
విండీస్ విజయలక్ష్యం 183
ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
ఓపెనర్లు జాసన్ రాయ్, హేల్స్ దాటిగా ఆడారు. తొలి నుంచి భారీ స్కోరే లక్ష్యంగా ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించింది. 37 పరుగులకే రాయ్ వికెట్ కోల్పోయిన తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ రెండెంకల స్కోర్ చేశారు. ఒక వైపు వికెట్లు కోల్పోతున్న ఆటగాళ్లు నిలకడగా ఆడడంతో స్కోర్ 180 పరుగులు దాటింది. రూట్ 48, జాస్ బట్లర్ 30 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్ మోర్గాన్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్, డ్రేన్ బ్రేవో రెండేసి వికెట్లు తీయగా బెన్ ఒక వికెట్ తీశాడు. విండీస్ 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.