
చివరిబంతి వరకు ఉత్కంఠగా సాగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ 34 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. మరణించిన వ్యక్తిని బిటు గొగొయ్(34)గా గుర్తించారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం థియేటర్‌లో ప్రత్యక్షప్రసారం చేస్తున్న భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు బిటు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అయితే మ్యాచ్ చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఫ్రెండ్స్ వెంటనే అతడ్ని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కానీ బిటు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. థియేటర్‌లో అరుపులు, ఈలల గోల కారణంగా శబ్ద కాలుష్యంతో అతనికి గుండెపోటు వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బిటు తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. 34 ఏళ్లకే బిటుకు నూరేళ్లు నిండుతాయని ఊహించలేదని కన్నీటిపర్యంతమయ్యారు.
చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం
Comments
Please login to add a commentAdd a comment