న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం వెల్లడించారు. ఈ అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఇటీవల భారత్‌ను సందర్శించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్... ఈ ఏడాది డిసెంబర్‌లో యూఏఈలో భారత్, పాక్‌ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కోల్‌కతాలో బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియాతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ సమాచారం తమ వద్దకు కూడా రాలేదని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సుష్మా స్పష్టం చేశారు. 2008 ముంబైలో ఉగ్రవాదుల దాడుల తర్వాత పాక్‌తో భారత్ ఇంతవరకు పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు.
ఇండో-పాక్ సిరీస్‌పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మా
Published Mon, Jun 1 2015 3:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM
Advertisement
Advertisement