Dubai International Stadium
-
Asia cup 2022: బంగ్లాదేశ్ అవుట్! ఏడ్చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్!
ఆసియాకప్-2022 టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంక సూపర్-4కు అర్హత సాధించిగా.. బంగ్లాదేశ్ మాత్రం ఇంటిముఖం పట్టింది. కాగా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ స్వీయ తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోయారు. ఓ బుడ్డోడు అయితే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. బంగ్లాదేశ్ ఓటమి పాలైన అనంతరం బంగ్లా జెర్సీ ధరించి ఉన్న ఓ బాలుడు ఏడుస్తూ కనిపించాడు. పక్కన అతడి తల్లి ఓదారుస్తూ కనిపించింది. తమ జట్టు గెలుపు ఖాయమనుకున్న ఆ యువ ఆభిమాని.. తమ జట్టు ఆఖరికి ఓడిపోవడంతో.. తట్టుకోలేకపోయాడు. కాగా గతంలో కూడా బంగ్లా జట్టు ఓటమి పాలైతే అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. #BANVSSL #SLvBAN emotions pic.twitter.com/j0zUbBojz9 — Wasif (@Wasif_93) September 1, 2022 చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ -
'భారత్‌పై గతేడాది విజయాన్ని గుర్తు తెచ్చుకోండి.. ఈ సారి కూడా'
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. ఆసియాకప్-2022లోభాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7: 30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ తన జట్టు సభ్యులకు ప్రేరణ కలిగించే ప్రసంగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేముందు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సాధించిన అద్భుత విజయాన్ని గుర్తు తెచ్చుకోవాలని బాబర్ సూచించాడు. "టీ20 ప్రపంచకప్‌లో ఏ విధంగా అయితే పట్టుదలతో ఆడామో ఈ మ్యాచ్‌లో కూడా అదే కసితో ఆడాలి. గతేడాది భారత్‌పై మనం ఆడిన ఆటను మనం గుర్తు తెచ్చుకోవాలి. పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్దం అయ్యి బరిలోకి దిగుతున్నాం. అయితే మన జట్టు ప్రాధాన బౌలర్ షహీన్ ఈ టోర్నీకి దూరమయ్యాడు అని మనకు తెలుసు. కానీ అతడి లోటుని పూరించే బాధ్యత మిగితా ఫాస్ట్ బౌలర్లది" అని ఆజం పేర్కొన్నాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై 10 వికెట్ తేడాతో పాక్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. "𝘈𝘱𝘱𝘭𝘺 𝘸𝘩𝘢𝘵 𝘺𝘰𝘶 𝘩𝘢𝘷𝘦 𝘱𝘳𝘦𝘱𝘢𝘳𝘦𝘥 𝘢𝘯𝘥 𝘺𝘰𝘶 𝘸𝘪𝘭𝘭 𝘨𝘦𝘵 𝘵𝘩𝘦 𝘳𝘦𝘴𝘶𝘭𝘵𝘴" 🔊🔛 Listen to the encouraging words from our captain 👏 #AsiaCup2022 | #BackTheBoysInGreen pic.twitter.com/odSavfgKO6 — Pakistan Cricket (@TheRealPCB) August 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: Asia Cup: అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లి.. తొలి భారత ఆటగాడిగా! -
శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గనిస్తాన్ (ఫొటోలు)
-
Asia Cup 2022: శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గనిస్తాన్.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
8 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్తాన్ ఘన విజయం ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి ఆఫ్గనిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తద్వారా ఆఫ్గనిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో చేధించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(37),గుర్బాజ్(40) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా ఒక్కడే ఒక వికెట్ సాధించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆఫ్గాన్ బౌలర్లు చేలరేగడంతో 105 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. నబీ, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో భానుక రాజపక్స 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చేలరేగి ఆడుతోన్న ఆఫ్గనిస్తాన్ ఓపెనర్లు 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ ఓపెనర్లు చేలరేగి ఆడుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. క్రీజులో హజ్రతుల్లా జజాయ్(32), రహ్మానుల్లా గుర్బాజ్(40) పరుగులతో ఉన్నారు. నాలుగు ఓవర్లకు ఆఫ్గనిస్తాన్ స్కోర్: 41/0 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ నాలుగు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో హజ్రతుల్లా జజాయ్(14), రహ్మానుల్లా గుర్బాజ్(17) పరుగులతో ఉన్నారు. 105 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 105 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. నబీ, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో భానుక రాజపక్స 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 13 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. 11 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 66/6 వరుసగా శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్ వేసిన ముజీబ్ బౌలింగ్‌లో హసరంగ ఔట్ కాగా.. తర్వాత ఓవర్ వేసిన నబీ బౌలింగ్‌లో షనక పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 66/6 నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక 49 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన గుణతిలక.. ముజీబ్ బౌలింగ్‌లో జనత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో హసరంగా, భానుక రాజపక్స ఉన్నారు 6 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 41/3 ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక తిరిగి పుంజుకుంది. 6 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో దనుష్క గుణతిలక(15), భానుక రాజపక్స(19) పరుగులతో ఉన్నారు. తొలి ఓవర్లో రెండు వికెట్లు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఫజల్హక్ ఫరూఖీ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆఫ్గానిస్తాన్‌కు అద్భుతమైన శుభారంభం అందించాడు. ఐదో బంతికి కుశాల్ మెండీస్, అఖరి బంతికి అసలంకను ఎల్బీ రూపంలో ఫరూఖీ పెవిలియన్‌కు పంపాడు. తొలి ఓవర్ ముగిసేసరికి శ్రీలంక స్కోర్: 3/2 ఆసియాకప్-2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్, శ్రీలంక జట్లు తలపడునున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా శ్రీలంక తరపున దిల్షన్ మదుశంక, మతీషా పతిరన ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. తుది జట్లు శ్రీలంక దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, మతీశ పతిరణ ఆఫ్గానిస్తాన్ హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ(కెప్టెన్), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ -
IPL 2021 Final Today: ఆ జట్టుదే పైచేయి... టాస్ గెలిస్తే చాలా?!
IPL 2021, CSK vs KKR Today At Dubai International Cricket Stadium: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి. తొమ్మిదిసార్లు ఫైనల్ చేరిన సీఎస్కే నాలుగోసారి కప్ కొట్టాలని భావిస్తుండగా... ప్లే ఆఫ్స్ కూడా చేరుతుందా లేదా అన్న దశ నుంచి టేబుల్ టాపర్‌ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్ మూడోసారి చాంపియన్‌గా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. నేటి మ్యాచ్ ప్రధానంగా చెన్నై బ్యాటింగ్‌కు, కోల్‌కతా బౌలింగ్‌కు మధ్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. Courtsey: IPL అదరగొడుతున్న ఓపెనర్లు... ఇంకో 23 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్... సీఎస్కే ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్( ఇప్పటి వరకు 603 పరుగులు) సొంతమవుతుంది. మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ (547), ఆల్‌రౌండర్ జడేజా వంటి కీలక ప్లేయర్లు మెరుగ్గా రాణిస్తుండటం... అన్నింటికీ మించి కెప్టెన్ ధోని వ్యూహాలు... సీఎస్కేను ఫేవరెట్‌గా నిలుపుతాయనడంలో సందేహం లేదు. అయితే, రెండో అంచెలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ దాకా వచ్చిన మోర్గాన్ బృందాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. Courtsey: IPL చెన్నైదే పైచేయి! ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(427), వెంకటేశ్ అయ్యర్(320)ఫాంలో ఉండటం... మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(18), సునిల్ నరైన్(14) రాణిస్తుండటం కేకేఆర్‌కు కలిసి వచ్చే అంశాలు. ఈ సీజన్లో చెన్నై- కేకేఆర్ రెండుసార్లు తలపడగా... రెండుసార్లు విజయం ధోని సేననే వరించింది. అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియం(సెప్టెంబరు 26), ముంబైలోని వాంఖడే స్టేడియంలో(ఏప్రిల్ 21) వరుసగా 2 వికెట్లు, 18 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. ఇక మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో సీఎస్కే- కేకేఆర్ 25సార్లు ముఖాముఖి తలపడగా... చెన్నై 16 సార్లు, కోల్‌కతా 8 సార్లు గెలిచింది. ఇక ఇప్పుడు ఇరు జట్లు తొలిసారిగా దుబాయ్ వేదికగా ఫైనల్లో తలపడబోతున్నాయి. మరి అక్కడి పిచ్‌పై టీ20 రికార్డు ఎలా ఉందో పరిశీలిద్దాం! ►స్టేడియం పేరు: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ►ఇప్పటి వరకు జరిగిన టీ20 మ్యాచ్‌లు: 105 ►తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు సాధించిన విజయాలు: 41 ►లక్ష్య ఛేదనకు దిగిన టీం సాధించిన విజయాలు: 63 ►మ్యాచ్ టై అయినవి: 1 ►నమోదైన అత్యధిక స్కోరు: 219/2- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్- 2020 ►అత్యల్ప స్కోరు: 59(లాహోర్ కాలాండర్స్ వర్సెస్ పెషావర్ జల్మీ-2017) ►ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 156 ►ఇక ఈ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై... ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. స్కోర్లు: ఢిల్లీ- 172/5(20 ఓవర్లు) చెన్నై- 173/6(19.4 ఓవర్లు). ►ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లోనూ టాస్ కీలకం కానుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టేడియం చరిత్ర ప్రకారం... ఒకవేళ ధోని టాస్ గెలిస్తే.. మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంటాడా.. లేదంటే అదృష్టం కేకేఆర్‌ను వరిస్తుందా.. లేదంటే సెంటిమెంట్‌ను తిరగరాస్తూ అద్భుతాలేమైనా జరుగుతాయా లేదా అన్నది చూడాలంటే సాయంత్రం వరకు(7.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం) వేచి చూడాల్సిందే! చదవండి: IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు! -
హాట్ కేకులా అమ్ముడు పోయిన పాక్- భారత్ మ్యాచ్ టిక్కెట్లు
దుబాయ్: టీ20 ప్రపంచకప్–2021 లో భాగంగా అక్టోబర్ 24 న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాక్ మధ్య తొలి పోరు జరగనుంది. దాయాదుల మధ్య సమరానికి మరోసారి ప్రపంచకప్ వేదిక కానుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ సంభందించిన టిక్కెట్లు ఇటీవల అమ్మకానికి వచ్చాయి. అయితే అంతా ఊహించినట్లుగా టిక్కెట్లు కొన్ని గంటల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయాయి. కాగా కొవిడ్ నేపథ్యంలో ముందుగా ప్రేక్షకులును అనుమతించకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే తన నిర్ణయం మార్చుకున్న ఐసీసీ.. 70% సామర్థ్యంతో టోర్నమెంట్ నిర్హహిస్తున్నట్లు తెలియజేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 25,000.. అంటే టీ 20 వరల్డ్ కప్ సమయంలో వేదికలోని ప్రతి గేమ్‌లో దాదాపు 18,500 సీట్లు అందుబాటులో ఉంటాయి. కాగా ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. చివరి సారిగా 2016 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పాక్‌తో తలపడింది. ఈ రెండు జట్ల మధ్య చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ 2019 లో మాంచెస్టర్‌లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో జరిగింది. పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌తో ఐదుసార్లు తలపడిన భారత్ నాలుగు గెలిచి, ‘టై’గా ముగిసిన మరో మ్యాచ్‌లో ‘బౌల్ అవుట్’లో నెగ్గింది. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ -
ఆసీస్‌కు బదులు కివీస్
దుబాయ్: ‘ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడ వేరు’ ప్రస్తుతం ఈ పద్యం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం అధికారులు చదువుకుంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తప్పిదం చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండు దేశాలు జెండాలు ఎగరేయడం ఆనవాయితీ. కానీ ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జెండా బదులు న్యూజిలాండ్ జెండా ఎగరేశారు. దీనిని ఎవ్వరూ గమనించకపోవడం విడ్డూరం. అయితే ఆసీస్ జర్నలిస్టు ఈ విషయాన్ని పసిగట్టి ట్వీటర్లో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ అయి దుబాయ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడ పట్ల ఆసీస్ అభిమానులు విమర్శించారు. దీంతో తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన స్టేడియం నిర్వాహకులు.. రెండు దేశాల జెండాలు ఒకే రీతిలో ఉండటంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. క్రికెట్లో ఇలాంటి సంఘటనలు జరగటం కొత్తేం కాదు. గతంలో కూడా ఓ మ్యాచ్‌లో భారత జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. మ్యాచ్ మధ్యలో ఆ విషయాన్ని గుర్తించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంపైర్లకు చెప్పి సరిచేపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పాక్ సిరీస్‌లో రాణించి పునర్వైభవం సాధించాలనుకున్న ఆసీస్‌కు శుభారంభం లభించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 482 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పసతగ్గిన ఆసీస్ బౌలింగ్‌పై పాక్ బ్యాట్స్‌మెన్ పైచేయి సాధించారు. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (126), హారీస్ సోహైల్ (110) శతకాలతో రెచ్చిపోయారు. వీరికి తోడుగా ఇమాముల్ హక్(76), ఆసద్ షఫీఖ్(80) అర్థసెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో సిడిల్ మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్ రెండు వికెట్లు, హోలండ్, స్టార్క్, ల్యాబస్చేంజ్ తలో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో ఆసీస్ ఓపెనర్లు ఖవాజా (17), ఫించ్(13)లు ఉన్నారు. -
రెండో టి20లో కివీస్ గెలుపు
పాక్‌తో సిరీస్ 1-1తో సమం దుబాయ్: బౌలర్ల ప్రతిభతో తక్కువ స్కోరును కాపాడుకున్న న్యూజిలాండ్ జట్టు... పాకిస్తాన్‌తో జరిగిన రెండో టి20లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. విలియమ్సన్ (32), రోంచీ (31), లాథమ్ (26), డివిచ్ (21) రాణించారు. పాక్ బౌలర్లలో గుల్, ఆఫ్రిది చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 18.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. షెహజాద్ (33) టాప్ స్కోరర్. ఆఫ్రిది (28), నజీమ్ (19) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిల్స్, నీషమ్ చెరో 3 వికెట్లు తీయగా, డివిచ్కు 2 వికెట్లు దక్కాయి. డివిచ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; రోంచీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సోమవారం నుంచి జరుగుతుంది. -
పాక్ 165 ఆలౌట్ లంక 57/1 రెండో టెస్టు
దుబాయ్: శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో పాకిస్థాన్ తడబడింది. లంక బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఖుర్రమ్ మన్జూర్ (136 బంతుల్లో 73; 7 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. కుషాల్ సిల్వ (12 బ్యాటింగ్), సంగక్కర (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కరుణరత్నే (32) ఫర్వాలేదనిపించాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... లంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పాక్ ఓపెనర్లలో మన్జూర్ క్రీజులో నిలబడినా... రెండో ఎండ్‌లో సహచరులు షెహజాద్ (3), హఫీజ్ (21), యూనిస్ ఖాన్ (13), మిస్బా (1) క్రమం తప్పకుండా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అర్ధసెంచరీ తర్వాత మన్జూర్ కూడా అవుట్ కావడంతో పాక్ 118 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత బిలావల్ భట్టీ (24 నాటౌట్) కాస్తా పోరాడాడు. ఫలితంగా పాక్ 38 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ప్రదీప్, హెరాత్ చెరో మూడు, లక్మల్, ఎరంగా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.