వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి వీరోచిత పోరాటం చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ గ్రేట్ ఇన్నింగ్స్ నుంచి మనమంతా ఐదు విషాయాలు నేర్చోవాలని తెలిపారు ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్. ఇందుకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కోహ్లీ నుంచి అందరూ నేర్చుకోవాల్సిన ఆ ఐదు విషయాలెంటో ఇప్పుడు చూద్దాం..
- బ్యాడ్ టైమ్ తాత్కాలికమే.. శాశ్వతం కాదు.
- ప్రదర్శనతోనే బదులివ్వాలి
- చివరి క్షణం వరకు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి
- ప్రజలు దేన్నైనా త్వరగా మర్చిపోతారనే విషయం గుర్తుంచుకోవాలి
- మీ ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు ఎంతపెద్ద కష్టాన్నైనా సులభంగా అధిగమించవచ్చు
#ViratKohli𓃵 की पारी से सीख:
— Awanish Sharan (@AwanishSharan) October 24, 2022
1. आपका बुरा समय भी स्थायी नहीं है
2. सिर्फ़ अपने परफ़ॉर्मेंस से ही जवाब दिया जा सकता
3. अंतिम समय तक अपनी भावनाओं पर नियंत्रण रखना
4. लोगों की याददाश्त बहुत छोटी होती है
5. जब आत्मविश्वास बढ़ता है तो कठिन परिस्थिति भी आसान लगती है
ఐఏఎస్ అధికారి చెప్పినట్లు ఈ ఐదు విషయాలు కోహ్లి ఇన్నింగ్స్ నుంచి అందరూ నేర్చుకోవచ్చు. పాక్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయతీరాలకు చేర్చాడు కోహ్లి. మ్యాచ్ పూర్తయాక భావోద్వానికి లోనయ్యాడు. తన కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడినట్లు చెప్పాడు.
చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం
Comments
Please login to add a commentAdd a comment