
'టీమిండియా వీక్ నెస్ గురించి పట్టించుకోం'
కోల్ కతా: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ను ఉపఖండంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా తిలకిస్తుందని పాక్ క్రికెట్ కోచ్ వకార్ యూనిస్ తెలిపాడు. శుక్రవారం అతడు విలేకరులతో మాట్లాడుతూ... గత మ్యాచుల్లో తమ జట్టుపై ఎక్కువ ఒత్తిడి ఉండేదని, ఇప్పుడు ఇండియా టీమ్ పై ప్రెషర్ అధికంగా ఉందని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి ఎక్కువయిందని వివరించాడు. కోల్ కతాలో తమకు మైదానంలోనూ, మైదానం వెలుపల మద్దతు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు బలాలపై దృష్టి పెడుతున్నామని, టీమిండియా బలహీనతల గురించి ఆలోచించడం లేదని వకార్ యూనిస్ తెలిపాడు.
రేపు(శనివారం) ఈడెన్ గార్డెన్ జరిగే మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.