నిర్ణయాన్ని మార్చుకున్న పాకిస్తాన్ కెప్టెన్ | I didn't take any decision on the retirement, says Shahid Afrid | Sakshi
Sakshi News home page

నిర్ణయాన్ని మార్చుకున్న పాకిస్తాన్ కెప్టెన్

Published Fri, Mar 25 2016 3:57 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

నిర్ణయాన్ని మార్చుకున్న పాకిస్తాన్ కెప్టెన్

నిర్ణయాన్ని మార్చుకున్న పాకిస్తాన్ కెప్టెన్

మొహాలీ: రిటైర్మెంట్ విషయంలో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తన నిర్ణయం మార్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అఫ్రిదీ అన్నాడు. పాకిస్తాన్లో దేశ ప్రజల సమక్షంలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. టి-20 ప్రపంచ కప్లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్కు ముందు రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు.

కాగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు ఇటీవల అఫ్రిదీ చెప్పిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో చివరిమ్యాచ్ ఆడబోతున్నట్టు చెప్పాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే మ్యాచ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావొచ్చని ప్రకటించాడు. కాగా, ప్రపంచకప్‌ అనంతరం అఫ్రిదీని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతానన్న షరతుమీదే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టినట్టు వెల్లడించింది. అయితే ఈ రోజు ఆస్ట్రేలియాతో మ్యాచే చివరిదన్న అఫ్రిదీ.. రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement