ఈసారి టీ20 ప్రపంచకప్ గెలిచితీరతామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. జట్టులోని ప్రతి ఒక్కరు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతామని పేర్కొంది. ఈవెంట్ ఎక్కడైనా ప్రేక్షకుల మద్దతు మాత్రం తమకే లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.
న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్
కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్టోబరు 3 నుంచి మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 మొదలుకానుంది. బంగ్లాదేశ్- స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక టీమిండియా అక్టోబరు 4న న్యూజిలాండ్‌తో పోరుతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాం
ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ‘‘మా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాము. చాలా కాలంగా మేము ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నాం. అదే మా బలం. ఎక్కడున్నా అభిమానుల మద్దతు మాకే ఉంటుంది.
జట్టులోని ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాం’’ అని పేర్కొంది. కాగా ఐసీసీ టోర్నీలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. గత టీ20 వరల్డ్‌కప్ ఆసాంతం నిలకడగా రాణించిన హర్మన్ సేన.. ఫైనల్లో మాత్రం అనుకన్న ఫలితం రాబట్టలేకపోయింది.
గత పొరపాట్లు పునరావృతం చేయకుండా
టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇటీవల మహిళల ఆసియా కప్ టోర్నీలోనూ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. అయితే, ప్రపంచకప్ ఈవెంట్లో మాత్రం గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడిని జయించి టైటిల్ గెలవాలని భావిస్తోంది.
చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
Comments
Please login to add a commentAdd a comment