గ్రేట్ క్యాచ్.. హఫీజ్ అవుట్..! | Soumya Sarkar great catch in T20 World Cup | Sakshi
Sakshi News home page

గ్రేట్ క్యాచ్.. హఫీజ్ అవుట్..!

Published Wed, Mar 16 2016 4:40 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

గ్రేట్ క్యాచ్.. హఫీజ్ అవుట్..!

గ్రేట్ క్యాచ్.. హఫీజ్ అవుట్..!

కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఫీల్డర్ సౌమ్య సర్కార్ అద్భుతం చేశాడు. గ్రేట్ క్యాచ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడుతున్న మహ్మద్ హఫీజ్ ను పెవిలియన్ పంపాడు. అరాఫత్ సన్నీ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద సర్కారు అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ దాటే సమయంలో చేతిలోని బంతిని మైదానంలోకి విసిరేసి బౌండరీ దాటాడు. మళ్లీ బౌండరీ లోపలికి వచ్చి బంతిని ఒడిసి పట్టాడు.

మైదానంలోని ప్రేక్షకులతో పాటు టీవీల్లో వీక్షిస్తున్న వారందరూ సర్కార్ ఫీట్ ను ఆసక్తిగా తిలకించారు. సర్కార్ పట్టిన క్యాచ్ తో హఫీజ్ ను అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో అతడు నిరాశగా మైదానం వీడాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement