
టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు బ్రిటిష్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గార్డియన్ నివేదిక ప్రకారం.. జూలై తొలి వారంలో అంతర్జాతీయ క్రికెట్‌కు మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
ఇక మోర్గాన్ సారథ్యంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. కాగా తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన మెర్గాన్ కేవలం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మెర్గాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. గాయం కారణంగా అఖరి వన్డేకు మోర్గాన్ దూరమ్యాడు.
మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే..
ఒక వేళ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే అతడి స్థానంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే విధంగా 2015 నుంచి ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా బట్లర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్-భారత మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జూలై 7 న ప్రారంభం కానుంది.
చదవండి: Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను'