ధావన్‌ ట్వీట్‌ను కాపీ కొట్టిన బంగ్లా క్రికెటర్‌! | Soumya Sarkar Copies Shikhar Dhawan Post on Yuvraj Singh Retirement | Sakshi
Sakshi News home page

ధావన్‌ ట్వీట్‌ను కాపీ కొట్టిన బంగ్లా క్రికెటర్‌!

Published Fri, Jun 14 2019 2:34 PM | Last Updated on Fri, Jun 14 2019 2:46 PM

Soumya Sarkar Copies Shikhar Dhawan Post on Yuvraj Singh Retirement - Sakshi

సౌమ్యా సర్కార్‌

లండన్‌ : టీమిండియా దిగ్గజ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. యువీ రిటైర్మెంట్‌పై యావత్‌ క్రికెట్‌ ప్రపంచం స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల జల్లు కురిపించింది. అతనితో ఉన్న జ్ఞాపకాలను రికార్డులను నెమరవేసుకుంది. ఇక యువీ వీరాభిమాని అయిన బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్యా సర్కార్‌ సైతం తన ఆరాధ్య క్రికెటర్‌కు ఘన వీడ్కోలు పలుకుతూ ఫేస్‌బుక్‌ వేదికగా అభినందనలు తెలిపాడు. ‘నీ గైడెన్స్‌, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు యువీ పాజీ. నేను చూసినవారిలో నువ్వొక గొప్ప లెప్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌. నేనెప్పుడు నీ స్టైల్‌, బ్యాటింగ్‌ టెక్నిక్‌ను అనుసరించాలని ప్రయత్నిస్తుంటాను. నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను. నీ ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను’ అని విషెస్‌ చెప్పాడు. (చదవండి : యువరాజ్‌ గుడ్‌బై)

అయితే ఈ పోస్టులో పేర్కొన్న సేమ్‌ వ్యాఖ్యలను టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాకపోతే ధావన్‌.. యువీ రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజే ట్వీట్‌ చేయగా.. సౌమ్య సర్కార్‌ మాత్రం మరుసటి రోజు ఉదయం తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ధావన్‌ ట్వీట్‌నకు సౌమ్యా సర్కార్‌ ఎఫ్‌బీ పోస్ట్‌కు ఒక్క అక్షరం కూడా తేడాలేకపోవడం గమానార్హం. దీంతో సౌమ్య సర్కార్‌, ధావన్‌ ట్వీట్‌ను కాపీ కొట్టాడని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: మైదానంలో ‘మహరాజు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement