భారత్-పాక్ మ్యాచ్ పై ఆసక్తికర కామెంట్స్
న్యూఢిల్లీ: టీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈడెన్ గార్డెన్ లో జరగనున్న దాయాది జట్ల మధ్య జరగనున్న పోరులో పాకిస్థాన్ గా బరిలోకి దిగబోతోందని అన్నాడు. టీమిండియాపై ఒత్తిడిలో ఉందని తెలిపాడు.
టోర్ని ప్రారంభానికి ముందు ధోని సేనను అందరూ ఫేవరేట్ గా భావించారని, టైటిల్ కూడా గెలుస్తుందని ఊహించారని అన్నారు. ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన తర్వాత టీమిండియాపై ఒత్తిడి పెరిగిందన్నాడు. బంగ్లాదేశ్ పై విజయంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో ఉందని, భారత్ తో జరగబోయే మ్యాచ్ లో ఆఫ్రిది సేన ఫేవరేట్స్ గా బరిలో దిగే అవకాశముందని విశ్లేషించాడు.
ఎప్పటిలాగానే భారత్ బ్యాటింగ్ కు, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య పోటీ ఉంటుందని వివరించాడు. ఆసియా కప్ లో ఇబ్బంది పెట్టిన పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ ను ఎలా ఎదుర్కొవాలే ఈపాటికి భారత బ్యాట్స్ మెన్ నేర్చుకునే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై ఎప్పుడు ఓడిపోని రికార్డును టీమిండియా కొనసాగిస్తుందో, లేదో చూడాలంటే ఈ నెల 19 వరకు ఆగాలి.