Singpore
-
T20 WC Qualifiers: పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్
టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫియర్-ఎలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా మలేషియా వేదికగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మంగోలియా 10 ఓవర్లు ఆడి కేవలం 10 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో ఐదు డకౌట్లు కాగా.. నలుగురు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. మంగోలియా ఇన్నింగ్స్‌లో 2 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. ఇక సింగపూర్ బౌలర్లలో హర్ష భరద్వాజ్ ఆరు వికెట్లు పడగొట్టగా.. ఆక్షయ్ పూరీ రెండు, రాహుల్, రమేష్ తలా వికెట్ సాధించారు. 10 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సింగపూర్ 0.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఆలౌటైన మంగోలియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన ఐస్లీ ఆఫ్ మ్యాన్ రికార్డును మంగోలియా సమం చేసింది. గతేడాది స్పెయిన్‌పై ఐస్లీ ఆఫ్ మ్యాన్ జట్టు కూడా 10 పరుగులకే చాపచుట్టేసింది.తుది జట్లుమంగోలియా: మోహన్ వివేకానందన్, సంచిర్ నట్సగ్డోర్జ్, దవాసురేన్ జమ్యాన్సురెన్, సోడ్బిలెగ్ గంతుల్గా, గండెంబెరెల్ గాన్బోల్డ్(వికెట్ కీపర్), లువ్సంజుండుయ్ ఎర్డెనెబుల్గాన్(కెప్టెన్), టెములెన్ అమర్మేండ్, జోల్జావ్ఖ్లాన్ షురెంత్సెట్సేగ్, టర్బోల్డ్ బట్జర్గల్, తుర్ముంఖ్ తుముర్సుఖ్, ఎంఖ్‌బాత్ బత్ఖుయాగ్సింగపూర్: సురేంద్రన్ చంద్రమోహన్, అర్జున్ ముత్రేజా, విలియం సింప్సన్, మన్‌ప్రీత్ సింగ్(వికెట్ కీపర్), అమన్ దేశాయ్, అమర్త్య కౌల్, హర్ష భరద్వాజ్, అక్షయ్ పూరి, రాహుల్ శేషాద్రి, రౌల్ శర్మ, రమేష్ కలిముత్తుచదవండి: Duleep Trophy: నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్.. ఆరు ఫోర్లు కొట్టి.. -
Gotabaya Rajapaksa: సింగపూర్‌లో ‘గొటబయ’కు ఊహించని షాక్..!
సింగపూర్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రజాగ్రహంతో దేశం విడిచిన గొటబయ రాజపక్స ప్రస్తుతం సింగపూర్‌లో తలదాచుకుంటున్నారు. అయితే.. అక్కడా ఊహించని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రజాహక్కుల గ్రూప్ గొటబయపై క్రిమినల్ కేసు పెట్టింది. యుద్ధ నేరాల ఆరోపణలతో గొటబయను అరెస్ట్ చేయాలంటూ.. సింగపూర్ అటార్నీ జెనరల్‌కు 63 పేజీల ఫిర్యాదును అందజేశారు ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్(ఐటీజేపీ) న్యాయవాదులు. 2009లో జరిగిన అంతర్యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న రాజపక్సే.. జెనీవా ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. అవి అంతర్జాతీయ న్యాయపరిధిలో భాగంగా సింగపూర్ దేశీయ ప్రాసిక్యూషన్‌కు లోబడిన నేరాలుగా పేర్కొన్నారు. పిటిషన్ ప్రకారం.. అంతర్యుద్ధం సమయంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టం, అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలను గొటబయ ఉల్లంఘించారు.‘అందులో హత్య, ఉరి తీయించటం, వేధించటం, అమానవీయంగా కొట్టటం, అత్యాచంర, ఇతర లైంగిక వేధింపులు, స్వేచ్ఛను హరించటం, మానసికంగా క్షోభకు గురిచేయంట వంటివి ఉన్నాయి. ఆర్థిక మాంద్యంతో ప్రభుత్వం పతనాన్ని చూసింది, అయితే శ్రీలంకలో సంక్షోభం నిజంగా మూడు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్రితం జరిగిన తీవ్రమైన అంతర్జాతీయ నేరాలతో ముడిపడి ఉంది. ఈ ఫిర్యాదు కేవలం అవినీతి, ఆర్థిక అవకతవకల గురించే కాదు.. తీవ్ర నేరాలకు బాధ్యత వహించాలని నమోదు చేశాం.’ అని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోస్మిన్ సూకా పేర్కొన్నారు. గొటబయ రాజపక్సను అరెస్ట్ చేసి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని కోరింది ఐటీజేపీ. 1989లో ఆయన ఆర్మీ కమాండర్‌గా ఉన్నప్పుడు.. సుమారు 700 మంది కనిపించకుండా పోయారని ఆరోపించింది. ముఖ్యంగా రక్షణ శాఖ సెక్రెటెరీగా ఉన్నప్పుడు ఆ నేరాలు మరింత పెరిగాయని తెలిపింది. తన కింది అధికారులకు టెలిఫోన్ ద్వారా నేరుగా ఆదేశాలు ఇచ్చి ప్రజలపై దాడి చేయించే వారని ఆరోపించింది. ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టి చోరీకి పాల్పడిన దుండగులు.. వీడియో వైరల్! -
ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కరోనా.. కోర్టు తీర్పు ఏంటంటే..
కౌలాలంపూర్: ఓ వ్యక్తి కోవిడ్ సోకడం వల్ల కోర్టు చివరి నిమిషంలో మరణశిక్ష అమలుపై స్టే విధించింది. ఈ ఘటన సింగపూర్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. 2009లో నాగేంద్రన్ కే ధర్మలింగం పోలీసులు అరెస్టు చేశారు. మరుసటి సంవత్సరమే అతనికి మరణశిక్ష విధించారు. ముందస్తు తీర్పు ప్రకారం బుధవారం రోజు అతనికి ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి ఈ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోసారి సైకియాట్రి పరీక్షలు చేయాలని కోర్టుకు నాగేంద్రన్ లాయర్ కోరారు. మంగళవారం సవాల్‌పై విచారణ జరగనున్నందున అప్పీల్ కోర్టులో చివరి ప్రయత్నంగా అప్పీల్ దాఖలు చేయడంతో ఉరిశిక్షను నిలిపివేశారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణుల బృందం సోమవారం ఈ కేసు చుట్టూ పెరుగుతున్న ఆందోళనలకు తమ స్వరాన్ని జోడించింది, మేధో వైకల్యం ఉన్న వ్యక్తులను ఉరితీయకూడదని పేర్కొంది. అతని శిక్షను తగ్గించాలని యూరోపియన్ యూనియన్ పిలుపునిచ్చింది. నాగేంద్రన్ మరణశిక్షను తగ్గించాలని కోరుతూ ఇప్పటికే ఆన్లైన్ పిటిషన్‌పై దాదాపు 70,000 సంతకాలు వచ్చాయి. కానీ సింగపూర్ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉరితో ముందుకు వెళ్లాలనే నిర్ణయాన్ని సమర్థించింది. చివరికి ఉరిశిక్ష అమలు జరిగితే, సింగపూర్‌లో 2019 తర్వాత ఇది మొదటిది అవుతుంది. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. -
చైనాను వదిలేస్తే భారత్ వైపు చూడండి: బిల్‌గేట్స్
కౌలాలంపూర్: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సింగపూర్‌లో జరుగుతున్న ఫిస్ ఎటక్ ఫెస్టివల్ వర్చ్యువల్ విధానంలో మంగళవారం పాల్గోన్న ఆయన ఈ సందర్భంగా భారత ఆర్థిక విధానాన్ని ప్రశంసించారు. వినూత్న ఆర్థిక విధానాలను అవలంభించడంలో ఇండియా మిగతా దేశాల కంటే ముందు నిలిచిందన్నారు. అంతేగాక అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను భారత్ చక్కగా వినియోగిస్తోందని, ఒకవేళ చైనాను వదిలేసి మరో దేశంపై అధ్యయనం చేయాలనుకునే ప్రపంచ దేశాలు ఏవైనా తప్పనిసరిగా ఇండియాను ఎంచుకోవాలని ఆయన సూచించారు. అదే విధంగా ప్రపంచంలోని అతిపెద్ద బయో మెట్రిక్ డేటా బేస్ ఇప్పటికే భారత్‌లో సిద్ధమైందని, డబ్బు బట్వాడా బ్యాంకుల ద్వారా కాకుండా స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా జరుగుతుండటం కూడా ఇండియాలో శరవేగంగా విస్తరిస్తోందన్నారు. అంతేగాక భారత ప్రభుత్వాలు సైతం పేదలందరికి సంక్షేమ పథకాలను దగ్గర చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!) ఇక 2016లో పెద్ద నోట్ల రద్దు తరువాత భారత్‌లో డిజిటల్ చెల్లింపులు ఎంతో పెరిగాయని, అవినీతిని నిర్మూలనకు తీసుకున్న ఈ నిర్ణయంతో దేశం మొత్తం నగదు రహితంగా మార్చేందుకు సహకరించిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల యూనిఫైడ్ పేమెంట్స్, ఇంటర్ ఫేస్ సేవలు విస్తరించాయని తెలిపారు. వైర్లెస్ డేటా రేట్లు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నది కూడా ఇండియాలోనేనని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో స్మార్ట్ ఫోన్ల ధరలు సైతం తక్కువగా ఉన్నాయని, దీంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్లు కనిపిస్తున్నాయన్నారు. ఫేస్బుక్, అమెజాన్, వాల్ మార్ట్, పేటీఎం సహా అన్ని కంపెనీలు తమ సేవలకు యూపీఐ ప్లాట్ ఫాంను వాడటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందని కితాబిచ్చారు. అయితే ఇదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఎన్నో దేశాలు విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ప్రపంచమంతా పంపిణీ చేయగలదు) -
ఆర్యవైశ్య సభ సింగపూర్ విభాగానికి నూతన కార్యవర్గం
సింగపూర్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) అంతర్జాతీయ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ సింగపూర్ విభాగానికి మంగళవారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. వామ్ సింగపూర్ విభాగానికి అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శిగా పట్టూరి కిరణ్ కుమార్, కోశాధికారిగా వుద్ధగిరి సతీష్, ఉపాధ్యక్షులుగా కంకిపాటి శశిధర్‌తో కూడిన నూతనకార్యవర్గం నియమితులైంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు భాస్కర్ గుప్త మాట్లాడుతూ అంతర్జాతీయ విభాగ సూచనలతో, అందరి సహాయ సహకారాలతో సింగపూర్‌లో నివశించే ఆర్యవైశ్యుల కోసం మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కొత్త కార్యవర్గానికి త్వరలోనే నియామకపత్రాలను జారీ చేస్తామని అంతర్జాతీయ కార్యదర్శి పసుమర్తి మల్లిఖార్జున గుప్త వెల్లడించారు. సింగపూర్ విభాగం అంటే తనకు ప్రత్యేక శ్రద్ధఅని, నూతన కమిటీ వినూత్న కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందగలదని తాను బలంగా నమ్ముతున్నానని వామ్ గ్లోబల్ ఎన్నారై చైర్మన్ యమ్.యన్.ఆర్. గుప్త పేర్కొన్నారు. నూతన కార్యవర్గానికి సింగపూర్ ఆర్యవైశ్యులు శుభాభినందనలు తెలిపారు. -
సింగపూర్‌లో సీతారాముల కళ్యాణం
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న స్థానిక శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయ సమీపంలోని పీజీపీ హాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం అట్టహాసంగా జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం భద్రాచలం నుంచి అర్చక బృందం రానున్నారు. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం అని పండితులు అంటున్నారు. రాముడు జన్మించిన సంవత్సరం విలంబ అని, మరలా అరవై సంవత్సరాలకు గాని రాని విలంబ నామ సంవత్సరంలో కళ్యాణదర్శన ఫలం ద్విగుణీకృతం అవుతుందని పేర్కొన్నారు. శ్రీరామనవమి రోజున భద్రాద్రిలో ఏవిధంగా సీతారామ కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా జరుపుటకు, భద్రాచల దివ్య మూర్తులతో సింగపూర్ వస్తున్నామని అర్చకులు తెలిపారు. శ్రీ సీతారామ కళ్యాణము చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివచ్చి శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా తిలకించి పులకితులవుతారని తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అన్నారు. అటువంటి స్వామి స్వయంగా మన సింగపూర్ వచ్చి మనకు కళ్యాణదర్శనం కల్పించడం మన అందరి అదృష్టమని, ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని కోటిరెడ్డి కోరారు. అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరుపుటకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని కార్యదర్శి సత్య చిర్ల తెలిపారు. ఉదయం పూట కళ్యాణమహోత్సవం, సాయంత్రం రామరక్షాస్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణ, విశేషపూజ ఇతర సాంసృతిక కార్యక్రమాలు జరుగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానకం, వడపప్పు, అన్నదాన వితరణ జరుగనున్నట్లు నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. -
క్రికెట్ టోర్నీలో సత్తాచాటిన కొడిమ్యాల వెల్ విషర్స్
సాక్షి, సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని వుడ్ లాండ్స్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ 2017 జరిగింది. ఈ టోర్నీలో కొడిమ్యాల వెల్ విషర్స్ జట్టు అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభకనభరిచి విజేతగా నిలిచింది. ఈ ఏడాది క్రికెట్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. లీగ్స్‌లో గ్రూప్ “ఏ” లో తెలుగు రైడర్స్, స్వేచ్ఛా టీం, స్కై టీం, గ్రూప్ “బి” లో భాగ్యనగర్ రైడర్స్, 11 స్టార్స్, ఇండియన్ రోలర్స్, గ్రూప్ ‘సి’ లో ముత్యంపేట్ కింగ్స్, జగిత్యాల్ టైగర్స్, తెలంగాణ లెజెండ్స్, గ్రూప్ ‘డి’ లో కొడిమ్యాల వెల్ విషర్స్, క్రిక్ బుల్స్, రాయల్ స్టార్స్ తలపడ్డాయి. లీగ్స్ అనంతరం స్వేచ్ఛా టీం , కొడిమ్యాల వెల్ విషర్స్, జగిత్యాల్ టైగర్స్, ఇండియన్ రోలర్స్ సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. జగిత్యాల్ టైగర్స్, కొడిమ్యాల వెల్ విషర్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో కొడిమ్యాల వెల్ విషర్స్ విజేతగా నిలిచింది. టోర్నమెంట్ బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మెన్ కూడా కొడిమ్యాల వెల్ విషర్స్ టీం చెందిన ఆటగాళ్లు గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్‌కు సమన్వయకర్తలుగా ప్రాంతీయ కార్యదర్శి అలసాని క్రిష్ణా రెడ్డి, చిల్క సురేశ్, ఆర్సిరెడ్డి, చెట్టిపల్లి మహేశ్, దామోదర్ గోపగోని, జుట్టు ఉమేందర్, బైరి రవి, పిల్లి రంజిత్‌లు వ్యవహరించారు. సొసైటి సభ్యలు మాట్లాడుతూ.. సింగపూర్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించడానికి వివిధ పండుగలను జరుపుకోవడమే కాకుండా క్రీడాస్పూర్తిని పెంపొందించడానికి క్రికెట్, బ్యాడ్మింటన్వంటి ఆటల పోటీలు ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్ల క్రీడాస్పూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను సొసైటి ఉపాధ్యక్షులు పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్, నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గార్లపాటి లక్ష్మా రెడ్డి, పెరుకు శివరామ్ ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా చిట్ల విక్రమ్, గొనె నరేందర్, గండ్ర సునీల్ కుమార్, దీరజ్ గౌడ్ కు సొసైటి కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.