వాట్ ఏ మ్యాచ్..!
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ లో ధోని సేన సెమీస్ ఫైనల్ కు చేరడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కళాత్మక విధ్వంసంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లిపై ప్రధాని నరేంద్ర మోదీతో సహా రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. సెమీఫైనల్లోనూ టీమిండియా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ క్రికెటర్లు, పలుదేశాలకు చెందిన ఆటగాళ్లు విరాట్ కోహ్లి ఆటను ప్రశంసించడం విశేషం. తీవ్రఒత్తడిని ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చిన 'మిస్టర్ ఫైర్'పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లిని స్వయంగా అభినందించడం మరో విశేషం.
'వాట్ ఏ మ్యాచ్. టీమిండియా ఆటను చూసి గర్విస్తున్నా. కోహ్లి గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. ధోని నాయకత్వం గొప్పగా ఉంది' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
'భారత క్రికెట్ జట్టుకు అభినందనలు. ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి మరోసారి జట్టును గెలిపించాడు' అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ లో పోస్టు చేశారు.
'వావ్ కోహ్లి.. అతడికి స్పెషల్ ఇన్నింగ్స్.. గ్రేట్ విన్.. అన్నివిధాలుగా పోరాడారు' అంటూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.
'విరాట్ కోహ్లి గ్రేట్ అఫర్ట్ పెట్టాడు. గ్రేట్ టెంపర్ మెంట్ చూపించాడు. ఆల్ బెస్ట్ ఫర్ టీమిండియా ఫర్ సెమీస్' అంటూ బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
సెమీఫైనల్ కు అర్హత సాధించిన టీమిండియాకు అభినందనలు. విరాట్ కోహ్లి బ్రిలియన్స్, క్లాస్, అవుట్ స్టాండింగ్ గా ఆడాడు' అని కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు.
'విరాట్ కోహ్లి ఆట సూపర్. ఇక నుంచి సచిన్‌తో పాటు కోహ్లిని క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. కోహ్లి మాస్టర్ క్లాస్ ఆటకు నాలుగు రకాలున్నాయి. 1. క్లాస్ అండర్ ప్రెజర్ 2. కవర్ డ్రైవింగ్ 3. రన్నింగ్ బిట్ వీన్ వికెట్స్ 4. డిజైర్' అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు.
What a match! Proud of our team. Great innings @imVkohli & exemplary leadership @msdhoni.
— Narendra Modi (@narendramodi) 27 March 2016
Woooow @imVkohli ...special it was... Great win, fighting all the way! #IndvsAus
— sachin tendulkar (@sachin_rt) 27 March 2016