
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ టీవీ ప్రేక్షకుల వీక్షణపరంగా రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌ను టెలివిజన్ ద్వారా 16 కోట్ల 70 లక్షల మంది చూశారని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ప్రకటించింది.
టి20 క్రికెట్ చరిత్రలో ఎక్కువ మంది చూసిన మ్యాచ్‌గా ఇది చరిత్ర సృష్టించిందని... 2016 టి20 ప్రపంచకప్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ముంబైలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ప్రేక్షకుల సంఖ్యను ఇది దాటిందని ఐసీసీ పేర్కొంది.
చదవండి: IPL 2022 Auction: ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్.. కోహ్లి, మ్యాక్స్‌వెల్