిగే ఐసీసీ సమావేశంలో స్వతంత్ర చైర్మన్ ఎన్నికపై కూడా చర్చించే అవకాశముంది. -
ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ అభిమానులకు ఆనందాన్నిచ్చే వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే తనకు మొట్టమొదటి ప్రాధాన్యతాంశమని అన్నాడు. ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవడం ఏమాత్రం ఇష్టం లేదన్న ‘దాదా’... ఏమాత్రం అవకాశం దొరికినా సరైన భద్రతా చర్యలు తీసుకుంటూ లీగ్‌ను నిర్వహిస్తామని హామీ ఇచ్చాడు. ఐపీఎల్‌కు సంబంధించి తాము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు ఐసీసీ టి20 వరల్డ్‌కప్ భవితవ్యంపై ప్రకటన చేయాల్సి ఉంటుందని అన్నాడు. బుధవారం తన 48వ పుట్టినరోజు జరుపుకున్న ‘దాదా’ ఇంకా ఏమన్నాడంటే... ► మా తొలి ప్రాధాన్యత భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడమే. 35–40 రోజులు దొరికినా చాలు టోర్నీ జరుపుతాం. కానీ వేదిక గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. ► మొదట ఐపీఎల్ విండో దొరుకుతుందో లేదో చూడాలి. ఆ తర్వాత భారత్‌లో పరిస్థితులు అనకూలించకపోతే ఏ దేశానికి లీగ్‌ను తరలించాలో ఆలోచించాలి. విదేశాల్లో అయితే ఫ్రాంచైజీలకు, బోర్డులకు వ్యయభారం ఎక్కువవుతుంది. ► పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో తటస్థ వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్ రద్దయింది. ► టి20 ప్రపంచకప్‌పై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. కానీ ఐసీసీ అధికారికంగా చెప్పేవరకు అసలేం జరుగనుందనే దానిపై ఒక నిర్ణయానికి రాలేం. నా వ్యక్తిగత అంచనా ప్రకారమైతే ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరిగేది అనుమానమే. ► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో అక్కడ లీగ్ జరుగుతుందని చెప్పలేను. అహ్మదాబాద్‌పై ప్రస్తుతం మా దృష్టి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడే నిర్వహిస్తామని కచ్చితంగా అయితే చెప్పలేను. ► కరోనా విరామం తర్వాత భారత్ ఆడబోయే తొలి అంతర్జాతీయ సిరీస్ ఏదో చెప్పలేను. భారత క్రికెటర్ల ఆరోగ్యమే మా తొలి ప్రాధాన్యత. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది లేదు. -
బీసీసీఐ మాటే నెగ్గుతుంది: చాపెల్
మెల్బోర్న్: షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నారు. అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుందనే నమ్మకం తనకు లేదని చాపెల్ పేర్కొన్నారు. బీసీసీఐ తలచుకుంటే ఐసీసీ టోర్నీ స్థానంలో ఐపీఎల్ నిర్వహించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటే వారికి కచ్చితంగా మార్గం సుగమం అవుతుంది. ఈ విషయంలో బీసీసీఐ గెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో వరల్డ్ కప్ నిర్వహణకు చాలా తక్కువ అవకాశాలున్నాయి. అసలు లేవని కూడా చెప్పవచ్చు’ అని చాపెల్ పేర్కొన్నారు. -
సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే కావాలి!
సిడ్నీ: ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకుండా పోయింది. ఫలితంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన తొలి సెమీస్ రద్దు కాగా... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో సెమీస్‌లోనూ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా ఫలితం తేలింది. అయితే లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించడంతో ఇంగ్లండ్‌ను వెనక్కి తోసి భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కీలకమైన సెమీస్‌కు కనీసం రిజర్వ్ డే పెట్టకపోవడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ప్రతిష్టాత్మక పురుషుల టి20 ప్రపంచకప్‌లో అలాంటి పరిస్థితి రాకూడదని ఆతిథ్య బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కోరుకుంటోంది. ఇప్పటికే అంగీకరించిన నిబంధనల ప్రకారం ఒక్క ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. ఇప్పుడు సెమీఫైనల్స్‌కు కూడా రిజర్వ్ డే పెట్టమంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేయాలని సీఏ నిర్ణయించింది. త్వరలో జరగనున్న ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో సీఏ ఈ ప్రతిపాదన పెట్టనుంది. ఈ సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని, అనంతరం చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) ఆమోద ముద్ర వేస్తే తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తుందని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరి కొన్ని నెలల్లో టోర్నీ జరగనున్న నేపథ్యంలో నిబంధనలు మార్చడం అరుదుగా జరుగుతుందని, అయితే ఐసీసీ సభ్యదేశాల్లో ఎవరైనా వీటిని మార్చే విషయంపై చర్చ జరపవచ్చని ఆయన చెప్పారు. ‘ఒక టోర్నీ జరిగిన తర్వాత మంచి చెడుల గురించి విశ్లేషించడం, రాబోయే టోర్నీకి ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోవడం ఎప్పుడైనా జరుగుతుంది. వేర్వేరు సమయంలో నిర్వహించినా టి20 ప్రపంచకప్ 2020కి సంబంధించి రెండు టోర్నీలకూ ఒకే తరహా నిబంధనలు మహిళా వరల్డ్ కప్ జరగక ముందే విధించారనేది వాస్తవం. అయితే నిబంధనల మార్పు గురించి మన వాదనలో వాస్తవం ఉండాలి. ఇంగ్లండ్ మహిళల జట్టు పరిస్థితి ఏమిటో మాకు బాగా తెలుసు. ఇప్పుడు మాలో చాలా మంది సెమీస్‌కు కూడా రిజర్వ్ డే ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు’ అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ అభిప్రాయ పడ్డారు. ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబర్ 15 వరకు టి20 ప్రపంచ కప్ జరుగుతుంది. -
టి20 ప్రపంచ కప్ నిర్వహణపై ఆసీస్ దృష్టి
మెల్బోర్న్: కరోనా వైరస్ కారణంగా టోర్నీలన్నీ రద్దవుతున్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం అక్టోబర్‌లో ఆసీస్ వేదికగా జరిగే టి20 ప్రపంచ కప్ మెగా టోర్నీపై దృష్టి సారించింది. ఈ మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరగాల్సిన క్రీడా ఈవెంట్లన్నీ రద్దయ్యాయి. అయితే వరల్డ్ కప్ నిర్వహణ సజావుగా సాగేట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది. టోర్నీకి ఆతిథ్యమిచ్చే మైదానాలను సంరక్షించడంతో పాటు నిధులను పద్ధతి ప్రకారం కూడబెడుతున్నట్లు సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ తెలిపారు. ‘కరోనా కారణంగా రాబోయే నెలల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. నిపుణుల సలహా మేరకు మేం నడచుకుంటున్నాం. ప్రపంచ కప్ నిర్వహణకు మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. అక్టోబర్ 18–23 వరకు జరిగే ప్రి క్వాలిఫయర్స్‌తో ప్రపంచకప్‌కు తెరలేస్తుంది. 24న ప్రధాన టోర్నీ ప్రారంభమవుతుంది. నవంబర్ 15న ఎంసీజీలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్‌కూ ఆసీస్ ఆటగాళ్లు దూరం! ఒక వేళ ఐపీఎల్ జరిగితే అందులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనేది అనుమానంగా మారింది. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనేది ఆలోచించి... పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆటగాళ్లకు సీఏ చీఫ్ కెవిన్ సూచించారు. మొత్తం 17 మంది ఆసీస్ ప్లేయర్లు ఐపీఎల్లో భాగంగా ఉన్నారు. ఈ టోర్నీలో తమ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్షిస్తున్నట్లు అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి. ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను తమ కాంట్రాక్టులను వదులుకోమని సీఏ అడిగే అవకాశాలున్నట్లు కూడా అందులో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌ను రద్దు చేసి లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ‘న్యూ సౌత్ వేల్స్’ జట్టును సీఏ విజేతగా ప్రకటించింది. -
ఏ సీమల ఏమైతివో
గెలవలేక పోయినప్పుడు భూమి మీద మనమొక్కరిమే ఏకాకిలా మిగిలి పోయినట్లు అనిపిస్తుంది.. సృష్టి ప్రారంభపు ఏకకణ జీవిలా! చేజారిన గెలుపుతో పాటే అన్నీ మనల్ని వదిలేసి పోయినట్లూ ఉంటుంది. చూసుకోం గానీ, ఒకరు మాత్రం ఆ క్షణంలో మన చెయ్యి పట్టుకునే ఉంటారు. ఓటమి! మరి ఒంటరివాళ్లం ఎలా అవుతాం? ఎగరేస్తున్న గాలిపటం తెగిపోతే హటాత్తుగా ఏకాకులై పోతారు చిన్నపిల్లలు. ఇంట్లో వదిలేసి అమ్మ ఊరెళ్లిపోయినా కూడా.. ‘ఏ సీమల ఏమైతివో.. ఏకాకినీ నా ప్రియా..’ అని కృష్ణశాస్త్రిలా విలపిస్తారు. ఆయన్ది కవిత్వం. వీళ్లవి కన్నీళ్లు. అంతే తేడా. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాక చిన్నమ్మాయ్ షఫాలీ వర్మ దుఃఖానికి అంతేలేకుండా పోయింది. చిన్నమ్మాయే. ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఆడిన అతి చిన్నవయసు అమ్మాయి. పుట్టిన పదహారేళ్ల నలభై రోజులకే పోటీలోకి వచ్చేసింది. ‘షఫాలీని కన్నీళ్లతో చూడలేకపోతున్నా’ అన్నాడు బ్రెట్ లీ. తనకొస్తున్న కన్నీళ్లతో షఫాలీని చూడలేకపోయాడా, కన్నీళ్లతో ఉన్న షఫాలీని చూడలేకపోయాడా! షఫాలీ తనొక్కటే ఏడ్వడం కాదు. క్రీడాదిగ్గజాలకు, ఉద్ధండులకూ ఏడుపులాంటి ఫీలింగ్‌ని తెప్పించింది. ఒకప్పటి ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. క్యాచ్ మిస్ అయితే ఎలా ఉంటుందో అతడికి తెలియని బాధ కాదు. క్యాచ్ మిస్ అయిందన్నది టీమ్ పడే బాధ అయితే.. ‘క్యాచ్‌ని మిస్ చేశానే’ అన్నది ఆ క్యాచ్ పట్టలేకపోయిన వారి బాధ. ఫైనల్స్‌లో కీలకమైన అలీసా హీలీ క్యాచ్‌ని మిస్ చేసింది షఫాలీ. అప్పట్నుంచే ఏకాకి అయిపోయింది. తను జారవిడిచింది క్యాచ్‌ని కాదు, కప్పుని. ఆటకు కనికరం ఉండదు. బ్రెట్లీలా ‘ఓ మై షఫాలీ’ అని సానుభూతి పడదు. కన్నీళ్లు పెట్టుకుంటే వెంటనే పెద్ద వర్షాన్ని కురిపించి, ఆ వర్షం నీళ్లలో కన్నీళ్లను కనబడనీయకుండా చేయదు. తన పనిలో తను ఉంటుంది. వెంటనే గెలిచినవాళ్ల దగ్గరకు వెళ్లిపోయి మెరుస్తున్న కప్పులో తన ముఖం చూసుకుని జుట్టు సవరించుకుంటుంది.. తన జట్టేదో గెలిచినట్లు, తనే గెలిపించినట్లు! అలాంటిది.. ఓడిపోయిన జట్టులోని షఫాలీ కన్నీళ్లను ఎందుకు పట్టించుకుంటుంది? ‘చిన్న పిల్లవు కదా, నెక్స్ట్ టైమ్ బెటర్ లక్’ అంటూ ముంగురుల్ని వేళ్లతో అలా అలా అనేసి ఎందుకు వెళుతుంది? ఆశలు పెట్టుకుంది షఫాలీ.. అందుకొచ్చిన ఏడుపు అది. ‘ఆశలు రాలి ధూళిపడినప్పుడు.. గుండెలు చీల్చు వేదనావేశము బ్రేల్చినప్పుడు.. వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశపు రక్త బిందువులతో..’ మేఘసందేశాన్ని రచియించాడు కృష్ణశాస్త్రి. ఈ అమ్మాయి కళ్లు మేఘాలై, ఓటమి వేదనను వర్షించాయి. అనుకుంటాం.. మన ఒంట్లో ఊపిరనేది ఒకటి ఉంటుందని, అందుకని జీవించి ఉంటాం అని. ఊపిరి కాదు ఉండేది. ఆశ. ఆశే ఊపిరికైనా ఆయువు. ఫైనల్స్‌లో తొలి ఓవర్లోనే రెండు పరుగులకే షఫాలీ ఔట్ అయింది! ఆయువు అవిరై కళ్లల్లోకి ఉబికి వచ్చేసింది. పిచ్, టీమ్, మెల్బోర్న్ మైదానం.. ఏవీ కనిపించడం లేదు. అంతా అలికేసినట్లున్న ఒకటే బ్లర్ పిక్చర్. ఓటమి! షఫాలీ మీద హోప్స్ పెట్టుకుంది భారత జట్టు. షఫాలీ ఉందని హోప్స్ వదులుకుంది ఆస్ట్రేలియా జట్టు. కప్పు కోసం పోటీ పడుతున్న రెండు జట్లకూ షెఫాలీ ముఖ్యం. షఫాలీని నిలబెట్టుకోవడం కోసం టీమ్ ఇండియా, షఫాలీని పడగొట్టడం కోసం టీమ్ ఆస్ట్రేలియా. గెలిస్తే ప్రపంచ కప్పులో భారత మహిళల తొలి విజయం. భారత్‌ను ఓడిస్తే ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియాకు ఐదవ విజయం. అసలు ఫైనల్స్‌కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు టార్గెట్ అయింది షెఫాలీ. ‘ఐ జస్ట్ హేట్ ప్లేయింగ్ ఇండియా.. దే హ్యావ్ గాట్ ద ఉడ్ ఓవర్ మి’ అని అంది మెగాన్ షూట్. ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలర్ తను. ‘గాడ్ ద ఉడ్’ అనే మాట పూర్తిగా ఆస్ట్రేలియా వాళ్లది. ‘ఎక్కడం’ అని అర్థం. ట్రై సీరీస్‌లో షఫాలీ తన సిక్సర్‌తో ఆమెను ఎక్కేసిందట. అది గుర్తుంచుకుంది షూట్. బలమైనవాళ్లు కూడా గుర్తుపెట్టుకునేంత షాట్ కొట్టిందన్నమాట షఫాలీ! క్రీడాకారులలో, చిన్నపిల్లల్లో ప్రతీకారేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. పైగా షఫాలీ క్రీడాకారిణి అయిన చిన్నపిల్ల. ఫైనల్స్‌లో మళ్లీ సిక్సర్లు కొట్టి షూట్ నోటిని ‘ఆ..’ అని తెరిపించాలని కూడా ఆమె అనుకుని ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తన జట్టును గెలిపించాలని తపించి ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తొమ్మిదేళ్ల వయసులో.. అబ్బాయిలు మాత్రమే ఆడే అకాడమీలో తనను చేర్పించడానికి అబ్బాయిలా తనకు క్రాఫ్ చేయించి సీటు సంపాదించిన తండ్రికి.. హర్యానా నుంచి ఆస్ట్రేలియా వచ్చే ముందు.. ‘నాన్నా.. కప్పుతో కనిపిస్తాం, చూస్తుండు’ అని షఫాలీ చెప్పే ఉండొచ్చు. అదీ సాధ్యం కాలేదు. సాధ్యం కాలేదూ అంటే ప్రయత్నలోపం కాదని తెలుసుకోడానికి షెఫాలీ మరికొన్ని ఆటలు ఆడాలి. దక్కని గెలుపు మిగిల్చి వెళ్లిన ఒంటరితనాన్ని పోగొట్టి అక్కున చేర్చుకునే మైదానాలు, వాటిలో ఆడవలసిన ఆటలు ఇంకా ఎన్నిలేవు ఈ చిన్నమ్మాయ్కి. -
ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో పూనమ్
దుబాయ్: టి20 ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన జట్టులో భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు చోటు దక్కింది. టీమ్ ఫైనల్‌కు చేరినా... పూనమ్ మినహా మరెవరికీ ఈ టీమ్‌లో చోటు లేదు. టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ 12వ ప్లేయర్‌గా ఎంపికైంది. మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, లిసా స్తాలేకర్, అంజుమ్ చోప్రా తదితరులతో కూడిన ప్యానెల్ ఈ టీమ్‌ను ఎంపిక చేసింది. చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు, ఇంగ్లండ్ నుంచి నలుగురు ఐసీసీ జట్టులో ఉన్నారు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టి20 ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలీసా హీలీ, బెత్ మూనీ, జెస్ జొనాసెన్, మెగాన్ షూట్ (ఆస్ట్రేలియా), నాట్ సివెర్, హెథర్ నైట్, సోఫీ ఎకెల్‌స్టోన్, అన్య ష్రబ్సోల్ (ఇంగ్లండ్), లారా వోల్వార్ట్ (దక్షిణాఫ్రికా), పూనమ్ యాదవ్ (భారత్); 12వ ప్లేయర్ షఫాలీ వర్మ (భారత్). -
మరింత బలంగా... మరింత పైపైకి...
దాదాపు పదకొండేళ్ల క్రితం 2009లో ఆస్ట్రేలియా మహిళల వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. సిడ్నీలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య 12,717 మాత్రమే! ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచ కప్ జరిగింది. ఆదివారం జరిగిన ఫైనల్‌కు ఏకంగా 86,174 మంది హాజరయ్యారు. స్టేడియంలో కూర్చున్న వారి సంఖ్యనే ఇంత ఉంటే టీవీల్లో, ఇంటర్నెట్లో చూసిన వారి గణాంకాలు అయితే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాయి. ప్రపంచకప్‌కు వచ్చిన ఈ భారీ స్పందన చూసి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ విజయంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) నిర్వహణ కూడా కీలక పాత్ర పోషించగా... మహిళల క్రికెట్‌కు మరింత జోష్ తెచ్చేందుకు ఇదే సరైన సమయంగా ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్‌తో పాటు అన్ని దేశాల్లో మహిళా క్రికెట్ మరింతగా దూసుకుపోవడం ఖాయం. సాక్షి క్రీడా విభాగం: మహిళల క్రికెట్లో గతంలో ఎన్నడూ లేని కొత్త ఉత్సాహభరిత వాతావరణం ఇప్పుడు వచ్చేసిందంటే ఆశ్చర్యం కాదు. మెల్బోర్న్లో ఫైనల్ ముగిసిన తర్వాత తాము కూడా రాబోయే టోర్నీని ఇదే స్థాయిలో నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ నికెర్క్ ప్రకటించింది. టి20లే కాదు మహిళల వన్డేలకు కూడా ఆదరణ పెరుగుతోందని 2017 వరల్డ్ కప్ చూపించింది. ఈ టోర్నీ తర్వాత వాయు వేగంతో మహిళల క్రికెట్ అందరినీ ఆకర్షించింది. దానికి కొనసాగింపుగానే మెల్బోర్న్లో ఈ భారీ జనసందోహం! సరిగ్గా ఏడాది తర్వాత జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. అయితే వరల్డ్ కప్‌లకే కాకుండా రెండు మెగా టోర్నీల మధ్యలో కూడా అమ్మాయిల ఆటపై ఆసక్తి సన్నగిల ్లకుండా ఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తుండటం విశేషం. గతంలో ఎన్నడూ లేని కార్యక్రమాలతో మహిళల క్రికెట్‌కు ఊపు తెచ్చే మార్పులు ఇకపై కూడా కొనసాగడం ఖాయం. వచ్చే ఏడాదిలోగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 10 లక్షల మంది అమ్మాయిలు క్రికెట్లోకి వచ్చేలా చేయాలనేదే తమ లక్ష్యమని ఐసీసీ ప్రకటించింది. సుదీర్ఘ ప్రణాళికతో... ఏడేళ్ల క్రితం మెల్బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ‘మహిళల యాషెస్’ వన్డే సిరీస్ జరిగితే ఆటగాళ్లు, బంధుమిత్రులు తప్ప ఎవరూ లేరు. కానీ వరల్డ్ కప్ ఆతిథ్య జట్టుగా భారం భుజాన వేసుకున్న తర్వాత ఆసీస్ బోర్డు (సీఏ) చురుగ్గా పని చేసింది. ‘ఫిల్ ద ఎంసీజీ’ ట్యాగ్‌లైన్‌తో పప్రంచ వ్యాప్తంగా ప్రచారం మొదలు పెట్టి అందరి దృష్టి టోర్నీపై పడేలా చేసింది. ఆతిథ్య జట్టు ప్రదర్శనే ఎప్పుడైనా ఒక టోర్నీ సక్సెస్‌కు కొలబద్దలా పని చేస్తుందనేది వాస్తవం. అది 2011 (భారత్), 2015 (ఆస్ట్రేలియా), 2019 (ఇంగ్లండ్) పురుషుల వన్డే వరల్డ్ కప్‌లు దీనిని చూపించాయి. సొంత జట్టు సాధారణంగా ఉంటే అభిమానుల్లో ఆసక్తిని తీసుకురావడం కష్టం. అందుకే నిర్వాహక దేశంగానే కాకుండా సొంత మహిళల టీమ్‌పై కూడా సీఏ భారీగా ఖర్చు చేసింది. క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకునే మహిళలకు ధైర్యం ఇచ్చేందుకు 2016లో ప్రత్యేకంగా 42 లక్షల 30 వేల డాలర్లు (రూ. 31 కోట్ల 40 లక్షలు) కేటాయించిన క్రికెట్ ఆస్ట్రేలియా తర్వాతి నాలుగేళ్లు సమర్థంగా తమ ప్రణాళికను అమలు చేసింది. అన్ని రకాల ప్రోత్సాహం... మహిళా క్రికెటర్లు ఏ రకమైన అభద్రతాభావానికి గురి కాకూడదని, అప్పుడే కెరీర్‌ను ఎంచుకుంటారనేది అన్ని క్రికెట్ బోర్డులు, ఐసీసీ గుర్తించాయి. ఒక్కసారిగా అమ్మాయిల ఆటకు పెరిగిన క్రేజ్‌కు అది కూడా ఒక కారణం. ఈ వరల్డ్ కప్ టోర్నీ విజేతకు ఐసీసీ 10 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 41 లక్షలు) ప్రైజ్‌మనీ గా ప్రకటించింది. 2018 వన్డే వరల్డ్‌కప్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఆస్ట్రేలియా బోర్డు మరో అడుగు ముందుకేసి తమ జట్టు విజేతగా నిలిస్తే 8,85,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 4 కోట్ల 36 లక్షలు) బహుమతిగా ఇస్తామని చెప్పింది. ఇది దాదాపు పురుషుల జట్టుతో సమానం. న్యూజిలాండ్ అందరికంటే ముందుగా తమ ప్లేయర్లకు ‘ప్రసూతి సెలవులు’ మంజూరు చేయగా, ఆసీస్ కూడా దానిని అనుసరిస్తోంది. ఇప్పుడు ఇంగ్లండ్ బోర్డు కూడా 20 మిలియన్ పౌండ్లు (రూ. 194 కోట్లు) భవిష్యత్తు కోసం పెట్టేందుకు సిద్ధమైంది. అన్నింటికి మించి పురుషుల టోర్నీ జరిగే సమయంలో కాకుండా మహిళలకు విడిగా ప్రపంచకప్ జరగడం పెద్ద మేలు చేసింది. 2018లోనూ ఇలాగే జరిగినా... వెస్టిండీస్ బోర్డు గొప్పగా పని చేయలేదు. కానీ ఈ సారి భారీ చెల్లింపులు, భారీ కవరేజ్, మైదానంలో అత్యుత్తమ సౌకర్యాలు మాత్రమే కాదు... వసతి, ప్రయాణం, అలవెన్స్‌ల విషయంలో వివక్ష లేకుండా సమానత్వాన్ని పాటించింది. భారత్ కూడా... మన మహిళల క్రికెట్‌కు సంబంధించి 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరడం మేలిమలుపు. ఆ మెగా టోర్నీ తర్వాతే అందరిలోనూ ఆసక్తి పెరి గింది. జట్టులోని దాదాపు ప్రతీ అమ్మాయి పేరు మారుమోగిపోగా, సగటు అభిమానులు వాళ్లందరినీ గుర్తు పట్టేందుకు కారణమైంది. కాంట్రాక్ట్‌లతో ప్లేయర్లలో బోర్డు ధైర్యం నింపగా... అగ్రశ్రేణి క్రీడాకారిణులు మైదానం బయట కూడా బ్రాండింగ్‌లతో సొమ్ము చేసుకుంటున్నారు. బయట బిగ్‌బాష్ లీగ్, కియా సూపర్ లీగ్ అవకాశాలు కూడా వచ్చాయి. ఆ వెంటనే 2018లో రెండు జట్లతో ఐపీఎల్ సమయంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగ్గా, గత ఏడాది అది మూడు జట్లకు పెరిగింది. ఇప్పుడు మరో జట్టును అదనంగా చేర్చి నాలుగు టీమ్‌లతో ఐపీఎల్ తరహా టోర్నీ నిర్వహించబోతున్నారు. తాజా టోర్నీలోనూ ఫైనల్లోనే ఓడినా... మన మహిళలు తమ ప్రదర్శనతో ఇప్పటికే అందరి మనసులు చూరగొన్నారు. ఇకపై షఫాలీ కావచ్చు లేదా పూనమ్ కావచ్చు... వీరంతా ఎక్కడ ఆడినా ఆయా మ్యాచ్‌లపై ఆసక్తి కచ్చి తంగా పెరుగుతుంది. బీసీసీఐ కూడా దీనికి అనుగుణంగా దేశవాళీ టోర్నీ ల్లో ప్రణాళికలు రూపొందించవచ్చు. ఆస్ట్రేలియా అద్భుత నిర్వహణ తమ జట్టుతో టైటిల్ అందించడంతో పాటు ప్రపంచ మహిళా క్రికెట్‌కు కూడా ఎంతో మేలు చేసిందనేది వాస్తవం. ఇదే పునాదిపై రాబోయే రోజుల్లో మహిళా క్రికెట్ మరింతగా ఎదగడం ఖాయం. -
మన వనిత... పరాజిత
మరో ప్రపంచ కప్ ఫైనల్... మళ్లీ అదే ఓటమి వ్యథ... విశ్వ వేదికపై భారత మహిళల క్రికెట్ జట్టు వేదన పునరావృతమైంది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చివరి వరకు పోరాడి పరాజయం వైపు ఉండిపోయిన మన బృందం ఈసారి టి20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. రికార్డు సంఖ్యలో మైదానంలో 86,174 మంది ప్రేక్షకులు, అటు ప్రత్యర్థిగా ఆతిథ్య జట్టు, భారీ లక్ష్యం... అన్నీ కలగలిసి తీవ్ర ఒత్తిడిలో హర్మన్ బృందం కుప్పకూలింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లీగ్ దశలో భారత్ చేతిలో ఓడినా... అసలు పోరులో ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. లోపాలు సరిదిద్దుకొని సరైన వ్యూహంతో బరిలోకి దిగి భారత్‌ను దెబ్బ కొట్టింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో ఐదోసారి పొట్టి ప్రపంచ కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు హీలీ, మూనీ ఇచ్చిన ఆరంభం భారీ స్కోరుకు బాటలు వేయగా, బౌలింగ్‌లో మెగాన్ షూట్, జొనాసెన్ చెలరేగి ప్రత్యర్థి ఆటకట్టించారు. టోర్నీలో ప్రయాణం తడబడుతూనే సాగినా ... చివరకు తమ స్థాయిని ప్రదర్శించి ఆసీస్ ఐదోసారి జగజ్జేతగా నిలిచింది. మెల్బోర్న్: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! టి20 వరల్డ్ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరి అరుదుగా లభించిన అవకాశాన్ని అందుకోవడంలో విఫలమైన మన జట్టు మళ్లీ రన్నరప్‌గానే ముగించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల భారీ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ బెత్ మూనీ (54 బంతుల్లో 78 నా టౌట్; 10 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 బంతుల్లోనే 115 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (35 బంతుల్లో 33; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. షూట్ (4/18), జొనాసెన్ (3/20) భారత ఇన్నింగ్స్ పతనాన్ని శాసించారు. హీలీ విధ్వంసం... స్పిన్ బలాన్ని నమ్ముకున్న భారత్... దీప్తి శర్మతో తొలి ఓవర్ వేయించింది. అయితే మొదటి బంతిని ముందుకు దూసుకొచ్చి ఆడి బౌండరీగా మలచిన హీలీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. అదే ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ... శిఖా వేసిన తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. పవర్‌ప్లే తర్వాత కూడా హీలీ దూకుడు తగ్గలేదు. రాజేశ్వరి వేసిన ఓవర్లో ఆమె వరుసగా రెండు సిక్సర్లు కొట్టింది. ఇందులో మొదటిది ఏకంగా 83 మీటర్ల దూరంలో పడింది! అనంతరం 30 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత శిఖా వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హీలీ పండగ చేసుకుంది. వరుసగా మూడు బంతుల్లో ఆమె 6, 6, 6 బాదింది. ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి వికెట్ భాగస్వామ్యం సెంచరీ దాటిన తర్వాత ఎట్టకేలకు రాధ యాదవ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హీలీ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. హీలీకి జతగా మరోవైపు మూనీ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఆమె 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరి తర్వాత వచ్చిన ఇతర బ్యాటర్లను నిలువరించడంలో భారత్ సఫలమైంది. ఫలితంగా చేతిలో 9 వికెట్లు ఉన్నా... చివరి 5 ఓవర్లలో ఆసీస్ 42 పరుగులే చేయగలిగింది. దీప్తి మినహా... ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో షూట్ వేసిన మొదటి ఓవర్లో షఫాలీ 4 ఫోర్లతో 16 పరుగులు రాబట్టింది. కానీ ఈసారి షూట్ వంతు! తొలి ఓవర్ మూడో బంతికే హీలీ అద్భుత క్యాచ్‌కు షఫాలీ (2) వెనుదిరిగింది. జొనాసెన్ వేసిన రెండో ఓవర్లో మెడకు బంతి తగలడంతో తానియా (2) రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించగా, జెమీమా (0) పేలవ షాట్‌తో వెనుదిరిగింది. ఆ తర్వాత మాలినెక్స్ కూడా తన మొదటి ఓవర్లోనే స్మృతి (11) పని పట్టింది. జొనాసెన్ తర్వాతి ఓవర్లో డీప్‌లో క్యాచ్ ఇచ్చి కెప్టెన్ హర్మన్ కౌర్ (4) అవుట్ కావడంతో భారత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. వేద (24 బంతుల్లో 19; 1 ఫోర్), తానియా స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రిచా ఘోష్ (18; 2 ఫోర్లు)తో కలిసి దీప్తి కొద్దిసేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆ రెండు క్యాచ్‌లు... ఆసీస్‌లాంటి జట్టుకు ‘లైఫ్’ ఇస్తే ఎలా ఉంటుందో ఫైనల్ మ్యాచ్ మళ్లీ చూపించింది. రెండుసార్లు తమకు వచ్చిన అవకాశాలను భారత్ జారవిడుచుకొని మూల్యం చెల్లించింది. తొలి ఓవర్ ఐదో బంతికి హీలీ వ్యక్తిగత స్కోరు 9 వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కవర్స్‌లో షఫాలీ వర్మ వదిలేయగా... రాజేశ్వరి తన మొదటి ఓవర్లోనే మూనీ తన వ్యక్తిగత స్కోరు 8 వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను నేలపాలు చేసింది. వీరిద్దరే ఆ తర్వాత చెలరేగి భారత్ కథ ముగించారు. ►5 ఆస్ట్రేలియాకు ఇది 5వ ప్రపంచకప్ టైటిల్. 7 సార్లు టోర్నీ జరిగితే ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి నెగ్గాయి. ►30 అలీసా హీలీ అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. ఏ ఐసీసీ టోర్నీ ఫైనల్లోనైనా (పురుషులతో సహా) ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ►184 ఫైనల్లో ఆసీస్ స్కోరు. ఏ టి20 ప్రపంచకప్‌లోనైనా (పురుషులతో సహా) ఇదే అత్యధిక స్కోరు. ►85 భారత్‌కు ఇది రెండో (85 పరుగులు) అతి పెద్ద పరాజయం. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 105 పరుగులతో ఓడింది. ►52 శిఖా పాండే ఇచ్చిన పరుగులు. ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. 86, 174 ఎంసీజీలో ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య. ఒక మహిళల క్రికెట్ మ్యాచ్‌కు ఎక్కడైనా హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇది కాగా... ఆస్ట్రేలియా గడ్డపై ఏ క్రీడాంశంలోనైనా మహిళల మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య కూడా ఇదే. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (సి) వేద (బి) రాధ 75; బెత్ మూనీ (నాటౌట్) 78; మెగ్ లానింగ్ (సి) శిఖా పాండే (బి) దీప్తి శర్మ 16; గార్డ్నర్ (స్టంప్డ్) తానియా (బి) దీప్తి శర్మ 2; హేన్స్ (బి) పూనమ్ 4; క్యారీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–115; 2–154; 3–156; 4–176. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–38–2; శిఖా పాండే 4–0–52–0; రాజేశ్వరి 4–0–29–0; పూనమ్ యాదవ్ 4–0–30–1; రాధ యాదవ్ 4–0–34–1. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా హీలీ (బి) షూట్ 2; స్మృతి మంధాన (సి) క్యారీ (బి) మాలినెక్స్ 11; తానియా (రిటైర్డ్‌హర్ట్) 2; జెమీమా రోడ్రిగ్స్ (సి) క్యారీ (బి) జొనాసెన్ 0; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) గార్డ్నర్ (బి) జొనాసెన్ 4; దీప్తి శర్మ (సి) మూనీ (బి) క్యారీ 33; వేద కృష్ణమూర్తి (సి) జొనాసెన్ (బి) కిమిన్స్ 19; రిచా ఘోష్ (సి) క్యారీ (బి) షూట్ 18; శిఖా పాండే (సి) మూనీ (బి) షూట్ 2; రాధ (సి) మూనీ (బి) జొనాసెన్ 1; పూనమ్ (సి) గార్డ్నర్ (బి) షూట్ 1; రాజేశ్వరి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 99. వికెట్ల పతనం: 1–2; 1–5 (రిటైర్డ్‌హర్ట్), 2–8; 3–18; 4–30; 5–58; 6–88; 7–92; 8–96; 9–97; 10–99. బౌలింగ్: మెగాన్ షూట్ 3.1–0–18–4; జొనాసెన్ 4–0–20–3; మాలినెక్స్ 4–0–21–1; కిమిన్స్ 4–0–17–1; క్యారీ 4–0–23–1. -
మెల్బోర్న్లో.... మహరాణులు ఎవరో?
లక్ష మంది ప్రేక్షకులు... దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచ కప్–2020 ఫైనల్ వేదికను మెల్బోర్న్గా ప్రకటించినప్పుడు ఆశించిన సంఖ్య! మహిళా దినోత్సవం రోజున ఈ పోరును నిర్వహిస్తే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచవచ్చని భావించిన నిర్వాహకుల ఆలోచన ఇప్పుడు సరిగ్గా కార్యరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో అభిమానుల హాజరయ్యే అవకాశం ఉన్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో (ఎంసీజీ) రెండు అత్యుత్తమ జట్లు తుది పోరులో తలపడుతుండటంతో మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని క్రేజ్ ఈ ఫైనల్‌కు వచ్చేసింది. ఇక సమరం హోరాహోరీగా సాగడమే తరువాయి. మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన జట్టు ఒకవైపు... నాలుగు సార్లు ఇప్పటికే చాంపియన్‌గా నిలిచిన టీమ్ మరోవైపు. సమష్టితత్వంతో వరుస విజయాలు సాధించి భారత్ తుది పోరుకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్ ఓటమిని దాటి తమదైన ప్రొఫెషనలిజంతో ఆస్ట్రేలియా ముందంజ వేసింది. తొలి టైటిల్ సాధించే లక్ష్యంతో హర్మన్ సేనపై కాస్త ఒత్తిడి ఉండగా, ఇప్పటికే ఇలాంటి ఫైనల్స్ ఆడిన అనుభవంతో రాటుదేలిన ఆడ కంగారూలు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీల ముందే కాదు... ఎంసీజీలో కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యే భారత అభిమానుల ప్రపంచకప్ కల నెరవేరుతుందా! మెల్బోర్న్: క్రికెట్ ప్రపంచంలో అత్యధిక ఆదరణ ఉన్న జట్టుకు, ప్రపంచ నంబర్‌వన్ జట్టుకు మధ్య విశ్వ వేదికపై తుది సమరానికి సమయం వచ్చేసింది. నేడు ఇక్కడి ఎంసీజీలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. వరుసగా ఆరోసారి ఫైనల్ చేరిన ఆసీస్ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలవగా, భారత్ మొదటిసారి ఫైనల్ బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ గెలిచింది. గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇదే గ్రూప్‌లో భారత్ చేతిలో ఓడిన అనంతరం ఆస్ట్రేలియా మిగిలిన మూడు మ్యాచ్‌లలో నెగ్గింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ ముందంజ వేయగా...సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గత కొన్నేళ్లుగా టి20ల్లో ఆసీస్ ఆధిపత్యం బాగా సాగింది. అయితే వారిని నిలవరించగలిగిన ఏకైక జట్టు భారత్ మాత్రమే. గత ఐదేళ్లలో ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగితే భారత్ 5 గెలిచి, 5 ఓడింది. ఓడిన మ్యాచ్‌లతో సమాన సంఖ్యలో మరే జట్టు ఆసీస్‌పై గెలవలేకపోయింది. ఇటీవలి ముక్కోణపు టోర్నీతో కలిపి చూస్తే ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లో భారత్ 3 గెలిచి ఆధిక్యంలో ఉంది. అందుకే సొంత మైదానంలో ఆడుతున్నా సరే... తమకు విజయం అంత సులువు కాదని ఆసీస్‌కూ బాగా తెలుసు. కీలకమైన మ్యాచ్‌కు ముందు తమ స్టార్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ గాయంతో దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బ. అయితే కెప్టెన్ లానింగ్, బెత్ మూనీ, అలీసా హీలీలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఆ జట్టు ప్రధానంగా జెస్ జొనాసన్, మెగాన్ షూట్లపై ఆధారపడుతోంది. భారత జట్టుకు మరోసారి సంచలన ఓపెనర్ షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభం కీలకం కానుంది. ఆమె తనదైన శైలిలో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. షఫాలీని నిలువరించేందుకు ఆసీస్ అన్ని ప్రయత్నాలు చేయడం ఖాయం. అయితే మిగతా బ్యాటర్ల ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. తుది పోరులోనైనా తమ స్థాయికి తగినట్లు కెప్టెన్ హర్మన్, స్మృతి, జెమీమా చెలరేగాల్సి ఉంది. లేదంటే గెలుపు ఆశలు నెరవేరడం కష్టం. బౌలింగ్‌లో మరోసారి భారత్ స్పిన్నే నమ్ముకుంది. తమ స్పిన్నర్లు ఈ టోర్నీలో కెప్టెన్ హర్మన్ ఉపయోగించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా పూనమ్ యాదవ్ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌కు భారీ షాక్ ఇచ్చింది. కాబట్టి ఈసారి ఆమె కోసం వారు మరింత మెరుగ్గా సిద్ధమై రావడం ఖాయం. ఇతర స్పిన్నర్లు కూడా ఒత్తిడి పెంచగలిగితే ప్రత్యర్థిని నిలువరించవచ్చు. వర్షం లేదు! సెమీస్‌లో పోలిస్తే సంతోషకర విషయం ఆదివారం మెల్బోర్న్లో ఎలాంటి వర్ష సూచన లేదు. మ్యాచ్‌కు ఏ సమయంలోనా ఇబ్బంది ఉండకపోవచ్చు. అనూహ్యంగా వర్షం పడినా ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. పిచ్ కూడా సాధారణ బ్యాటింగ్ వికెట్. మంచి స్కోరింగ్‌కు అవకాశం ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ ఒత్తిడి ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. ఫైనల్ చేరారిలా (భారత్) లీగ్ దశలో... ►ఆస్ట్రేలియాపై 17 పరుగులతో విజయం ►బంగ్లాదేశ్‌పై 18 పరుగులతో గెలుపు ►న్యూజిలాండ్‌పై 3 పరుగులతో విజయం ►శ్రీలంకపై ఏడు వికెట్లతో గెలుపు సెమీఫైనల్... ►ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు భారత్ ఫైనల్ చేరింది. (ఆస్ట్రేలియా) లీగ్ దశలో... ►భారత్ చేతిలో 17 పరుగులతో ఓటమి ►శ్రీలంకపై 5 వికెట్లతో గెలుపు ►బంగ్లాదేశ్‌పై 86 పరుగులతో విజయం ►న్యూజిలాండ్‌పై 4 పరుగులతో గెలుపు సెమీఫైనల్... దక్షిణాఫ్రికాపై 5 పరుగులతో విజయం టోర్నీలో భారత్ టాప్–3 బ్యాటర్లు 1. షఫాలీ వర్మ (161 పరుగులు) 2. జెమీమా (85) 3. దీప్తి శర్మ (84) టాప్–3 బౌలర్లు 1. పూనమ్ యాదవ్ (9 వికెట్లు) 2. శిఖా పాండే (7) 3. రాధా యాదవ్, రాజేశ్వరి (5) టోర్నీలో ఆస్ట్రేలియా టాప్–3 బ్యాటర్లు 1. మూనీ (181 పరుగులు) 2. హీలీ (161) 3. లానింగ్ (116) టాప్–3 బౌలర్లు 1. షూట్ (9 వికెట్లు) 2. జొనాసన్ (7) 3. వేర్హామ్, క్యారీ (3) -
ఆమె కోసం అతడు తిరుగుముఖం
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసీస్ జట్టులో స్టార్క్ సతీమణి అలీసా హీలీ వికెట్ కీపర్, బ్యాటర్. మిచెల్ స్టార్క్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా వన్డే జట్టు తరఫున సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. అయినా సరే... తన భార్య ఆడే ఫైనల్ పోరును ప్రత్యక్షంగా తిలకించాలనుకున్న స్టార్క్ అంతే ఠంచనుగా తిరుగుముఖం పట్టేశాడు. దీంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పురుషుల జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి వన్డేకు స్టార్క్ దూరమయ్యాడు. ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్ సంతోషంగానే అతనికి అనుమతిచ్చింది. ‘ఇలాంటి అవకాశం జీవితంలో ఎవరికో ఒకరికి చాలా అరుదుగా వస్తుంది. స్టార్క్‌కు ఇప్పుడా చాన్స్ వచ్చింది. కాబట్టి తన శ్రీమతి ఆడే మ్యాచ్‌కు ప్రత్యక్షంగా మద్దతుగా నిలిచేందుకు సమ్మతించాం’ అని ఆస్ట్రేలియా పురుషుల జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 0–2తో కోల్పోయింది. ఇక అమ్మాయిల మెగా ఫైనల్ విషయానికొస్తే... భారత్ ఈ పొట్టి ఫార్మాట్లో తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సంపాదించగా... ఆసీస్ ఈ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచింది. అన్నట్లు ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్ కూడా! కానీ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడింది. -
మేమే ఫేవరెట్...
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా నాలుగుసార్లు విశ్వ విజేత అయినప్పటికీ ఈసారి ఫైనల్లో తమ జట్టే ఫేవరెట్‌గా అనిపిస్తోందని భారత సీనియర్ బ్యాటర్ వేద కృష్ణమూర్తి తెలిపింది. ఫైనల్లో టీమిండియానే గెలుస్తుందని తనకు గట్టి నమ్మకముందని ఆమె చెప్పింది. ‘ఇదంతా విధి రాత. నేను దీన్ని బాగా నమ్ముతాను. ట్రోఫీ గెలుస్తామనే విశ్వాసం ఉంది. అయితే ఈ ప్రపంచకప్ భారత్‌కు అనుకూలంగానే రూపొందించారనడం హాస్యాస్పదం. వికెట్లు, వాతావరణం సంగతెలా ఉన్నా మేం బాగా ఆడామన్నది నిర్వివాదాంశం. నిజానికి మేం ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. అలా మొదటి దశను పూర్తి చేశాం. ఇప్పుడు అంతిమ దశ మిగిలుంది. ఆఖరి పోరులో ఏం చేయాలో కచ్చితంగా అదే చేస్తాం’ అని వేద పేర్కొంది. భారత్ 2017లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడి చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ జట్టులో వేద కూడా ఉంది. అయితే ఫైనల్ దాకా వచ్చి ట్రోఫీని చేజార్చుకోవడం జీర్ణించుకోలేని బాధను మిగులుస్తుందని ఆమె గత పరాజయం తాలుకు జ్ఞాపకాలను వెల్లడించింది. ‘వ్యక్తిగతంగా నా పాత్రను నేను చక్కగా పోషించాను. జట్టు లో అందరిని కలుపుకొని వెళ్లాను. ఏదో ఒకరిద్దరని కాకుండా... ప్రతీ ఒక్కరిని ఉత్సాహపరుస్తూనే ఉన్నాను’ అని 27 ఏళ్ల వేద తెలిపింది. ఈ టోర్నీలో భారత అమ్మాయిల జట్టు అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించే... ఈ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టడం విశేషం. అమ్మో... పవర్‌ప్లేలో వాళ్లిద్దరికి బౌలింగా? భారత్‌తో తలపడటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్న ఆసీస్ బౌలర్ మేగన్ షూట్ పవర్ ప్లేలో భారత స్టార్ బ్యాటర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలకు బౌలింగ్ చేయలేనని చెప్పింది. షూట్ వేసిన టోర్నీ ఓపెనింగ్ ఓవర్లో నాలుగు బౌండరీలు బాదిన షఫాలీ ఈ మెగా ఈవెంట్‌కే మెరుపు ఆరంభాన్నిచ్చింది. ‘స్మృతి, షఫాలీ నన్ను అలవోకగా ఎదుర్కొంటారు. ముక్కోణపు సిరీస్‌లో షఫాలీ కొట్టిన సిక్సర్ ఇప్పటికీ మర్చిపోలేదు. నేను చూసిన భారీ సిక్సర్లలో అది ఒకటి. అందుకే పవర్‌ప్లేలో వారికి ఎదురుపడటం నాకిష్టం లేదు’ అని షూట్ చెప్పింది. ఏదేమైనా మా వ్యూహాలు మాకుంటాయని తప్పకుండా వాటిని ఆచరణలో పెడతామని చెప్పింది. ‘ఫైనల్’ ఫీల్డ్ అంపైర్లు వీరే... ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే అంతిమ పోరాటంలో న్యూజిలాండ్‌కు చెందిన కిమ్ కాటన్, పాకిస్తానీ అహ్సాన్ రజా ఫీల్డు అంపైర్లు గా వ్యవహరిస్తారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. గ్రెగరీ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) మూడో అంపైర్‌గా ఉంటారు. అహ్సాన్ రజా 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించింది. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లండ్
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో తలపడే జట్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్... రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ స్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ‘ఢీ’కొంటాయి. ఈ రెండు మ్యాచ్‌లు కూడా ఒకే రోజు (గురువారం) జరుగుతాయి. వర్షం కారణంగా గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కూడా ఫలితం రాలేదు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దాంతో మొత్తం 7 పాయింట్లతో దక్షిణాఫ్రికా గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. రెండో స్థానం సాధించిన ఇంగ్లండ్ జట్టు హర్మన్‌ప్రీత్ సేనతో సవాల్‌కు సన్నద్ధమైంది. మరోవైపు ఇదే గ్రూప్‌లో పాకిస్తాన్, థాయ్‌లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా రద్దయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షంతో పాకిస్తాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఎలీస్ పెర్రీ అవుట్...: కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ క్రీడాకారిణి ఎలీస్ పెర్రీ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అయిన ఎలీస్ లేకపోవడం ఆ జట్టు అవకాశాలను ప్రభావితం చేయవచ్చు. 2009లో మహిళల టి20 ప్రపంచ కప్ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 36 మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలోనూ పెర్రీ భాగం కావడం విశేషం. -
చివరి బెర్త్ ఆసీస్‌దే
మెల్బోర్న్: సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చోట ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో వరుసగా ఏడోసారి టి20 ప్రపంచ కప్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (50 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. ఆమెకు మెగ్ ల్యానింగ్ (21; 4 ఫోర్లు), గార్డ్నెర్ (20; 2 ఫోర్లు), ఎలీస్ పెర్రీ (21; 2 ఫోర్లు) సహాయపడగా... చివర్లో రాచెల్ హైనస్ (8 బంతుల్లో 19; 2 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. అనంతరం ఛేదనలో కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియా వారెమ్ (3/17), మేఘాన్ షూట్ (3/28) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన సోఫీ డివైన్ (31; 2 ఫోర్లు, సిక్స్), సుజీ బేట్స్ (14; 2 ఫోర్లు), మ్యాడీ గ్రీన్ (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లను వారెమ్ పెవిలియన్‌కు చేర్చి మ్యాచ్‌ను ఆసీస్ వైపుకు తిప్పింది. మార్టిన్ (18 బంతుల్లో 37; 4 ఫోర్లు, సిక్స్) కివీస్ విజయం కోసం తుది వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో గెలుపు కోసం 20 పరుగులు చేయాల్సి ఉండగా... కివీస్ 15 పరుగులను మాత్రమే రాబట్టగలిగింది. ఇదే గ్రూప్‌లో నామమాత్రంగా జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 91 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా (39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. శశికళ సిరివర్దనే 4 వికెట్లతో రాణించింది. శ్రీలంక 15.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి 92 పరుగులు చేసి విజయంతో టోర్నీని ముగించింది. -
సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్
సిడ్నీ: ‘హ్యాట్రిక్’ విజయంతో దక్షిణాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్ జట్లు మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 17 పరుగుల ఆధిక్యంతో పాకిస్తాన్‌పై... ఇంగ్లండ్ 46 పరుగుల ఆధిక్యంతో వెస్టిండీస్‌పై గెలుపొందాయి. గ్రూప్ ‘బి’లో తమ నాలుగు లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సంపాదించింది. దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో ఇంగ్లండ్‌తో సమఉజ్జీగా ఉంది. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఇంగ్లండ్ ఈ గ్రూప్‌లో టాప్ ర్యాంక్‌లో ఉంది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడిస్తే దక్షిణాఫ్రికా గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్ (36 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మారిజన్ కాప్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) కూడా రాణించింది. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు చేసి ఓడిపోయింది. జవేరియా ఖాన్ (31; 4 ఫోర్లు), అలియా రియాజ్ (39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించినా ఫలితం లేకపోయింది. మాజీ చాంపియన్ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. నటాలీ షివెర్ (56 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. అనంతరం వెస్టిండీస్ 17.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. సోఫీ ఎకిల్‌స్టోన్ 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీసింది. నేటి గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక; ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత ఈ గ్రూప్ నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్ చేరుకుంటుంది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచి భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. -
సెమీస్ రేసులో కివీస్...
గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచింది. తొలుత న్యూజిలాండ్ 18.2 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కివీస్ బౌలర్లలో లే కాస్పెరెక్, హేలీ జేన్సన్ మూడేసి వికెట్లు తీశారు. ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్ సెమీస్ వెళ్లగా... రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రేసులో ఉన్నాయి. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌తో దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌తో వెస్టిండీస్ తలపడతాయి. -
అమ్మాయిలు అజేయంగా...
మెల్బోర్న్: టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో తమ విజయయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో విజయం సాధించిన భారత్ గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా తమ లీగ్ మ్యాచ్‌లను ముగించింది. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండిమా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 113 పరుగులు చేసింది. భారత్ 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (34 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ (4/23)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో భారత్ 8 పాయిం ట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానం సంపాదించింది. స్పిన్ మ్యాజిక్... టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు ఉపక్రమించింది. మూడో ఓవర్ తొలి బంతికే స్పిన్నర్ దీప్తి శర్మ లంక ఓపెనర్ థిమాషినిని అవుట్ చేసింది. ఆ తర్వాత జయాంగని, హర్షిత కొంచెంసేపు వికెట్లను కాపాడుకున్నారు. అయితే హర్షితను బౌల్డ్ చేసి స్పిన్నర్ రాజేశ్వరి ఈ జోడిని విడగొట్టింది. అనంతరం మరో స్పిన్నర్ రాధా యాదవ్ తన మాయాజాలాన్ని ప్రదర్శించింది. శ్రీలంక పతనాన్ని శాసించింది. మరో స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఒక వికెట్ తీసింది. మొత్తం శ్రీలంక కోల్పోయిన తొమ్మిది వికెట్లలో ఎనిమిది వికెట్లు స్పిన్నర్లకే రావడం విశేషం. ఆడుతూ... పాడుతూ... 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ షఫాలీ వర్మ మరోసారి మెరిసింది. లంక బౌలర్ల భరతం పట్టింది. ఏడు బౌండరీలు కొట్టింది. మరోవైపు స్మృతి (12 బంతుల్లో 17; 3 ఫోర్లు) కూడా తన జోరు కొనసాగించింది. తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించాక స్మృతి పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (14 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్)తో షఫాలీ రెండో వికెట్‌కు 47 పరుగులు జత చేసింది. హర్మన్‌ప్రీత్, షఫాలీ అవుటయ్యాక... జెమీమా (15 నాటౌట్; ఫోర్), దీప్తి శర్మ (15 నాటౌట్; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 28 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇనింగ్స్: థిమాషిని (సి) రాజేశ్వరి (బి) దీప్తి శర్మ 2; జయాంగని (సి) శిఖా పాండే (బి) రాధా యాదవ్ 33; హర్షిత (బి) రాజేశ్వరి 12; హన్సిమ (సి) వేద (బి) రాధా యాదవ్ 7; హాసిని (సి) తానియా (బి) రాధా యాదవ్ 7; శశికళ సిరివర్దనె (సి) వేద (బి) రాజేశ్వరి 13; నీలాక్షి డిసిల్వా (సి) హర్మన్ (బి) పూనమ్ 8; అనుష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) రాధా యాదవ్ 1; దిల్హారీ (నాటౌట్) 25; సత్య (బి) శిఖా పాండే 0; ప్రబోధని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–48, 4–58, 5–75, 6–78, 7–80, 8–104, 9–104. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–16–1; శిఖా పాండే 4–0–35–1; రాజేశ్వరి 4–1–18–2; పూనమ్ యాదవ్ 4–0–20–1; రాధా యాదవ్ 4–0–23–4. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 47; స్మృతి (సి) దిల్హారీ (బి) ప్రబోధని 17; హర్మన్‌ప్రీత్ (సి) హన్సిమ (బి) శశికళ 15; జెమీమా (నాటౌట్) 15; దీప్తి శర్మ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.4 ఓవర్లలో మూడు వికెట్లకు) 116 వికెట్ల పతనం: 1–34, 2–81, 3–88. బౌలింగ్: ప్రబోధని 4–0–13–1; శశికళ 4–0–42–1; సత్య సాందీపని 1–0–11–0; జయాంగని 2–0–21–0; దిల్హారీ 3–0–18–0; థిమాషిని 0.4–0–7–0. -
సఫారీ భారీ విజయం
కాన్బెర్రా: మహిళల టి20 ప్రపంచకప్‌లో థాయ్‌లాండ్ కూనపై దక్షిణాఫ్రికా 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. సఫారీ ఓపెనర్ లిజెల్లీ లీ (60 బంతుల్లో 101; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. ఆమె సెంచరీలో 82 పరుగులు ఫోర్లు, సిక్సర్లతోనే వచ్చాయి. మొదట దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. సున్ లూస్ (41 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించింది. లీ, లూస్ రెండో వికెట్‌కు 13 ఓవర్లలో 131 పరుగులు జోడించారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన థాయ్‌లాండ్ కూన 19.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. కంచోంఫు (26), సుతిరంగ్ (13)లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. షబ్నిమ్, లూస్ చెరో 3 వికెట్లు తీశారు. పాక్‌పై ఇంగ్లండ్ జయభేరి మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు 42 పరుగుల తేడాతో పాకిస్తాన్ అమ్మాయిలపై గెలిచారు. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. హీథెర్ నైట్ (62), సీవెర్ (36) ధాటిగా ఆడారు. ఐమన్కు 3 వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనకు దిగిన పాక్ 19.4 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. అలియా (41) ఒంటరి పోరాటం చేసింది. ష్రబ్సోల్, గ్లెన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. -
అజేయంగా ముందుకెళ్తారా..!
మెల్బోర్న్: భారత అమ్మాయిల జట్టు అందరికంటే ముందుగానే సెమీస్ చేరింది. ఇప్పుడు అజేయంగా ముందుకెళ్లడంపై దృష్టిపెట్టింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు గ్రూప్‘ఎ’లో జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుస విజయాలతో ఊపు మీదుంది. మొదట డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌పై, తర్వాత బంగ్లా, కివీస్‌లను ఓడించిన భారత్ ఇప్పుడు గ్రూప్ టాపర్‌గా ఉంది. ఇలాంటి జట్టు లంకను ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా హర్మన్ సేన అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో దుర్భేద్యంగా ఉంది. అందుకేనేమో సారథి హర్మన్ వరుసగా విఫలమవుతున్నా ఆ ప్రభావం జట్టుపై ఏమాత్రం లేదు. 16 ఏళ్ల షఫాలీ వర్మ ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నమవుతోంది. జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు మిడిలార్డర్లో తానియా, వేద కృష్ణమూర్తిలు చక్కగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ అయితే బ్యాటింగ్‌కు దీటుగా ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో మనం చేసిన స్కోర్లను నిలబెట్టిందే బౌలర్లు. స్పిన్నర్ పూనమ్ యాదవ్, పేసర్ శిఖా పాండేలను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడుతున్నారు. పేలవ ఫామ్‌ను కనబరుస్తున్న హర్మన్‌ప్రీత్ గనక ఈ మ్యాచ్‌తో గాడిన పడితే భారత్ తిరుగులేని జట్టుగా మారడం ఖాయం. మరోవైపు శ్రీలంక అమ్మాయిలది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. భారత్ ఆడినవన్నీ గెలిస్తే... లంకేమో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ లక్ష్యాల్ని బౌలర్లు కాపాడితే... లంక లక్ష్యాలన్నీ చెదిరిపోయాయి. బ్యాటింగ్‌లో కెప్టెన్ జయాంగని ఫామ్‌లో ఉంది. హర్షిత మాధవి, హాసిని పెరీరాలు కూడా మెరుగ్గా ఆడారు. కానీ బౌలింగ్ వైఫల్యం లంకను పరాజయం పాలు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో లంక బౌలర్లు తీసింది 7 వికెట్లే కావడం గమనార్హం. దీనివల్లే లంక లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. ఇప్పటికే సెమీస్‌ను కష్టం చేసుకున్న లంక... పరువుకోసమైనా గెలిచేందుకు ఆరాటపడుతోంది. ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను స్టార్‌స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది -
టీ20 వరల్డ్ కప్ టీమిండియా కెప్టెన్‌గా..
ముంబై : ఆస్ర్టేలియాలో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంపికైంది. కౌర్ నేతృత్వంలో భారత జట్టు తరపున ఆడే 15 మంది జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ టీంలో రిచా ఘోష్ ఒక్కరే కొత్త ముఖం కావడం గమనార్హం. ఇటీవల మహిళల ఛాలెంజర్స్ ట్రోఫీలో సత్తా చాటిన రిచాకు టీమిండియాలో చోటు కల్పించారు. వరల్డ్ టీ20 టీంలో హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్) సహా స్మృతి మంధానా, అరుంధతి రెడ్డి, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనం యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్‌లకు చోటు దక్కింది. -
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే
దుబాయ్ : టీ20 ప్రపంచకప్ 2020 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళా, పురుషుల టీ20 ప్రపంచకప్‌లను ఒకే ఏడాది, ఒకే వేదికగా నిర్వహించనుంది. ఈ సూపర్ టోర్నీలకు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. తొలుత మహిళా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. అనంతరం పురుషుల టీ20 టోర్నీ ఆరంభం కానుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు మహిళా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 15 వరకు పురుషుల టోర్నీ జరగనుంది. ఈ రెండు టోర్నీలకు ఆస్ట్రేలియాలోని మొత్తం 13 వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇరు టోర్నీల ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం మెల్బోర్న్ మైదానం వేదిక కానుంది. మహిళా టోర్నీల్లో 10 జట్లు పోటీపడనుండగా.. పురుషుల టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి. ఆతిథ్య జట్టు, ఢిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా- భారత్‌ల మ్యాచ్‌తో మహిళల టోర్నీ ఆరంభం కానుండగా.. పురుషుల టోర్నీకి ఆసీస్-పాకిస్తాన్ మ్యాచ్‌తో తెరలేవనుంది. ఈ టోర్నీల్లో హర్మన్ సేన ప్రారంభ మ్యాచ్‌నే ఆడనుండగా.. కోహ్లిసేన మాత్రం అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌తో టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఇరు టోర్నీల్లో ఆయా జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించిన ఐసీసీ.. మహిళా టోర్నీలో సూపర్ 10, పురుషుల టోర్నీ సూపర్ 12 పద్దతిలో ఆడించనుంది. పురుషుల టీ20 టోర్నీకి శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అర్హత సాధించని విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు మరో ఆరు జట్లతో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడే 8 జట్లలో నాలుగు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించనున్నాయి. (చదవండి: ఆ రెండు జట్లకు నో డైరక్ట్ ఎంట్రీ) సూపర్-12 పురుషుల పూల్ గ్రూప్-1: పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 గ్రూప్-2: భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, క్వాలియర్-3, క్వాలిఫయర్-4 సూపర్-10 మహిళల పూల్ గ్రూప్-ఏ : ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, క్వాలిఫయర్-1 గ్రూప్-బీ: ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, క్వాలిఫయర్-2 మహిళల షెడ్యూల్ ICC Women's T20 World Cup 2020 Full Fixtures/Draws Feb 21 Australia v India at Sydney Showground Feb 22 West Indies v Q2 at WACA Feb 22 New Zealand v Sri Lanka at WACA Feb 23 England v South Africa at WACA Feb 24 Australia v Sri Lanka at WACA Feb 24 India v Q1 at WACA Feb 26 England v Q2 at Manuka Oval Feb 26 West Indies v Pakistan at Manuka Oval Feb 27 Australia v Q1 at Manuka Oval Feb 27 India v New Zealand at Junction Oval Feb 28 South Africa v Q2 at Manuka Oval Feb 28 England v Pakistan at Manuka Oval Feb 29 New Zealand v Q1 at Junction Oval Feb 29 India v Sri Lanka at Junction Oval Mar 1 South Africa v Pakistan at Sydney Showground Mar 1 England v West Indies at Sydney Showground Mar 2 Sri Lanka v Q1 at Junction Oval Mar 2 Australia v New Zealand at Junction Oval Mar 3 Pakistan v Q2 at Sydney Showground Mar 3 West Indies v South Africa at Sydney Showground Semi-Finals Mar 5 SCG Mar 5 SCG Final Mar 8 MCG పురుషుల షెడ్యూల్ ICC Men's T20 World Cup 2020 full fixtures/draws Oct 24 Australia v Pakistan at SCG Oct 24 India v South Africa at Perth Stadium Oct 25 New Zealand v West Indies at MCG Oct 25 QA1 v Q82 at Bellerive Oval Oct 26 Afghanistan v QA2 at Perth Stadium Oct 26 England v Q131 at Perth Stadium Oct 27 New Zealand v QB2 at Bellerive Oval Oct 28 Afghanistan v QB1 at Perth Stadium Oct 28 Australia v West Indies at Perth Stadium Oct 29 India v QA2 at MCG Oct 29 Pakistan v QA1 at SCG Oct 30 England v South Africa at SCG Oct 30 West Indies vQB2 at Perth Stadium Oct 31 Pakistan v New Zealand at The Gabba Oct 31 Australia v QA1 at The Gabba Nov 1 India v England at MCG Nov 1 South Africa v Afghanistan at Adelaide Oval Nov 2 QA2 v QB1 at SCG Nov 2 New Zealand v QA1 at The Gabba Nov 3 Pakistan v West Indies at Adelaide Oval Nov 3 Australia v Q82 at Adelaide Oval Nov4 England v Afghanistan at The Gabba Nov 5 South Africa v Q. at Adelaide Oval Nov 5 India vQB1 at Adelaide Oval Nov6 Pakistan vQB2 at MCG Nov 6 Australia v New Zealand at MCG Nov 7 West Indies v QA1 at MCG Nov 7 England v Q. at Adelaide Oval Nov 8 South Africa v Q81 at SCG Nov 8 India v Afghanistan at SCG Semi-Finals Nov 11 SCG Nov 12 Adelaide Oval Final Nov 15 MCG -
ఎవరు గెలిచినా 'డబుల్'
కోల్ కతా: టీ20 ప్రపంచకప్ తుది సమరంలో తలపడేందుకు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు రెడీ అవుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఈ రెండు జట్లు టైటిల్ పోరు సాగించనున్నాయి. ఈసారి గ్రూప్-1లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్ కు చేరడం విశేషం. ఈ రెండు టీముల్లో ఏది గెలిచినా రెండోసారి వరల్డ్ కప్ అందుకున్న జట్టు అవుతుంది. 2010లో ఇంగ్లండ్, 2012లో విండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. తాజా ప్రపంచకప్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లీషు జట్టు అనూహ్యంగా ఆడి ఫైనల్ కు చేరింది. ఓటమితో టోర్ని ఆరంభించిన ఇంగ్లండ్ తర్వాత పుంజుకుని టైటిల్ వేటకు సిద్ధమైంది. మార్చి 16న వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓడింది. తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ టీమ్ లను ఓడించి ఫైనల్ చేరుకుంది. లీగ్ దశలో వరుసగా మూడు అగ్రశ్రేణి జట్లను ఓడించిన విండీస్ చివరి లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా అప్ఘానిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. అయితే సెమీస్ నంబర్ వన్ టీమిండియాను ఓడించిన టైటిల్ బరిలో నిలిచింది. ఇంగ్లండ్, విండీస్ లో ఏ జట్టు రెండోసారి టీ20 వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుంటుందో చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. -
భారత్-విండీస్ మ్యాచ్ హైలైట్స్
ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం రాత్రి జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమీండియాపై విండీస్ టీమ్ పైచేయి సాధించి తుది సమరానికి అర్హత సాధించింది. భారత్-విండీస్ మ్యాచ్ తో పాటు, ఈ వరల్డ్ కప్ లోని కొన్ని విశేషాలు గురించి తెలుసుకుందాం. ఈ టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచింది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచుల్లో టాస్ ఓడినప్పటికీ విజయాలు నమోదు చేసింది. టాప్-3 బ్యాట్స్ మన్లు 40 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇది మూడోసారి. 2013లో న్యూజిలాండ్-ఇంగ్లండ్, 2016లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచుల్లో ఈ ఫీట్ నమోదైంది. ఈ టీ20 ప్రపంచకప్ లో వాంఖెడే స్టేడియంలో 5 మ్యాచ్ లు జరగ్గా నాలుగుసార్లు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ నాలుగుసార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలులు సాధించిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. 16 అర్ధసెంచరీలతో టాప్ లో నిలిచాడు. టీ20ల్లో ఫస్ట్ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ సగటు 35.22. ఛేజింగుల్లో అతడి బ్యాటింగ్ యావరేజ్ 91.80 వాంఖెడే స్టేడియంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు 37.67. అంతకుముందు 39 ఇన్నింగ్స్ లో 135.97 స్ట్రైక్ రేటుతో 1168 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో 55 పరుగులు చేసింది. టీ20 పవర్ ప్లేలో టీమిండియాకు ఇదే అత్యుత్తమ స్కోరు. వికెట్ నష్టపోకుండా పవర్ ప్లే ఆడడం కూడా ఇదే మొదటిసారి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా వెస్టిండీస్ (193) గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా (192; 2010లో పాక్‌పై) పేరిట ఉండేది. -
వాట్ ఏ మ్యాచ్..!
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ లో ధోని సేన సెమీస్ ఫైనల్ కు చేరడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కళాత్మక విధ్వంసంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లిపై ప్రధాని నరేంద్ర మోదీతో సహా రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. సెమీఫైనల్లోనూ టీమిండియా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ క్రికెటర్లు, పలుదేశాలకు చెందిన ఆటగాళ్లు విరాట్ కోహ్లి ఆటను ప్రశంసించడం విశేషం. తీవ్రఒత్తడిని ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చిన 'మిస్టర్ ఫైర్'పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లిని స్వయంగా అభినందించడం మరో విశేషం. 'వాట్ ఏ మ్యాచ్. టీమిండియా ఆటను చూసి గర్విస్తున్నా. కోహ్లి గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. ధోని నాయకత్వం గొప్పగా ఉంది' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'భారత క్రికెట్ జట్టుకు అభినందనలు. ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి మరోసారి జట్టును గెలిపించాడు' అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ లో పోస్టు చేశారు. 'వావ్ కోహ్లి.. అతడికి స్పెషల్ ఇన్నింగ్స్.. గ్రేట్ విన్.. అన్నివిధాలుగా పోరాడారు' అంటూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. 'విరాట్ కోహ్లి గ్రేట్ అఫర్ట్ పెట్టాడు. గ్రేట్ టెంపర్ మెంట్ చూపించాడు. ఆల్ బెస్ట్ ఫర్ టీమిండియా ఫర్ సెమీస్' అంటూ బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. సెమీఫైనల్ కు అర్హత సాధించిన టీమిండియాకు అభినందనలు. విరాట్ కోహ్లి బ్రిలియన్స్, క్లాస్, అవుట్ స్టాండింగ్ గా ఆడాడు' అని కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. 'విరాట్ కోహ్లి ఆట సూపర్. ఇక నుంచి సచిన్‌తో పాటు కోహ్లిని క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. కోహ్లి మాస్టర్ క్లాస్ ఆటకు నాలుగు రకాలున్నాయి. 1. క్లాస్ అండర్ ప్రెజర్ 2. కవర్ డ్రైవింగ్ 3. రన్నింగ్ బిట్ వీన్ వికెట్స్ 4. డిజైర్' అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు. What a match! Proud of our team. Great innings @imVkohli & exemplary leadership @msdhoni. — Narendra Modi (@narendramodi) 27 March 2016 Woooow @imVkohli ...special it was... Great win, fighting all the way! #IndvsAus — sachin tendulkar (@sachin_rt) 27 March 2016 -
స్మిత్ వర్సెస్ కోహ్లి
మొహాలి: టీ20 ప్రపంచకప్ భారత్, ఆస్ట్రేలియా కీలక సమరంలో ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కీలకం కానున్నారు. విపత్కర పరిస్థితుల్లో చెలరేగడంలో ఇద్దరూ ఇద్దరే. పాకిస్థాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో కోహ్లి అర్ధసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. పాకిస్థాన్ తోనే జరిగిన మ్యాచ్ లో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. జట్టు కిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆపద్భాందవుల పాత్ర పోషించడంతో ఎవరికి వారే సాటి. ఆదివారం మొహాలిలో భారత్-ఆసీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ యువ బ్యాట్స మెన్ల మీద నెలకొంది. ముఖ్యంగా టీమిండియాపై బెస్ట్ రికార్డు ఉన్న స్మిత్ ను కట్టడిచేయకుంటే ధోని సేనకు కష్టాలు తప్పవు. ఇప్పటివరకు 29 టీ20 మ్యాచ్ లు ఆడిన స్మిత్ 22.57 సగటుతో 429 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 90. జట్టు విజయంలో 17 సార్లు కీలకపాత్ర పోషించాడు. స్ట్రైక్ రేటు 123.98. కోహ్లి విషయానికి వస్తే ఇప్పటివరకు 41 టీ20 మ్యాచ్ లు ఆడి 55.50 సగటుతో 1470 పరుగులు చేశాడు. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 90 నాటౌట్. 28 సార్లు టీమిండియా గెలుపులో ప్రధాన భూమిక పోషించాడు. స్ట్రైక్ రేటు 131.72. గణాంకాల పరంగా చూస్తే టీ20ల్లో స్మిత్ పై కోహ్లిదే పైచేయి. ఈ రోజు జరిగే మ్యాచ్ లో వీరిద్దరూ ఎలా ఆడతారనే దాని గురించి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
'అంచనాలు లేకుండా వచ్చాం, సెమీస్ చేరాం'
న్యూఢిల్లీ: తాము ఎటువంటి అంచనాలు లేకుండానే టీ20 వరల్డ్ కప్ కు వచ్చామని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ప్రత్యేకంగా ఒక లక్ష్యం పెట్టుకోలేదని చెప్పాడు. తమకు అందుబాటులో వనరులతో సమర్థవంతంగా ఆడాలన్న ఉద్దేశంతో బరిలోకి దిగామని అన్నాడు. శ్రీలంకతో శనివారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత మోర్గాన్ విలేకరులతో మాట్లాడాడు. సెమీఫైనల్ కు అర్హత సాధించాలని ముందుగా లక్ష్యం నిర్దేశించుకున్నారా అని ఈ సందర్భంగా అడగ్గా... 'నిజం చెప్పాలంటే గొప్ప లక్ష్యాలు ఏవీ పెట్టుకోలేదు. అంచనాలు, అడ్డంకులు, నియంత్రణలు లాంటివి సెట్ చేసుకోలేదు. మా సామర్థ్యం మేరకు బెస్ట్ గా ఆడాలనుకున్నాం. అలా ఆడితే మంచి పొజిషన్ లో ఉంటామని అనున్నామ'ని మోర్గాన్ బదులిచ్చాడు. ఒత్తిడి సమయాల్లో తమ జట్టు రాణించిన తీరు పట్ల అతడు సంతృప్తి వ్యక్తం చేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, మున్ముందు మరింత కష్టపడాల్సి ఉంటుందని అన్నాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులతో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను ఓడించి ఇంగ్లండ్ మూడో విజయంతో సగర్వంగా సెమీస్‌కు చేరింది. -
నిర్ణయాన్ని మార్చుకున్న పాకిస్తాన్ కెప్టెన్
మొహాలీ: రిటైర్మెంట్ విషయంలో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తన నిర్ణయం మార్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అఫ్రిదీ అన్నాడు. పాకిస్తాన్లో దేశ ప్రజల సమక్షంలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు ముందు రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు ఇటీవల అఫ్రిదీ చెప్పిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో చివరిమ్యాచ్ ఆడబోతున్నట్టు చెప్పాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే మ్యాచ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చని ప్రకటించాడు. కాగా, ప్రపంచకప్ అనంతరం అఫ్రిదీని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతానన్న షరతుమీదే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టినట్టు వెల్లడించింది. అయితే ఈ రోజు ఆస్ట్రేలియాతో మ్యాచే చివరిదన్న అఫ్రిదీ.. రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. -
రనౌట్ కు ముందు ధోని ఏం చేశాడంటే...
బెంగళూరు: టీ20 ప్రపంచకప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో చివరికి రనౌట్ తో టీమిండియా విజయం సాధించింది. రనౌట్ చేయాలని 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోని ముందుగానే సిద్ధమైనట్టు కనబడుతోంది. హార్ధిక్ పాండ్యా చివరి బంతిని వేసే ముందు ధోనిని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. బంతి వేయడానికే ముందే ధోని తన కుడిచేతి గ్లౌజ్ తీసేశాడు. సాధారణంగా వికెట్ కీపర్లు చేతులకు రెండేసి గ్లౌజులు వేసుకుంటారు. చేతికి అంటిపెట్టుకుని గ్లౌజులతో పాటు వదులుగా ఉండే గ్లౌజులు ధరిస్తారు. బంతిని ఒడిసిపట్టిన తర్వాత దాన్ని విసిరే క్రమంలో చేతికున్న పెద్ద గ్లౌజును తీసేస్తుంటారు. వదులుగా ఉండే పెద్ద గ్లౌజులు ధరించి వికెట్లను కొట్టడం కష్టం. కాబట్టి ధోని ముందుగానే రనౌట్ కు ప్లాన్ చేసుకున్నట్టు కనబడుతోంది. ఇక రెండో ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మన్ వచ్చేలోపే 15 గజాల దూరం పరుగెత్తి ధోని రనౌట్ చేయడం విశేషం. దూరం నుంచి బంతి విసిరితే అది వికెట్లకు తగలకపోతే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదముందని గ్రహించిన టీమిండియా కెప్టెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తి పరుగులు తీయడంలో ధోని ఎక్స్ పర్ట్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విశ్వాసంతోనే ధోని వికెట్ల దగ్గరకు పరుగెత్తికొచ్చి రనౌట్ చేయగలిగాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. -
అదే నా చివరి మ్యాచ్: ఆఫ్రిది
మొహాలి: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ షాహిద్ అఫ్రిది సూచనప్రాయంగా వెల్లడించాడు. తన కెరీర్ లో చివరిమ్యాచ్ ఆడబోతున్నట్టు చెప్పాడు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 22 పరుగులతో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆఫ్రిది మాట్లాడుతూ... ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే గేమ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చని అవుతుందని ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ కు సెమీస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోనప్పటికీ అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, ప్రపంచకప్ అనంతరం అఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతానన్న షరతుమీదే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టినట్టు వెల్లడించింది. -
దక్షిణాఫ్రికా బోణి
ముంబై: వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 37 పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా సమష్టిగా రాణించడంతో టోర్నీలో బోణి కొట్టింది. దక్షిణాఫ్రికా విసిరిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్ఘాన్లు పోరాడి ఓటమి చెందారు. చివరి వరకూ తమ పోరాటం కొనసాగించిన అఫ్ఘానిస్తాన్ 172 పరుగులకు చేసి పరాజయం చెందింది. అఫ్ఘాన్ ఆటగాళ్లలో మొహ్మద్ షహజాద్(44; 19 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) పరుగుల మోత మోగించి దక్షిణాఫ్రికా గుండెల్లో గుబులు పుట్టించాడు. షహజాద్ దూకుడుతో అఫ్ఘాన్ నాలుగు ఓవర్లలోనే యాభైకి పరుగులు సాధించి ఊపు మీద కనిపించింది. కాగా, ఆ తరువాత నూర్ అలీ జాద్రాన్(25), గుల్బాదిన్(26), షెన్వారీ(25)లు మాత్రమే మోస్తరుగా రాణించడంతో అఫ్ఘాన్‌కు ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు సాధించగా, అబాట్, ఇమ్రాన్ తాహీర్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగులు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వీరవిహారం చేశాడు. డివిలియర్స్ (64; 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తన సహజసిద్ధమైన ఆటతో విరుచుకుపడ్డాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నదక్షిణాఫ్రికాకు ఓపెనర్ హషీమ్ ఆమ్లా(5) నిరాశపరిచినా, మరో ఓపెనర్ డీ కాక్(45; 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడాడు. అనంతరం కెప్టెన్ డు ప్లెసిస్(41; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అతనికి సాయంగా డివిలియర్స్ కూడా రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు వేగంగా కదిలింది. అఫ్ఘాన్ స్పిన్నర్ రషిద్ వేసిన ఇన్నింగ్స్ 17.0 ఓవర్లో డివిలియర్స్ 29 పరుగులు సాధించాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలచిన డివిలియర్స్, రెండో బంతికి ఫోర్ సాధించాడు. ఆ తరువాత మూడు బంతులను వరుస సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలోనే దాదాపు 200 పైగా స్ట్రైక్ రేట్ తో డివిలియర్స్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక చివరి బంతికి సింగిల్ తీయడంతో మొత్తంగా ఆ ఓవర్లో 29 పరుగులను డివిలియర్స్ పిండుకున్నాడు. ఇక చివర్లో డేవిడ్ మిల్లర్(19; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), జేపీ డుమినీ(29 నాటౌట్; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్)లు అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపెట్టడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు నమోదు చేసింది. -
షహజాద్ పరుగుల మోత
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా దక్షిణాఫ్రికా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘాన్ ఓపెనర్ మొహ్మద్ షహజాద్ పరుగుల మోత మోగించాడు. కేవలం 19 బంతులను ఎదుర్కొన్నషహజాద్ 3 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 44 పరుగులు సాధించాడు. తద్వారా అఫ్ఘాన్ నాలుగు ఓవర్లు ముగిసే సరికి 52 పరుగులు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా విసిరిన 210 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన షహజాద్ మంచి పునాది వేయడంతో అఫ్ఘాన్ స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. కాగా, దక్షిణాఫ్రికా పేసర్ మోరిస్ వేసిన బంతిని హిట్ చేయబోయిన షహజాద్ బౌల్డ్ కావడంతో అతని ఇన్నింగ్స్‌కు ఫుల్ స్టాప్ పడింది. ఆ తరువాత ఆస్గర్ స్టానిక్జాయ్(7) రెండో వికెట్ గా అవుటయ్యాడు. అయినప్పటికీ అఫ్ఘాన్ అదే వేగాన్ని కొనసాగించడంతో 10.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. -
డివిలియర్స్ వీరవిహారం
ముంబై:దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వీరవిహారం చేశాడు. వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం వాంఖేడే స్టేడియంలో అఫ్ఘాన్స్తాన్తో జరుగుతున్న మ్యాచ్‌లో డివిలియర్స్ (64; 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తన సహజసిద్ధమైన ఆటతో విరుచుకుపడ్డాడు. తద్వారా దక్షిణాఫ్రికా 210 పరుగుల విజయలక్ష్యాన్ని అఫ్ఘాన్‌కు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నదక్షిణాఫ్రికాకు ఓపెనర్ హషీమ్ ఆమ్లా(5) నిరాశపరిచినా, మరో ఓపెనర్ డీ కాక్(45; 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడాడు. అనంతరం కెప్టెన్ డు ప్లెసిస్(41; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అతనికి సాయంగా డివిలియర్స్ కూడా రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు వేగంగా కదిలింది. అఫ్ఘాన్ స్సిన్నర్ రషిద్ వేసిన ఇన్నింగ్స్ 17.0 ఓవర్లో డివిలియర్స్ 29 పరుగులు సాధించాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలచిన డివిలియర్స్, రెండో బంతికి ఫోర్ సాధించాడు. ఆ తరువాత మూడు బంతులను వరుస సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలోనే దాదాపు 200 పైగా స్ట్రైక్ రేట్ తో డివిలియర్స్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక చివరి బంతికి సింగిల్ తీయడంతో మొత్తంగా ఆ ఓవర్లో 29 పరుగులను డివిలియర్స్ పిండుకున్నాడు. ఇక చివర్లో డేవిడ్ మిల్లర్(19; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), జేపీ డుమినీ(29 నాటౌట్; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్)లు అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపెట్టడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగులు నమోదు చేసింది. అఫ్ఘాన్ బౌలర్లలో అమిర్ హమ్జా, దావ్లాత్ జద్రాన్, షాపూర్ జాద్రాన్, మహ్మద్ నబీలకు తలో వికెట్ దక్కింది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి రెండొందలకు పైగా స్కోరు నమోదు చేసింది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 229 పరుగులు నమోదు చేసినా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
అబ్బాయిలు అలా.. అమ్మాయిలు ఇలా..
కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచుల్లో భారత పురుషులు, మహిళల జట్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రెండు టీమ్ లు రెండేసి మ్యాచ్ లు అడగా ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి. మొదటి మ్యాచ్ లో 'మెన్ ఇన్ బ్లూ' ఓడిపోగా, అమ్మాయిలు తమ మొదటి మ్యాచ్ లో శుభారంభం చేశారు. రెండో మ్యాచ్ లో పురుషుల టీమ్ నెగ్గగా, అమ్మాయిల జట్టు ఓడింది. నాగపూర్ లో ఈ నెల 15న ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడిన ధోని సేన శుభారంభం అందుకోలేక చతికిలపడింది. 47 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఈడెన్ గార్డన్ లో 19న జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది ఆరంభ ఓటమి నుంచి కోలుకుంది. ఆరు వికెట్ల తేడాతో దాయాది జట్టును చిత్తు చేసి సత్తా చాటింది. బెంగళూరులో ఈ నెల 15న బంగ్లాదేశ్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో ఇండియా వుమెన్స్ టీమ్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 19న పాకిస్థాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో 2 పరుగులతో తేడాతో మిథాలి సేన ఓడింది. గెలిచే అవకాశం భారతవైపు మొగ్గిన తరుణంలో వరుణుడు మిథాలీసేన ఆశలపై నీళ్లుజల్లాడు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ రెండు పరుగులతో విజయం సాధించింది. -
సౌతాఫ్రికా బ్యాటింగ్
ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం వాంఖేడ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, అప్ఘానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు తాము ఆడిన తొలి మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారీ స్కోరు చేసినా సఫారీ టీమ్ కాపాడులేకపోయింది. శ్రీలంకతో ఆడిన మొదటి మ్యాచ్ లో అప్ఘానిస్తాన్ పోరాడి ఓడింది. దీంతో దక్షిణాఫ్రికా, అప్ఘానిస్తాన్ జట్లు గెలుపుకోసం బరిలోకి దిగుతున్నాయి. లంకతో జరిగిన మ్యాచ్ లో అప్ఘాన్ ఓడినప్పటికీ పోరాటపటిమతో ఆకట్టుకుంది. దీంతో అప్ఘాన్ ను అషామాషీగా తీసుకోరాదని దక్షిణాఫ్రికా భావిస్తోంది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఓడిన ఇంగ్లీషు టీమ్ ఈ మ్యాచ్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని సఫారీ జట్టు భావిస్తోంది. -
'టీమిండియా వీక్ నెస్ గురించి పట్టించుకోం'
కోల్ కతా: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ను ఉపఖండంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తుందని పాక్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ తెలిపాడు. శుక్రవారం అతడు విలేకరులతో మాట్లాడుతూ... గత మ్యాచుల్లో తమ జట్టుపై ఎక్కువ ఒత్తిడి ఉండేదని, ఇప్పుడు ఇండియా టీమ్ పై ప్రెషర్ అధికంగా ఉందని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి ఎక్కువయిందని వివరించాడు. కోల్ కతాలో తమకు మైదానంలోనూ, మైదానం వెలుపల మద్దతు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు బలాలపై దృష్టి పెడుతున్నామని, టీమిండియా బలహీనతల గురించి ఆలోచించడం లేదని వకార్ యూనిస్ తెలిపాడు. రేపు(శనివారం) ఈడెన్ గార్డెన్ జరిగే మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. -
'పాక్ తో ఎలా ఆడాలో మాకు తెలుసు'
కోల్ కతా: పాకిస్థాన్ తో మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నామని, తమపై ఎటువంటి ఒత్తడి లేదని టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అన్నాడు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... ఒత్తిడిని ఎలా అధిగమించాలో తమకు తెలుసునని, ప్రతి మ్యాచ్ లోనూ గెలవాలనే ఆడతామని చెప్పాడు. టీ20 మ్యాచుల్లో ఏ జట్టు ఫేవరేట్ కాదని, ఇరు జట్లకు సమాన అవకాశాలుంటాయని పేర్కొన్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో తాము ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వబోమని, దాయాది జట్టుతో చాలా మ్యాచ్ లు ఆడామని గుర్తు చేశాడు. యాషెస్ సిరీస్ కంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో భావోద్వేగాలు అధికంగా ఉంటాయన్నాడు. దాయాది జట్ల మధ్య పోరును ఆటగా కాకుండా, సరిహద్దు వివాదంలా చూస్తారని వెల్లడించాడు. దీంతో తమపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటారని చెప్పాడు. మైదానంలో భావోద్వేగాలు పక్కన పెట్టి మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని అశ్విన్ చెప్పాడు. -
భారత్-పాక్ మ్యాచ్ పై ఆసక్తికర కామెంట్స్
న్యూఢిల్లీ: టీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈడెన్ గార్డెన్ లో జరగనున్న దాయాది జట్ల మధ్య జరగనున్న పోరులో పాకిస్థాన్ గా బరిలోకి దిగబోతోందని అన్నాడు. టీమిండియాపై ఒత్తిడిలో ఉందని తెలిపాడు. టోర్ని ప్రారంభానికి ముందు ధోని సేనను అందరూ ఫేవరేట్ గా భావించారని, టైటిల్ కూడా గెలుస్తుందని ఊహించారని అన్నారు. ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన తర్వాత టీమిండియాపై ఒత్తిడి పెరిగిందన్నాడు. బంగ్లాదేశ్ పై విజయంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో ఉందని, భారత్ తో జరగబోయే మ్యాచ్ లో ఆఫ్రిది సేన ఫేవరేట్స్ గా బరిలో దిగే అవకాశముందని విశ్లేషించాడు. ఎప్పటిలాగానే భారత్ బ్యాటింగ్ కు, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య పోటీ ఉంటుందని వివరించాడు. ఆసియా కప్ లో ఇబ్బంది పెట్టిన పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ ను ఎలా ఎదుర్కొవాలే ఈపాటికి భారత బ్యాట్స్ మెన్ నేర్చుకునే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై ఎప్పుడు ఓడిపోని రికార్డును టీమిండియా కొనసాగిస్తుందో, లేదో చూడాలంటే ఈ నెల 19 వరకు ఆగాలి. -
విండీస్ విజయలక్ష్యం 183
ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్, హేల్స్ దాటిగా ఆడారు. తొలి నుంచి భారీ స్కోరే లక్ష్యంగా ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించింది. 37 పరుగులకే రాయ్ వికెట్ కోల్పోయిన తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ రెండెంకల స్కోర్ చేశారు. ఒక వైపు వికెట్లు కోల్పోతున్న ఆటగాళ్లు నిలకడగా ఆడడంతో స్కోర్ 180 పరుగులు దాటింది. రూట్ 48, జాస్ బట్లర్ 30 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్ మోర్గాన్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్, డ్రేన్ బ్రేవో రెండేసి వికెట్లు తీయగా బెన్ ఒక వికెట్ తీశాడు. విండీస్ 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది. -
ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం జరుగుతున్న మూడో మ్యాచ్ లో ఇంగ్లండ్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ కు మోర్గాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. విండీస్ టీమ్ కు సమీ నాయకత్వం వహిస్తున్నాడు. ఇరు జట్లు శుభారంభం చేయాలన్న పట్టుదలతో ఉన్నాయి. -
పాకిస్థాన్ ఘన విజయం
కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 202 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ అజేయ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. ఇక్బాల్ 24, సబీర్ రహమాన్ 25, ముష్ఫికర్ 18, మోర్తజా 15 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఆమిర్ , ఆఫ్రిది రెండేసి వికెట్లు తీశారు. ఇర్ఫాన్, ఇమాద్ వాసిద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. షెహజాద్(52), హఫీజ్(64) అర్ధ సెంచరీలు కొట్టారు. ఆఫ్రిది వేగంగా ఆడి 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. పాక్ తరపున వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన ఘనత సాధించకుండానే అవుటయ్యాడు. ఒక్క పరుగు తేడాతో రికార్డు మిస్సయ్యాడు. ఆఫ్రిదికే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. -
ఆఫ్రిది మెరుపులు; పాక్ భారీ స్కోరు
కోల్ కతా: హఫీజ్, షహజాద్ అర్థసెంచరీలకు ఆఫ్రిది మెరుపులు జతకావడంతో బంగ్లాదేశ్ ముందు పాకిస్థాన్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. బంగ్లాకు 202 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై పాక్ బ్యాట్స్ మన్ ఎదురుదాడి చేశారు. చివరివరకు దూకుడు కొనసాగించి స్కోరు 200 పరుగులు దాటించారు. షెహజాద్(52, 39 బంతుల్లో 8 ఫోర్లు), హఫీజ్(64, 42 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సౌమ్య సర్కార్ సూపర్ క్యాచ్ తో హఫీజ్ ను పెవిలియన్ కు పంపాడు. కెప్టెన్ ఆఫ్రిది మరోసారి తనదైన శైలిలో చితకబాదాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు పిండుకున్నాడు. షర్జీల్ ఖాన్ 18, షోయబ్ మాలిక్ 15 పరుగులు చేశారు. ఉమర్ అక్మల్ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, అరాఫత్ సన్నీ రెండేసి వికెట్లు పడగొట్టారు. సమీర్ రహమాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
గ్రేట్ క్యాచ్.. హఫీజ్ అవుట్..!
కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఫీల్డర్ సౌమ్య సర్కార్ అద్భుతం చేశాడు. గ్రేట్ క్యాచ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడుతున్న మహ్మద్ హఫీజ్ ను పెవిలియన్ పంపాడు. అరాఫత్ సన్నీ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద సర్కారు అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ దాటే సమయంలో చేతిలోని బంతిని మైదానంలోకి విసిరేసి బౌండరీ దాటాడు. మళ్లీ బౌండరీ లోపలికి వచ్చి బంతిని ఒడిసి పట్టాడు. మైదానంలోని ప్రేక్షకులతో పాటు టీవీల్లో వీక్షిస్తున్న వారందరూ సర్కార్ ఫీట్ ను ఆసక్తిగా తిలకించారు. సర్కార్ పట్టిన క్యాచ్ తో హఫీజ్ ను అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో అతడు నిరాశగా మైదానం వీడాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
కోల్‌కతా: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో బుధవారమిక్కడ బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సూపర్ 10 విభాగం గ్రూప్ -2 మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత ఓపెనర్లుగా పాకిస్తాన్ ఆటగాళ్లు షార్జిల్ ఖాన్, అహ్మద్ షెహజాద్ బరిలోకి దిగారు. బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ తొలి ఓవర్ వేశాడు. -
కివీ'పోటు'
ఎవరైనా అనుకున్నారా... భారత జట్టు ఇంత ఘోరంగా ఓడిపోతుందని. ఎవరైనా కలగన్నారా... సొంతగడ్డపై పులులు పిల్లుల్లా మారతారని ఎవరైనా ఊహించగలరా... న్యూజిలాండ్ స్పిన్నర్లు ఇంత మాయ చేయగలరని. వాళ్లేమీ దిగ్గజాలు కాదు... అనుభవం అంతకన్నా లేదు. కానీ మాయ చేశారు. అలా ఇలా కాదు... భారత్‌ను తమ స్పిన్ ఉచ్చులో బిగించి గింగరాలు తిప్పించారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడ్డట్లు... స్పిన్ వికెట్‌పై చెలరేగాల్సిన భారత్ బొక్కబోర్లా పడింది. సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌ను మొదలుపెట్టిన ధోనిసేన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మనోళ్ల దూకుడుకు కేరింతలు కొట్టాల్సిన స్టేడియం... చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా మారింది. కోటి ఆశలతో టీవీలకు అతుక్కున్న కోట్లాది మంది భారతీయులు దారుణంగా నిరాశచెందారు.కివీ‘పోటు’కు ధోనిసేన ఉక్కిరిబిక్కిరయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఘోర పరాజయంతో టి20 ప్రపంచకప్‌ను ప్రారంభించింది. ♦ భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం ♦ స్పిన్ ఉచ్చులో చిక్కిన ధోనిసేన ♦ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాన్‌ట్నర్ నాగ్‌పూర్ నుంచి సాక్షి క్రీడాప్రతినిధి: స్పిన్ వేయడంలో బలం ఉంటే సరిపోదు... అదే స్పిన్‌ను బాగా ఆడే సమర్థత కూడా ఉండాలి... లేకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. సింగిల్స్ తీసుకుంటూ చివరి వరకూ ఆడినా గెలిచే మ్యాచ్‌లో భారత్ తమ బలహీనతను బయటపెట్టింది. బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యంతో టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఏకంగా 47 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కోరీ అండర్సన్ (42 బంతుల్లో 34; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. అనంతరం భారత్ 18.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. ధోని (30 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్), కోహ్లి (27 బంతుల్లో 23; 2 ఫోర్లు) తప్ప ఎవరూ కనీసం పోరాడలేదు. కివీస్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సాన్‌ట్నర్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోధికి 3 వికెట్లు దక్కాయి. శనివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్ జట్టు పాకిస్తాన్‌తో తలపడుతుంది. అండర్సన్ మినహా... పవర్‌ప్లేలో న్యూజిలాండ్ చేసిన పరుగులు 33. ఇందులో తొలి ఓవర్లో కొట్టిన రెండు సిక్సర్లను మినహాయిస్తే మిగిలిన 22 బంతుల్లో ఆ జట్టు చేసింది 21 పరుగులే! దీన్ని బట్టి భారత బౌలర్లు ప్రత్యర్థిని ఎంతగా నియంత్రించారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నెహ్రా, బుమ్రా కట్టి పడేయడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. మ్యాచ్ తొలి బంతిని సిక్సర్ బాదిన గప్టిల్ (6) రెండో బంతికే వెనుదిరగ్గా, నాలుగో బంతిని భారీ సిక్సర్ కొట్టి మున్రో (7) తర్వాతి ఓవర్‌కే వెనుదిరిగాడు. విలియమ్సన్ (16 బంతుల్లో 8) భారమైన ఇన్నింగ్స్‌కు ముగింపు పలికిన రైనా... కొద్ది సేపటికి అద్భుతమైన ఫీల్డింగ్‌తో టేలర్ (10)ను కూడా రనౌట్‌గా వెనక్కి పంపాడు. మరో వైపు అండర్సన్‌ను భారీ షాట్లు ఆడకుండా ప్రత్యేక వ్యూహంతో బౌలర్లు లెగ్‌స్టంప్‌పై బంతులు విసిరి కట్టడి చేశారు. దూకుడుగా ఆడేందుకు పదే పదే ప్రయత్నించి విఫలమైన అండర్సన్ చివరకు బుమ్రా యార్కర్‌కు బౌల్డయ్యాడు. చివర్లో రోంచీ (11 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ధాటిగా ఆడటంతో కివీస్ పోరాడే స్కోరు చేసింది. అంతా అనూహ్యం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు షాక్ మీద షాక్ తగిలింది. కివీస్ కూడా భారత్‌లాగే స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్లోనే నాథన్ మెకల్లమ్... ధావన్ (1)ను అవుట్ చేయగా, మూడో ఓవర్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ సాన్‌ట్నర్ చెలరేగాడు. భారీ షాట్ ఆడబోయి ముందుకొచ్చిన రోహిత్ (5) స్టంపవుట్ కాగా, రైనా (1) కూడా అనుసరించాడు. ఇక కోహ్లి ఉన్నాడు కదా...చింత లేదు అనుకుంటే ఈ సారి లెగ్‌స్పిన్నర్ సోధి వంతు. తన తొలి బంతికే అతను విరాట్ పని పట్టడంతో భారత్ పరిస్థితి మరింత దిగజారింది. ఒక వైపు ధోని పోరాడటం మినహా మన బ్యాట్స్‌మెన్ ఏమీ చేయలేక చేతులెత్తేశారు. భారత్ ఇన్నింగ్స్‌లో మొత్తం 4 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉన్నాయి. మరో 11 బంతులకు ముందే జట్టు కథ ముగిసిపోవడం విశేషం.స్కోరు వివరాలు:- న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 6; విలియమ్సన్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 8; మున్రో (సి) పాండ్యా (బి) నెహ్రా 7; అండర్సన్ (బి) బుమ్రా 34; టేలర్ (రనౌట్) 10; సాన్‌ట్నర్ (సి) ధోని (బి) జడేజా 18; ఇలియట్ (రనౌట్) 9; రోంచీ (నాటౌట్) 21; మెకల్లమ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1-6; 2-13; 3-35; 4-61; 5-89; 6-98; 7-114. బౌలింగ్: అశ్విన్ 4-0-32-1; నెహ్రా 3-1-20-1; బుమ్రా 4-0-15-1; రైనా 4-0-16-1; జడేజా 4-0-26-1; పాండ్యా 1-0-10-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) రోంచీ (బి) సాన్‌ట్నర్ 5; ధావన్ (ఎల్బీ) (బి) మెకల్లమ్ 1; కోహ్లి (సి) రోంచీ (బి) సోధి 23; రైనా (సి) గప్టిల్ (బి) సాన్‌ట్నర్ 1; యువరాజ్ (సి) అండ్ (బి) మెకల్లమ్ 4; ధోని (సి) మెకల్లమ్ (బి) సాన్‌ట్నర్ 30; పాండ్యా (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 1; జడేజా (సి) అండ్ (బి) సోధి 0; అశ్విన్ (స్టంప్డ్) రోంచీ (బి) సోధి 10; నెహ్రా (బి) మిల్నే 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.1 ఓవర్లలో ఆలౌట్) 79. వికెట్ల పతనం: 1-5; 2-10; 3-12; 4-26; 5-39; 6-42; 7-43; 8-73; 9-79; 10-79. బౌలింగ్: నాథన్ మెకల్లమ్ 3-0-15-2; అండర్సన్ 3-0-18-0; సాన్‌ట్నర్ 4-0-11-4; ఇలియట్ 2-0-9-0; ఆడమ్ మిల్నే 2.1-0-8-1; సోధి 4-0-18-3. 2.. టి20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇది రెండోసారి. 2009లో ఇంగ్లండ్ జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. 5.. పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడింది. 79.. భారత్‌లో ఏ టి20 మ్యాచ్‌లోనైనా నమోదైన అత్యల్ప స్కోరు ఇదే. 9.. భారత్‌పై ఓ టి20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు తొమ్మిది వికెట్లు తీయడం ఇదే ప్రథమం. ఇదేం పిచ్ బాబోయ్..! భారత్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి మ్యాచ్‌లో పిచ్ దారుణంగా ఉంది. టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆఖరి సెషన్లో కూడా ఇంత దారుణంగా స్పిన్ తిరగదు. దక్షిణాఫ్రికాతో టెస్టు మూడో రోజే ముగిసిన తర్వాత ఐసీసీ నుంచి విదర్భ క్రికెట్ సంఘానికి చీవాట్లు పడ్డాయి. అయినా బీసీసీఐ అధ్యక్షుడి సొంత సంఘం విదర్భ తీరు మారలేదు. ‘బ్యాటింగ్ పిచ్‌లు తయారు చేయాలని ఐసీసీ నుంచి ఆదేశం వచ్చింది’ అని చెప్పిన క్యూరేటర్ ఈ మ్యాచ్ తర్వాత తనని తాను ఎలా సమర్థించుకుంటారో చూడాలి. టి20 మ్యాచ్ అంటేనే పరుగుల వినోదం. ఇక ప్రపంచకప్ అంటే అభిమానుల అంచనాలు భారీగా ఉంటాయి. ఇలాంటి పిచ్‌లపై టోర్నీ నిర్వహిస్తే అభిమానులకు ఏమాత్రం వినోదం దక్కదు. -
భారత్ పై కివీస్ ఘన విజయం
నాగ్‌పూర్: ప్రపంచ కప్ తొలి టీ20 మ్యాచ్ లో బౌలర్ల హవా కొనసాగింది. భారత బౌలర్లు కివీస్ బ్యాట్స్మెన్లను 126 పరుగుకే కట్టడి చేస్తే కివీస్ బౌలర్లు ఏకంగా భారత్‌ను 79 పరుగులకే పరిమితం చేశారు. పటిష్టమైన టాప్ ఆర్డర్ ఉన్న భారత్ లక్ష్య చేధనలో ఏ దశలోనూ పోటీని ఇవ్వలేకపోయింది. చిన్న లక్ష్యం అయినా కివీస్ బౌలర్ల దాటికి ఒక్కక్కరుగా భారత్ బ్యాట్స్మెన్లు పెవీలియన్‌కు క్యూకట్టడంతో కివీస్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20ల్లో భారత్ పై కివీస్ ఇప్పటి వరకు ఓటమి చెందని రికార్డును పదిలంగా ఉంచుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గప్టిల్(7) అశ్విన్ బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ కొట్టి, మరుసటి బంతికే ఎల్బీ డబ్ల్యూగా వెనుదిరిగాడు. మున్రో(7) అదే ఓవర్లో మరో సిక్స్‌ర్ కొట్టి అనంతరం నెహ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. 32/2 పరుగల దగ్గర విలియమ్సన్ రనౌట్ నుంచి తృటిలో తప్పించుకున్నా, రైనా బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యాడు. పరుగులు రాబట్టే క్రమంలోనే రాస్ టేలర్ (10) రనౌట్‌గా వెనుదిరిగాడు. నిలకడగా ఆడుతున్న సమయంలోనే అండర్సన్(34) బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తర్వాతి బ్యాట్స్ మెన్లు పరుగులవేటలో విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి 126 పరుగులు చేయగలిగింది. అశ్విన్, రైనా, జడేజా, నెహ్రా, బుమ్రాలకు తలా ఓ వికెట్ లభించింది. 127 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఏ సమయంలోనూ దూకుడును చూపించ లేక పోయింది. తొలి ఓవర్లోనే ధావన్(1) మెకల్లమ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యు రూపంలో వెనుదిరిగాడు. రోహిత్ శర్మ(5), రైనా(1)లు వెంటవెంటేన ఔటయ్యారు. అనంతరం వచ్చిన యువరాజ్(4) నిరాశ పరిచాడు. నిలకడగా పరుగులు రాబడుతున్న సమయంలోనే కోహ్లీ(23) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పాండ్యా(1), జడేజా(0)లు కూడా వెంటవెంటనే ఔటవ్వడంతో 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత ధోనీ(30) మినహా మిగతా బ్యాట్స్మెన్లు రాణించకపోవడంతో 79 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో సాన్‌ట్నర్ 4, సోధీ 3, మెకల్లమ్2 వికెట్లు దక్కాయి. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: విలియమ్సన్; (బి) రైనా (స్టంప్) ధోనీ 8. గుప్టిల్; ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 6, కొలిన్ మున్రో; (బి) నెహ్రా (సి) పాండ్యా 7, రాస్ టేలర్, రనౌట్ 10 కోరీ అండర్సన్;(బి) జస్ప్రీత్ బుమ్రా 34 మిచెల్ శాంటర్ ;(బి)జడేజా (సి)ధోని 18 ఇలియట్,(రనౌట్) 9 రోంచి (నాటౌట్) 21 ఎక్స్‌ట్రాలు: 13 మొత్తం: (20 ఓవర్లలో ఏడు వికెట్లు) 126 వికెట్ల పతనం: 1-6; 2-13; 3-35; 4-61; 5-89 ; 6-98 ; 7-114 బౌలింగ్: అశ్విన్ 4-0-32-1 ; రైనా 4-0-16-1 జస్ప్రీత్ బుమ్రా 4-0-15-1 జడేజా 4-0-26-1 హార్దిక్ పాండ్యా 1-0-10-0 నెహ్రా 3-1-20-1 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్) రోంచి (బి)సాన్‌ట్నర్ 5, ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) మెకల్లమ్ 1, రైనా (సి)గప్టిల్(బి)సాన్‌ట్నర్ 1, యువరాజ్ (సి)&(బి)మెకల్లమ్ 4, కోహ్లి (సి)రోంచి(బి)సోధీ 23, ధోని (సి) మెకల్లమ్ (బి)సాన్‌ట్నర్ 30 పాండ్యా ఎల్బీడబ్ల్యు(బి)సాన్‌ట్నర్ 1, జడేజా (సి)&(బి)సోధీ 0, అశ్విన్ (స్టంప్) రోంచి (బి)సోధీ10 నెహ్రా (బి)మిల్నె 0 బుమ్రా(నాటౌట్)0, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (18.1 ఓవర్లలో) 79 వికెట్ల పతనం: 1-5; 2-10; 3-12; 4-26; 5-39 ; 6-42 ; 7-43 ; 8-73; 9-79; 10-79 బౌలింగ్: మెకల్లమ్ 3-0-15-2 సాన్‌ట్నర్ 4-0-11-4 ఇలియట్ 2-0-9-0 అండర్సన్ 3-0-18-0 సోధీ 4-0-18-3 మిల్నె 2.1-0-8-1 -
భారత్ లక్ష్యం 127
నాగ్‌పూర్: ప్రపంచ కప్ తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలింగ్ విభాగం సత్తా చాటింది. కివీస్ బ్యాట్స్‌మెన్ వేగానికి భారత బౌలర్లు దీటుగా అడ్డుకట్ట వేయగలిగారు. 126 పరుగలకే కివీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ జట్టు నెహ్రా నేతృత్వంలోని టీమిండియా బౌలింగ్ ముందు నిలువలేకపోయింది. భారత బౌలర్లు అశ్విన్, రైనా, బుమ్రా, జడేజా, నెహ్రా.. సమిష్టిగా రాణించి తలో వికెట్ తీశారు. బౌలర్ల ధాటికి నలుగురు బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరు లోపు ఔటయ్యారు. ఒక్క కోరీ అండర్సన్ (34), రోంచి (21) మాత్రమే బౌలర్ల కాస్తా ఎదుర్కొని ఓ మోస్తరుపరుగులు చేయగలిగారు. ఓపెనర్ గప్టిల్(7) అశ్విన్ బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ కొట్టి, మరుసటి బంతికే ఎల్బీ డబ్ల్యూగా వెనుదిరిగాడు. మున్రో(7) అదే ఓవర్లో మరో సిక్స్‌ర్ కొట్టి అనంతరం నెహ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. 32/2 పరుగల దగ్గర విలియమ్సన్ రనౌట్ నుంచి తృటిలో తప్పించుకున్నా, రైనా బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యాడు. పరుగులు రాబట్టే క్రమంలోనే రాస్ టేలర్ (10) రనౌట్‌గా వెనుదిరిగాడు. నిలకడగా ఆడుతున్న సమయంలోనే అండర్సన్(34) బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్లు పరుగులవేటలో విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి 126 పరుగులు చేయగలిగింది. అశ్విన్, రైనా, జడేజా, నెహ్రా, బుమ్రాలకు తలా ఓ వికెట్ లభించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: విలియమ్సన్; (బి) రైనా (స్టంప్) ధోనీ 8. గుప్టిల్; ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 6, కొలిన్ మున్రో; (బి) నెహ్రా (సి) పాండ్యా 7, రాస్ టేలర్, రనౌట్ 10 కోరీ అండర్సన్;(బి) జస్ప్రీత్ బుమ్రా 34 మిచెల్ శాంటర్ ;(బి)జడేజా (సి)ధోని 18 ఇలియట్,(రనౌట్) 9 రోంచి (నాటౌట్) 21 ఎక్స్‌ట్రాలు: 13 మొత్తం: (20 ఓవర్లలో ఏడు వికెట్లు) 126 వికెట్ల పతనం: 1-6; 2-13; 3-35; 4-61; 5-89 ; 6-98 ; 7-114 బౌలింగ్: అశ్విన్ 4-0-32-1 ; రైనా 4-0-16-1 జస్ప్రీత్ బుమ్రా 4-0-15-1 జడేజా 4-0-26-1 హార్దిక్ పాండ్యా 1-0-10-0 నెహ్రా 3-1-20-1 -
భారత్-పాక్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్
కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ నెల 19న ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ ప్రారంభానికి ముందు బిగ్ బీ జాతీయగీతం ఆలపించనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చొరవతోనే అమితాబ్ మ్యాచ్ కు రావడానికి ఒప్పుకున్నారని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు అమితాబ్ తో జాతీయ గీతం పాడించాలని ఎప్పటినుంచో సౌరవ్ గంగూలీ అనుకుంటున్నారని తెలిపారు. పాకిస్థాన్ జట్టు కూడా క్లాసికల్ సింగర్ షఫాకత్ అమనాత్ అలీతో తమ జాతీయ గీతం పాడించాలని భావిస్తోంది. -
నల్ల రిబ్బన్లతో న్యూజిలాండ్ ఆటగాళ్లు
నాగ్‌పూర్: టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ భుజాలకు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. తమ క్రికెట్ దిగ్గజం మార్టిన్ క్రో మృతికి నివాళిగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడిన 53 ఏళ్ల మార్టిన్ క్రో ఈనెల 3న మరణించిన విషయం విదితమే. 13 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రో వరుస గాయాలతో 33 ఏళ్లకే 1995లో రిటైర్మెంట్ ప్రకటించారు. 80ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీగా పరుగులు సాధించిన క్రో, నాడు న్యూజిలాండ్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు చాలా ఏళ్లు క్రో పేరిటే ఉండగా, అత్యధిక సెంచరీల రికార్డు (17) ఇంకా కొనసాగుతోంది. మార్టిన్ క్రో అనగానే ఈతరం అభిమానులకు కూడా గుర్తొచ్చేది 1992 ప్రపంచకప్. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా పించ్ హిట్టర్, స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడంలాంటి అపూర్వ వ్యూహాలతో టోర్నీకి ఆయన కొత్త కళ తెచ్చారు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
నాగ్‌పూర్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆరంభ మ్యాచ్ ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే ప్రారంభమైంది. గ్రూప్- బీలోని భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ విజయంతో దూకుడు మీద ఉన్న టీం ఇండియా సొంతగడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ను విజయంతో ప్రారంభించాలని ఉత్సాహంగా ఉంది. మరో వైపు న్యూజిలాండ్ కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో భారత్ పై విజయం సాధించాలని ఊవిల్లూరుతోంది. పిచ్, వాతావరణం: పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం, భారీ స్కోరు నమోదు కావచ్చని క్యురేటర్ కర్లేకర్ చెప్పారు. పేస్‌బౌలర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చు. మంచు ప్రభావం లేదు. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా న్యూజిలాండ్ : విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, రాంచీ, టేలర్, ఇలియట్, సాన్‌ట్నర్, మెకల్లమ్, సోధీ, ఆడమ్ మిల్నె, కోరీ అండర్సన్. -
భారత్, పాక్ మ్యాచ్ వేదిక మారింది..
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ వేదికలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మార్పుచేసింది. ఈ నెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ వేదికను కోల్ కతా కు మార్చుతున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానం దాయదుల పోరుకు సిద్ధం చేయనున్నారు. పాక్‌తో మ్యాచ్‌కు సరైన భద్రత ఇవ్వలేమని హిమాచల్ ప్రదేశ్ సీఎం తేల్చి చెప్పిన విషయం విదితమే. టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు గాను భారత్‌కు వచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియరైంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ మేరకు అనుమతి మంజూరు చేయడం ఇరుజట్లకు కలిసొచ్చే అంశం. -
ఆమిర్ కు థ్రిల్.. గుల్ కు షాక్
కరాచీ: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బుధవారం జాతీయ జట్టు ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై జైలు శిక్ష పడటంతో ఐదేళ్లు నిషేధానికి గురై, అటుపై నిరపరాధిగా తేలి తిరిగి జట్టులోకి వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్.. జట్టులో స్థానం పొంది మళ్లీ వార్తల్లో నిలిచాడు. సీనియర్ పేసర్ ఉమర్ గుల్, ఓపెనర్ అహ్మద్ షెహజాద్ లపై వేటు పడింది. సీనియర్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ నేతృత్వంలోని పాక్ జట్టు ఈ నెల 24 నుంచి బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న ఆసియాకప్ లో పాల్గొంటుంది. మార్చి 8 నుంచి భారత గడ్డపై జరుగనున్న టీ20 ప్రపంచకప్ లో పాక్ ఆడాల్సిన మ్యాచ్ ల వేదికలపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రతాకారణాల దృష్ట్యా ఇండియాలో ఆడబోమని పీసీబీ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లకు పాక్ జట్టు: షాహిద్ అఫ్రిది(కెప్టెన్), ఖుర్రం మంజూర్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఇఫ్తికార్ అహ్మద్, ఎమద్ వసీమ్, అన్వర్ అలీ, మొహమ్మద్ ఇర్ఫాన్, వాహబ్ రియాజ్, మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ నవాజ్, రుమన్ రయీజ్.