Asia Cup 2022: Babar Azam Motivational Speech Ahead Of Ind Vs Pak Match - Sakshi
Sakshi News home page

Asia Cup 2022 Ind Vs Pak: 'భారత్‌పై గతేడాది విజయాన్ని గుర్తు తెచ్చుకోండి.. ఈ సారి కూడా'

Published Sun, Aug 28 2022 2:12 PM | Last Updated on Sun, Aug 28 2022 3:06 PM

Babar Azams Speech Ahead Of Game vs India - Sakshi

భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. ఆసియాకప్‌-2022లో​భాగంగా ఆదివారం దుబాయ్‌ వేదికగా భారత్‌-పాక్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ సాయంత్రం 7: 30 గంటలకు ప్రారంభం కానుంది.

కాగా ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ కెప్టెన్‌ తన జట్టు సభ్యులకు ప్రేరణ కలిగించే ప్రసంగం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేముందు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సాధించిన అద్భుత విజయాన్ని గుర్తు తెచ్చుకోవాలని బాబర్‌ సూచించాడు.

"టీ20 ప్రపంచకప్‌లో ఏ విధంగా అయితే పట్టుదలతో ఆడామో  ఈ మ్యాచ్‌లో కూడా అదే కసితో ఆడాలి. గతేడాది భారత్‌పై మనం ఆడిన ఆటను మనం గుర్తు తెచ్చుకోవాలి. పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఈ మ్యాచ్‌ కోసం పూర్తి స్థాయిలో సన్నద్దం అయ్యి బరిలోకి దిగుతున్నాం.

అయితే మన జట్టు ప్రాధాన బౌలర్‌ షహీన్‌ ఈ టోర్నీకి దూరమయ్యాడు అని మనకు తెలుసు. కానీ అతడి లోటుని పూరించే బాధ్యత మిగితా ఫాస్ట్‌ బౌలర్‌లది" అని ఆజం పేర్కొన్నాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై 10 వికెట్‌ తేడాతో పాక్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.


చదవండి: Asia Cup: అరుదైన రికార్డుకు చేరువలో విరాట్‌ కోహ్లి.. తొలి భారత ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement