కోల్కతా: టి20 ప్రపంచ కప్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో బుధవారమిక్కడ బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సూపర్ 10 విభాగం గ్రూప్ -2 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత ఓపెనర్లుగా పాకిస్తాన్ ఆటగాళ్లు షార్జిల్ ఖాన్, అహ్మద్ షెహజాద్ బరిలోకి దిగారు. బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ తొలి ఓవర్ వేశాడు.