'అంచనాలు లేకుండా వచ్చాం, సెమీస్ చేరాం' | I don't set expectations and barriers for my team: Morgan | Sakshi
Sakshi News home page

'అంచనాలు లేకుండా వచ్చాం, సెమీస్ చేరాం'

Published Sun, Mar 27 2016 12:34 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

'అంచనాలు లేకుండా వచ్చాం, సెమీస్ చేరాం'

'అంచనాలు లేకుండా వచ్చాం, సెమీస్ చేరాం'

న్యూఢిల్లీ: తాము ఎటువంటి అంచనాలు లేకుండానే టీ20 వరల్డ్ కప్ కు వచ్చామని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ప్రత్యేకంగా ఒక లక్ష్యం పెట్టుకోలేదని చెప్పాడు. తమకు అందుబాటులో వనరులతో సమర్థవంతంగా ఆడాలన్న ఉద్దేశంతో బరిలోకి దిగామని అన్నాడు. శ్రీలంకతో శనివారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత మోర్గాన్ విలేకరులతో మాట్లాడాడు.

సెమీఫైనల్ కు అర్హత సాధించాలని ముందుగా లక్ష్యం నిర్దేశించుకున్నారా అని ఈ సందర్భంగా అడగ్గా... 'నిజం చెప్పాలంటే గొప్ప లక్ష్యాలు ఏవీ పెట్టుకోలేదు. అంచనాలు, అడ్డంకులు, నియంత్రణలు లాంటివి సెట్ చేసుకోలేదు. మా సామర్థ్యం మేరకు బెస్ట్ గా ఆడాలనుకున్నాం. అలా ఆడితే మంచి పొజిషన్ లో ఉంటామని అనున్నామ'ని మోర్గాన్ బదులిచ్చాడు.

ఒత్తిడి సమయాల్లో తమ జట్టు రాణించిన తీరు పట్ల అతడు సంతృప్తి వ్యక్తం చేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, మున్ముందు మరింత కష్టపడాల్సి ఉంటుందని అన్నాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులతో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను ఓడించి ఇంగ్లండ్ మూడో విజయంతో సగర్వంగా సెమీస్‌కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement