ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం జరుగుతున్న మూడో మ్యాచ్ లో ఇంగ్లండ్, వెస్టిండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ కు మోర్గాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. విండీస్ టీమ్ కు సమీ నాయకత్వం వహిస్తున్నాడు. ఇరు జట్లు శుభారంభం చేయాలన్న పట్టుదలతో ఉన్నాయి.