భారత్ లక్ష్యం 127
నాగ్పూర్:
ప్రపంచ కప్ తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలింగ్ విభాగం సత్తా చాటింది. కివీస్ బ్యాట్స్మెన్ వేగానికి భారత బౌలర్లు దీటుగా అడ్డుకట్ట వేయగలిగారు. 126 పరుగలకే కివీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ జట్టు నెహ్రా నేతృత్వంలోని టీమిండియా బౌలింగ్ ముందు నిలువలేకపోయింది. భారత బౌలర్లు అశ్విన్, రైనా, బుమ్రా, జడేజా, నెహ్రా.. సమిష్టిగా రాణించి తలో వికెట్ తీశారు. బౌలర్ల ధాటికి నలుగురు బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరు లోపు ఔటయ్యారు. ఒక్క కోరీ అండర్సన్ (34), రోంచి (21) మాత్రమే బౌలర్ల కాస్తా ఎదుర్కొని ఓ మోస్తరుపరుగులు చేయగలిగారు.
ఓపెనర్ గప్టిల్(7) అశ్విన్ బౌలింగ్లో తొలి బంతికే సిక్సర్ కొట్టి, మరుసటి బంతికే ఎల్బీ డబ్ల్యూగా వెనుదిరిగాడు. మున్రో(7) అదే ఓవర్లో మరో సిక్స్ర్ కొట్టి అనంతరం నెహ్రా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. 32/2 పరుగల దగ్గర విలియమ్సన్ రనౌట్ నుంచి తృటిలో తప్పించుకున్నా, రైనా బౌలింగ్లో స్టంప్ ఔట్ అయ్యాడు. పరుగులు రాబట్టే క్రమంలోనే రాస్ టేలర్ (10) రనౌట్గా వెనుదిరిగాడు. నిలకడగా ఆడుతున్న సమయంలోనే అండర్సన్(34) బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.
అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్లు పరుగులవేటలో విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి 126 పరుగులు చేయగలిగింది. అశ్విన్, రైనా, జడేజా, నెహ్రా, బుమ్రాలకు తలా ఓ వికెట్ లభించింది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్:
విలియమ్సన్; (బి) రైనా (స్టంప్) ధోనీ 8.
గుప్టిల్; ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 6,
కొలిన్ మున్రో; (బి) నెహ్రా (సి) పాండ్యా 7,
రాస్ టేలర్, రనౌట్ 10
కోరీ అండర్సన్;(బి) జస్ప్రీత్ బుమ్రా 34
మిచెల్ శాంటర్ ;(బి)జడేజా (సి)ధోని 18
ఇలియట్,(రనౌట్) 9
రోంచి (నాటౌట్) 21
ఎక్స్‌ట్రాలు: 13
మొత్తం: (20 ఓవర్లలో ఏడు వికెట్లు) 126
వికెట్ల పతనం: 1-6; 2-13; 3-35; 4-61; 5-89 ; 6-98 ; 7-114
బౌలింగ్:
అశ్విన్ 4-0-32-1 ; రైనా 4-0-16-1 జస్ప్రీత్ బుమ్రా 4-0-15-1
జడేజా 4-0-26-1 హార్దిక్ పాండ్యా 1-0-10-0 నెహ్రా 3-1-20-1