భారత్ పై కివీస్ ఘన విజయం
నాగ్పూర్:
ప్రపంచ కప్ తొలి టీ20 మ్యాచ్ లో బౌలర్ల హవా కొనసాగింది. భారత బౌలర్లు కివీస్ బ్యాట్స్మెన్లను 126 పరుగుకే కట్టడి చేస్తే కివీస్ బౌలర్లు ఏకంగా భారత్ను 79 పరుగులకే పరిమితం చేశారు. పటిష్టమైన టాప్ ఆర్డర్ ఉన్న భారత్ లక్ష్య చేధనలో ఏ దశలోనూ పోటీని ఇవ్వలేకపోయింది. చిన్న లక్ష్యం అయినా కివీస్ బౌలర్ల దాటికి ఒక్కక్కరుగా భారత్ బ్యాట్స్మెన్లు పెవీలియన్కు క్యూకట్టడంతో కివీస్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20ల్లో భారత్ పై కివీస్ ఇప్పటి వరకు ఓటమి చెందని రికార్డును పదిలంగా ఉంచుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గప్టిల్(7) అశ్విన్ బౌలింగ్లో తొలి బంతికే సిక్సర్ కొట్టి, మరుసటి బంతికే ఎల్బీ డబ్ల్యూగా వెనుదిరిగాడు. మున్రో(7) అదే ఓవర్లో మరో సిక్స్ర్ కొట్టి అనంతరం నెహ్రా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. 32/2 పరుగల దగ్గర విలియమ్సన్ రనౌట్ నుంచి తృటిలో తప్పించుకున్నా, రైనా బౌలింగ్లో స్టంప్ ఔట్ అయ్యాడు. పరుగులు రాబట్టే క్రమంలోనే రాస్ టేలర్ (10) రనౌట్గా వెనుదిరిగాడు. నిలకడగా ఆడుతున్న సమయంలోనే అండర్సన్(34) బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. తర్వాతి బ్యాట్స్ మెన్లు పరుగులవేటలో విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి 126 పరుగులు చేయగలిగింది. అశ్విన్, రైనా, జడేజా, నెహ్రా, బుమ్రాలకు తలా ఓ వికెట్ లభించింది.
127 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఏ సమయంలోనూ దూకుడును చూపించ లేక పోయింది. తొలి ఓవర్లోనే ధావన్(1) మెకల్లమ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యు రూపంలో వెనుదిరిగాడు. రోహిత్ శర్మ(5), రైనా(1)లు వెంటవెంటేన ఔటయ్యారు. అనంతరం వచ్చిన యువరాజ్(4) నిరాశ పరిచాడు. నిలకడగా పరుగులు రాబడుతున్న సమయంలోనే కోహ్లీ(23) కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పాండ్యా(1), జడేజా(0)లు కూడా వెంటవెంటనే ఔటవ్వడంతో 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత ధోనీ(30) మినహా మిగతా బ్యాట్స్మెన్లు రాణించకపోవడంతో 79 పరుగులకే ఆలౌటైంది.
కివీస్ బౌలర్లలో సాన్‌ట్నర్ 4, సోధీ 3, మెకల్లమ్2 వికెట్లు దక్కాయి.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్:
విలియమ్సన్; (బి) రైనా (స్టంప్) ధోనీ 8.
గుప్టిల్; ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 6,
కొలిన్ మున్రో; (బి) నెహ్రా (సి) పాండ్యా 7,
రాస్ టేలర్, రనౌట్ 10
కోరీ అండర్సన్;(బి) జస్ప్రీత్ బుమ్రా 34
మిచెల్ శాంటర్ ;(బి)జడేజా (సి)ధోని 18
ఇలియట్,(రనౌట్) 9
రోంచి (నాటౌట్) 21
ఎక్స్‌ట్రాలు: 13
మొత్తం: (20 ఓవర్లలో ఏడు వికెట్లు) 126
వికెట్ల పతనం: 1-6; 2-13; 3-35; 4-61; 5-89 ; 6-98 ; 7-114
బౌలింగ్:
అశ్విన్ 4-0-32-1 ; రైనా 4-0-16-1 జస్ప్రీత్ బుమ్రా 4-0-15-1
జడేజా 4-0-26-1 హార్దిక్ పాండ్యా 1-0-10-0 నెహ్రా 3-1-20-1
భారత్ ఇన్నింగ్స్:
రోహిత్ (స్టంప్) రోంచి (బి)సాన్‌ట్నర్ 5,
ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) మెకల్లమ్ 1,
రైనా (సి)గప్టిల్(బి)సాన్‌ట్నర్ 1,
యువరాజ్ (సి)&(బి)మెకల్లమ్ 4,
కోహ్లి (సి)రోంచి(బి)సోధీ 23,
ధోని (సి) మెకల్లమ్ (బి)సాన్‌ట్నర్ 30
పాండ్యా ఎల్బీడబ్ల్యు(బి)సాన్‌ట్నర్ 1,
జడేజా (సి)&(బి)సోధీ 0,
అశ్విన్ (స్టంప్) రోంచి (బి)సోధీ10
నెహ్రా (బి)మిల్నె 0
బుమ్రా(నాటౌట్)0,
ఎక్స్‌ట్రాలు: 4;
మొత్తం: (18.1 ఓవర్లలో) 79
వికెట్ల పతనం: 1-5; 2-10; 3-12; 4-26; 5-39 ; 6-42 ; 7-43 ; 8-73; 9-79; 10-79
బౌలింగ్:
మెకల్లమ్ 3-0-15-2 సాన్‌ట్నర్ 4-0-11-4 ఇలియట్ 2-0-9-0
అండర్సన్ 3-0-18-0 సోధీ 4-0-18-3 మిల్నె 2.1-0-8-1