Asia cup 2022: బంగ్లాదేశ్‌ అవుట్‌! ఏడ్చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్‌! | Young fan spotted crying after Bangladeshs dismal loss against Sri Lanka | Sakshi
Sakshi News home page

Asia cup 2022: బంగ్లాదేశ్‌ అవుట్‌! స్టేడియంలోనే ఏడ్చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్‌!

Published Fri, Sep 2 2022 12:35 PM | Last Updated on Fri, Sep 2 2022 2:27 PM

Young fan spotted crying after Bangladeshs dismal loss against Sri Lanka - Sakshi

PIC: Crictracker(Twitter)

ఆసియాకప్‌-2022 టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ నిష్క్రమించింది. శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంక సూపర్‌-4కు అర్హత సాధించిగా.. బంగ్లాదేశ్‌ మాత్రం ఇంటిముఖం పట్టింది. కాగా మ్యాచ్‌లో బం‍గ్లాదేశ్‌ తమ స్వీయ తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో బం‍గ్లా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ముఖ్యంగా స్టేడియంలో ‍ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించిన అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోయారు. ఓ బుడ్డోడు అయితే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. బంగ్లాదేశ్‌ ఓటమి పాలైన అనంతరం బంగ్లా జెర్సీ ధరించి ఉన్న ఓ బాలుడు ఏడుస్తూ కనిపించాడు.

పక్కన అతడి తల్లి ఓదారుస్తూ కనిపించింది. తమ జట్టు గెలుపు ఖాయమనుకున్న ఆ యువ ఆభిమాని.. తమ జట్టు ఆఖరికి ఓడిపోవడంతో.. తట్టుకోలేకపోయాడు. కాగా గతంలో కూడా బంగ్లా జట్టు ఓటమి పాలైతే అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. 


చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్‌! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్‌ అల్‌ హసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement