
షహజాద్ పరుగుల మోత
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా దక్షిణాఫ్రికా జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘాన్ ఓపెనర్ మొహ్మద్ షహజాద్ పరుగుల మోత మోగించాడు. కేవలం 19 బంతులను ఎదుర్కొన్నషహజాద్ 3 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 44 పరుగులు సాధించాడు. తద్వారా అఫ్ఘాన్ నాలుగు ఓవర్లు ముగిసే సరికి 52 పరుగులు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా విసిరిన 210 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన షహజాద్
మంచి పునాది వేయడంతో అఫ్ఘాన్ స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది.
కాగా, దక్షిణాఫ్రికా పేసర్ మోరిస్ వేసిన బంతిని హిట్ చేయబోయిన షహజాద్ బౌల్డ్ కావడంతో అతని ఇన్నింగ్స్కు ఫుల్ స్టాప్ పడింది. ఆ తరువాత ఆస్గర్ స్టానిక్జాయ్(7) రెండో వికెట్ గా అవుటయ్యాడు. అయినప్పటికీ అఫ్ఘాన్ అదే వేగాన్ని కొనసాగించడంతో 10.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.