
ముంబై: భారత క్రికెట్ అభిమానుల ఆశలు మోస్తూ టి20 ప్రపంచ కప్ వేటలో టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని బృందం గురువారం ముంబైనుంచి బయల్దేరి వెళ్లింది. 14 మంది జట్టు సభ్యులతో పాటు మరో 16 మంది సహాయక సిబ్బంది కూడా టీమ్‌తో ఉన్నారు.
వరల్డ్‌కప్‌లోని ఇతర జట్లతో పోలిస్తే భారత్ చాలా ముందుగా ఆసీస్ గడ్డపై అడుగు పెడుతోంది. మెగా టోర్నీకి ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన దీపక్ హుడా పూర్తిగా కోలుకొని జట్టుతో చేరాడు. మరో వైపు బుమ్రా స్థానంలో ఇంకా ఎవరినీ సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో 14 మందే ఆసీస్‌కు వెళ్లారు. పెర్త్‌లో జట్టుకు వారం రోజుల పాటు కండిషనింగ్ క్యాంప్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment