PS: Twitter
దుబాయ్: టీ20 ప్రపంచకప్–2021 లో భాగంగా అక్టోబర్ 24 న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాక్ మధ్య తొలి పోరు జరగనుంది. దాయాదుల మధ్య సమరానికి మరోసారి ప్రపంచకప్ వేదిక కానుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ సంభందించిన టిక్కెట్లు ఇటీవల అమ్మకానికి వచ్చాయి. అయితే అంతా ఊహించినట్లుగా టిక్కెట్లు కొన్ని గంటల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయాయి.
కాగా కొవిడ్ నేపథ్యంలో ముందుగా ప్రేక్షకులును అనుమతించకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే తన నిర్ణయం మార్చుకున్న ఐసీసీ.. 70% సామర్థ్యంతో టోర్నమెంట్ నిర్హహిస్తున్నట్లు తెలియజేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 25,000.. అంటే టీ 20 వరల్డ్ కప్ సమయంలో వేదికలోని ప్రతి గేమ్‌లో దాదాపు 18,500 సీట్లు అందుబాటులో ఉంటాయి.
కాగా ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. చివరి సారిగా 2016 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పాక్‌తో తలపడింది. ఈ రెండు జట్ల మధ్య చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ 2019 లో మాంచెస్టర్‌లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో జరిగింది. పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌తో ఐదుసార్లు తలపడిన భారత్ నాలుగు గెలిచి, ‘టై’గా ముగిసిన మరో మ్యాచ్‌లో ‘బౌల్ అవుట్’లో నెగ్గింది.
చదవండి: వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment