Michael Gough: అంపైర్‌ గాఫ్‌కు ఐసీసీ మరోసారి షాక్‌.. ఈసారి ఏకంగా | Umpire Michael Gough Not Umpiring Any More Matches T20 World Cup 2021 | Sakshi
Sakshi News home page

T20 WC 2021: అంపైర్‌ గాఫ్‌కు ఐసీసీ మరోసారి షాక్‌.. ఈసారి ఏకంగా

Published Thu, Nov 4 2021 10:56 AM | Last Updated on Thu, Nov 4 2021 1:18 PM

Umpire Michael Gough Not Umpiring Any More Matches T20 World Cup 2021 - Sakshi

Umpire Michael Gough Not Umpiring Any More T20 WC 2021 Matches.. ఇంగ్లీష్‌ అంపైర్‌ మైకెల్‌ గాఫ్‌కు ఐసీసీ మరోసారి షాక్‌ ఇచ్చింది. బయోబబూల్‌ నిబంధనలు ఉల్లఘించినందుకు గానూ ఆరు రోజులు కఠిన క్వారంటైన్‌కు పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా టి20 ప్రపంచకప్‌లో అంపైరింగ్‌ విధుల నుంచి గాఫ్‌ను తప్పిస్తున్నట్లు ఐసీసీ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. తొలుత ఆరు రోజుల క్వారంటైన్‌ అనంతరం గాఫ్‌కు అంపైరింగ్‌ బాధ్యతలు అ‍ప్పగిస్తారని అంతా భావించారు. కానీ ఐసీసీ రూల్స్‌ను అతిక్రమించినందున్న గాఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది.

చదవండి: T20 WC 2021: అంపైర్‌కు షాకిచ్చిన ఐసీసీ

వాస్తవానికి టీమిండియా, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు(అక్టోబర్‌ 31న) గాఫ్‌ విధులు నిర్వర్తించాల్సింది. అయితే అప్పటికే రెండురోజుల క్రితం అక్టోబర్‌ 28న గాఫ్‌ అనుమతి లేకుండా బయోబబూల్‌ వీడి బయటకు వెళ్లి తన మిత్రులను కలిసి వచ్చాడు. దీంతో ఐసీసీ అతన్ని విధుల నుంచి తప్పించి ఆరురోజులు పాటు క్వారంటైన్‌కు తరలించింది. నవంబర్‌ 3తో ఆయన క్వారంటైన్‌ ముగిసింది.

చదవండి: T20 WC 2021: 'ప్రపంచకప్‌ మాదే' అన్న పాక్‌ అభిమాని.. స్టువర్ట్‌ బ్రాడ్‌ సూపర్‌ రిప్లై

ఇక నవంబర్‌ 4న శ్రీలంక, వెస్టిండీస్‌ మ్యాచ్‌కు గాఫ్‌ అంపైర్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ గాక సూపర్‌ 12లో మరో రెండు మ్యాచ్‌లకు(ఆస్ట్రేలియా వర్సెస్‌ వెస్టిండీస్‌,నవంబర్‌ 6); (అఫ్గానిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌, నవంబర్‌ 7) అంపైర్‌గా సేవలందించాల్సి ఉంది. తాజాగా గాఫ్‌ తొలగింపుతో ఆ మ్యాచ్‌లకు అంపైర్‌గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. కాగా మైకెల్‌ గాఫ్‌కు బెస్ట్‌ అంపైర్‌ అని పేరు ఉండడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement