celebrities comments
-
మగవారూ... భాష జాగ్రత్త
గతంలో ఎం.ఎల్.ఏ అయిన ఒక పెద్ద హీరో స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడి అసెంబ్లీలో సంజాయిషీ ఇచ్చాడు. డెబ్బయి ఏళ్లు దాటిన ఒక సీనియర్ నటుడు నోరు పారేసుకుని పరువు పోగొట్టుకున్నాడు. పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న మరో నటుడు స్త్రీల దుస్తుల గురించి సుద్దులు చెప్పి నిరసన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. సెలబ్రిటీలుగా ఉన్నవారు ఎంతో బాధ్యతగా ఉండి యువతకు మార్గం చూపేలా ఉండాలి. వారు ఇలా తగలడితే స్త్రీలతో ఎలా వ్యవహరించాలో ఇంటినే బడిగా మార్చి తల్లిదండ్రులు నేర్పించాల్సి ఉంటుంది. అయితే ఇంటి ఆడవారికి తండ్రి, భర్త గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారా అనేది ప్రశ్న. అతడో ప్రసిద్ధ నటుడు. ‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’ అంటుంటాడు. కాని ఒక సభలో అభిమానులను చూసి పూనకం వచ్చి స్త్రీల గురించి అశ్లీలమైన వ్యాఖ్యలు చేశాడు. వందల సినిమాల్లో తండ్రిగానో బాబాయిగానో వేసిన ఒక నటుడు ‘స్త్రీల మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని సభలో యాంకర్ అడిగితే పరమ రోతగా సమాధానం ఇచ్చాడు. ఇక నటుడుగా, రియల్టర్‌గా గుర్తింపు పొందిన మరో పెద్ద మనిషి పార్లమెంట్ మెంబర్ అయ్యాక పార్లమెంట్లో నిలబడి మరీ ‘స్త్రీల దుస్తుల వల్లే వారికి సమస్యలు వస్తున్నాయి’ అన్నాడు. స్త్రీలను ఏదో ఒకటి అనేయొచ్చు, అంటే వాళ్లు పడతారు, అనడానికే మేము పుట్టాము అనే చులకనభావం పురుష సమాజంలో నరనరాన జీర్ణించుకుని పోబట్టే ఈ ప్రతిఫలాలు. అదృష్టవశాత్తు ఇలాంటి వ్యాఖ్యలకు వెంటనే నిరసన పెల్లుబుకుతున్నా పురుషుల నోటి దురుసు తగ్గడం లేదు. తాజాగా తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల త్రిషతో ‘లియో’ సినిమాలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఆమె హీరోయిన్ అని తెలిశాక (గత సినిమాల్లో తాను చేసిన) బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను’ అని వ్యాఖ్యానించాడు. ‘ఇది సినిమా లాంగ్వేజ్’ అని మన్సూర్ అనుకుని ఉండొచ్చుగాని దానిలోని అశ్లీల ధ్వనికి త్రిష రియాక్ట్ అయ్యింది. ‘ఇతనితో ఇంకెప్పుడూ సినిమాల్లో నటించను’ అని చెప్పింది. ఆ తర్వాత చినికి చినికి గాలివానై ఇప్పుడు మన్సూర్ మీద కేసు బుక్ అయ్యేంతగా వెళ్లింది. మగవాళ్లు ‘సరదాగా మాట్లాడుతున్నామని’ అనుకుంటూ కూడా స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. సరదాగా కించపరచడం ఏమిటో... కించపరచడం ఎలాంటి సరదానో వీరే చెప్పాలి. ► ప్రసిద్ధులే దారి తప్పితే రాజకీయ నేతలు, సినిమా నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు... ఇలా సమాజంలో గుర్తింపు పొందినవారు స్త్రీల పట్ల మరింత గౌరవంతో మెలగుతూ ఆదర్శంగా నిలవాలి. కాని చాలాసార్లు రాజకీయ నాయకుల దగ్గరి నుంచి అన్ని రకాల ప్రముఖులు ఏదో ఒక సందర్భంలో చులకన మాటలు మాట్లాడుతూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాదిలో మంత్రులు ‘మేం వేసిన రోడ్లు ఫలానా హీరోయిన్ బుగ్గల్లా ఉంటాయి’ అంటూ వదరుతుంటారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో కుస్తీ వీరుడిగా నటించి ‘ఈ సినిమాలో కుస్తీలు చేస్తే రేప్ జరిగినంత పనయ్యింది నాకు’ అని వ్యాఖ్యానించి మొట్టికాయలు తిన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రిగా ఉన్న నటిపై దారుణమైన వ్యాఖ్యలు చేసి కోర్టు కేసును ఎదుర్కొనబోతున్నాడు. ► బాల్యం నుంచి భావజాల ప్రభావం ‘కుటుంబంలో తండ్రి (మగాడు) ముఖ్యం’ అనే భావన బాల్యం నుంచి పిల్లల్లో ఎక్కించడం ద్వారా పురుష సమాజం తన ఆధిక్యతను స్త్రీలపై ఆధిపత్యాన్ని కొనసాగించేలా చేస్తుంది. తండ్రిని ‘మీరు’ అని, తల్లిని ‘నువ్వు’ అని అనడంలో ప్రేమ, గౌరవం, దగ్గరితనం ఉన్నా ‘నువ్వు’ అనడం వల్ల ‘లెక్క చేయవలసిన పని లేదు’ అనే భావన కలిగితే కష్టం. తిట్లు, బూతులు అన్నీ స్త్రీలను అవమానించేవే. వాటిని విని, పలికి స్త్రీల పట్ల అలా మాట్లాడవచ్చు అనుకుంటారు మగవారు. ఇంట్లో చెల్లెని, అక్కని, తల్లిని తండ్రి అదుపు చేసే తీరు చూసి, తామూ బయట స్త్రీలను అలాగే అదుపు చేయవచ్చనుకుంటారు. ఫైటర్ జెట్స్‌ను స్త్రీలు నడుపుతున్న ఈ కాలంలో కూడా ‘మేమేమీ గాజులు తొడుక్కోలేదు’, ‘మూతి మీద మీసముంటే రా’లాంటి పౌరుష వచనాలను పురుషులు ఇంకా పలికేటంత వెనుకబాటుతనంలో ఉండటం విషాదకరం. శారీరక పరిమితులు ఉన్నంత మాత్రాన స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు కాబోరు. ► తల్లిదండ్రులూ జాగ్రత్త అబ్బాయిలను ఆడపిల్లలను గౌరవించేలా పెంచడం, టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం ఇప్పటి తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యం. చట్టాలు పకడ్బందీగా ఉన్న ప్రస్తుత రోజుల్లో తెలిసో తెలియకో అహంకారంతోనో పరుష వ్యాఖ్య, అసభ్య చేష్ట నేరుగా కాని సోషల్ మీడియాలోగాని చేస్తే వారు ప్రమాదంలో పడతారని హెచ్చరించాలి. చైతన్యం పెరిగింది. అబ్బాయిలూ భాష జాగ్రత్త. -
Oscar 2023: నాటునాటుకు ఆస్కార్.. ప్రముఖుల స్పందనలివే..!
తెలుగు పాటను విశ్వవ్యాప్తం చేసిన రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణిని భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి అభినందనల వెల్లువతాకింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను పతాకశీర్షికలకు ఎక్కించిన ఘనులు అని ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖుల స్పందనలివే..! ప్రధాని నరేంద్ర మోదీ తెలుగువారికి అవార్డు రావడం గర్వకారణం, ప్రతిష్టాత్మక అవార్డు తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌కు, ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్‌కు అభినందనలు. ఇది దేశం గర్వించే రోజు. కేటీఆర్ నాటునాటు పాటకు ఆస్కార్ రావడం దేశానికి గర్వకారణం. రాజమౌళి దేశాన్ని గర్వపడేలా చేశారు. చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు. జోగి రమేశ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ రావడం పట్ల ఏపీ మంత్రి జోగి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వకారణమన్నారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్‌కు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్‌కు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభినందనలు తెలిపారు. ► ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ టీమ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. ► ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం.. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగ్గ విషయం అని బాలకృష్ణ ప్రశంసించారు. ► భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారంటూ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను పవన్ కల్యాణ్ అభినందించారు. మంచు విష్ణు ఆస్కార్ గెలుచుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకు ఈ విభాగంలో అవార్డు రావడం చరిత్రాత్మకం అని ట్వీట్ చేశారు. Amazing! I extend my warmest congratulations to Sri. Keeravani Garu on his historic achievement as the first Indian Music Composer to win an Oscar award for an Indian movie. Congratulations! 💐@mmkeeravaani @ssrajamouli #Oscars #AcademyAwards #NaatuNaatu #Oscars95 pic.twitter.com/2gDZCk86Lf — Vishnu Manchu (@iVishnuManchu) March 13, 2023 చిరంజీవి తెలుగు సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ విశ్వప్యాప్తం చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమా అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో తన కుమారుడు రామ్‌చరణ్ భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ దేశానికి గర్వకారణమన్నారు. #NaatuNaatu ON TOP OF THE WORLD !!! 👏👏👏👏👏 And THE OSCAR for the Best Original Song Goes To : Take a Bow .. @mmkeeravaani garu & @boselyricist @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith @tarak9999 @AlwaysRamCharan And the One & Only @ssrajamouli 😍😍😍#Oscars95 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023 రవితేజ ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది, ఈ సినిమా ఆడియన్స్ మదిలో చాలా ఏళ్ల పాటు నిలిచిపోతుందని రవితేజ్ ట్వీట్ చేశారు. ఆస్కార్‌తో ప్రపంచ శిఖరాగ్రాన నిలిచిందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఎలక్ట్రిఫయింగ్ డ్యాన్స్ మూవ్స్ లేకపోతే.. నాటు నాటు పాటకు ఆస్కార్ సాధ్యమయ్యేది కాదని రవితేజ అన్నారు. History is created!#NaatuNaatu has truly left a lasting impact on audiences and will be remembered for years to come & this prestigious OscaRRR is a cherry on top❤️ Congratulations @mmkeeravaani garu, @boselyricist garu, Prem , @kaalabhairava7 @Rahulsipligunj🤗#RRRatOSCARS — Ravi Teja (@RaviTeja_offl) March 13, 2023 #oscar for #NatuNatu Historic moment for Indian cinema!! you make us proud!! Congratulations to @MMKeeravaani @SSRajamouli @BoseLyricist @Tarak9999 @AlwaysRamCharan @KaalaBhairava7 @RahulSipligunj #PremRakshith @DVVMovies @RRRMovie and team!!💐💐💐👏🏼👏🏼👏🏼👏🏼👏🏼 — Nagarjuna Akkineni (@iamnagarjuna) March 13, 2023 Sir @mmkeeravaani YOU OSCARRED IT! 😘😘😘😍😍😍 CONGRATS to the KILLER TEAM of RRR 🙏🙏🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) March 13, 2023 Team #RRR u made the whole of india proud …. Congrats @mmkeeravaani sir and dear @boselyricist sir … this is hugeeeee 👏👏👏👏👏👏 @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/HPcl4O49BJ — G.V.Prakash Kumar (@gvprakash) March 13, 2023 As it is often said, cinema speaks a universal language. Congratulations to the teams of #RRR and #TheElephantWhisperers for their #Oscar wins. It’s a proud 🇮🇳 moment 🎈 — Ajay Devgn (@ajaydevgn) March 13, 2023 Congratulations to entire India🇮🇳a movie about suppression, torture, killing, colonisation of Indians based on racial grounds gets appreciated on a world platform, number of Indians died just during one Bengal famine were way more than Jews died during holocaust. Thank team RRR🙏 https://t.co/J0L2RFuicH — Kangana Ranaut (@KanganaTeam) March 13, 2023 🔥👏❤️#RRR is a True example of Team work lead by a Great Visionary. @ssrajamouli 🙏 Congratulations & keep inspiring.@mmkeeravaani @boselyricist @premrakchoreo @tarak9999 @AlwaysRamCharan @ssk1122 @RRRMovie Love..#RAPO https://t.co/HXycu5tWIt — RAm POthineni (@ramsayz) March 13, 2023 I join a Billion Indians in celebrating the Honour for #NaatuNaatu and #RRR 🎉 Kudos to @mmkeeravaani Garu and @boselyricist Garu on making History ❤️👏 The man of the moment, brilliant storyteller who has made India proud @ssrajamouli Garu 🎉 Both my brothers, the superstars… https://t.co/TxKRZ8Dq1q pic.twitter.com/2IRfgPltYo — KTR (@KTRBRS) March 13, 2023 And there you go... NAATU NAATU!! Crossing all boundaries!! Congratulations to @mmkeeravaani garu, @boselyricist and the entire team of #RRR on their phenomenal win at the Oscars!! A jubilant moment for Indian cinema 👏👏👏 — Mahesh Babu (@urstrulyMahesh) March 13, 2023 View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) -
వాట్ ఏ మ్యాచ్..!
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ లో ధోని సేన సెమీస్ ఫైనల్ కు చేరడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో కళాత్మక విధ్వంసంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లిపై ప్రధాని నరేంద్ర మోదీతో సహా రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. సెమీఫైనల్లోనూ టీమిండియా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ క్రికెటర్లు, పలుదేశాలకు చెందిన ఆటగాళ్లు విరాట్ కోహ్లి ఆటను ప్రశంసించడం విశేషం. తీవ్రఒత్తడిని ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చిన 'మిస్టర్ ఫైర్'పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లిని స్వయంగా అభినందించడం మరో విశేషం. 'వాట్ ఏ మ్యాచ్. టీమిండియా ఆటను చూసి గర్విస్తున్నా. కోహ్లి గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. ధోని నాయకత్వం గొప్పగా ఉంది' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'భారత క్రికెట్ జట్టుకు అభినందనలు. ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి మరోసారి జట్టును గెలిపించాడు' అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ లో పోస్టు చేశారు. 'వావ్ కోహ్లి.. అతడికి స్పెషల్ ఇన్నింగ్స్.. గ్రేట్ విన్.. అన్నివిధాలుగా పోరాడారు' అంటూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. 'విరాట్ కోహ్లి గ్రేట్ అఫర్ట్ పెట్టాడు. గ్రేట్ టెంపర్ మెంట్ చూపించాడు. ఆల్ బెస్ట్ ఫర్ టీమిండియా ఫర్ సెమీస్' అంటూ బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. సెమీఫైనల్ కు అర్హత సాధించిన టీమిండియాకు అభినందనలు. విరాట్ కోహ్లి బ్రిలియన్స్, క్లాస్, అవుట్ స్టాండింగ్ గా ఆడాడు' అని కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. 'విరాట్ కోహ్లి ఆట సూపర్. ఇక నుంచి సచిన్‌తో పాటు కోహ్లిని క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. కోహ్లి మాస్టర్ క్లాస్ ఆటకు నాలుగు రకాలున్నాయి. 1. క్లాస్ అండర్ ప్రెజర్ 2. కవర్ డ్రైవింగ్ 3. రన్నింగ్ బిట్ వీన్ వికెట్స్ 4. డిజైర్' అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు. What a match! Proud of our team. Great innings @imVkohli & exemplary leadership @msdhoni. — Narendra Modi (@narendramodi) 27 March 2016 Woooow @imVkohli ...special it was... Great win, fighting all the way! #IndvsAus — sachin tendulkar (@sachin_rt) 27 March 2016