
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఫామ్‌తో లేమితో సతమతమవుతున్న కోహ్లి.. దాయాదితో జరిగిన మ్యాచ్‌తో తన రిథమ్‌ను తిరిగి పొందాడు. 242 పరుగుల లక్ష్య చేధనలో ఆఖరి వరకు క్రీజులో నిలబడిన కోహ్లి.. వరల్డ్ క్రికెట్‌లో తనకు మించిన ఛేజ్ మాస్టర్ లేడని మరోసారి నిరూపించుకున్నాడు.
కింగ్ కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లికి ఇది 51వ వన్డే సెంచరీ. మ్యాచ్ ముగిసి మూడు రోజులు అవుతున్నప్పటికి కోహ్లిపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ చేరాడు.
"వన్డేల్లో విరాట్ కోహ్లి కంటే మెరుగైన ఆటగాడిని నేను ఇప్పటివరకు చూడలేదు. అతడు ఇప్పుడు నన్ను (అత్యధిక వన్డే పరుగుల్లో) దాటేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అతడి కంటే ముందు కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. కాబట్టి వన్డేల్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలవాలని కోహ్లి భావిస్తాడనంలో సందేహం లేదు. కోహ్లి ఎప్పటిలాగే ఫిట్‌గా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఇదే ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేస్తాడని నేను అనుకుంటున్నాను.
అతడికి కష్టపడి పనిచేసే తత్వం ఉంది. అతడు ఇప్పటికీ సచిన్ కంటే 4,000 పరుగులు వెనుకబడి ఉన్నాడు. సచిన్‌ను కోహ్లి అధిగిమించలేడని చెప్పలేం. అతడిలో కసి ఉంటే కచ్చితంగా సచిన్‌ను దాటగలడు. టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్‌పై ఏ విధంగా అయితే కోహ్లి ఆడాడో.. ఇప్పడు ఈ టోర్నీలో కూడా అదే చేశాడు. అతడొక ఛాంపియన్ ప్లేయర్. ముఖ్యంగా వైట్‌బాల్ ఫార్మాట్లలో అతడిని మించిన వారు లేరని" పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో పేర్కొన్నాడు.
కాగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి తన 14,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు 299 మ్యాచ్‌ల్లో కోహ్లి 58.20 సగటుతో 14085 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్‌లో 51 సెంచరీలు ఉన్నాయి. కోహ్లి కంటే ముందు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర(14234), సచిన్(18426) ఉన్నారు.
చదవండి: మీ కంటే కోతులు బెటర్.. తక్కువగా తింటాయి: వసీం అక్రమ్
Comments
Please login to add a commentAdd a comment