ఆర్యవైశ్య సభ సింగపూర్ విభాగానికి నూతన కార్యవర్గం | waam expands new executive body to singapore division | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్య సభ సింగపూర్ విభాగానికి నూతన కార్యవర్గం

Published Tue, Jul 7 2020 8:31 PM | Last Updated on Tue, Jul 7 2020 8:31 PM

waam expands new executive body to singapore division - Sakshi

సింగపూర్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ(వామ్) అంతర్జాతీయ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ సింగపూర్ విభాగానికి మంగళవారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. వామ్ సింగపూర్ విభాగానికి అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శిగా పట్టూరి కిరణ్ కుమార్, కోశాధికారిగా వుద్ధగిరి సతీష్, ఉపాధ్యక్షులుగా కంకిపాటి శశిధర్​తో కూడిన నూతనకార్యవర్గం నియమితులైంది. 

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు భాస్కర్ గుప్త మాట్లాడుతూ అంతర్జాతీయ విభాగ సూచనలతో, అందరి సహాయ సహకారాలతో సింగపూర్​లో నివశించే ఆర్యవైశ్యుల కోసం మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కొత్త కార్యవర్గానికి త్వరలోనే నియామకపత్రాలను జారీ చేస్తామని అంతర్జాతీయ కార్యదర్శి పసుమర్తి మల్లిఖార్జున గుప్త వెల్లడించారు. 

సింగపూర్ విభాగం అంటే తనకు ప్రత్యేక శ్రద్ధఅని, నూతన కమిటీ వినూత్న కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందగలదని తాను బలంగా నమ్ముతున్నానని వామ్ గ్లోబల్ ఎన్నారై చైర్మన్ యమ్.యన్.ఆర్. గుప్త పేర్కొన్నారు. నూతన కార్యవర్గానికి సింగపూర్ ఆర్యవైశ్యులు శుభాభినందనలు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement