India-Pakistan match
-
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. 62 బిర్యానీలు ఆర్డర్ చేసిన మహిళ
వీకెండ్లు, పండగలు.. ఇలా సందర్భం ఏదైనా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం సాధారణంగా మారిపోయింది. బంధువులు, స్నేహితులతో కలసి పార్టీలు చేసుకుంటున్నప్పుడు కాస్త ఎక్కువగానే ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా 62 బిర్యానీలు ఆర్డర్ చేసింది. శనివారం(సెప్టెంబర్ 2) భారత్-పాకిస్తాన్ (India-Pakistan match) ఆసియా కప్ (Asia Cup 2023) మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా బెంగళూరు వాసి ఒకరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)లో 62 బిర్యానీలను ఆర్డర్ చేశారు. దీని గురించి స్విగ్గీ సంస్థ ‘ఎక్స్’(ట్విటర్) (Twitter)లో షేర్ చేసింది. "బెంగళూరు నుంచి ఎవరో ఇప్పుడే 62 యూనిట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు? ఎవరు మీరు? ఎక్కడ ఉన్నారు? భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కి వాచ్ పార్టీని నిర్వహిస్తున్నారా? మేమూ రావచ్చా?" అంటూ రాసుకొచ్చింది. స్విగ్గీ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు పోస్ట్‌పై కామెంట్ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ వ్యక్తి ఎవరా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఫుడ్ ఫ్రీ పంపిస్తారా? అంటూ ఓ యూజర్ చమత్కరించారు. కానీ వర్షం కారణంగా పార్టీ అకస్మాత్తుగా ముగిసింది అంటూ మరొకరు నిట్టూర్చారు. కాగా శ్రీలంకలోని క్యాండీలో పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులు చేయగా వర్షం కురవడంతో పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. సోమవారం ఇదే వేదికపై భారత్ నేపాల్‌తో తలపడనుంది. someone from bengaluru just ordered 62 units of biryanis?? who are you? where exactly are you? are you hosting a #INDvsPAK match watch-party?? can i come? — Swiggy (@Swiggy) September 2, 2023 -
యూకేలో ఆలయాలపై దాడులు... కేంద్రం ఖండన
లండన్: యూకేలోని లీసెస్టర్ నగరంలోని భారతీయులపై దాడులు, అక్కడి ఆలయం ఆవరణలో విధ్వంసం ఘటనలను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడులకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూకే యంత్రాంగాన్ని డిమాండ్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాలని కోరింది. గత నెలలో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం నగరంలోని హిందూ ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. లీసెస్టర్‌లోని ఆలయం వద్ద ఎగురవేసిన కాషాయ జెండాను కొందరు చించి వేస్తున్నట్లున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
భారత్–పాక్ మ్యాచ్ బ్లాక్‌బస్టర్ వ్యూస్.. టీ20 హిస్టరీలోనే అత్యధికం..
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ టీవీ ప్రేక్షకుల వీక్షణపరంగా రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌ను టెలివిజన్ ద్వారా 16 కోట్ల 70 లక్షల మంది చూశారని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ప్రకటించింది. టి20 క్రికెట్ చరిత్రలో ఎక్కువ మంది చూసిన మ్యాచ్‌గా ఇది చరిత్ర సృష్టించిందని... 2016 టి20 ప్రపంచకప్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ముంబైలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ప్రేక్షకుల సంఖ్యను ఇది దాటిందని ఐసీసీ పేర్కొంది. చదవండి: IPL 2022 Auction: ఆర్సీబీ రిటైన్ లిస్ట్.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ -
హాట్ కేకులా అమ్ముడు పోయిన పాక్- భారత్ మ్యాచ్ టిక్కెట్లు
దుబాయ్: టీ20 ప్రపంచకప్–2021 లో భాగంగా అక్టోబర్ 24 న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాక్ మధ్య తొలి పోరు జరగనుంది. దాయాదుల మధ్య సమరానికి మరోసారి ప్రపంచకప్ వేదిక కానుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ సంభందించిన టిక్కెట్లు ఇటీవల అమ్మకానికి వచ్చాయి. అయితే అంతా ఊహించినట్లుగా టిక్కెట్లు కొన్ని గంటల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయాయి. కాగా కొవిడ్ నేపథ్యంలో ముందుగా ప్రేక్షకులును అనుమతించకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే తన నిర్ణయం మార్చుకున్న ఐసీసీ.. 70% సామర్థ్యంతో టోర్నమెంట్ నిర్హహిస్తున్నట్లు తెలియజేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 25,000.. అంటే టీ 20 వరల్డ్ కప్ సమయంలో వేదికలోని ప్రతి గేమ్‌లో దాదాపు 18,500 సీట్లు అందుబాటులో ఉంటాయి. కాగా ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. చివరి సారిగా 2016 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పాక్‌తో తలపడింది. ఈ రెండు జట్ల మధ్య చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ 2019 లో మాంచెస్టర్‌లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో జరిగింది. పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌తో ఐదుసార్లు తలపడిన భారత్ నాలుగు గెలిచి, ‘టై’గా ముగిసిన మరో మ్యాచ్‌లో ‘బౌల్ అవుట్’లో నెగ్గింది. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ -
బర్గర్, పిజ్జాలు తినడం వల్లే పాక్ ఓటమిపాలైంది
-
హర్మన్ ప్రీత్‌పై నెటిజన్ల ప్రశంసలు
గయానా : టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి వార్తల్లో నిచిచారు. ధనా ధన్ షాట్లతో బంతిని బౌండరీలకు తరలించడమే కాదు, సమయస్పూర్తితో వ్యవరించి అభిమానుల హృదయాలను కౌర్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లోనే హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళల టీ20 క్రికెట్లోనే సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్‌లో హర్మన్ 51 బంతుల్లోనే 103 పరుగులు చేసింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో కూడా హర్మన్‌ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు జాతీయగీతం ఆలపించే సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇరు జట్లు జాతీయ గీతం పాడడానికి మైదానంలో నిల్చున్న సమయంలో ఎప్పటిలానే ఒక్కోక్కరి ముందు ఒక్కో చిన్నారి నిల్చున్నారు. చిన్నారులందరూ టీ20 ప్రపంచకప్ మస్కట్ ఉన్న టీషర్టులు ధరించి అక్కడ నిల్చున్నారు. అయితే సరిగ్గా భారత జాతీయ గీతం ప్రారంభమయ్యే సమయంలో తన ముందు నిల్చున్న చిన్నారి అనారోగ్యానికి గురవ్వడాన్ని హర్మన్ ప్రీత్ కౌర్ గమనించింది. జాతీయగీతం అయిపోయేంత వరకు సదరు చిన్నారిని చేతితో పట్టుకుంది. జాతీయ గీతాలాపన పూర్తయిన వెంటనే చేతులతో చిన్నారిని ఎత్తుకుని వెంటనే తీసుకెళ్లి మేనేజ్మెంట్ వాళ్లకి అప్పగించింది. ఓ వైపు జాతీయ గీతాన్ని ఆలకిస్తూనే, మరోవైపు చిన్నారిని కిందపడకుండా హర్మన్ సమయస్పూర్తితో వ్యవహరించారని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత అమ్మాయిలు వరుసగా రెండో విజయం నమోదు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. బిస్మా మారూఫ్ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు), నిదా దార్ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (2/22), హేమలత (2/34) ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పిచ్‌పై డేంజర్ ఏరియాలో పరిగెత్తినందుకుగాను పెనాల్టీగా అంపైర్లు భారత జట్టుకు 10 పరుగులు అదనంగా కేటాయించారు. లక్ష్య ఛేదనలో మిథాలీ రాజ్ (47 బంతుల్లో 56; 7 ఫోర్లు), స్మృతి మంధాన (26; 4 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (14 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగడంతో భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లకు 137 పరుగులు చేసి గెలుపొందింది. తదుపరి మ్యాచ్‌లో గురువారం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. -
అభిమానుల హృదయాలు గెలుచుకున్న కౌర్
-
భారత్‌తో ఫిక్సింగ్ చేయమన్నారు : పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సంచలన ఆరోపణలు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్ వెల్లడించాడు. ‘‘2015 ప్రపంచకప్‌లో భారత్‌తో అదే మా తొలి మ్యాచ్. ఈ సందర్భంగా నేను వరుసగా రెండు బంతులు ఆడకుండా వదిలేస్తే బుకీలు దాదాపు రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. అంతకు ముందు కూడా అలాంటి భారీ ఆఫర్లు పెద్ద ఎత్తున వచ్చాయి, కానీ వాటిని తిరస్కరించా. వాటికి నేను విరుద్ధమని, ఇలాంటి ఉద్దేశాలతో మరోసారి నా దగ్గరకు రావద్దని వాళ్లకు గట్టిగా హెచ్చరించా’’ అని అక్మల్ చెప్పాడు. ఈ వ్యాఖ్యల అనంతరం ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు వివరణ ఇవ్వాలంటూ అక్మల్‌కు సమన్లు జారీ చేశాయి. 2015 ఫిబ్రవరి 15న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో దిగిన పాక్ మహమ్మద్ షమీ బౌలింగ్ ధాటికి 224 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 76 పరుగులతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 107 పరుగులతో చెలరేగిపోయాడు. Umar Akmal claims he was offered $200,000 during World Cup to leave two deliveries, tells @Shoaib_Jatt that he was also offered money to skip games against India. I wonder if Akmal had ever reported these approaches, if not then this statement will get him in more troubles. pic.twitter.com/inIQLN5Np4 — Faizan Lakhani (@faizanlakhani) June 24, 2018 -
భారత్-పాక్ మ్యాచ్ పై ఆసక్తికర కామెంట్స్
న్యూఢిల్లీ: టీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈడెన్ గార్డెన్ లో జరగనున్న దాయాది జట్ల మధ్య జరగనున్న పోరులో పాకిస్థాన్ గా బరిలోకి దిగబోతోందని అన్నాడు. టీమిండియాపై ఒత్తిడిలో ఉందని తెలిపాడు. టోర్ని ప్రారంభానికి ముందు ధోని సేనను అందరూ ఫేవరేట్ గా భావించారని, టైటిల్ కూడా గెలుస్తుందని ఊహించారని అన్నారు. ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన తర్వాత టీమిండియాపై ఒత్తిడి పెరిగిందన్నాడు. బంగ్లాదేశ్ పై విజయంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో ఉందని, భారత్ తో జరగబోయే మ్యాచ్ లో ఆఫ్రిది సేన ఫేవరేట్స్ గా బరిలో దిగే అవకాశముందని విశ్లేషించాడు. ఎప్పటిలాగానే భారత్ బ్యాటింగ్ కు, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య పోటీ ఉంటుందని వివరించాడు. ఆసియా కప్ లో ఇబ్బంది పెట్టిన పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ ను ఎలా ఎదుర్కొవాలే ఈపాటికి భారత బ్యాట్స్ మెన్ నేర్చుకునే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై ఎప్పుడు ఓడిపోని రికార్డును టీమిండియా కొనసాగిస్తుందో, లేదో చూడాలంటే ఈ నెల 19 వరకు ఆగాలి. -
ఇండో-పాక్ సిరీస్‌పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మా
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ల మధ్య క్రికెట్ సిరీస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం వెల్లడించారు. ఈ అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఇటీవల భారత్‌ను సందర్శించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్... ఈ ఏడాది డిసెంబర్లో యూఏఈలో భారత్, పాక్‌ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కోల్‌కతాలో బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ సమాచారం తమ వద్దకు కూడా రాలేదని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సుష్మా స్పష్టం చేశారు. 2008 ముంబైలో ఉగ్రవాదుల దాడుల తర్వాత పాక్‌తో భారత్ ఇంతవరకు పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. -
భారత్-పాక్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా అమితాబ్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే తన గాంభీర్యమైన కంఠంతో చిత్రాల్లోనే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ కార్యక్రమం ద్వారా అభిమానులను అరలించిన అమితాబ్.. ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా మన ముందుకు రానున్నారు. నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ అంటే అందరికీ అత్యంత ఆసక్తి. అందులోనూ భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనూ ఉత్కంఠే. ఆదివారం జరిగే భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో అమితాబ్ తొలిసారిగా కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్, షోయబ్ అక్తర్, హర్షబోగ్లే వంటి దిగ్గజాల సరసన అమితాబ్ కామెంటేటరీ చెప్పనున్నారు. తన షమితాబ్ చిత్రానికి ప్రమోషన్ గానే ఆయన కామెంట్రీ చెబుతారని అంటున్నారు.