
100 Percent Seating Capacity Allowed Final T20 WC 2021.. టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు టి20 ప్రపంచకప్ టోర్నీలో జరిగిన మ్యాచ్‌లకు 70 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉండేది. తాజాగా ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం వంద శాతం సీటింగ్‌ను అనుమతిస్తున్నట్లు ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే నవంబర్ 10, 11న జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం 70 శాతంప్రేక్షకులకే అనుమతి ఉందని.. కేవలం నవంబర్ 14న జరిగే ఫైనల్‌కు మాత్రం వంద శాతం అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
చదవండి: T20 WC 2021: ఎలిమినేటెడ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్.. కెప్టెన్ మాత్రం లేడు
ఇక నవంబర్10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ , 11వ తేదీన పాకిస్తాన్, ఆస్ట్రేలియా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇక సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు నవంబర్ 14న మెగా ఫైనల్‌లో తలపడనున్నాయి. అయితే టీమిండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్‌లు సూపర్ 12 దశలో వెనుదరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment