అదే నా చివరి మ్యాచ్: ఆఫ్రిది | I am going to play the last game of my career, says Shahid Afrid | Sakshi
Sakshi News home page

అదే నా చివరి మ్యాచ్: ఆఫ్రిది

Published Wed, Mar 23 2016 9:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

అదే నా చివరి మ్యాచ్: ఆఫ్రిది

అదే నా చివరి మ్యాచ్: ఆఫ్రిది

మొహాలి: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది సూచనప్రాయంగా వెల్లడించాడు. తన కెరీర్ లో చివరిమ్యాచ్ ఆడబోతున్నట్టు చెప్పాడు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 22 పరుగులతో ఓడిపోయింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఆఫ్రిది మాట్లాడుతూ... ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే గేమ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావొచ్చని అవుతుందని ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ కు సెమీస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోనప్పటికీ అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, ప్రపంచకప్‌ అనంతరం అఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతానన్న షరతుమీదే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టినట్టు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement