Pakistan Cricket Captain
-
నిర్ణయాన్ని మార్చుకున్న పాకిస్తాన్ కెప్టెన్
మొహాలీ: రిటైర్మెంట్ విషయంలో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తన నిర్ణయం మార్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అఫ్రిదీ అన్నాడు. పాకిస్తాన్లో దేశ ప్రజల సమక్షంలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. టి-20 ప్రపంచ కప్లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్కు ముందు రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు ఇటీవల అఫ్రిదీ చెప్పిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో చివరిమ్యాచ్ ఆడబోతున్నట్టు చెప్పాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే మ్యాచ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చని ప్రకటించాడు. కాగా, ప్రపంచకప్ అనంతరం అఫ్రిదీని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతానన్న షరతుమీదే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టినట్టు వెల్లడించింది. అయితే ఈ రోజు ఆస్ట్రేలియాతో మ్యాచే చివరిదన్న అఫ్రిదీ.. రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. -
'అందుకే పాక్లో ఆఫ్రిదిని విమర్శిస్తున్నారు'
న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్లో ఆడేందుకు భారత్కు వచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలపాలవుతున్నాడు. మొహాలీలో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కు కశ్మీర్ ప్రజలు చాలామంది తమకు మద్దతుగా తరలివస్తారంటూ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తప్పుపట్టారు. 'ఆఫ్రిది ఇలాంటి ప్రకటన చేయడం రాజకీయంగా సరికాదు. క్రీడాకారులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. పాక్లో ఆఫ్రిదిని విమర్శించడానికి ఇదే కారణం' అని ఠాకూర్ అన్నాడు. ఆఫ్రిది ఇప్పటికే పెద్ద వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. పాక్లో కంటే భారత్లోనే తమకు ఎక్కువ అభిమానం లభిస్తోందని ఆఫ్రిది వ్యాఖ్యలు చేయడంతో స్వదేశంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ కప్లో పాక్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడం కూడా అతనికి ఇబ్బందికరంగా మారింది. ప్రపంచ కప్ తర్వాత ఆఫ్రిదిని జట్టు సారథిగా తొలగిస్తామని ఇప్పటికే పీసీబీ ప్రకటించింది. -
అదే నా చివరి మ్యాచ్: ఆఫ్రిది
మొహాలి: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ షాహిద్ అఫ్రిది సూచనప్రాయంగా వెల్లడించాడు. తన కెరీర్ లో చివరిమ్యాచ్ ఆడబోతున్నట్టు చెప్పాడు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 22 పరుగులతో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆఫ్రిది మాట్లాడుతూ... ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే గేమ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చని అవుతుందని ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ కు సెమీస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోనప్పటికీ అతడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, ప్రపంచకప్ అనంతరం అఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతానన్న షరతుమీదే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టినట్టు వెల్లడించింది.