భారత్, పాక్ మ్యాచ్ వేదిక మారింది.. | India vs Pakistan match in kolkata on March 19 | Sakshi
Sakshi News home page

భారత్, పాక్ మ్యాచ్ వేదిక మారింది..

Published Wed, Mar 9 2016 5:35 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

భారత్, పాక్ మ్యాచ్ వేదిక మారింది..

భారత్, పాక్ మ్యాచ్ వేదిక మారింది..

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ వేదికలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మార్పుచేసింది. ఈ నెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ వేదికను కోల్ కతా కు మార్చుతున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానం దాయదుల పోరుకు సిద్ధం చేయనున్నారు. 

పాక్‌తో మ్యాచ్‌కు సరైన భద్రత ఇవ్వలేమని హిమాచల్ ప్రదేశ్ సీఎం తేల్చి చెప్పిన విషయం విదితమే. టీ20 ప్రపంచ కప్లో పాల్గొనేందుకు గాను భారత్కు వచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియరైంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ మేరకు అనుమతి మంజూరు చేయడం ఇరుజట్లకు కలిసొచ్చే అంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement