Soumya Sarkar
-
ఇది నాటౌటా?.. అంపైర్ నిర్ణయంపై విస్మయం.. వీడియో వైరల్
సెల్హాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి బంగ్లా ఛేదించింది. ఇక ఇది ఇలా ఉండగా.. మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది. క్లియర్‌గా ఔటైనప్పటికి థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఏం జరిగిందంటే? బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన బినురా ఫెర్నాండో తొలి బంతిని బౌన్సర్‌గా సంధించాడు. అయితే స్ట్రైక్‌లో ఉన్న సౌమ్య సర్కార్ ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. కానీ సర్కార్ మాత్రం డీఆర్ఎస్కు వెళ్లాడు. ఆల్ట్రాఎడ్జ్‌లో కూడా స్పైక్ రావడం స్క్రీన్‌లో కన్పిచండంతో సర్కార్ సైతం మైదానాన్ని వీడేందుకు సిద్దమయ్యాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. బ్యాట్‌కు బంతికి క్లియర్ గ్యాప్ ఉందని థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో శ్రీలంక ఆటగాళ్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు సైతం షాకయ్యారు. ఈ క్రమంలో లంక ఆటగాళ్లు అంపైర్లతో వాగ్వదానికి దిగారు. ఆ తర్వాత అంపైర్లు నచ్చచెప్పడంతో ఆట తిరిగి మళ్లీ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్‌గా ఔట్.. అంపైర్‌కు కళ్లు కన్పిచండం లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. DRAMA! Clear noise > on-field umpire signals out > review taken > 3rd umpire rules not out despite UltraEdge! Bangladesh-Sri Lanka always throws up a controversy 😶 . .#BANvsSL #FanCode pic.twitter.com/8hH9i65SD6 — FanCode (@FanCode) March 6, 2024 -
NZ vs Ban: బంగ్లా సంచలన విజయం.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర
New Zealand vs Bangladesh, 3rd ODI: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మూడో వన్డేలో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది. పటిష్ట కివీస్ జట్టును సొంతగడ్డపై 98 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. సిరీస్ కివీస్‌దే కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. కివీస్ బంగ్లాను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో వన్డేలోనూ ఏడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ జోరును కొనసాగిస్తూ వైట్‌వాష్ చేయాలని భావించిన న్యూజిలాండ్ ఆశలపై పర్యాటక బంగ్లా జట్టు నీళ్లు చల్లింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బంగ్లాదేశ్ పేసర్లు అయితే, ఆరంభం నుంచే దూకుడు పెంచిన బంగ్లా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్ ఇస్లాం మూడు, తాంజిం హసన్ సకీబ్ మూడు, సౌమ్యా సర్కార్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ ఒక వికెట్ పడగొట్టాడు. బంగ్లా ఫాస్ట్‌బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఓపెనర్ విల్ యంగ్ 26 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్, వరల్డ్‌కప్ సెంచరీల వీరుడు రచిన్ రవీంద్ర ఎనిమిది పరుగులకే పరిమితం అయ్యాడు. ఇక కెప్టెన్ టామ్ లాథం 21 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. నజ్ముల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ గడ్డపై కొత్త చరిత్ర లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌలింగ్‌తో ఆకట్టుకున్న బ్యాటర్ సౌమ్యా సర్కార్ 16 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అనముల్ హక్ 37 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో అజేయ అర్ధ శతకం బాదాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్ గడ్డమీద ఇదే తొలి వన్డే విజయం కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం! -
చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
నెల్సన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సర్కార్.. ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝుళిపించాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో బంగ్లా క్రికెటర్‌గా సర్కార్ నిలిచాడు. ఈ జాబితాలో లిట్టన్ దాస్(176) అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్ రికార్డు బ్రేక్.. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సర్కార్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆసియా క్రికెటర్‌గా సర్కార్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 2009లో క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 163 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అయితే తాజా మ్యాచ్‌తో సర్కార్ 14 ఏళ్ల మాస్టర్‌బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్‌క్యాప్స్ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్(169) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్సన్, ఆశోక్ చెరో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 23న నేపియర్ వేదికగా జరగనుంది. -
'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో ఇండియా-ఏ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీఫైనల్లో ఇండియా-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే సెమీఫైనల్ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎక్కడా తగ్గలేదు. మొదట టీమిండియా బ్యాటింగ్ సమయంలో వికెట్ పడ్డ ప్రతీసారి బంగ్లా ఆటగాళ్లు టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ పెవిలియన్ సిగ్నల్ చూపించారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు.. పదే పదే అదే చర్యకు పాల్పడుతూ శ్రుతి మించారు. ఇదంతా టీమిండియా ఆటగాళ్లు గమనిస్తూనే వచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా సైలెంట్‌గా ఉన్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఇండియా- ఏ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. బంగ్లా వికెట్ కోల్పోయిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్, ఇండియా-ఏ ఆటగాడు హర్షిత్ రానాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకోవడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 26వ ఓవర్ యువరాజ్‌సిన్హ్ దోదియా వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సౌమ్యా సర్కర్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న నికిన్ జోస్‌కు దొరికిపోయాడు. కీలక వికెట్ కావడంతో ఇండియా-ఏ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. అయితే హర్షిత్ రానా సౌమ్యా సర్కర్ మొహం ముందు గట్టిగా అరుస్తూ పంచ్‌లు గుద్దుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది నచ్చిన సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాతో గొడవకు దిగాడు. ఇద్దరు మాటమాట అనుకున్నారు. అంపైర్ వచ్చేలోపే ఇద్దరు దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ వచ్చి సౌమ్యా సర్కార్‌ను వెళ్లమంటూ పక్కకు తీసుకెళ్లాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న సమయంలోనూ సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాపై మాటల యుద్దం కొనసాగించాడు. అయితే హర్షిత్ రానా ఇంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో యష్‌దుల్ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసి శ్రుతి మించాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్ రానా సౌమ్యా సర్కార్ ఔటవ్వగానే బదులు తీర్చుకున్నాడు. ''నువ్వు మొదలుపెట్టావ్..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది'' అంటూ కామెంట్ చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. India vs Bangladesh - never short of some heat 🔥 . .#EmergingAsiaCup2023 #INDAvBANA pic.twitter.com/xxnMx8Arez — FanCode (@FanCode) July 21, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా Lionel Messi: మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా -
చెలరేగిన బంగ్లా బ్యాట్స్‌మెన్.. తొలి టీ20లో జింబాబ్వేపై గెలుపు
హరారే: జింబాబ్వే గడ్డపై బంగ్లాదేశ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా జట్టు.. మూడు టీ20ల సిరీస్‌లోను బోణీ కొట్టింది. గురువారం జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిన బంగ్లా.. 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రెగిస్ చకబ్వా(22 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డియోన్ మైర్స్(22 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/31) మూడు వికెట్లతో చెలరేగగా.. సైఫుద్దీన్(2/23), షోరిఫుల్ ఇస్లామ్(2/17) చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్‌లకు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లా జట్టు ఆడుతూ పాడుతూ 18.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు మహమ్మద్ నైమ్(51 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు), సౌమ్య సర్కార్(45 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు ఒక్క వికెట్ తీయలేకపోవడం గమనార్హం. బంగ్లా రెండు వికెట్లు కూడా రనౌట్ల రూపంలోనే కోల్పోయింది. ఇక వికెట్‌తో పాటు హాఫ్ సెంచరీ సాధించిన సౌమ్య సర్కార్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా శుక్రవారం జరగనుంది. -
ధావన్ ట్వీట్‌ను కాపీ కొట్టిన బంగ్లా క్రికెటర్!
లండన్ : టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. యువీ రిటైర్మెంట్పై యావత్ క్రికెట్ ప్రపంచం స్పందించింది. సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల జల్లు కురిపించింది. అతనితో ఉన్న జ్ఞాపకాలను రికార్డులను నెమరవేసుకుంది. ఇక యువీ వీరాభిమాని అయిన బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్యా సర్కార్ సైతం తన ఆరాధ్య క్రికెటర్‌కు ఘన వీడ్కోలు పలుకుతూ ఫేస్బుక్ వేదికగా అభినందనలు తెలిపాడు. ‘నీ గైడెన్స్, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు యువీ పాజీ. నేను చూసినవారిలో నువ్వొక గొప్ప లెప్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్. నేనెప్పుడు నీ స్టైల్, బ్యాటింగ్ టెక్నిక్‌ను అనుసరించాలని ప్రయత్నిస్తుంటాను. నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను. నీ ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను’ అని విషెస్ చెప్పాడు. (చదవండి : యువరాజ్ గుడ్‌బై) అయితే ఈ పోస్టులో పేర్కొన్న సేమ్ వ్యాఖ్యలను టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన ట్వీట్లో పేర్కొన్నాడు. కాకపోతే ధావన్.. యువీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే ట్వీట్ చేయగా.. సౌమ్య సర్కార్ మాత్రం మరుసటి రోజు ఉదయం తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ధావన్ ట్వీట్‌నకు సౌమ్యా సర్కార్ ఎఫ్బీ పోస్ట్‌కు ఒక్క అక్షరం కూడా తేడాలేకపోవడం గమానార్హం. దీంతో సౌమ్య సర్కార్, ధావన్ ట్వీట్‌ను కాపీ కొట్టాడని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: మైదానంలో ‘మహరాజు’) Thank you, Yuvi paaji for all the guidance, support & love. ♥ You are one of the best left-handed batsmen I have come across. I always looked up to your style & batting technique, have learnt so much from you! Wish you prosperity & success in your new journey. Rab rakha 💪🏻 pic.twitter.com/AQH4LkgS0Q — Shikhar Dhawan (@SDhawan25) June 10, 2019 -
కివీస్ ఇన్నింగ్స్ విజయం
హామిల్టన్: తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో గెలిచింది కానీ... బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సౌమ్య సర్కార్ (171 బంతుల్లో 149; 21 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ మహ్ముదుల్లా (229 బంతుల్లో 146; 21 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ప్రదర్శన నాలుగో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. కివీస్ భారీస్కోరు (715/6 డిక్లేర్డ్) దృష్ట్యా విజయం ఖాయమైందని ఉత్సాహంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లను సౌమ్య, మహ్ముదుల్లా ద్వయం చెమటలు కక్కించింది. 307 పరుగుల లోటుతో ఓవర్‌నైట్ స్కోరు 174/4తో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడింది. సౌమ్య సర్కార్, మహ్ముదుల్లా శతకాలతో కదంతొక్కారు. తమ పోరాటంతో కివీస్ విజయాన్ని అంతకంతకు ఆలస్యం చేశారు. ఇద్దరు ఐదో వికెట్‌కు 235 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 103 ఓవర్లలో 429 పరుగుల వద్ద ఆలౌటైంది. వాళ్లిద్దరు మినహా ఇంకెవరూ 5 పరుగులైనా చేయలేకపోయారు. సౌమ్యతో పాటు లిటన్ దాస్ (1), అబు జయెద్ (3)లను బౌల్ట్ పెవిలియన్ చేర్చగా, సౌతీ బౌలింగ్‌లో మహ్ముదుల్లా, ఎబదత్ హొస్సేన్ (0) ఔటయ్యారు. మరో రోజు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే వికెట్‌తో సరిపెట్టుకున్న పేసర్ బౌల్ట్ ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సౌతీ 3, వాగ్నర్ 2 వికెట్లు తీశారు. డబుల్ సెంచరీ సాధించిన కివీస్ సారథి విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టెస్టు ఈ నెల 8 నుంచి వెల్లింగ్టన్లో జరుగుతుంది. -
ఇప్పటికీ ఆ మ్యాచ్ గుర్తొస్తే బాధగా ఉంది
-
‘ఆరోజు నేను బాగా బౌలింగ్ చేసుంటే..’
ఢాకా: నిదహాస్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఓటమిని బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చివరి వరకూ గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ చివరి బాల్కి తలకిందులవ్వడాన్ని బంగ్లా ప్లేయర్లు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే మ్యాచ్ ఓటమిపై బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హుస్సేన్ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను ధారాళంగా పరుగులివ్వడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని, ఈ విషయంలో అభిమానులు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. తమ జట్టు ఓటమికి తానే కారణమవుతానని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నానని, ఈ ఒక్కసారికి వదిలేయాలని అభిమానులకు కోరాడు. తాజాగా చివరి ఓవర్ వేసిన సౌమ్య సర్కార్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి తాను కూడా కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను ఇంతకుముందు కూడా బౌలింగ్ చేసాను.. కానీ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. ఈ మ్యాచ్‌తో ఎలాంటి పరిస్థితులోనైనా కట్టుదిట్టంగా బాల్స్ వేయగలననే నమ్మకం వచ్చింది. గతంలో మా జట్టు టీ20 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓటమి చవిచూసేది. కానీ ఇపుడు 200 పరుగులు లక్ష్మాన్ని కూడా చేయగలుగుతున్నాం. అదే విధంగా భారీ లక్ష్యాలను కూడా సునాయాసంగా చేధించగలుగుతున్నాము. కానీ మొన్నటి మ్యాచ్ ఓటమి మరచిపోలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ మ్యాచ్ గుర్తొస్తే బాధగా ఉంది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి అవసరమైన 12 పరుగుల్ని సమర్పించుకోవడం నా కెరీర్లో చేదు జ్ఞాపకం. ప్రధానంగా చివరి బంతికి సిక్సర్ ఇచ్చి మా పరాజయంలో భాగమయ్యా. ఆ రోజు నేను బాగా బౌలింగ్ చేసి ఉంటే 16 కోట్ల మంది పెదవులపై చిరునవ్వును చూసేవాళ్లం’ అని సౌమ్య తెలిపాడు. బంగ్లాదేశ్‌తో గత ఆదివారం ఉత్కంఠభరింతగా జరిగిన నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సౌమ్య వేసిని ఆఖరి బంతిని దినేష్ కార్తిక్ సిక్స్‌గా మార్చడంతో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. -
బౌల్డ్ పై డీఆర్ఎస్ కు వెళ్లాడు..
-
బౌల్డ్ పై డీఆర్ఎస్ కు వెళ్లాడు..
గాలె: సాధారణంగా ఎల్బీలు, క్యాచ్‌లు వంటి అనుమానాస్పద నిర్ణయాల్లో మాత్రమే అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని క్రికెటర్లు కోరుతుంటారు. అయితే శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ ను సవాల్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతమైన నవ్వులు తెప్పించింది. శనివారం చివరి రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ ఆటగాడు సౌమ్య సర్కార్ బౌల్డ్ అయ్యాడు. శ్రీలంక మీడియం ఫాస్ట్ బౌలర్ గుణరత్నే బౌలింగ్ లో్ సౌమ్య సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే బౌల్డ్ అయిన విషయాన్ని పూర్తిగా చూడని సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ కు వెళ్లాడు. సౌమ్య సర్కార్ బౌల్డ్ అయ్యే క్రమంలో ఫీల్డ్ అంపైర్ కాస్త ఆలస్యంగా నిర్ణయం ప్రకటించడంతో అసలు వికెట్ల వద్ద ఏమి జరిగిందో అనే విషయాన్ని అతను పట్టించుకోలేదు. తన అవుట్ ను సవాల్ చేసే ముందు తాను ఎందుకు డీఆర్ఎస్ కు వెళ్లాల్సివచ్చిందో కనీసం తెలియకపోవడం అభిమానుల్లో నవ్వులు పూయించింది. ఆ మ్యాచ్ లో శ్రీలంక 259 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
గ్రేట్ క్యాచ్.. హఫీజ్ అవుట్..!
కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఫీల్డర్ సౌమ్య సర్కార్ అద్భుతం చేశాడు. గ్రేట్ క్యాచ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడుతున్న మహ్మద్ హఫీజ్ ను పెవిలియన్ పంపాడు. అరాఫత్ సన్నీ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద సర్కారు అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ దాటే సమయంలో చేతిలోని బంతిని మైదానంలోకి విసిరేసి బౌండరీ దాటాడు. మళ్లీ బౌండరీ లోపలికి వచ్చి బంతిని ఒడిసి పట్టాడు. మైదానంలోని ప్రేక్షకులతో పాటు టీవీల్లో వీక్షిస్తున్న వారందరూ సర్కార్ ఫీట్ ను ఆసక్తిగా తిలకించారు. సర్కార్ పట్టిన క్యాచ్ తో హఫీజ్ ను అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో అతడు నిరాశగా మైదానం వీడాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. -
బంగ్లాదేశ్ బోణీ
► క్వాలిఫయింగ్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపు ► తమీమ్ ఒంటరిపోరాటం ధర్మశాల: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బోణీ చేసింది. తమీమ్ ఇక్బాల్ (58 బంతుల్లో 83 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో... బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 8 పరుగుల స్వల్ప తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆరంభంలో డచ్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాకు శుభారంభం దక్కలేదు. ఓ ఎండ్‌లో తమీమ్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సౌమ్య సర్కార్ (15), షబ్బీర్ (15) కాసేపు పోరాడారు. గుగెటెన్ 3, వాన్ మీకెరెన్ 2 వికెట్లు తీశారు. తర్వాత నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులకే పరిమితమైంది. బోరెన్ (29), మైబర్గ్ (29), కూపర్ (20) ఓ మాదిరిగా ఆడారు. చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన దశలో డచ్ ఆటగాళ్లు బుకారి (14), పీటర్ సీలర్ (7 నాటౌట్)లు ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టారు. అయితే తస్కిన్ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు మాత్రమే రావడంతో ఓటమి తప్పలేదు. అల్ అమిన్, షకీబ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తమీమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
సౌమ్య సర్కార్ అర్ధ సెంచరీ
హామిల్టన్: న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ సౌమ్య సర్కార్ అర్ధ సెంచరీ సాధించాడు. 55 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది తొలి అర్ధసెంచరీ కావడం విశేషం. 6వ వన్డే ఆడుతున్న సర్కార్ కు వన్డేల్లో వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. 51 పరుగులు చేసి 3వ వికెట్ గా అవుటయ్యాడు. మహ్మదుల్లా దుల్లా కూడా అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 108 బంతుల్లో 90 పరుగులు జోడించారు. 30 ఓవర్లలో 126/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.