పాకిస్థాన్ ఘన విజయం
కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 202 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ అజేయ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. ఇక్బాల్ 24, సబీర్ రహమాన్ 25, ముష్ఫికర్ 18, మోర్తజా 15 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఆమిర్ , ఆఫ్రిది రెండేసి వికెట్లు తీశారు. ఇర్ఫాన్, ఇమాద్ వాసిద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. షెహజాద్(52), హఫీజ్(64) అర్ధ సెంచరీలు కొట్టారు. ఆఫ్రిది వేగంగా ఆడి 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. పాక్ తరపున వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన ఘనత సాధించకుండానే అవుటయ్యాడు. ఒక్క పరుగు తేడాతో రికార్డు మిస్సయ్యాడు. ఆఫ్రిదికే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.