టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫియర్-ఎలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా మలేషియా వేదికగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మంగోలియా 10 ఓవర్లు ఆడి కేవలం 10 పరుగులకే కుప్పకూలింది.
ఆ జట్టు బ్యాటర్లలో ఐదు డకౌట్లు కాగా.. నలుగురు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. మంగోలియా ఇన్నింగ్స్‌లో 2 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. ఇక సింగపూర్ బౌలర్లలో హర్ష భరద్వాజ్ ఆరు వికెట్లు పడగొట్టగా.. ఆక్షయ్ పూరీ రెండు, రాహుల్, రమేష్ తలా వికెట్ సాధించారు.
10 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సింగపూర్ 0.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఆలౌటైన మంగోలియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
టీ20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన ఐస్లీ ఆఫ్ మ్యాన్ రికార్డును మంగోలియా సమం చేసింది. గతేడాది స్పెయిన్‌పై ఐస్లీ ఆఫ్ మ్యాన్ జట్టు కూడా 10 పరుగులకే చాపచుట్టేసింది.
తుది జట్లు
మంగోలియా: మోహన్ వివేకానందన్, సంచిర్ నట్సగ్డోర్జ్, దవాసురేన్ జమ్యాన్సురెన్, సోడ్బిలెగ్ గంతుల్గా, గండెంబెరెల్ గాన్‌బోల్డ్(వికెట్ కీపర్), లువ్‌సంజుండుయ్ ఎర్డెనెబుల్గాన్(కెప్టెన్), టెములెన్ అమర్‌మేండ్, జోల్జావ్ఖ్లాన్ షురెంత్‌సెట్సేగ్, టర్బోల్డ్ బట్జర్గల్, తుర్ముంఖ్ తుముర్సుఖ్, ఎంఖ్బాత్ బత్ఖుయాగ్
సింగపూర్: సురేంద్రన్ చంద్రమోహన్, అర్జున్ ముత్రేజా, విలియం సింప్సన్, మన్‌ప్రీత్ సింగ్(వికెట్ కీపర్), అమన్ దేశాయ్, అమర్త్య కౌల్, హర్ష భరద్వాజ్, అక్షయ్ పూరి, రాహుల్ శేషాద్రి, రౌల్ శర్మ, రమేష్ కలిముత్తు
చదవండి: Duleep Trophy: నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్.. ఆరు ఫోర్లు కొట్టి..
Comments
Please login to add a commentAdd a comment