
సౌమ్య సర్కార్ అర్ధ సెంచరీ
హామిల్టన్: న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ సౌమ్య సర్కార్ అర్ధ సెంచరీ సాధించాడు. 55 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది తొలి అర్ధసెంచరీ కావడం విశేషం. 6వ వన్డే ఆడుతున్న సర్కార్ కు వన్డేల్లో వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. 51 పరుగులు చేసి 3వ వికెట్ గా అవుటయ్యాడు.
మహ్మదుల్లా దుల్లా కూడా అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 108 బంతుల్లో 90 పరుగులు జోడించారు. 30 ఓవర్లలో 126/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.